»   » చూడటం ఓ శోకం (‘ప్రేమ ఒక మైకం’ రివ్యూ)

చూడటం ఓ శోకం (‘ప్రేమ ఒక మైకం’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.0/5
నటీనటులు: ఛార్మి, రాహుల్, శరణ్యం, సోనీ చరిష్టా, సతీష్, చంద్రమోహన్, రావు రమేష్, తాగుబోతు రమేష్, పృథ్వీ, సురేఖ వాణి, చంటి, జాకీ తదితరులు సమర్పణ: బేబీ హ్యాపీ తదితరులు
పాటలు: కులశేఖర్‌, శశి,
సంగీతం: ఎస్.ఆర్.పోశం,
మాటలు: పులగం.సి.నారాయణ,
కెమెరా: ప్రవీణ్‌.కె.బంగారి
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: పి.ప్రతాప్, గీతానంద్‌రెడ్డి,
సహనిర్మాత: జితిన్ చక్రవర్తి
సమర్పణ: బేబీ హ్యాపీ.
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చందు

అనుకోకుండా ఒక రోజు, మంత్ర వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలను పూర్తిగా తనే మోసి, విజయం సాధించిన ఛార్మి... ఈ మధ్య కాలంలో హిట్స్ లేక, హీరోల ప్రక్కన ఛాన్స్ లు లేక పూర్తిగా వెనకపడింది. అడపా దడపా ఇలాంటి సినిమాలతో పలరించినా అవి ఆశించిన ఫలితం దక్కటం లేదు. ఉన్నంతలో విభిన్నత చూపాలని ... కాల్ గర్ల్ గా చేసిన ఈ చిత్రం కూడా ఆమె కు నిరాశే మిగిల్చేటట్లు ఉంది. స్లో నేరేషన్, కాంఫ్లిక్ట్ లేని పాత్రలు, ఎంటర్టైనర్టైన్మెంట్ లేకపోవటం... ముఖ్యంగా ఈ చిత్రం పబ్లిసిటీ చూసి ఏదో ఊహించుకుని వెళ్లిన వారికి ఆ తరహా కంటెంట్ ఏదీ కనపడకపోవటం ఇబ్బందికర అంశాలే. ఉన్నంతలో పులగం.సి.నారాయణ డైలాగులే బాగున్నాయి.

హై క్లాస్ కాల్ గర్ల్ అయిన మల్లిక(ఛార్మి) ఓ రోజు ఔత్సాహిక పాటల రచయిత లలిత్ ( 'హ్యాపీడేస్‌' రాహుల్‌, ) ని రేష్ డ్రైవింగ్ లో గుద్దేస్తుంది. ఆ ఏక్సిడెంట్ లో రాహుల్ కళ్లు పోగొట్టుకుంటాడు. దాంతో తన తప్పు రియలైజ్ అయిన ఆమె అతన్ని ఇంటికి తీసుకు వెళ్లి...అన్ని తానే అయ్యి సాకుతుంది. ఈ క్రమంలో ఆమెకు లలిత్ డైరీ దొరుకుతుంది. దాంట్లో లలిత్ ... మరో ఔత్సాహిక గాయకురాలు స్వాతి ('ప్రేమిస్తే' శరణ్య) లవ్ స్టోరీ ఉంటుంది. ఇదంతా చదివిన తర్వాత మల్లిక ఏం నిర్ణయం తీసుకుంది. లలిత్ కి తిరిగి కళ్లు వచ్చాయా.... అతని ప్రేమ కథ కి ఎలాంటి ముగింపు దొరికింది... మల్లిక..వారి ప్రేమకు ఎలా సహాయం చేసింది..అనేది మిగతా కథ.

