»   »  నవ్వుల ప్యాకేజి(బ్లేడు బాబ్జీ రివ్యూ)

నవ్వుల ప్యాకేజి(బ్లేడు బాబ్జీ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating

-జోశ్యుల సూర్య ప్రకాష్
తారాగణం:అల్లరి నరేష్,శియాలి భగత్,రుతిక,హర్ష వర్దన్,వేణు మాధవ్,
బ్రహ్మానందం,శ్రీనివాస రెడ్డి,కృష్ణ భగవాన్,ధర్మవరపు,కొండవలస,
హేమ,అపూర్వ,జయ ప్రకాష్ రెడ్డి తదితరులు
సంగీతం:కోటి
మాటలు:వేగేశ్న సతీష్
ఛాయా గ్రహణం:ఎ రాజా
ఎడిటింగ్:నందమూరి హరి
నిర్మాత:ముత్యాల సత్య కుమార్
కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం:దేవి ప్రసాద్
రిలీజ్ :అక్టోబర్ 24,2008

ఆడుతూ పాడుతూ,లీలామహల్ సెంటర్ చిత్రాల దర్శకుడు చిరకాల విరామం తర్వాత అల్లరి నరేష్ తో వచ్చిన కామెడీ ప్యాకేజ్ బ్లేడు బాబ్జీ. పూర్తి స్ధాయి ఎంటర్ టైన్ మెంట్ తో వచ్చిన ఈ చిత్రం ధియేటర్లను నవ్వులలో ముంచెత్తుతోంది. అయితే హాలీవుడ్ చిత్రానికి కాపీ కావటం మైనస్ అయినా దానికిచ్చిన ట్రీట్ మెంట్ కొత్తగా అల్లుకోవటం ప్లస్ గా మారింది.కేక ప్లాప్ కావటం,ఈ సినిమాతోటే రిలీజైన మరో కామెడీ కాశీపట్నం చూడరబాబు డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటం ఈ సినిమాకు బాగా కలసి వచ్చే అంశం.

కష్టపడి దొంగిలించి సంపాదించిన సొమ్మును ఓ చోట పాతి పెట్టి తర్వాత తీసుకుందామని వచ్చేసరికి అక్కడ ఓ పోలీస్ కమీషనర్ ఆఫీస్ వెలిస్తే...పరిస్ధితి ఎలా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సిట్యువేషన్ బ్లేడు బాబ్జీ(అల్లరి నరేష్) అనే చిల్లర దొంగకి ఎదురవుతుంది. అతనికి ఆ డబ్బు అత్యవసరం.దాంతో బాబ్జీ...ఎస్సై పోస్ట్ లో జాయిన్ కాబోయే మనోహర్ (శ్రీనివాస రెడ్డి) ని కిడ్నాప్ చేసి అతని ప్లేసులోకి వెళ్తాడు. ఎన్నో ప్లాన్స్ వేసి ఆ డబ్బుదాచిన బ్యాగులు బయిటకుతీస్తాడు. అయితే అందులో డబ్బు ఉండదు. అంతా షాక్.ఇంతకీ ఆ సొమ్ము ఏమయింది. చివరకు బాబ్జీ ఆ డబ్బుని తిరిగి ఎలా పట్టుకున్నాడనేది మిగతా సినిమా.

హాలీవుడ్ బ్లూ స్ట్రెక్(1999) సినిమా ఆధారంగా,Can't Live Without Robbery(2002) సినిమాలో సీన్స్ లిఫ్ట్ చేసిన ఈ సినిమా కామిడీ ఆఫ్ ఎర్రర్స్ ని నమ్ముకుని ఫక్తు ఇ.వి.వి చిత్రంలా ముందుకెళ్తుంది. అందులోనూ పోకిరి,తమ్ముడు చిత్రాల ప్యారెడీ బాగా నవ్విస్తుంది. చివరవలో వచ్చే దుప్పటి కామిడీకి నవ్వని ప్రేక్షకుడు ఉండడు. అయితే ఏం చూసాం ఏం చెప్పాడు అనేదానికన్నా ఎంతనవ్వుకున్నాం అనే పాయింట్ మీద బేస్ అయిన చిత్రం ఇది. పెద్ద ట్విస్ట్ లు లేకుండా నడవంటం,సిట్యువేషన్ కామెడీ ఈ చిత్రానికి ప్లస్ లుగా మారాయి.అలాగే కథ పాతదే(ఇంతకు ముందు సురేష్ హీరోగా శివ నాగేశ్వరరావు ఈ పాయింట్ తో పట్టుకోండి చూద్దాం చేసారు) అయినా వేగేశ్న సతీష్ డైలాగ్ లుతో ఆకట్టుకున్నాడు. ఇక టెక్నికల్ గా మాత్రం చాలా పూర్ గా ఉంది. కోటీ సంగీతం చాలా సబ్ స్టాండర్డ్ లో ఉంది. నటీనటుల్లో నరేష్ రెగ్యులర్ కామెడీనే తన దైన శైలిలో పండించాడు. ఉన్నంతలో రుతిక బాగుంది. బ్రహ్మానందం,కృష్ణ భగవాన్,ధర్మవరపు కామెడీ పేలింది.ఇక హీరోయిన్ శియాలి భగత్ పాటల్లో అందచందాలు ఒలకపోసినా ఎక్స్ ప్రెషన్స్ లో బాగా వీక్. అయితే ఆమె చుట్టూ కథ కాకపోవటంతో ఆ ఇబ్బంది కనపడదు.

కాసెపు నవ్వుకోవటానికి అసభ్యత,అతి లేని ఈ చిత్రానికి చక్కగా వెళ్ళవచ్చు. ఇక ఈ సినిమా మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు పట్టకపోయినా బి,సి సెంటర్లలలో బాగా ఆడుతుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X