twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రోచేవారెవరురా సినిమా రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    3.0/5
    Star Cast: శ్రీ విష్ణు, ప్రియదర్శి, నివేదా థామస్, నివేదా పేతురాజ్, రాహుల్‌ రామకృష్ణ
    Director: వివేక్‌ ఆత్రేయ

    Recommended Video

    Brochevarevarura Movie Review & Rating

    మెంటల్ మదిలో ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్వకత్వంలో శ్రీ విష్ణు, నివేదా థామస్, నివేదా పేతురాజ్, సత్యదేవ్ కలిసి నటించిన చిత్రం బ్రోచేవారెవరురా. ఈ సినిమా విడుదలకు ముందే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. టీజర్లు, ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ నేపథ్యంలో వివేక్ ఆత్రేయ ద్వితీయ విఘ్నం అధిగమించాడా? నివేదా, శ్రీ విష్ణు, నివేతా పేతురాజ్, సత్యదేవ్‌ కెరీర్‌లో హిట్టు పడిందా అనే అంశాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    బ్రోచేవారెవరురా కథ

    బ్రోచేవారెవరురా కథ

    రాహుల్ (శ్రీ విష్ణు), రాంబాబు ( రాహుల్ రామకృష్ణ), రాకేష్ (ప్రియదర్శి) ఒకే కాలేజీలో చదివే ప్రాణ స్నేహితులు RRR ఫేమస్. చదువులో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్. ఇలాంటి లక్షణాలు ఉన్న మిత్ర (నివేదా)తో స్నేహం పెరుగుతుంది. మిత్రాకు తండ్రి అంటే అసలే ఇష్టం ఉండదు. ఈ క్రమంలో మిత్రాకు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను పరిష్కరించేందుకు మిత్రాను కిడ్నాప్ చేసినట్టు డ్రామా ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక విశాల్ (సత్య దేవ్) సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా రాణించాలని కష్టాలు పడుతుంటాడు. షాలిని అనే హీరోయిన్‌కు కథ చెప్పి దర్శకుడిగా మారాలనుకొంటాడు. ఆ క్రమంలో వారు యాక్సిడెంట్‌కు గురవుతారు.

    బ్రోచేవారెవరురా ట్విస్టులు

    బ్రోచేవారెవరురా ట్విస్టులు

    మిత్రా కిడ్నాప్ డ్రామాతో రాహుల్; రాంబాబు, రాకేష్ జీవితంలో ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకొన్నాయి. విశాల్, శాలిని యాక్సిడెంట్‌కు కారణమేమిటి? మిత్రాకు ఎదురైన సమస్య ఏమిటి? దానికి RRR ఎలాంటి పరిష్కారం చూపారు? ఈ సినిమా కథలో రెండు వేర్వేరు సంఘటనలకు లింక్ ఏమిటి? చివరకు రెండు గ్రూపుల సమస్యలకు ఏ విధంగా ఉపశమనం లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే బ్రోచేవారెవరురా సినిమా కథ.

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    హీరోయిన్ షాలినికి విశాల్ కథ చెప్పడం, కాలేజీలో ముగ్గురు స్నేహితులకు సంబంధించిన అంశాలు, మిత్రా లైఫ్ లాంటి విషయాలతో కథ సాగుతుంది. ప్రతీ ఫ్రేములో చిరునవ్వులు నింపడంతో సరదాగా, హాయిగా సాగిపోతుంటుంది. కిడ్నాప్ డ్రామాను కొనసాగిస్తూనే, విశాల్, షాలిని ఎపిసోడ్స్ మేలవించడం తెర మీద ఓ మ్యాజిక్‌లా అనిపిస్తుంటుంది. కిడ్నాప్ డ్రామా ముగిసిన తర్వాత తండ్రిని వదిలేసి మిత్రా హైదరాబాద్‌కు పారిపోవడంతో కథ మరో లెవెల్‌కు వెళ్తుంది. కేవలం హాస్యాన్ని కాకుండా ప్రతీ ఫ్రేమ్‌లో అంతే ఏమోషన్‌ను జొప్పించడంతో ఫీల్‌గుడ్ మూవీ అనే ఫీలింగ్ తొలిభాగం ముగియకముందే కలుగుతుంది. రెండు వేర్వేరు కథలను ఇంటర్వెల్ బ్యాంగ్‌లో లింక్ చేయడం ఓ థ్రిల్‌గా అనిపిస్తుంది.

