twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బృందావన్‌ కాలనీలో గంద్రగోళ ప్రేమ

    By Staff
    |

    Brindavan Colony
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    చిత్రం: 7/జి,బృందావన్‌ కాలనీ
    నటీనటులు:రవికృష్ణ, సోనియా అగర్వాల్‌, చంద్రమోహన్‌,సుధ, సుమన్‌శెట్టి తదితరులు
    సంగీతం:యువన్‌ శంకర్‌ రాజా
    కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీ రాఘవ
    బ్యానర్‌: శ్రీసూర్య మూవీస్‌
    నిర్మాత: ఎ.దయాకర్‌

    ఎన్నోభారీచిత్రాలు, ప్రేమకథా చిత్రాలు అందించి ఘనవిజయాలుసాధించిన ఎ.ఎం రత్నం బాయ్స్‌,నీ మనసు నాకు తెలుసు ఫ్లాప్‌చిత్రాలకు ట్రయాలజీగా వచ్చిన చిత్రం ఈ 7/జి,బృందావన్‌ కాలనీ. మరోసారి బూతును నమ్ముకునియూత్‌ని ఆకట్టుకోవాలని చేసినప్రయత్నం సూపర్‌హిట్‌ చిత్రంకాదల్‌కొండెల్‌ (తెలుగులోనేను) దర్శకుడు శ్రీ రాఘవమరో ప్రేమకథను ఎ.ఎం రత్నంకుమారుడు రవికృష్ణతో చేసినప్రయత్నం సాదాసీదా బాయ్‌ మీట్స్‌ దగాళ్‌ తరహాగా సాగింది. హీరో రవి పోరంబోకు.

    డిగ్రీ డింకీలుకొడుతూ తొట్టిగ్యాంగ్‌ను వెంటేసుకుని ప్రతిరోజూ పచ్చితాగుబోతుగా మందుకొడుతూతండ్రిపైనే చెయ్యెత్తే మూర్ఖుడు.వాళ్ళ కాలనీకి కొత్తగా వచ్చిన ఒకడీసెంట్‌ అమ్మాయి అనితను ప్రేమించి, ఆమెవరసైన వాడితో తన్నులు తిని రోడ్డుమీద పడుతూ, అయినా ఆమెవెనకపడుతూ ఆమె దృష్టిలో పడి బుద్ధిమంతుడిగామారి, ఆమె యాక్సిడెంటలో చనిపోవడంతోపిచ్చాడిగా మారుతాడు. ఇదంతా ఫ్లాష్‌బ్యాక్‌లో సాగేకథ. రేపు ఏం జరుగుతుందో ఎవరునా మెడలో తాళి కడతాడో..నీకు లాభం చూపొద్దా అంటూ శరీరం అప్పగించేహీరోయిన్‌ ఈ సినిమాలోనే కనబడుతుంది.

    మొదట్లోఅనిత రవిని ఛీకొట్టినా తొలిప్రేమలో లాగాఅతడిని బాగు చేయాలని నిర్ణయించుకునినీలో ఏం టాలెంట్‌ ఉందో చెప్పు.పెయింటర్‌వా, రచయితవా మరొకటాఏమిటి అని ఆమె నిలదీస్తే రవి వెంటనే బైకువిప్పి బిగించగలను అంటాడు. దానితో ఆమెఅతడిని హీరోహోండా కంపెనీలో మెకానిక్‌గాఉద్యోగం ఇప్పించి, ఇప్పుడు నచ్చావ్‌ అంటుంది.అంటే ఆమెకు సోషల్‌ సెక్యూరిటీ తప్పరవి అయినా వేరొకరైనా ఒకటేనన్న మాట. రవిలో ఉన్న ఈ హిడెన్‌ టాలెంట్‌ మిగితాసినిమాలో ఎక్కడా కన్పించదు. మరోసారి ఆమెరవితో ఓ నాలుగేళ్ళు ఆగుదాం, మన చదువులుపూర్తవుతాయి. అప్పటికీమన మధ్య ప్రేమ ఇలాగే నిలిచి ఉంటేఅప్పుడు పెళ్ళి చేసుకుందాం అంటుంటేమనం మరో చరిత్ర అని ముచ్చటపడేలోపే ఆమె మాట మార్చేస్తుంది.

