For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Chhatriwali movie review సేఫ్ సెక్స్ బ్యాక్ డ్రాప్.. కండోమ్ టెస్టర్‌గా రకుల్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

  |

  Rating: 2.5/5

  నటీనటులు: రకుల్ ప్రీత్ సింగ్, సుమీత్ వ్యాస్, సతీష్ కౌశిక్, రాకేష్ బేడీ, రాజేశ్ తైలాంగ్ తదితరులు
  దర్శకత్వం: తేజాస్ దియోస్కర్
  నిర్మాత: రోనీ స్క్రూవాలా
  రచన: సంచిత్ గుప్తా
  సినిమాటోగ్రఫి: సిద్దార్థ్ వాసానీ
  ఎడిటింగ్: శృతి బోరా
  మ్యూజిక్: మంగేశ్ ధాక్డే, రోషన్, సుమీత్ బళ్లారి, దుర్గేష్
  బ్యానర్: RSVP Movies
  ఓటీటీ రిలీజ్: Zee5
  ఓటీటీ రిలీజ్ డేట్: 2023-01-20

  హర్యానాలోని కర్నల్ ప్రాంతంలో సన్యా ధింఘ్రా (రకుల్ ప్రీత్ సింగ్) ప్రైవేట్ స్కూల్‌లో కెమిస్ట్రీ టీచర్. అనుకోని పరిస్థితుల్లో కండోమ్స్ తయారీ కంపెనీలో కండోమ్స్ టెస్టింగ్ చేసే ఉద్యోగిగా చేరుతుంది. కర్నల్ ప్రాంతానికి చెందిన రిషి (సుమీత్ వ్యాస్) తో పెద్దలు కుదిర్చిన వివాహం జరుగుతుంది. అయితే తాను గొడుగుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టు అబద్దం ఆడుతుంది. ఈ క్రమంలో తన తోడు కోడలికి వచ్చిన ఆరోగ్య సమస్య ప్రభావంతో కండోమ్ టెస్టర్‌గా తన ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. గర్బం నిరోధక ట్యాబ్లెట్లు వాడటం వల్ల మహిళల్లో తలెత్తే సమస్యలకు చెక్ చెప్పాలని చిన్నపాటి ఉద్యమాన్ని తన ఇంటి నుంచే మొదలుపెడుతుంది.

  స్కూల్ టీచర్‌ అయిన సన్యా కండోమ్ టెస్టింగ్ ఉద్యోగాన్ని ఎందుకు చేయాలనుకొన్నది? కండమ్ టెస్టర్ ఉద్యోగంలో చేరే సమయంలో ఆ కంపెనీ యజమాని లాంబా (సతీష్ కౌశిక్) ఎలాంటి షరుతులు విధించింది? కండోమ్ కంపెనీలో చేరిన సన్యాకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తాత్కాలికంగా కండోమ్ కంపెనీలో ఉద్యోగం చేయాలని అనుకొన్న సన్యా కంప్లీట్‌గా అదే ఉద్యోగాన్ని చేయాలని ఎందుకు అనుకొన్నది? గర్బ నిరోధక ట్యాబ్లెట్లు వాడటం వల్ల తన తోడు కోడలికి ఏర్పడిన ఆరోగ్య సమస్య గురించి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది? గొడుగుల కంపెనీలో పనిచేయడం లేదని తెలిసిన తర్వాత ఫ్యామిలీలో సన్యా పరిస్థితి ఎలా మారింది? అగరవత్తుల కంపెనీని నడిపే తన భర్త సోదరుడి నుంచి ఎలాంటి అభ్యంతరాలను ఎదుర్కొన్నది? చివరకు కండోమ్ తప్పనిసరిగా వాడాలనే పోరాటంలో సన్యా ఎలా విజయం సాధించింది అనే ప్రశ్నలకు సమాధానమే ఛత్రీవాలా సినిమా కథ.

  Chhatriwali movie review and rating: Rakul Preet Singh in different look and performance

  గర్బ నిరోధక ట్యాబ్లెట్లు వాడటం వల్ల కలిగే అనర్ధాల కథా నేపథ్యం ఛత్రివాలా సినిమాకు ప్రధానమైన పాయింట్. ఫన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ను కలిపి ఈ కథను చెప్పడానికి దర్శకుడు తేజాస్ దియోస్కర్ ఎంచుకొన్న విధానం కొత్తగాలేదు. రెగ్యులర్, రొటీన్ ప్యాటర్న్‌తో సాగుతుంది. కథకు ముంగింపు ఏమిటో ముందే తెలియడం సాధారణమే అయినా.. ఆ ముగింపును ఎంత ఎమోషనల్‌గా చెప్పారనేది సినిమా విజయానికి ముఖ్యం. తను చేసే ఉద్యోగం వల్ల సమాజంలో పరువుపోతుందని అత్తగారి కుటుంబం భావించడం.. తన ఉద్యోగానికి గౌరవం ఇవ్వని ఇంట్లో ఉండటం సబబు కాదని.. భర్తకు దూరంగా ఉండటం సినిమాలో ముఖ్యమైన కాన్‌ఫ్లిక్ట్. గర్బ నిరోధక టాబ్లెట్లు వాడకుండా చేయడం.. తన అత్తగారి కుటుంబాన్ని మెప్పించడమనే పాయింట్స్‌తో కథ ముందుకెళ్తుంది. కొన్ని చోట్ల ఎమోషన్స్ బాగా పండాయి. కొన్ని చోట్ల రొమాంటిక్ సీన్లు ఆకట్టుకొంటాయి.

  గ్లామర్ పాత్రలకు దూరంగా సన్యాగా రకుల్ ప్రీత్ సింగ్ ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించింది. మహిళల ఆరోగ్యం ఇంటికి ఎంత ముఖ్యం, అలాగే గర్బం రాకుండా ట్యాబ్లెట్లు వాడటం వల్ల సంతానం తర్వాత మహిళలు ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంగా సాగే పాత్రలో రకుల్ ఒదిగిపోయింది. తన ఇమేజ్‌ను మార్చేసుకొనే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. సినిమాను మొత్తంగా భుజాల మీద మోసింది. మిగితా పాత్రల్లో నటించిన ఫర్వాలేదనిపించారు.

  దర్శకుడు తేజాస్ దియోస్కర్ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. పూర్తి స్థాయి కథగా, ఎమోషనల్స్‌ను పండించడంలో తడబాటు పడ్డారు. బడ్జెట్ పరిమితుల కారణంగా చిన్న నటులతో పెద్ద ప్రయోగమే చేశారనిపిస్తుంది. రకుల్ తప్ప మిగితా నటీనటుల ఎంపిక ఈ సినిమాకు మైనస్. భారమైన, ఎమోషనల్ పాత్రలను చిన్ననటులు న్యాయం చేయలేకపోయారనిపిస్తుంది.

  సాంకేతిక నిపుణుల ప్రతిభ విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, బీజీఎం బాగున్నాయి. పంజాబీ నేటివిటిని సిద్దార్థ్ వసానీ బాగా చూపించాడు. RSVP Movies పాటించిన నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తాయి. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. రకుల్ అభిమానులు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే అవకాశం ఉంది. అంచనాలు లేకుండా లాగిన్ అయితే.. ఇంట్లో తీరిక వేళల్లో సినిమాను హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వీలుంటుంది.

  English summary
  Star Actress Rakul Preet Singh's Chhatriwali movie is hit the OTT on January 20th. Here is the Telugu filmibeat exclusive reveiw
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X