twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Chor Bazaar Review : ఆకాష్ పూరి చోర్ బజార్ సినిమా ఎలా ఉందంటే?

    |

    Rating:
    2.5/5

    Recommended Video

    Sammathame,Chor Bazaar Movie Review | Kiran Abbavaram | Akash Puri *Reviews |FilmiBeat Telugu

    నటీనటులు : ఆకాష్ పూరి, గెహనా సిప్పీ, సుబ్బరాజు, సునీల్, సంపూర్ణేష్‌బాబు, లక్ష్మణ్
    దర్శకుడు : బి.జీవన్‌రెడ్డి
    నిర్మాత : వి.ఎస్.రాజు
    సంగీతం : సురేష్ బొబ్బిలి
    సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి

    హీరోగా నిలబడడానికి పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ చాలప్ర్య యత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన హీరోగా నటించిన మెహబూబా, రొమాంటిక్ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకోలేకపోయారు. ఇక తన తండ్రి మార్క్ లేకుండా ముందు నుంచి కూడా సొంతంగా ప్రమోట్ చేసుకుంటూ వచ్చిన సినిమా చోర్ బజార్. ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్టు కూడా చాలా మందికి తెలియదు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బండ్ల గణేష్, ఆకాష్ పూరిలు మాట్లాడిన మాటలకు సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది? ఆకాష్ పూరి తన సినిమాతో ఎలా ఆకట్టుకున్నాడు? అనే వివరాలు సమీక్షలో తెలుసుకుందాం.

    చోర్ బజార్ కథ ఏమిటంటే?

    చోర్ బజార్ కథ ఏమిటంటే?

    హైదరాబాద్ పాతబస్తీలో ఉన్న చోర్ బజార్ అనే ప్రాంతం నేపథ్యంలో కధ అంతా సాగుతుంది. నిజాం నవాబులకు చెందిన 200 కోట్ల విలువైన డిమాండ్ దొంగతనం జరగడం ఆ దొంగలను పట్టుకునే క్రమంలో ఆ డైమండ్ చోర్ బజార్ లో పడడంతో ఆ డైమండ్ చుట్టూనే కథ తిరుగుతుంది. ఆ డైమండ్ చోర్ బజార్ కు వచ్చాక అక్కడ బచ్చన్ సాబ్ (ఆకాష్ పూరి) జీవితంలో ఎలాంటి విషయాలు చోటు చేసుకున్నాయి. స్వతహాగా దొంగ అయిన బచ్చన్ సాబ్ ప్రేమ కథ ఏంటి? దొంగ అయిన బచ్చన్ సాబ్ జీవితాన్ని మార్చేసిన యూట్యూబ్ వీడియో ఏంటి? ఇందులో గబ్బర్ సింగ్(సుబ్బరాజు), మాంజా(సంపూర్నేష్ బాబు), హోం మినిస్టర్(సునీల్) పాత్రలు ఏమిటి? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

    చోర్ బజార్ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే:

    చోర్ బజార్ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే:


    సినిమా మొదటి భాగం అంతా కూడా పాత్రల పరిచయానికి వెచ్చించారు. అయితే అలా మొదటి భాగం అంతా కూడా కధలోకి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేసినా ప్రేక్షకులకు అనేక విషయాల్లో కన్ఫ్యూజన్ అలానే ఉంటుంది. బచ్చన్ సాబ్ గా ఆకాష్ పూరి ఏం చేస్తాడు? నిజాం డైమండ్ దొంగతనం వంటి విషయాలతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేందుకు ట్రై చేశాడు దర్శకుడు. మొదటి భాగంలోనే డైమండ్ దొంగతనం అనే పాయింట్ చుట్టూనే కధ తిరుగుతుంది అనే హింట్ ఇచ్చేశాడు దర్శకుడు. అయితే చోర్ బజార్ అనే ప్రాంతంలోనే ఉన్న డైమండ్ కోసం పోలీసులు అసలు ఎందుకు తీవ్రంగా ప్రయత్నించలేదు అనే లాజిక్ ఎవరికీ అర్ధం కాదు. అలా డైమండ్ విషయం మీద ఎలాంటి క్లారిటీ రాకుండానే మొదటి భాగం ముగించారు.

