Just In
- 9 min ago
యువ హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్
- 21 min ago
Naandhi 11 Days Collections: క్లిష్ట సమయంలోనూ సత్తా చాటిన ‘నాంది’.. లాభాల్లోనూ నరేష్ మూవీ రికార్డు
- 26 min ago
ఆన్లైన్లో నితిన్ దర్శకుడికి టోకరా.. గుడ్డిగా నమ్మి డబ్బులు పంపిన దర్శకుడు.. చివరికి..
- 47 min ago
Uppena 18 Days Collections: దారుణంగా పడిపోయిన ‘ఉప్పెన’ కలెక్షన్లు.. అయినా వైష్ణవ్ తేజ్‌దే హవా!
Don't Miss!
- News
Viral Video: పేలిన అగ్నిపర్వతం: బూడిద వర్షం: నాలుగు కిలోమీటర్ల ఎత్తు..భయంభయంగా
- Sports
ఐపీఎల్ 2021 వేదికలపై సన్‌రైజర్స్ అసంతృప్తి.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు నిర్వహించాలంటూ!!
- Automobiles
తండ్రి పుట్టిన రోజు కానుకగా తనయుడు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్!
- Finance
భారీగా తగ్గిన బంగారం ధరలు, రూ.45,000కి దిగొచ్చిన పసిడి: వెండి కూడా డౌన్
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి వ్యాపారులు ఈరోజు ఆర్థిక నష్టాన్ని భరించాలి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చక్ర మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నిర్మాత: విశాల్
మ్యూజిక్: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫి: కేటీ బాలసుబ్రమణ్యం
ఎడిటింగ్: తియగు
బ్యానర్: విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
రిలీజ్ డేట్: 2021-02-19

చక్ర మూవీ కథ..
చంద్రు అలియాస్ చంద్రబోస్ (విశాల్) ఆర్మీ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ గాయత్రి (శ్రద్దా శ్రీనాథ్)ను పెళ్లి చేసుకోవాలనుకొంటారు. కానీ ఓ కారణంగా గాయత్రితో విడిపోతారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో దాదాపు 50 ఇళ్లలో జరిగిన దోపిడిలు సంచలనం రేపుతాయి. ఈ దోపిడిలో చంద్రు అమ్మమ్మ (కేఆర్ విజయ) గాయపడిన నేపథ్యంలో గాయత్రి, చంద్రు కలుసుకొంటారు. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా సైబర్ క్రైమ్ వెనుక లీలా (రెజీనా కసండ్రా) ముఠా ఉందనే విషయాన్ని గ్రహిస్తారు.

చక్ర మూవీ ట్విస్టులు
ఆర్మీ ఆఫీసర్ అయిన చందూ హైదరాబాద్ సిటీ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి ఎందుకు ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు? పెళ్లి చూపుల్లో గాయత్రితో చందు ఎందుకు గొడవ పడుతాడు? లీలా సైబర్ క్రైమ్స్‌కు ఎందుకు పాల్పడుతుంది? తన అమ్మమ్మ ఇంటిలో జరిగిన దోపిడిని చందు ఎందుకు పర్సనల్‌గా తీసుకొంటారు? సైబర్ దొంగగా లీల మారడానికి కారణాలు ఏమిటి? లీలా సైబర్ మోసాలకు చంద్రు ఎలా చెక్ పెట్టారు? హైదరాబాద్‌లో సైబర్ దోపిడిలకు పాల్పడి సవాల్ విసిరిన లీలా ఆటలను గాయత్రి ఎలా కట్టించారు? అనే ప్రశ్నలకు సమాధానమే చక్ర సినిమా కథ.

ఫస్టాఫ్ రివ్యూ
చక్ర సినిమా విషయానికి వస్తే ఫస్టాఫ్ సైబర్ క్రైమ్స్ గుట్టు విప్పడమనే అంశంపై గ్రిప్పింగ్‌గా సాగుతుంది. దర్శకుడు ఎంఎస్ ఆనందన్ తన సౌలభ్యం కోసం రాసుకొన్న సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. విశాల్ చేత ఆడించిన మైండ్ గేమ్ ఆకట్టుకొనేలా ఉంటుంది. సైబర్ క్రైమ్ దొంగలు, విశాల్ ఎత్తులు పై ఎత్తులు సినిమాపై మరింత ఆసక్తిని రేపుతాయి. పక్కా స్క్రీన్ ప్లేతో సహాజమైన సన్నివేశాలతో ఫస్టాఫ్ అప్పుడే ముగిసిందా అనే విధంగా సినిమా సాగుతుంది.

సెకండాఫ్ రివ్యూ
ఇక రెండో భాగంలో లీలా పాత్ర రివీల్ అయిన తర్వాత సినిమా రొటీన్‌గా మారిపోతుంది. హైదరాబాద్ పోలీసులను పక్కన పెట్టి ఆర్మీ ఆఫీసర్ అయిన చంద్రు ఇన్వెస్టిగేషన్ అసహజంగా అనిపిస్తుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా ఆర్మీ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్‌కు మద్దతు తెలపడం, తన పోలీసుల బలగాలను పట్టించుకోకుండా చంద్రుపైనే ఆధారపడటం సినిమా ట్రాక్ తప్పిందనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథ మొత్తం లీలా వర్సెస్ చంద్రుగా మారడం కొంత ప్రతికూలంగా మారుతుంది.

విశాల్ యాక్టింగ్
ఎప్పటిలానే విశాల్ తన దేశభక్తి భావాన్ని చక్ర సినిమాలో చూపించుకొన్నారు. తొలి భాగంలో వేగవంతంగా కనిపించే స్క్రీన్ ప్లేకు అనుగుణంగా చురుకుగా తన నటనను ప్రదర్శించారు. సినిమా భారాన్ని తన భుజాలపై మోసేందుకు ప్రయత్నించారు. గాయత్రి, లీలా పాత్రలతో పోటీ పడుతూ ఆకట్టుకొన్నాడు. ఫైట్స్‌లో కూడా సత్తా చూపించాడు.

శ్రద్దా శ్రీనాథ్ పెర్ఫార్మెన్స్
ఇటీవల కాలంలో శ్రద్దా శ్రీనాథ్ బలమైన పాత్రలను ఎంపిక చేసుకొంటూ రాణిస్తున్నారు. మారా చిత్రం తర్వాత మరోసారి పవర్‌ఫుల్ రోల్‌లో మెప్పించారు. గాయత్రిగా ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో తన నటనా ప్రతిభను చాటుకొన్నారు. లేడి జేమ్స్‌బాండ్ మాదిరిగా ఫైట్స్‌తోను మెప్పించారు. తన కెరీర్‌లోనే ఓ మంచి పాత్రలో శ్రద్దా శ్రీనాథ్ కనిపించారని చెప్పవచ్చు.

రెజీనా కసండ్రా విలనిజం
ఇక వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న రెజీనా కసండ్రా ఈ సారి చక్కటి విలనిజం ప్రదర్శించారు. తన పాత్రలో ఉండే ఇంటెన్సిటీని తన కళ్లతో పలికించారు. ఈ సెకండాఫ్‌లో రెజీనా తన నటనతో డామినేట్ చేశారు. విశాల్‌తో పోటీ పడి నటించారని చెప్పవచ్చు.

యువన్ శంకర్ రాజా మ్యూజిక్
చక్ర తెర వెనుక అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ ఈ సినిమాకు బలంగా మారింది. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. టెక్నికల్‌గా సాగే ఈ చిత్రానికి కేటీ బాలసుబ్రమణ్యం అందించిన సినిమాటోగ్రఫి ప్లస్ అయింది. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది.

విశాల్ నిర్మాతగా
ఇక ప్రొడక్షన్ వ్యాల్యూస్ విషయానికి వస్తే.. కథా పరంగా సరికొత్త పాయింట్‌ను విశాల్ ఎంచుకొన్నారు. కథకు తగ్గట్టుగా నటీనటులను ఎంపిక చేసుకొన్న తీరు బాగానే ఉంది. కానీ సెకండాఫ్‌లో కథ, కథనాలపై మరింత శ్రద్ద పెట్టాల్సి ఉండేది. స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు కొట్టిచ్చినట్టు కనిపిస్తాయి. వాటిని సరిద్దిద్దుకొని ఉంటే ఈ చిత్రం మరింత మంచి ఫలితాన్ని సాధించడానికి అవకాశం ఉండేది.

ఫైనల్‌గా
విశాల్ నిర్మాతగా వ్యవహరించి నటించిన చక్ర సినిమా సైబర్ క్రైమ్, టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అంశాల ఆధారంగా సాగుతుంది. క్రైమ్, ఇన్వెస్టిగేషన్ చిత్రాలను ఆదరించే వారికి చక్ర మూవీ బాగా నచ్చుతుంది. శ్రద్దా శ్రీనాథ్, రెజీనా నటనను, గ్లామర్‌ను ఆస్వాదించే ప్రేక్షకులను చక్ర మూవీ మెప్పిస్తుంది. విశాల్‌కు దక్షిణాదిలో ఉండే క్రేజ్‌తో భారీ ఓపెనింగ్స్ లభించే అవకాశం ఉంది.