For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కలర్ ఫోటో మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  2.5/5
  Star Cast: సుహాస్, చాందినీ చౌదరీ, సునీల్, వైవా హర్షా, ఆదర్శ్ బాలకృష్ణ
  Director: సందీప్ రాజ్

  తెలుగు తెరపై ప్రేమ కథా చిత్రాలు ఎన్నో వచ్చి ప్రేక్షకులను మంచి అనుభూతిని పంచాయి. కులం, మతం, వర్ణానికి వ్యతిరేకంగా ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి. అలాంటి కోవలోనే మళ్లీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడానికి వచ్చిన ప్రేమ కథ కలర్ ఫోటో. యూట్యూబ్, షార్ట్ ఫిలింస్‌లో అనుభవం ఉన్న నటీ, నటులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలను పోషించారు. దసరా పండుగ సమయంలో పెద్ద సినిమాలు లేక అసహనం, అసంతృప్తితో ఉన్న ప్రేక్షకులకు కలర్ ఫోటో ఎలాంటి అనుభూతిని పంచిందనే విషయాన్ని తెలుసుకొందాం.

  కలర్ ఫోటో మూవీ కథ

  కలర్ ఫోటో మూవీ కథ

  పేదరికంలో పుట్టిన జయకృష్ణ ఇంజినీరింగ్ విద్యార్థి. ఇంటికి సంబంధించిన పాల వ్యాపారంలో భాగమై కుటుంబానికి అండగా ఉంటాడు. నలుపు రంగులో ఉండే జయకృష్ణ తన కాలేజీలో ఇంజినీరింగ్ చదువుకొనే మిల్కి బ్యూటీ దీప్తి వర్మ (చాందినీ చౌదరీ)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అన్ని కథల్లో మాదిరిగానే దీప్తి అన్నయ్య రామరాజు (సునీల్) అడ్డుగా నిలుస్తాడు.

  కలర్ ఫోటో మూవీ ట్విస్టులు

  కలర్ ఫోటో మూవీ ట్విస్టులు

  మచిలీపట్నంలో ఇంజినీరింగ్ కాలేజీలో జయకృష్ణ, దీప్తి ప్రేమ కథ ఎలా సాగింది. అందం, డబ్బు లేని జయకృష్ణను చూసి సంపన్న కుటుంబంలో పుట్టిన దీప్తి ఎలా ప్రేమలో పడింది. పోలీస్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేసే రామరాజు ఏ కారణంగా వారి ప్రేమను వ్యతిరేకించాడు. ప్రేమికులంటే రామరాజుకు ఎందుకు గిట్టదు? ఏ పరిస్థితుల్లో చందు (ఆదర్శ్ బాలకృష్ణ)ను దీప్తి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? దీప్తి పెళ్లి తర్వాత జయకృష్ణ జీవితంలో ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకొన్నాయి? దీప్తి, జయరాజు ప్రేమ కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే కలర్ ఫోటో కథ.

  కలర్ ఫోటో మూవీ కథ, కథనాలు

  కలర్ ఫోటో మూవీ కథ, కథనాలు

  తండ్రి మరణం కారణంగా అమెరికా నుంచి దీప్తి వర్మ రావడంతో కథ మొదలవుతుంది. తండ్రి శవం పక్కనే పెట్టుకొని విచిత్రంగా దీప్తి వర్మ ప్రవర్తించడం, అన్నయ్య రామరాజు ఇరిటేట్ కావడమనే పాయింట్ ప్రేక్షకులకు కథపై ఆసక్తి కలిగేలా మారుతుంది. ఆ తర్వాత ఓ ఇంట్రెస్టింగ్ సీన్‌తో ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లడం.. కాలేజీ సీన్లు చకచకా ఫన్నీగా సాగిపోతుంటాయి. అందమైన, సెన్సిబుల్‌గా లవ్ సాగుతుంది. కాకపోతే కథను చెప్పడంలో దర్శకుడు చురుకుగా వ్యవహరించకపోవడంతో కథనం నత్తనడకలా సాగినట్టు అనిపిస్తుంది. కథ, కథనాల్లో వేగం లేకపోవడం వల్ల ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మిస్ అయిపోయిందనే భావన కలుగుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్‌ వరకు కథను ఆసక్తికరంగా, భావోద్వేగంగా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ కావడంతో ఓవరాల్‌గా కలర్ ఫోట్ ఫీల్‌గుడ్ మూవీగా మారిందని చెప్పవచ్చు.

   దర్శకుడు సందీప్ రాజ్ గురించి

  దర్శకుడు సందీప్ రాజ్ గురించి

  దర్శకుడు సందీప్ రాజ్ ఎంచుకొన్న పాయింట్‌లో కొత్తదనం ఉంది. కాకపోతే అనుభవరాహిత్యం కారణంగా సినిమాను పరిగెత్తించే విధానంలో తడబాటు కనిపిస్తుంది. అయితే దర్శకుడిలోని కొన్ని లోపాలను సాంకేతిక విలువలు, నటీనటులు ఫెర్ఫార్మెన్స్ కప్పిపుచ్చడం కాస్త ఉపశమనం. కొన్ని ఎమోషనల్ సీన్లను డీల్ చేయడంలో దర్శకుడి సత్తా ఏంటో తెలుస్తుంది. క్లైమాక్స్‌లో దీప్తి గుడిసెలోకి వెళ్లడం, అలాగే సునీల్‌తో చేయించిన స్పెషల్ బిర్యాని సీన్, ఇక అవిటివాడిగా మారిన తర్వాత జయరాజ్‌ పాత్రపై చిత్రీకరించిన సీన్లు దర్శకుడు ప్రతిభకు అద్దం పట్టాయి. కథ, కథనాలపై విషయంలో మరికొంత జాగ్రత్త పడి ఉంటే కలర్ ఫోటో మరో ఫీల్ గుడ్ లవ్ స్టోరిగా మారి ఉండేది.

   సుహాస్, చాందినీ చౌదరీ పెర్ఫార్మెన్స్

  సుహాస్, చాందినీ చౌదరీ పెర్ఫార్మెన్స్

  కలర్ ఫోటో చిత్రంలో సుహాస్‌ కథానాయకుడిగా కంటే ప్రేమ కథకు బలమైన వస్తువుగానే కనిపించాడు. భావోద్వేగమైన సన్నివేశాలను చాలా సహజంగా, సులభంగా చేసినట్టు కనిపించాడు. అమ్మాయి నవ్వే అందమైన నవ్వులా నా తల్లి ఉంటుంది అంటూ సుహాస్ చెప్పిన మరొకొన్ని ఎమోషనల్ డైలాగ్స్ హృదయాన్ని కదిలిస్తాయి. కలర్ ఫోటోకు ప్రధాన బలంగా సుహాస్‌ నిలిచాడు. ఇక చాందినీ చౌదరీ కూడా తనదైన శైలిలో నటించింది. సముద్ర ఒడ్డున కొన్ని సన్నివేశాల్లో అద్భుతంగా నటించి మెప్పించింది. దీప్తి పాత్రకు సరిపడా హావభావాలను ప్రదర్శించింది.

  సునీల్ ఎలా నటించారంటే

  సునీల్ ఎలా నటించారంటే

  ఇక విలన్‌ రామరాజు పాత్రకు సునీల్ యాప్ట్ అని చెప్పలేం కానీ.. కొన్ని సన్నివేశాల్లోనే పాత్రను పండించాడు. రామరాజు పాత్రలో సునీల్‌ను ఊహించుకోవడం కష్టంగా మారింది. చాలా ఏళ్లుగా కమెడియన్‌గా మనసులో ముద్ర పడటంతో ఆ ఇమేజ్‌ను తడిపేసుకొని చూడటం కష్టంగా మారింది. తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించాడని చెప్పవచ్చు. ఇక బాల ఏసు పాత్రలో హర్షవైవా అద్భుతంగా నటించాడు. చాలా రోజుల తర్వాత రొటిన్ కమెడియన్ పాత్రలకు భిన్నంగా మెచ్యురిటీతో రోల్‌లో కనిపించాడు. పాత్రకు తగినట్టుగా అతడి గెటప్ బాగుంది. హర్ష వినోదాన్ని పంచడమే కాకుండా భావోద్వేగాన్ని పండించాడని చెప్పవచు.

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగంలో కాలభైరవ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సన్నివేశాలను మరోస్థాయికి చేరేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను చేశారు. ఇక వెంకట్ శాఖమూరి సినిమాలో వన్ మ్యాన్ షోగా మారాడు. సన్నివేశాలను అద్భుతంగా పెయింటింగ్‌లా మలిచాడు. సముద్ర తీరంలో ప్రకృతి అందాలను కెమెరాలో బంధించిన తీరు బాగుంది. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ కావడంతో ఆర్ట్ విభాగం పనితీరు బ్రహ్మండంగా ఉంది. క్యాస్టూమ్స్, మేకప్ చాలా విషయంలో తీసుకొన్న జాగ్రత్తలు సినిమాకు మరింత ఆకర్షణగా మారాయి. ఎడిటింగ్‌కు ఇంకా కాస్త స్కోప్ ఉంది.

  ఓవరాల్‌గా ఎలా ఉందంటే..

  ఓవరాల్‌గా ఎలా ఉందంటే..

  ధనిక, పేద, కులం, వర్ణం లాంటి అంశాలతో మేలవించిన సెన్సిబుల్ లవ్‌స్టోరి కలర్ ఫోటో. సుహాస్ నటన, చాందిని పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అందమైన ప్రేమ కథను అందించాలనే తపన దర్శకుడిలో కనిపిస్తుంది. ఇక కలర్ ఫోటో సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ చిత్రానికి కథను అందించిన సాయి రాజేష్ నీలం నిర్మాతగా కూడా వ్యవహరించారు. బెన్నీ ముప్పనేనితో కలిసి రూపొందించిన ఈ చిత్రం వారి అభిరుచికి అద్దం పట్టింది.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు


  పాజిటివ్ పాయింట్స్
  సుహాస్, చాందినీ పెర్ఫారెన్స్
  వైవా హర్ష కామెడీ
  మ్యూజిక్, సినిమాటోగ్రఫి
  క్లైమాక్స్

  మైనస్ పాయింట్స్
  స్లో నేరేషన్
  కథ, కథనాల్లో ఎమోషన్స్ లోపించడం

  Anchor Anasuya Suspicious Behavior Grabs The Attention || Filmibeat Telugu
  నటీనటులు

  నటీనటులు

  నటీనటులు: సుహాస్, చాందినీ చౌదరీ, సునీల్, వైవా హర్షా, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు
  దర్శకత్వం: సందీప్ రాజ్
  నిర్మాతలు: సాయి రాజేశ్ నీలం, బెన్నీ ముప్పనేని
  సంగీతం: కాల భైరవ
  సినిమాటోగ్రఫి: వెంకట్ ఆర్ శాఖమూరి
  ఎడిటర్: కొదాటి పవన్ కల్యాణ్
  రిలీజ్: 2020-10-23
  ఓటీటీ రిలీజ్: ఆహా

  English summary
  Colour Photo Telugu movie review: Colour Photo Telugu movie is directed by Sandeep Raj. Produced by Sai Rajesh Neelam, Benny Muppaneni. Suhas and Chandini Chowdary is in lead roles. This movie released in Aha OTT on 2020 october 23rd.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X