Just In
- 13 min ago
షర్ట్ మొత్తం విప్పేసింది.. ఎద అందాల వల.. ఇలియానా హాట్ పిక్స్ వైరల్
- 50 min ago
అల్లు స్నేహారెడ్డి ఐడియాకు అంతా ఫిదా.. ఆ ఫోటోలన్నీ ఒకే చోట.. బన్నీ ఫ్యాన్స్ హల్చల్
- 1 hr ago
ఏదేదో ఊహించుకోకండి.. సమయం వస్తే చెబుతాను.. రేణూ దేశాయ్ కామెంట్స్ వైరల్
- 2 hrs ago
ప్రియుడి నుంచి ఆ పాఠాలు నేర్చుకొంటున్న బ్యూటీ.. కౌగిలింతల్లో మునిగి తేలిన స్టార్ హీరో కూతురు (వీడియో)
Don't Miss!
- News
10 లక్షల మందికి వ్యాక్సిన్.. అమెజాన్ ఇండియా గొప్ప మనసు.. ఎవరికి అంటే
- Sports
ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా భువనేశ్వర్ కుమార్.. వరుసగా మూడు భారత్‌కే!
- Finance
సెన్సెక్స్ 660 పాయింట్లు జంప్, మార్కెట్ అదరగొట్టడం వెనుక...
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Lifestyle
Sun Transit in Aries on 14 April:మేషంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారికి ప్రత్యేకం...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చావు కబురు చల్లగా మూవీ రివ్యూ అండ్ రేటింగ్
రేటింగ్: 2.75/5
నటీనటులు: కార్తీకేయ గుమ్మకొండ, లావణ్య త్రిపాఠి, అనసూయ భరద్వాజ్, ఆమని, మురళీశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, రజిత, మహేష్, భద్రం తదితరులు
రచన, దర్శకత్వం: కౌశిక్ పెగళ్లపాటి
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాసు
ఎడిటర్: సత్య
డీవోపీ: కామ్ చావ్లా
మ్యూజిక్: జేక్స్ బిజోయ్
ఆర్ట్ డైరెక్టర్: జీఎం శేఖర్
బ్యానర్: జీఏ2 పిక్చర్స్
రిలీజ్ డేట్: 2021-03-19
హీరో కార్తికేయ లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్.. చావు కబురు చల్లగా సక్సెస్‌పై కన్నేసిన యువ హీరో (ఫొటోలు)

చావు కబురు చల్లగా కథ ఏమిటంటే
బస్తీ బాలరాజు ( కార్తీకేయ గుమ్మకొండ) శవాలను మోసుకెళ్తే వాహనం డైవర్. జల్సాగా ఎలాంటి బాధ్యతలను పట్టించుకోకుండా జీవించే బాలరాజు.. ఓ చావులో భార్తను కోల్పోయిన మల్లిక (లావణ్య త్రిపాఠి)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. మల్లికతోపాటు కుటుంబ సభ్యులు నిరాకరించినా బాలరాజు వెంటపడుతూనే ఉంటాడు. ఈ క్రమంలో భర్త ఉండగానే వివాహేతర బంధం పెట్టుకొన్న తల్లి గంగమ్మ (ఆమని) విషయం బాలరాజుకు తెలుస్తుంది.

మూవీలో ట్విస్టులు
భర్తను కోల్పోయిన వితంతు మల్లికను బాలరాజు ప్రేమ, పెళ్లికి ఒప్పించాడా? మల్లిక మామ (మురళీశర్మ), ఆయన కుటుంబంతో బాలరాజు వ్యవహరించిన తీరు ఎలా ఉంది? భర్త ఉండగానే మోహన్ (శ్రీకాంత్ అయ్యంగార్)తో గంగమ్మ ఎందుకు వివాహేతర బంధాన్ని పెట్టుకొన్నది? తన తల్లి వివాహేతర బంధం గురించి తెలిసిన బాలరాజు రియాక్షన్ ఏమిటి? ఏ పరిస్థితుల్లో తండ్రి బతికి ఉండగానే తన తల్లికి పెళ్లి చేయాలని నిర్ణయించుకొన్నాడు? చివరకు మల్లికను ఒప్పించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే చావు కబురు చల్లగా సినిమా కథ.

ఫస్టాఫ్ ఎలా ఉందంటే..
తొలి భాగం విషయానికి వస్తే.. బస్తీ బాలరాజు క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు కౌశిక్ రాసుకొన్న సన్నివేశాలు ఆసక్తికరంగా మొదలవుతాయి. మల్లిక భర్త చనిపోయిన సీన్‌తో అసలు కథ మొదలవుతుంది. మల్లిక వెంటన బాలరాజు పడటం లాంటి సీన్లు నత్త నడకగా సాగడం కొంత అసౌకర్యంగా అనిపిస్తుంది. కానీ బాలరాజు, తల్లి గంగి మధ్య సన్నివేశాలు సినిమాపై కొంత క్యూరియాసిటీని పెంచుతాయి. తల్లితో ముడిపడి ఉన్న ఓ భావోద్వేగమైన అంశాన్ని జోడించి కథను మరింత ఎమోషనల్‌గా మార్చడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. తొలి భాగంలో వినోదానికి పెద్ద పీట వేసినట్టు కనిపించినా ఎమోషన్స్ సరిగా వర్కవుట్ కాలేదనే ఫీలింగ్ కలుగుతుంది.

సెకండాఫ్ అనాలిసిస్
ఇక సెకండాఫ్‌లో దర్శకుడు కౌశిక్ తన ప్రతిభకు పదనుపెట్టారనిపిస్తుంది. కథలో రకరకాల ఎమోషన్స్ జొప్పించి బ్యాలెన్స్ చేయడంలో అతడి స్టామినా అర్ధమవుతుంది. ఆమని, కార్తీకేయ మధ్య సన్నివేశాలు, అలాగే శ్రీకాంత్ అయ్యంగార్‌తో కొన్ని సీన్లు ఆసక్తికరంగా సాగుతాయి. అలాగే లావణ్య త్రిపాఠిని తన ప్రేమను ఒప్పుకొనే విధంగా బాలరాజు చేసే ప్రయత్నాలు చాలా ఎమోషనల్‌గా సాగుతాయి. క్లైమాక్స్‌లో మురళీ శర్మతో బాలరాజు ఎపిసోడ్ మరింత ఎమోషనల్‌గా కనిపించి సినిమాకు జస్టిఫికేషన్‌గా మారుతుంది.

డైరెక్టర్ కౌశిక్ గురించి
చావు, పుట్టుక లాంటి భావోద్వేగమైన పాయింట్‌ను ఎంచుకొన్న తీరు దర్శకుడికి ఓ ఛాలెంజ్‌గానే కనిపిస్తుంది. కానీ ప్రజల ఆమోదం పొందని, సెంటిమెంట్లకు దూరంగా ఉండే పాయింట్లను తీసుకొని బాలెన్స్‌గా కథను నడిపించిన తీరును అభినందించాలి. జీవితం పట్ల ఉండే ఫిలాసఫీని తనదైన శైలిలో చెప్పడానికి చేసిన ప్రయత్నం బాగుంది. కథలో ఉండే వివాదాస్పద పాయింట్లను డీల్ చేసిన విధానం పర్‌ఫెక్ట్‌గా ఉంది. కథ, కథనాల విషయంలో మరింత జాగ్రత్త పడి ఉంటే డెఫినెట్‌గా ఈ చిత్రం మరో లెవెల్‌కు వెళ్లడానికి ఆస్కారం ఉండేది.

