»   » దెయ్యంతో సెక్స్-కామెడీ ('గ్రేట్ గ్రాండ్ మస్తీ' రివ్యూ)

దెయ్యంతో సెక్స్-కామెడీ ('గ్రేట్ గ్రాండ్ మస్తీ' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.0/5

సెక్స్ కామెడీలకు ప్రపంచ వ్యాప్తంగా ఓ వర్గం నుంచి ఎప్పుడూ ఆదరణ ఉంటూనే వస్తోంది. దాంతో దాన్ని క్యాష్ చేసుకోవాలని దర్శక,నిర్మాతలు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే మన దేశంలో బాలీవుడ్ మాత్రమే ఈ సెక్స్ కామెడీలను అందిస్తోంది. ఇప్పుడు అదే కోవలో మస్తీ చేస్తాం..అదరకొడతాం అంటూ ట్రైలర్స్, టీజర్స్, పోస్టర్స్ తో ఏదో అడల్ట్ కంటెంట్ గట్టిగానే ఉందన్న ఆసక్తి కలిగిస్తూ వచ్చింది గ్రేట్ గ్రాండ్ మస్తి. ఈ రోజు రిలీజైన ఈ చిత్రం లో నిజంగా అంత సీనుందా...అడల్ట్ మెచ్చుకునే కామెడీ ఉందా చూద్దాం.

అమర్ సక్సేనా(రితీష్) మీట్ మెహ్తా (వివేక్ ఒబరాయ్), ప్రేమ్ చావ్లా(ఆప్తాబ్) వీళ్లు ముగ్గరూ ప్రాణ స్నేహితులు. అయితే వీరికి వృత్తి, ప్రవృత్తి పరంగా ఇబ్బందులు లేకపోయినా భార్యల బంధువల వల్ల లైఫ్ ని ఎంజాయ్ చేయలేక బాధపడుతూంటారు. దాంతో ముగ్గరూ కలిసి ఓ స్కెచ్ వేస్తారు.

ఊరి చివర ఉన్న బంగ్లాను అమ్ముదాము అనే వంకతో సరాగాతమ కోరికలు తీర్చుకోవాలనుకుంటారు.అందుకు తగినట్లుగానే ఆ బంగ్లాలో ఓ సెక్సీ పనిమనిషి రాగిణి(ఊర్వసి) ఉంటుంది. దాంతో రాగిణితో కమిటయ్యి..తమ కోరికలు తీర్చుకోవాలని ఫిక్స్ అవుతారు ముగ్గురూ. కానీ ఇక్కడో ట్విస్ట్.

Crude, cliched:Great Grand Masti movie review

వాళ్లు కోరిక తీర్చుకుందామనుకుంటున్న రాగిణి నిజానికి మనిషి కాదు ఓ ప్రేతాత్మ అని రివీల్ అవుతుంది. కన్యగానే చనిపోయిన ఆమె వీళ్ల ముగ్గరు ఫ్రెండ్స్ ద్వారా తన కామాన్ని తీర్చుకోవాలనుకుంటోందని అర్దమవుతుంది. అప్పుడు ఈ ముగ్గురూ ఏం చేసారు. ఆమె బారి నుంచితప్పించుకున్నారా..లేక ఆమెకు బలైపోయారా... ఇలాంటి డౌట్స్ ఏమన్నా వస్తే తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది.

"మస్తీ జాదే, క్యా కూల్ హై హమ్" లాంటి సినిమాల్లో కంటెంట్ లేకపోయినప్పటికీ తెగ ఆడేసి నిర్మాతకు డబ్బులు తెచ్చి పెట్టాయి కాబట్టి ఈ సినిమా కూడా అదే కోవలో పెద్ద హిట్ అవుతుంది అనుకుని కథను వదిలేసినట్లున్నారు. కానీ అందులో హిరోయిన్స్ అందచందాలే పెట్టుబడి గా జనం ఫీలై ఎంజాయ్ చేసారు.

ఈ సినిమాకు వచ్చేసరికి ఊర్వసి దెయ్యంగా కనపడుతూంటే ఇంక ఆమెపై కోరిక చూసేవాళ్లకు ఏమి ఉంటుంది. కాబట్టి అడల్ట్ జోక్స్ ని ఎంజాయ్ చేయలేని పరిస్దితి. వాటిలో చాలా జోక్స్ వాట్సప్ లోనూ, మేసేజ్ లు రూపంలో రెగ్యలర్ ఈ కంటెంట్ ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు చూస్తున్నవే.

అయినా చక్కగా అడల్ట్ కామెడీ అన్నప్పుడు అదేదో మర్యాదగా ఆ జానర్ లోనే వెళ్లక, మధ్యలో ఘోస్ట్ కామెడీ ఎందుకు పెట్టుకున్నారో మరి. దాంతో ఈ సినిమా రెంటికి చెడ్డ రేవడిలా మారింది. అటు సెక్స్ కామెడీనూ కాదు..ఇటు హర్రర్ కామెడీనీ కాదు..ఏం జరుగుతోందో..ఏమి అనుకుని తాము సినిమాని చూడాలో ప్రేక్షకుడుకి అర్దం కానీ సిట్యువేషన్.

సర్లే అనుకున్నా ..ఈ సినిమా ఇంటర్నెట్ లో రెండు వారాల క్రితమే విడుదలైపోయింది. ఏ బాహుబలో, లేక మరొకటో అయితే ధియేటర్ కు డబ్బు పెట్టి చూస్తారు కానీ, ఇలాంటి సినిమాలు నెట్ లో ముందే దొరికేస్తే ఇక్కడే చూసేద్దాం అని ఫిక్సై పోతారు. కాబట్టి ఆ టిక్కెట్లు గోవిందా. ఇవన్ని దాటుకుని ధియోటర్ కు వచ్చి ఏదో చూద్దామనుకున్నవాడికి అసలు అక్కడ ఏమీ దొరక్క అదో బాధ.

ఇక ఈ సినిమాలో నటించిన హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది...పండిపోయారు. హీరోయిన్స్ గురించి చెప్తామంటే వాళ్లకు అంత సీన్ దర్శకుడు ఇవ్వలేదు. ఉన్న ఒక్కగా నొక్క రొమాంటిక్ ఎలిమెంట్...ఉందీ అనుకుంటే అది దెయ్యమై కూర్చుంది. ఆమె ఎక్సపోజింగ్ చేసినా ఎక్కడో దెయ్యాన్ని చూసి ఎంజాయ్ చేయటం ఏమిటా అన్న ఫీలింగ్, టోటల్ గా ఎక్కడా ఏమీ లేదు.

టెక్నికల్ గా చెప్పాలంటే ఏ విభాగమూ సరిగ్గా పనిచేయలేదు అనేదాని కన్నా దర్శకుడు, ఆయన ఎంచుకున్న కథ ఆ అవకాసం ఇవ్వలేదు అని చెప్పాలి. సినిమా అంతా డ‌బుల్ మినింగ్ డైలాగ్స్ తో నింపేసి నవ్వించే ప్రయత్నం చేసారు.. ఇక కొన్ని సీన్స్ రోత‌ పుట్టించేలా ఉన్నాయి..సి క్లాస్ ప్రేక్ష‌కులు మాత్రం ఎంజాయ్ చేస్తారని రాసుకున్నట్లు ఉన్నారు. ఇక నిర్మాణ విలువలు అయితే దేముడా..అంత నాశిరకంగా ఎప్పుడో కానీ హిందీలో చూడలేం.

బ్యానర్: బాలాజీ మోషన్ పిక్చర్స్
నటీనటులు:రితేష్ దేశ్ ముఖ్, వివేక్ ఒబెరాయ్, అఫ్తాబ్, ఊర్వశి రొటేలా, మిస్తీ చక్రవర్తి, శ్రద్ధా దాస్, పూజా బోస్ తదితరులు..
సంగీతం: సంజీవ్ దర్షన్
ఛాయాగ్రహణం: నిగమ్ బొంజాన్
కథ: తుషార్ హిరన్ నంది
స్క్రీన్ ప్లే: మాధుర్ శర్మ, ఆకాష్ కౌసిక్
ఎడిటర్ : సంజయ్ సంకల
దర్శకత్వం: ఇంద్ర కుమార్
నిర్మాతలు: సంజీవ్ నాయర్, అమన్ గిల్లి, అశోక్ టకారియా, శ్రీ అదికారి బ్రదర్స్, ఆనంద్ పండిట్
విడుదల తేదీ:15, జూలై 2016

ఫైనల్ గా...కన్నె దెయ్యం ముగ్గురు పెళ్లైన కుర్రాళ్లపై కన్నేసింది అనే పాయింట్ కి టెమ్ట్ అయ్యి ధియోటర్లో దూరితే చేసేదేం లేదు. ఏదైతే ఆశించి వెల్తారో అది అందని సినిమాకు అందనంత దూరంలో ఉండటమే మేలు.

English summary
Great Grand Masti movie review, featuring Riteish Deshmukh,Vivek Oberoi and Urvashi Rautela.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu