»   » ప్రీమియర్ షో అప్ డేట్: ఖైదీ నెం 150, ఆడియన్స్ రివ్యూ....

ప్రీమియర్ షో అప్ డేట్: ఖైదీ నెం 150, ఆడియన్స్ రివ్యూ....

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా అభిమానులు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఖైదీ నెం 150' చిత్రం విడుదలైంది. తెలుగు రాష్ట్రాల కంటే ముందుగా యూఎస్ఏలో ప్రీమియర్ షో పడింది.

కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించింది. యూఎస్ఏలో సినిమా చూసిన వారి నుండి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. సినిమా బావుందనే టాక్ వినిపిస్తోంది.

ఖైదీ నెం 150... ఇదో యాక్షన్ థ్రిల్లర్. తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి చిత్రాన్ని తెలుగులో రీమేక్ అయింది. ఇందులో చిరంజీవి రెండు పాత్రల్లో కనిపించారు. సినిమా కథ ముఖ్యంగా... జైలు నుండి తప్పించుకున్న ఓ ప్రెట్టీ క్రమినల్(చిరంజీవి) చుట్టూ తిరుగుతుంది. జైలు నుండి తప్పించుకున్న తర్వాత విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేసుకుంటాడు కానీ ఎయిర్ పోర్టులో ఒక అమ్మాయి(కాజల్ అగర్వాల్)ని కలిసిన తర్వాత తన నిర్ణయం మార్చుకుంటాడు. ఇలాంటి వ్యక్తి రైతుల కోసం పోరాడేందుకు నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏమిటి? చిరంజీవి రెండు పాత్రల వెనక అసలు కథేంటి తెలుసుకోవాలంటే థియేటర్ కి వెళ్లాల్సిందే.

పాజిటివ్ టాక్

పాజిటివ్ టాక్

సినిమా చూసిన ఆడియన్స్.... ఖైదీ నెం 150 మూవీ వినోదంతో పాటు మంచి సందేశంతో ఉందని అంటున్నారు. కత్తితో పోలిస్తే మూల కథలో పెద్దగా మార్పులు ఏమీ చేయలేదు. అయితే చిరంజీవి ఇమేజికి తగిన విధంగా స్క్రీన్ ప్లే రన్ చేసేందుకు, తెలుగు ఆడియన్స్ టేస్టుకు తగిన విధంగా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసారని అంటున్నారు.

ఫస్టాఫ్, సెకండాఫ్

ఫస్టాఫ్, సెకండాఫ్

సినిమా ఫస్టాఫ్ లో కామెడీ సీన్లు, రొమాంటిక్ సీన్లతో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేస్తుంది. సెకండాఫ్ కథలో సీరియస్ నెస్ పెరిగి ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు ప్రేక్షకులు.

చిరంజీవి లుక్

చిరంజీవి లుక్

పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి... తనలో ఏమాత్రం జోరు, హుషారు తగ్గలేదని నిరూపించారు. ముఖ్యంగా ఆయన వయసుతో సంబంధం లేకుండా గుడ్ లుకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆయన డాన్స్, ఫైట్స్ విషయంలో ఏ మాత్రం జోరు తగ్గలేదు, డైలాగ్ డెలివరీలో పదును అలాగే ఉందని అంటున్నారు.

హీరోయిన్ కాజల్

హీరోయిన్ కాజల్

కాజల అగర్వాల్ గ్లామరస్ గా కనిపించడంతో పాటు తన పాత్రకు న్యాయం చేసింది, చిరు, కాజల్ మధ్య వచ్చే సన్నివేశాలు, కెమిస్ట్రీ సినిమాకే హైలెట్ అంటున్నారు ఆడియన్స్.

ఇతర అంశాలు

ఇతర అంశాలు

విలన్ పాత్రలో తరుణ్ అరోరా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాకు ప్లస్సయ్యాడని అంటున్నారు. బ్రహ్మానందం, పోసాని, అలీ, పృథ్వి కామెడీ టైమింగ్ సినిమా బిగ్ అట్రాక్షన్ గా నిలిచిందని, రామ్ చరణ్, వివి వినాయక్, లక్ష్మి రాయ్ స్పెషల్ అప్పియరెన్స్ కూడా సినిమాకు ప్లస్ అని అంటున్నారు.

సాంకేతికంగా

సాంకేతికంగా

ఇక కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు, దేవిశ్రీ అందించిన సౌండ్ ట్రాక్, బ్యాగ్రౌండ్ స్కోర్, రత్నవేలే పిక్చరైజేషన్ సినిను టెక్నికల్ అంశాల పరంగా సినిమాను హైరేంజికి తీసుకెళ్లాయని అంటున్నారు.

పాజిటివ్స్

పాజిటివ్స్

అదే జోరు, హుషారుతో బాస్ ఈజ్ బ్యాక్
కథ
పాటలు, డాన్సులు
బ్యాగ్రౌండ్ స్కోర్
విలేజర్స్ తో ఎమోషనల్ సీన్స్

మైనస్

మైనస్

స్టోరీ మధ్యలో కొన్ని సాంగ్స్ రావడం కాస్త ఇబ్బంది అనిపిస్తుంది
కొన్ని యాక్షన్ సీన్లు ఓవర్ అనిపిస్తాయి
కొన్ని కామెడీ సీన్లు కూడా మైనస్ అయ్యాయి
ఎడిటింగ్

మా క్రిటిక్స్ అందించే విశ్లేషణాత్మక పూర్తి రివ్యూ కాసేపట్లో...

మా క్రిటిక్స్ అందించే విశ్లేషణాత్మక పూర్తి రివ్యూ కాసేపట్లో...

మా క్రిటిక్స్ అందించే విశ్లేషణాత్మక పూర్తి రివ్యూ కాసేపట్లో..... ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీబీట్.

English summary
Director VV Vinayak's Telugu movie Khaidi No 150, featuring megastar Chiranjeevi and Kajal Aggarwal in the lead roles, has received positive reviews from the audience around the world.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu