twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Chup movie Reveiw దుల్కర్ సల్మాన్ ఫెర్ఫార్మెన్స్ మరో లెవెల్.. సీరియల్ కిల్లర్‌గా..

    |

    Rating: 2.75/5

    నటీనటులు: దుల్కర్ సల్మాన్, సన్నీడియోల్, పూజా భట్, శ్రీయ ధన్వంతరి, అమితాబ్ బచ్చన్ (గెస్ట్ అప్పీయరెన్స్) తదితరులు
    దర్శకత్వం: ఆర్ బాల్కీ
    నిర్మాతలు: రాకేశ్ ఝుంఝూన్‌వాలా, అనిల్ నాయుడు, డాక్టర్ జయంతిలాల్ గదా, గౌరీ షిండే
    సినిమాటోగ్రఫి: విశాల్ సిన్హా
    మ్యూజిక్: అమన్ పంత్
    ఎడిటర్: నయన్ హెచ్‌కే భద్ర
    బ్యానర్: హోప్ ప్రొడక్షన్
    థియేట్రికల్ రిలీజ్: 2022-09-23
    ఓటీటీ రిలీజ్: జీ5

    బాలీవుడ్ సినిమాలను సమీక్షించే ఫిల్మ్ క్రిటిక్స్ వరుస హత్యలు ముంబై నగరాన్ని కుదిపేస్తాయి. పోలీసులకు ఛాలెంజ్ విసురుతూ డానీ అలియాస్ సెబాస్టియన్ గోమ్స్ (దుల్కర్ సల్మాన్) ఫిల్మ్ క్రిటిక్స్‌ను హత్య చేస్తుంటాడు. నీలా మీనన్ (శ్రీయ ధన్వంతరి) అనే సినీ క్రిటిక్‌తో ప్రేమలో డానీ ఉంటాడు. ఫిల్మ్ క్రిటిక్స్ హత్య కేసులను అరవింద్ మాతూర్ (సన్నీడియోల్) దర్యాప్తు చేస్తుంటాడు. ఒక దశలో తన లవర్ నీలాను కూడా హత్య చేసేందుకు డానీ సిద్దమవుతాడు.

    ఫిల్మ్ క్రిటిక్స్‌ను డానీ ఎందుకు హత్య చేస్తుంటాడు? ఫిల్మ్ క్రిటిక్స్‌ను డానీ హత్య చేయడానికి కారణం ఏమిటి? ఫిల్మ్ క్రిటిక్ నీలాను కూడా ఎందుకు హత్య చేయాలనుకొంటాడు? సెబాస్టియన్ గోమ్స్ డానీగా ఎందుకు మారాడు? చివరకు డానీని పోలీస్ ఆఫీసర్ అరవింద్ మాథూర్ పట్టుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే చుప్ సినిమా కథ.

    Chup movie Reveiw and Rating: Dulquer Salmaan excellent performance as psycho Killer

    చుప్ సినిమాకు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆర్ బాల్కీ దర్శకత్వం వహించాడు. గతంలో ఆయన తీసిన చీనీ కమ్, పా, ఇంగ్లీష్ వింగ్లీష్, షమితాబ్, ప్యాడ్ మ్యాన్, మిషన్ మంగళ్ చిత్రాలకు భిన్నంగా చుప్ సినిమాను తెరకెక్కించారు. చుప్ లాంటి సినిమా బాల్కీ రూపొందించారంటే నమ్మడం చాలా కష్టం. సినిమాలకు ఎక్కువ రేటింగ్, తక్కువ రేటింగ్‌లు ఇస్తూ సినిమాలను చీల్చి చండాడే సినీ క్రిటిక్స్‌ను ఓ యువకుడు అంతం చూడటమనే సింగిల్ పాయింట్‌తో కథను అల్లుకొన్నాడు. కథను ఆసక్తిగా చెప్పేందుకు ఎంచుకొన్న స్క్రీన్ ప్లే బాగుంది. ప్రఖ్యాత ఫిల్మ్‌మేకర్ గురుదత్ గురించి.. ఆయన సినిమా వైఫల్యం గురించి చర్చించడం ఎమోషనల్ టచ్ ఉంటుంది. నీలా, డానీ మధ్య లవ్ ఎలిమెంట్స్ బాగా రాసుకొన్నాడు. ఇక సైకో కిల్లర్‌గా దుల్కర్ సల్మాన్ పాత్రను తీర్చిదిద్దిన తీరు బాగుంది. కానీ మితిమీరిన హింస మాత్రం సినిమాకు మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. తెరమీద మనుషులను క్రూరంగా చంపటం పైశాచికత్వానికి పరాకాష్టగా చెప్పవచ్చు.

    సైకో, సీరియల్ కిల్లర్ డానీ పాత్రలో దుల్కర్ సల్మాన్ పరకాయ ప్రవేశం చేశాడనే చెప్పవచ్చు. సీతారామం లాంటి స్టాఫ్ క్యారెక్టర్, ఇంతకు ముందు లవర్ బాయ్ పాత్రలో దుల్కర్ సల్మాన్‌ను చూసిన వారు ఆయన పాత్రను జీర్ణించుకోవడం కష్టం. అయితే పాత్ర కోసం తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకొన్న తీరు.. ముఖంలో హావభావాలు ఆకట్టుకొంటాయి. నీలా మీనన్‌గా శ్రేయ ధన్వంతరి తన పాత్ర పరిధి మేరకు ఫర్యాలేదనిపించింది. ఇక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ అరవింద్ మాథూర్‌గా సన్నీడియోల్ కొత్తగా కనిపంచాడు. ఇప్పటి వరకు చూడని పాత్రలో అభిమానులను మెప్పించారనే చెప్పవచ్చు.

    చుప్ సినిమాకు అమన్ పంత్ అందించిన మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను హైలెట్ చేసింది. మర్డర్ మిస్టరీ కావాల్సిన మూడ్‌ను క్రియేట్ చేయడంలో మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించింది. విశాల్ సిన్హా అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. ఇతర విభాగాల పనితీరు ఫర్యాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

    క్రైమ్, హారర్ అంశాలను జోడించి ఆర్ బాల్కీ అందించిన మర్డర్ మిస్టరీ చుప్. అయితే సింగిల్ పాయింట్‌పై కథ ఆసక్తిగానే సాగుతుంది. కానీ ఇన్వెస్టిగేషన్‌కు పెద్దగా స్కోప్ కనిపించదు. ఏదో రొటీన్‌గా పోలీసుల దర్యాప్తు జరగడం.. హంతకుడు తనంతంటా తాను యదేచ్ఛగా హత్యలు చేసుకొంటూ పోవడం కథలో లోపంగా కనిపిస్తుంది. అందుకే సినిమా అంత గ్రిప్పింగ్‌గా అనిపించదు. కాకపోతే సీన్ల వారీగా చూస్తే.. దుల్కర్ సల్మాన్ పెర్ఫార్మెన్స్ కారణంగా బాగుందనే ఫీలింగ్ కలుగుతుంది. కథ, కథనాలపై ఇంకాస్త కసరత్తు చేసి ఉంటే.. మంచి మర్డర్ మిస్టరీ అయి ఉండేదనిపిస్తుంది. జీ5లో స్ట్రీమింగ్ అవుతున్నది. కాబట్టి తీరిక వేళలో తగినంత సమయం ఉంటే.. ఒకేసారి సినిమాను చూస్తే.. మంచి అనుభూతి కలుగుతుంది.

    English summary
    Dulquer Salmaan and Sunny Deol's Chup: Revenge of the Artist is streaming on Zee5. Here is the Review of Telugu filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X