కార్తీకేయ గుమ్మకొండ పెర్ఫార్మెన్స్
RX 100 తర్వాత పలు సినిమాల్లో చూస్తే కార్తీకేయ తన పెర్ఫార్మెన్స్ లెవెల్స్‌ను పెంచుకొంటూ వెళ్తున్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక చావు కబురు చల్లగా సినిమాలో ఓ భారమైన పాత్రను చాలా సహజంగా, సన్నితంగా, సులభంగా చేసి మెప్పించాడని చెప్పవచ్చు. సినిమా భారాన్ని తన భుజాల మీద మోసి మెప్పించాడు. నటనలో మరింత మెచ్యురిటీ కనిపించింది. ఎమోషనల్ సీన్లలో విజృంభించాడనే చెప్పవచ్చు. కమర్షియల్ హీరోగా, ఫెర్ఫార్మర్‌గాను తన రేంజ్‌ను చావు కబురు చల్లగా సినిమా ద్వారా పెంచుకొన్నాడనే చెప్పవచ్చు.

లావణ్య త్రిపాఠి, ఇతర నటీనటులు
సాధారణంగా హీరోయిన్ అంటే గ్లామర్, అందాల ఆరబోత అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ మల్లిక పాత్ర విషయానికి వస్తే పూర్తిగా డీ గ్లామరైజ్డ్ రోల్. కానీ మల్లిక పాత్రను లావణ్య త్రిపాఠి చక్కగా పోషించింది. గ్లామర్‌కు ఏ మాత్రం అవకాశం లేని పాత్రలో ఒదిగిపోయింది. ఇప్పటి వరకు చూసిన లావణ్య త్రిపాఠి తెర మీద కనిపించదు. ఓ సరికొత్తగా ఫెర్ఫార్మర్ మాత్రమే ఆమె కనిపిస్తుంది. ఇక ఆమని విషయానికి వస్తే భారమైన పాత్రతో సినిమాకు ప్రత్యేకమైన ఆకర్షణగా మారారు. శ్రీకాంత్ అయ్యంగార్ తన పాత్ర పరిధి మేరకు మెప్పించాడు. మురళీ శర్మ క్లైమాక్స్‌లో రెచ్చిపోయాడు. భద్రం, మహేష్ తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు.

టెక్నికల్ అంశాల గురించి
చావు కబురు చల్లగా సినిమాలో ఎమోషన్స్‌తోపాటు వినోదం కూడా సమాన భాగాల్లో ఉంటుంది. ముఖ్యంగా సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ అందించిన పాటలు క్లాస్ మాస్ అంశాలతోపాటు, భావోద్వేగంగా సాగుతాయి. రీరికార్డింగ్ కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. కామ్ చావ్లా సినిమాటోగ్రఫి బాగుంది. సత్య ఎడిటింగ్, జీఎం శేఖర్ ఆర్ట్ విభాగం పనితీరు ఫర్వాలేదనిపిస్తుంది. గీతా ఆర్ట్స్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నాయి.

బలం, బలహీనతలు
ప్లస్ పాయింట్స్
కార్తీకేయ, ఆమని, లావణ్య త్రిపాఠి పెర్ఫార్మెన్స్
సెకండాఫ్
మ్యూజిక్
మైనస్ పాయింట్స్
స్లో నేరేషన్
ఫస్టాఫ్

ఫైనల్‌గా
ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్ మిక్స్ చేసి రూపొందించిన చిత్రం చావు కబురు చల్లగా. కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని లాంటి నటీనటులు ఫెర్ఫార్మెన్స్ సినిమాకు ఆకర్షణ అని చెప్పవచ్చు. భారమైన పాత్రలు, వాటి చుట్టూ ఎమోషన్స్‌తో కూడిన చిత్రమని చెప్పవచ్చు. ఫ్యామిలీ ఆడియెన్స్‌కే కాకుండా యూత్ కూడా ఎంజాయ్ చేసే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయితే ఈ సినిమా భారీ ఒపెనింగ్స్ సాధించే అవకాశాలు ఉన్నాయి.