For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చి.ల.సౌ సినిమా రివ్యూ: మరో మంచి కాఫీ లాంటి..

  By Rajababu
  |
  Chi La Sow Movie Review చి.ల.సౌ మూవీ రివ్యూ

  Rating:
  2.5/5
  Star Cast: సుశాంత్, రుహానా శర్మ, జయప్రకాశ్, రోహిణి, వెన్నెల కిషోర్
  Director: రాహుల్ రవీంద్రన్

  టాలీవుడ్‌లో ఫీల్‌గుడ్ చిత్రాలకు ఇటీవల ప్రేక్షకాదరణా బ్రహ్మండంగా ఉంటున్నది. నటుడిగా మెప్పించిన రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం చిలసౌ. ఈ చిత్రంలో రుహానీ శర్మ, సుశాంత్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఫ్యామిలీ, లవ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ రవీంద్రన్‌కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? సుశాంత్ కెరీర్‌కు ఈ సినిమా దోహదపడుతుంది. రుహాని శర్మ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  చిలసౌ స్టోరి ఇదే

  చిలసౌ స్టోరి ఇదే

  అర్జున్ (సుశాంత్) ప్రేమలో విఫలమై ఒంటరి జీవితాన్ని గడుపుతుంటాడు. తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని పెడుతున్న పోరు భరించలేక తప్పని పరిస్థితుల్లో అంజలి ( రుహానీ శర్మ)తో పెళ్లి చూపులకు సిద్ధమవుతాడు. ఎన్నో పెళ్లిచూపులకు హాజరైన అంజలి తల్లి (రోహిణి)ని ఓ ఆరోగ్య సమస్య వెంటాడుతుంటుంది. ఇరు కుటుంబాలు లేకుండా జరిగిన పెళ్లిచూపుల్లో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అంజలికి చెబుతాడు. దాంతో అంజలి ఫైర్ అవుతుంది. పెళ్లి కుదరకపోవడంతో తన తల్లి పరిస్థితి ఏమవుతుందో విషయాన్ని తలచుకొని తల్లడిల్లిపోతుంది. కానీ ఓ కారణంగా అంజలి, అర్జున్ కొన్ని గంటలు కలిసి ఉండాల్సిన పరిస్థితి రావడం వారిద్దరిని మానసికంగా దగ్గరకు చేరుస్తుంది.

  కథలో ట్విస్టులు

  కథలో ట్విస్టులు

  పెళ్లిచూపుల్లో అర్జున్ రిజెక్ట్ చేసిన అంజలి పరిస్థితి ఏమిటి? అంజలి తల్లికి ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటి? ఏ కారణంగా వారిద్దరూ కలిసి ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది? ఓ రోజు సాయంత్రం నుంచి ఉదయం వరకు జరిగిన ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయనే విషయమే చి.ల.సౌ చిత్ర కథ.

  ఫస్టాఫ్ అనాలిసిస్

  ఫస్టాఫ్ అనాలిసిస్

  అర్జున్ బ్రేకప్ తర్వాత జరుగుతున్న విషయాలను, తాను పడే మానసిక సంఘర్షణ గురించి చెప్పడంతో కథ ప్రారంభమవుతుంది. అర్జున్, స్నేహితుడు (వెన్నెల కిషోర్‌)తో మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలతో ఫీల్‌గుడ్ నొటేషన్‌లో చాలా కామ్‌గా ప్రేక్షకుడు లీనమయ్యే విధంగా కథ ముందుకెళ్తుంది. ఇక అంజలితో పెళ్లిచూపులతో భావోద్వేగమైన కథ ఆరంభమవుతుంది. ఓ సన్నివేశానికి, మరో సన్నివేశానికి ఎమోషనల్ స్థాయి పెంచుకొంటూ పోవడంతో ఓ మంచి సినిమా చూస్తున్నాననే ఫీలింగ్‌లో ప్రేక్షకుడు మునిగిపోతాడు. వెన్నెల కిషోర్ కామెడీతో ఓ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్‌తో రెండో భాగంపై ఆసక్తిపెరిగే విధంగా ఇంటర్వెల్ కార్డు పడుతుంది.

  సెకండాఫ్ అనాలిసిస్

  సెకండాఫ్ అనాలిసిస్

  మొదటి భాగంలోనే ఓ మంచి సినిమాను చూస్తున్నామనే ఫీలింగ్‌తో ఉన్న ప్రేక్షకుడికి రెండో భాగంలో నవరసాలు కలబోసిన సన్నివేశాలు కళ్ల ముందు కదలాడుతాయి. రెండో భాగంలో హాస్పిటల్‌లో జరిగే డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ సన్నివేశం ప్రేక్షకులకు హాస్యాన్ని పంచడంతోపాటు.. భావోద్వేగాన్ని గురిచేస్తుంది. అంజలి ఫ్లాష్‌బ్యాక్ గురించి తన మేనమామ (జయప్రకాశ్) చెప్పిన అంశాలు ప్రేక్షకుడిని భావోద్వేగంలో బంధిస్తాయి. చక్కటి ముగింపుతో అన్ని రకాలు రుచులున్న పెళ్లి భోజనం ఆరగించిన ఫీల్‌తో ప్రేక్షకుడు బయటకు రావడం అనేది జరుగుతుంది.