    సెకండాఫ్‌ అనాలిసిస్

    సెకండాఫ్‌ అనాలిసిస్

    ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. రెండో భాగం అంతా భావోద్వేగాలు, బంధాలు, అనుబంధాలు, ప్రేమ ఇలాంటి అంశాలన్నీ పేర్చుకుంటూ పోవడం సినిమాకు అత్యంత సానుకూలంగా మారిందని చెప్పవచ్చు. ఇక మిత్రా నిజంగానే కిడ్నాప్ కావడం సినిమాను అనేక మలుపులు తిప్పుతుంది. కిడ్నాప్ చుట్టూ సాగే కథలో అనేక కార్యెక్టర్లు ఎంటరవుతాయి. చిన్న పాప పాత్ర నుంచి ప్రతీ క్యారెక్టర్ ఓ అనుభూతిని ప్రేక్షకుడి మదిలో వదిలి వెళ్తుంది. విశాల్, షాలిని యాక్సిడెంట్ చుట్టూ మరో ఎమోషనల్ పాయింట్ అల్లుకోవడం కథను మరింత బలంగా మార్చిందని చెప్పవచ్చు. అమ్మాయిలకు ఎన్ని కష్టాలు వచ్చినా బయటకు పారిపోకూడదు.. ఇల్లే స్వర్గం అనే పాయింట్ చెప్పడం సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్తుంది.

    దర్శకుడి ప్రతిభ

    దర్శకుడి ప్రతిభ

    మెంటల్ మదిలో సినిమాతో ఓ చిన్న మ్యాజిక్ చేసిన దర్శకుడు వివేక్ ఆత్రేయ.. అంతకు మించిన మ్యాజిక్‌ను బ్రోచేవారెవరురాలో చూపించారని చెప్పవచ్చు. మొదటి సినిమాతో పోల్చితే రెండో సినిమాకు రాటుదేలిపోయాడని చెప్పవచ్చు. కమర్షియల్ అంశాలను సమపాళ్లలో రంగరించి తాజా సినిమాను ప్రేక్షకుల ముందు పెట్టాడనిపిస్తుంది. ఇక కథలో పలు రకాలు లింకులు ఓపెన్ చేసి.. బ్రహ్మండమైన లింక్ చేయడం ద్వారా తన దర్శకత్వ ప్రతిభను మరోసారి ప్రూవ్ చేసుకొన్నాడు. రకరకాల పాత్రలను డిజైన్ చేసుకొన్న తీరు నిజంగా అభినందనీయం. బ్రోచేవారెవరురా చూసిన తర్వాత దర్శకుడు వివేక్ ఆత్రేయ గురించి చెప్పడానికి చాలా ఉంటుంది. కానీ సినిమా చూస్తే అతడి ప్రతిభ మీకు కళ్లకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

    నటీనటులు ఫెర్ఫార్మెన్స్

    నటీనటులు ఫెర్ఫార్మెన్స్

    బ్రోచేవారెవరురా ఓ టీమ్ వర్క్ లాంటి సినిమా. ఏ ఆటలోనై సభ్యులందరూ ఆడితే ఎలా అయితే విజయం దొరుకుంతుందో.. బ్రోచేవారెవరురా సినిమాలో విజయంలో నివేదా థామస్, శ్రీ విష్ణు, నివేతా పేతురాజ్, సత్యదేవ్, రాహుల్, ప్రియదర్శి ఇలాంటి వారందరూ భాగస్వామ్యులే. ఒక్కరు తక్కువ చేశారు.. మరొకరు ఎక్కువ చేశారనే చాన్స్ లేకుండా ప్రతీ ఒక్కరు సినిమాను తమ భుజాల మీద మోసి ప్రేక్షకుడిని మెప్పించారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. హర్ష, ఝాన్సీ, శివాజీ రాజా ఇతర పాత్రధారులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