    అనిత బిఎస్సీకంప్యూటర్స్‌ చదువుతూ రవికి బీకాంఅకౌంట్స్‌ చెప్పడం విచిత్రం. మానాన్నకు రెండు సార్లు హార్ట్‌ ఎటాక్‌వచ్చింది. ఆయన మాట దాటను అని అంటూనేహీరోకి పెళ్ళి కాకముందే ఫస్ట్‌ నైట్‌ ప్రపోజల్‌ పెడుతుంది. పాపం!ఆమెతండ్రికి పెళ్ళి చేసుకుంటేనే హార్ట్‌ఎటాక్‌ వస్తుందన్న మాట. మరే చేసినాఫర్వాలేదన్నమాట. అనితతలిదండ్రులు మార్వాడీలు. ఎక్కువగాహిందీలో, తెలుగులో వచ్చీ రానట్టు మాట్లాడుతారు.

    అనితమాత్రం స్వచ్ఛమైన తెలుగులోఅనర్గళంగా మాట్లాడుతుంది. రవిఇంటర్వెల్‌ లో అనితతో ఆమెకు వర సయ్యేవాడిని ఉద్దేశించి నువ్వు నన్ను చేసుకోకపోయినా ఫర్వాలేదు, ఆవెధవను చేసుకోవద్దు అంటాడు.రవే ఒక ఆవారా. అతిని నోటి వెంట ఆ డైలాగ్‌రావడం ప్రేక్షకులకు ఎబ్బెట్టుగా ఉంటుంది. ఈసినిమాలో రవి, అనితల మధ్య ఉన్నదిప్రేమా? ఆకర్షణా? స్నేహమా? అన్నదిఎస్టాబ్లిష్‌ కాదు. ఈ విషయంలో దర్శకుడికేకన్ఫ్యూజన్‌ ఉన్నట్టుంది.

    అసలుకథ ప్లాట్‌ పాయింట్‌- టూ (అనిత తల్లి వచ్చిహీరోను తిట్టి ఆమెకు సంబంధించిన వస్తువులను పట్టుకెళ్ళడం)వరకుకరెక్టుగానే వచ్చింది. కథ అక్కడితోఆగిపోవడంతో క్లెయిమాక్స్‌ విసుగుపుట్టిస్తుంది. హీరో ప్రేమనుసాధించడమో లేక ఆమెతో శారీరకసుఖం పొందడమో జరగ్గానేప్రేక్షకుడికి కథ ముగిసినట్టు అన్పించిరిలాక్స్‌ అయిపోతాడు. హీరోపై సానుభూతిరప్పించి హిట్‌ కొట్టాలన్న తాపత్రయంలోకథను పక్కకు తప్పించి హీరోనిపిచ్చివాడిని చేయడం ప్రేక్షకులనుపూర్తిగా నిరాశ పరుస్తుంది. కథలోతమిళ వాసన లు తెలుగు ప్రేక్షకుడినిఆకర్షించవు. రవి క్యారెక్టర్‌మొదటి నుంచి నవ్వు, ఎమోషన్లలో పిచ్చితొంగి చూసేలా ఏర్పాటు చేయడం దర్శకుడి ప్రతిభే(?).

    బాగున్నసీన్లు:

    సునీల్‌ షెట్టినిద్రపోయేటప్పుడు లేపుతుంటే చేసినకామెడీ సన్నివేశం బాగుంది. చంద్రమోహన్‌కొడుకు రవిని మెచ్చుకునే సెంటిమెంట్‌ సీన్‌పాతదే అయినా పండింది. యవన్‌శంకరరాజా సంగీతం ఫర్వాలేదు.కెమెరా పనితనం ప్రశంసనీయం.డైలాగులు పెద్దగా పేలవు. ఏదైమైనాకుర్రాళ్ళు తాగుతూ తిరుగుతూ ఉంటేమార్చాల్సింది పోయి మీలో ఏదో టాలెంట్‌ ఉండేఉంటుంది, చదువుకోకపోయినా ఫర్వాలేదుఅని ఓదార్చే సినిమాలు సమాజానికి హాని చేస్తాయి.

    సినిమాక్లెయిమాక్స్‌కు ముందుహీరోయిన్‌ను చంపేయడం, ఆతర్వాత ఆమెను ఏంజెల్‌గా మార్చిహీరోను ఓదార్చడం తెలుగు వారికి యాంటీక్లెయిమాక్స్‌. ఈ సినిమా గాలిగాతిరిగే కుర్రకారుకు నచ్చవచ్చు కానీఅన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X