  రాహుల్ రవీంద్రన్ టేకింగ్

  రాహుల్ రవీంద్రన్ టేకింగ్

  ప్రతిభావంతుడైన నటుడు రాణించలేకపోవడానికి పలు కారణాలు ఉన్నప్పటికీ రాహుల్ రవీంద్రన్ తొలిచిత్రంతోనే గొప్ప విజనరీ ఉన్న దర్శకుడిగా కనిపిస్తాడు. ఒక చిన్నపాయింట్‌తో తెర మీద పాత్రలతో మ్యాజిక్ చేసిన విధానానికి ప్రేక్షకుడు థ్రిల్ కావడం తథ్యం. పాత్రల తీరును రాసుకొన్న విధానం, కథను నడిపించిన తీరు సినిమాపై ఆయనకు ఉన్న అభిరుచిని చెబుతాయి. తొలి చిత్రమైన ఎక్కడా తొణికిసలాట కనిపించదు. ఆయనలో ఉన్న దర్శకుడి గురించి చెప్పడాకి అంజలి తల్లి అపార్ట్‌మెంట్ మీద నుంచి దూకే ఓ సీన్ చాలనిపిస్తుంది. మహిళా చైతన్యం అనే అంశంతో అంజలి పాత్రను రూపుదిద్దిన తీరు హ్యాట్సాఫ్. చి.ల.సౌ చిత్రంతో దక్షిణాదికి రాహుల్ రవీంద్రన్ రూపంలో మరో మంచి దర్శకుడు దొరికాడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

   రుహానీ శర్మ పెర్ఫార్మెన్స్

  రుహానీ శర్మ పెర్ఫార్మెన్స్

  చి.ల.సౌ చిత్రంలో అంజలి పాత్రలో రుహానీ శర్మ చాలా సాదాసీదాగా కనిపిస్తుంది. ముఖం మీద మొటిమలు, పీలగా ఎలాంటి గ్లామర్ లేని ఫేస్‌తో తొలి షాట్‌లోనే ఏందీ ఈ అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేసుకొన్నారనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ పాత్రలో ఒదిగిపోయిన తీరుతో అంజలిపై గౌరవం పెరుగుతుంది. ఆ తర్వాత రుహానా శర్మలోని టాలెంట్‌ కారణంగా గొప్ప అందగత్తెగా కనిపిస్తుంది. ఆమెలో మంచి ఫెర్ఫార్మర్‌ను చూస్తాం. బక్క పలచటి అమ్మాయే సినిమా భారాన్ని మోసిందా? అనే ఆశ్చర్యం థియేటర్‌ బయటకు వచ్చిన తర్వాత కలుగకపోతే ఒట్టు అనిపిస్తుంది. అంజలి పాత్ర వండర్‌కు చి.ల.సౌ సినిమా కేరాఫ్ అడ్రస్.

  సుశాంత్ నటన

  సుశాంత్ నటన

  కమర్షియల్ హీరో అనే ట్యాగ్ కోసం గత సినిమాల్లో ప్రయత్నించిన సుశాంత్ తన రూట్ మార్చుకొని చేసిన సినిమా ఇది. అర్జున్ పాత్రలో చూసిన తర్వాత ఈ స్థాయి ఫెర్మార్మర్ ఉన్నాడా అనే ఫీలింగ్ కలుగుతుంది. స్టార్‌గా కంటే నటుడి స్థిరపడటానికి సుశాంత్‌కు ఈ సినిమా తోడ్పడుతుంది. పాత్రకు తగినట్టుగా సుశాంత్ నటన సూపర్బ్ అని చెప్పవచ్చు.

   మిగితా పాత్రల్లో

  మిగితా పాత్రల్లో

  ఇక చిత్రంలో సుశాంత్ తల్లిదండ్రులుగా (అను హాసన్), రుహాని శర్మ తల్లిగా రేవతి పాత్రలు అద్భుతంగా ఉంటాయి. అంజలి మేనమామ పాత్ర కూడా జయప్రకాశ్ పాత్ర కూడా ఆకట్టుకొంటున్నది. క్లైమాక్స్‌లో జయప్రకాశ్, రేవతి నటించిన సన్నివేశాలు చాలా బాగుంటాయి. విద్యుల్లత రామన్ విభిన్నమైన పాత్రలో మెరిసింది.

  వెన్నెల కిషోర్, రాహుల్ కామెడీ

  వెన్నెల కిషోర్, రాహుల్ కామెడీ

  వెన్నెల కిషోర్ మరోసారి బ్రహ్మండమైన హాస్యాన్ని పంచాడు. రాహుల్ రామకృష్ణ, కమెడియన్ హరీష్ లాంటి ప్రతీ పాత్ర ప్రేక్షకుడిని వెంటాడుతుంటుంది. ఎమోషనల్‌గా సాగే కథలో వెన్నెల కిషోర్ కామెడీ కొంత భావోద్వేగాన్ని తగ్గించి రిలీఫ్‌గా ఉంటుంది. కొద్ది నిమిషాల పాత్రలో కనిపించినా గానీ రాహుల్ రామకృష్ణ గుర్తుండిపోతాడు.

  మ్యూజిక్, సినిమాటోగ్రఫీ

  మ్యూజిక్, సినిమాటోగ్రఫీ

  ప్రశాంత్ విహారి అందించిన సంగీతం చిలసౌ చిత్రానికి ప్రాణం పోసింది. భావోద్వేగ సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతమైన ఫీలింగ్‌ను ఇస్తుంది. తెలుగుదనంతో నిండిన పాటలు కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. ఎన్ సుకుమార్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రతీ ఫ్రేమ్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. మూడ్‌ను ఎలివేట్ చేయడానికి వాడుకొన్న లైటింగ్ బాగుంది.

  ఎడిటింగ్, ఇతర

  ఎడిటింగ్, ఇతర

  సినిమాలో జర్క్‌లు లేకుండా సాఫీగా, వేగంగా, షార్ప్‌గా కనిపించేలా చేయడంలో చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఎక్కడా ఓ చెత్త సీన్ కనిపించదు. ఈ సన్నివేశంలోనూ సాగదీత ఉండదు. ప్రతీ సీన్ చకచక పరుగులు పెడుతుంటాయి. చిన్మయి చెప్పిన డబ్బింగ్ హీరోయిన్ పాత్రకు జీవం పోసింది.

   ప్రొడక్షన్ వ్యాల్యూస్

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  అన్నపూర్ణ బ్యానర్‌ సమర్పించిన చిలసౌ చిత్రం మంచి నిర్మాణ విలువలకు అద్దం పట్టింది. పాత్రల ఎంపిక, సాంకేతిక నిపుణుల సెలక్షన్ వారి అభురుచి చెప్పింది. సినిమాను ప్రమోషన్ చేసిన విధానం కూడా బాగుంది.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  సినిమాగా కాకుండా జీవితం అనిపించే విధంగా ఉంటుంది చిలసౌ చిత్రం. ప్రతీ సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఏదో ఒక్క వర్గానికి కాకుండా ప్రతీ ఒక్కరిని టచ్ చేసే సినిమా చిలసౌ. వెండి తెర మీద హృదయాన్ని హత్తుకునే ఆనంద్, పెళ్లిచూపులు లాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తాయి. అదే కోవలో వచ్చిన చిత్ర చిలసౌ. వారాంతంలో ప్రతీ ఒక్కరికి పైసా వసూల్ లాంటి చిత్రం. మల్టీప్లెక్స్ సినిమా అనే ఫీలింగ్ కలిగినా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కూడా మెప్పిస్తుంది. దిగువశ్రేణి సెంటర్లలో వచ్చే స్పందనను బట్టి ఈ సినిమా కమర్షియల్ రేంజ్ ఏంటో తెలుస్తుంది.

  ప్లస్ పాయింట్స్

  ప్లస్ పాయింట్స్

  కథ, కథనాలు

  రుహాన శర్మ, సుశాంత్ యాక్టింగ్

  రాహుల్ రవీంద్రన్ టేకింగ్

  సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్

  మైనస్ పాయింట్స్

  కమర్షియల్ వ్యాల్యూస్ లేకపోవడం

  సెకండాఫ్‌లో కొంత

  తెర ముందు, తెర వెనుక

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: సుశాంత్, రుహానా శర్మ, జయప్రకాశ్, రోహిణి, వెన్నెల కిషోర్ తదితరులు

  దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్

  నిర్మాత: జస్వంత్ నాడిపెల్లి, అక్కినేని నాగార్జున

  సినిమాటోగ్రఫీ: ఎన్ సుకుమార్

  మ్యూజిక్: ప్రశాంత్ విహారి

  ఎడిటింగ్: చోటా కే ప్రసాద్

  రిలీజ్ డేట్: 2018-08-03

  English summary
  Rahul Ravindran's Feel good drama is Chi La Sow movie. Sushanth, Ruhani Sharma are lead pair. This movie released on Aug 3rd.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X