    టెక్నికల్‌ అంశాలు

    టెక్నికల్‌ అంశాలు

    టెక్నికల్ విభాగానికి వస్తే వివేక్ సాగర్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. ఎక్కడా సౌండ్ పొల్యూషన్ ఉండదు. రీరికార్డింగ్ ఎంగేజ్‌ చేసేలా ఉంది. ఇక సినిమాకు అసలు హీరో ఎడిటర్ అనిచెప్పవచ్చు. అనేక ట్విస్టులు ఉన్న కథ, సన్నివేశాలను అద్భుతంగా లింక్ చేయడంలోనూ రవితేజ గిరిజాల కత్తెర పదును ఎంత వాడిగా ఉందో సినిమా చూస్తే తెలుస్తుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫి మరో హైలెట్. కొన్ని క్రిటికల్ సీన్లు చూస్తే ఎంత కష్టపడ్డాడో అనే ఫీలింగ్ కలుగుతుంది.

    నిర్మాణ విలువలు

    నిర్మాణ విలువలు

    ప్రతీ అమ్మాయికి కనెక్ట్ అయ్యే కథతో బ్రోచేవారెవరురాను రూపొందించిన విజయ్ కుమార్‌ను నిజంగా అభినందించాల్సిందే. ఇలాంటి కథను నమ్మడం, ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ప్రశంసనీయం. పాత్రధారులు ఎంపిక, సాంకేతిక విభాగాల మేలవింపు ఆయన నిర్మాణ విలువలు, అభిరుచికి నిదర్శనం అని చెప్పవచ్చు.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    బ్రోచేవారెవరురా సినిమా పక్కా స్క్రీన్ ప్లే ప్రధానమైన డైరెక్టర్ ఓరియెంట్ మూవీ. సినిమా వ్యాల్యూసే కాకుండా కుటుంబ విలువలు పుష్కలంగా దొరికే, కనిపించే చిత్రం. సినిమాకు కుటుంబంతోపాటు వెళ్లాలా వద్దా అనే సంశయించే వారు.. ఎలాంటి అనుమానాలు లేకుండా ఫ్యామిలీ అంతా రెండు గంటలపాటు ఎంజాయ్ చేసే సినిమా బ్రోచేవరెవరురా. ఇలాంటి సినిమాకు రంధ్రాన్వేషణ చేస్తే అంతకంటే శిక్ష మరొకటి ఉండదేమో. పక్కాగా ఈ సీజన్ ఎంతో చక్కటి అనుభూతి కలిగించే చిత్రమని చెప్పవచ్చు.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    దర్శకుడు వివేక్ ఆత్రేయ టేకింగ్
    నటీనటుల పెర్ఫార్మెన్స్
    కామెడీ అండ్ ఎమోషన్స్
    సాంకేతిక అంశాలు

    నటీనటులు, సాంకేతిక వర్గం

    నటీనటులు, సాంకేతిక వర్గం

    తెర ముందు, తెర వెనుక
    నటీనటులు: శ్రీ విష్ణు, ప్రియదర్శి, నివేదా థామస్, నివేదా పేతురాజ్, రాహుల్‌ రామకృష్ణ, సత్యదేవ్‌, శివాజీ రాజా తదితరులు
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వివేక్‌ ఆత్రేయ
    సంగీతం: వివేక్‌ సాగర్‌
    కూర్పు: రవితేజ గిరిజాల
    సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్‌
    సమర్పణ: సురేశ్‌ ప్రొడక్షన్స్‌
    నిర్మాతలు: విజయ్‌ కుమార్‌
    విడుదల తేదీ: 28-06-2019

    English summary
    Nivetha Thomas is an actress who appears in Malayalam, Telugu, Tamil language films. She is best known for Ninnu Kori, Jai lava kusa and Gentleman. Now she is doing Brochevarevarura movie. This movie released on June 28. In this occassion, Telugu filmibeat brings exclusive reveiw.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X