    రెండో భాగం విషయానికి వస్తే:

    రెండో భాగం విషయానికి వస్తే:

    రెండో భాగం అంతా ఆకాష్ పూరి పాత్ర ఫ్లాష్ బ్యాక్ చూపించేందుకు ప్రయత్నించారు. జమిందార్ అనిపించుకుంటూ తిరిగిన ఆకాష్ పూరి అసలు విషయం తెలియడంతో డీలా పడిపోతాడు. ఆ తర్వాత దొంగతనాల టాలెంట్ తోనే ఉద్యోగం దక్కించుకోవడం వంటి విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఇక అయితే రెండో భాగం అంతా కూడా కొత్తదనం లేకపోవడంతో తరువాత ఏమి జరుగుతుంది అనే విషయం మీద ఈజీగా అవగాహనకు వచ్చేస్తారు ప్రేక్షకులు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం ఊహించని విధంగా ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు.

    నటీనటుల విషయానికి వస్తే:

    నటీనటుల విషయానికి వస్తే:

    ఈ సినిమాలో ఆకాశ్ బ‌చ్చ‌న్ సాబ్ గా తనదైన శైలిలో నటించాడు. గత సినిమాలతో పోలిస్తే నటన విషయంలో మెరుగయ్యాడు. ఇక మూగమ్మాయి పాత్రలో గెహెన్నా సిప్పీ తన పరిధి మేర నటించింది. హోమ్ మంత్రిగా సునీల్, మాంజా అనే దొంగగా సంపూర్ణేష్‌బాబు, బచ్చన్ తల్లి బేబి పాత్రలో అర్చన, లాయర్లుగా డబుల్ రోల్ చేసిన లక్ష్మణ్ కూడా త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. మిగిలిన జబర్దస్త్ బ్యాచ్ కూడా త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. టెంపర్ వంశీ, సుబ్బరాజు వంటి వారికి పూర్తి స్థాయి పాత్రలు పడలేదని చెప్పాలి.

    టెక్నికల్ విషయానికి వస్తే:

    టెక్నికల్ విషయానికి వస్తే:

    దళం, జార్జ్ రెడ్డి వంటి సినిమాలు తెరకెక్కించిన జీవన్ రెడ్డి నుంచి వచ్చిన మొదటి కమర్షియల్ సినిమా చోర్ బజార్ ను ప్రేక్షకులను మెప్పించేలా తీర్చిదిద్దెందుకు చాలా ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. కథ - కథనం అంతా కూడా రొటీన్ గా ఉండడమే కాక కథ కూడా కొత్తదనం లేకుండా ఉండడంతో ప్రేక్షకులు అంత త్వరగా కనెక్ట్ కాలేరు. అయితే లాజిక్స్ వెతకకుండా సినిమా చూసేవారికి మాత్రం సినిమా నచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం సెట్ అయింది. పాటలు కొన్ని బాగా కుదిరాయి. జగదీశ్ చీకటి కెమెరా పనితనం కొన్ని సీన్స్ లో కనిపించింది. ఎడిటింగ్ కూడా సినిమాకు ప్లస్ అయింది. ఇక నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి.

    ఫైనల్ గా చెప్పాలంటే:

    ఫైనల్ గా చెప్పాలంటే:


    ఎమోషన్స్‌తో కూడిన సన్నివేశాల వలన సినిమాకి ప్ల‌స్ అవుతుంది అనుకుంటే అదే ఇబ్బందిగా మారినట్టు అనిపిస్తుంది. చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే కానీ దాన్ని తెరకెక్కించే విషయంలో కాస్త ఇబ్బంది పడ్డారు. అందుకే కొంతమందికి ఈ సినిమా నచ్చచ్చు కానీ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌డం కాస్త క‌ష్ట‌మ‌నే చెప్పాలి.

    English summary
    AKash puri, gehana sippy, sunil and sampoornesh babu starrer Chor Bazaar movie release, and here is the filmibeat exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X