వరస ఫ్లాపుల్లో ఉన్న ఛార్మి గ్యాప్ తీసుకుని మరీ చేసిన ఈ చిత్రం ...ఆమె కమింగ్ బ్యాక్ చిత్రంలా కనిపించదు. ఛార్మి కెరీర్ లో ఇలాంటి పాత్ర కొత్తేమో కానీ..తెలుగు తెరపై ఇలాంటి పాత్రలు చాలా సార్లు కనపడ్డవే. ఛార్మికి గతంలోనూ ఫెరఫెక్ట్ స్క్రిప్టులు సక్సెస్ కి హెల్ప్ చేసాయి. అయితే ఈ సారి అదే లోపించింది. ఎక్కడో ప్రీ క్లైమాక్స్ లో కానీ..కథలో వేడి పుట్టదు. ఛార్మి... లలిత్ డైరీ చదివేదాకా కథలో కాంఫ్లిక్టే లేకుండా పోయింది. దాంతో చాలా బోర్ గా తయారైంది. క్లైమాక్స్ కూడా పెద్ద పండలేదు. దానికి తోడు సినిమాలో చాలా సేపు ఛార్మి కనపడదు(అందుకే ఛార్మి ఒప్పుకుందేమో). సినిమాని ఛార్మి కథగా సినిమా మొదలెట్టినప్పుడు... ప్లాష్ బ్యాక్ లవ్ స్టోరి ని త్వరగా ముగించి ...ఆ కథ తెలుసుకున్న ఛార్మి ఏం చేసిందనే దిసగా కథ నడపాల్సి ఉంది....ఎందుకంటే ఛార్మి ఏం చేస్తుంది అనే విషయం తెలుసుకోవటమే ఆ క్షణంలో ప్రేక్షకుడి ఆసక్తి...అది మిస్సయ్యారు.

డైలాగుల్లో.... రాహుల్ చెప్పే... నేను రాసే రాతలు కాదు తల రాత బాగుండాలి, మనిషికి కళ్లు లేకుండా, నోరు లేకుండా ఆఖరికి అవయవాలు లేకుండా పుట్టోచ్చు కాని మనసు లేకుండా పుట్టడు వంటివి బాగున్నాయి. ఛార్మికి, రాహుల్ కి మధ్య వచ్చే సన్నివేశాలలో కొన్ని బాగున్నాయి. ఇక పాటల్లో.. ఫస్టాఫ్ లో వచ్చే... 'స్వచ్చమైన ప్రేమ..' బాగుంది. కాకపోతే అదీ ప్లేస్ మెంట్ బాగోలేదు. ఇక మిగతా విభాగాలు ఎంతకు అంతే. సినిమా నిర్ధాక్ష్యంగా ఫస్టాఫ్ లో ఓ అరగంట కట్ చేస్తే కొంతలో కొంత బాగుండే అవకాసం ఉంది. డైరక్టర్ గా చందు కామెడీ సీన్స్ బాగా పండించాడు. నిర్మాత సురేష్ కొండేటి, సింగర్ శ్రీకృష్ణ కూడా ప్రీ ఇంటర్వెల్ సీన్స్ లో కనపడి నవ్విస్తారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా చాలా పూర్ గాఉన్నాయి.

ఏదైమైనా ఛార్మి నటించిన చిత్రం అంటే ప్రేక్షకుల్లో ఎంతో కొంత ప్రత్యేకమైన ఆసక్తి. అయితే ఛార్మి కోసమే కాకుండా ఆమె డిఫెరెంట్ చిత్రం చేస్తుందనే ఆసతో వచ్చే ప్రేక్షకులను ఇలాంటి సినిమాలు నిరుత్సాహపరుస్తాయి. దర్శకుడు రెగ్యులర్ ధోరణిలో మాస్ మసాలా కథ కాకుండా ఏదో డిఫెరెంట్ చేద్దామని ప్రయత్నించి...రెగ్యులర్ గా తడపడ్డాడు.

English summary
Charmee, Rahul and Sharanya starrer Prema Oka Maikam released today(Aug 30th) with negitive talk.Chandu, who had earlier made 10th Class, has directed this film and it has been jointly produced by D Venkat Suresh and K Surya Srikanth.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu