»   » అమ్మో, ఇంకా ఉందే...(దండుపాళ్యం-2 రివ్యూ)

అమ్మో, ఇంకా ఉందే...(దండుపాళ్యం-2 రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన 'దండుపాళ్యం' చిత్రం 2012లో విడుదలై భారీ విజయం సాధించింది. దండుపాళ్యం అనే ఊరికి చెందిన గ్యాంగ్ 80 హత్యలు, దోపిడీలు, మానభంగాల పర్వాన్ని అప్పట్లో కళ్లకు కట్టినట్లు చూపించారు. దండుపాళ్యం గ్యాంగ్ పేరు చెబితేనే కర్నాటక వాసుల్లో ఏదో తెలియని భయం ఉండేది. ఆ గ్యాంగ్ అంత దారుణమైన ఘోరాలు చేశారుమరి.

తొలి భాగంలో దండుపాళ్యం ముఠా సభ్యులు పోలీసులకు పట్టుబడటం, వారికి కోర్టు ఉరిశిక్ష విధించడం వరకు చూపించారు. తాజాగా 'దండుపాళ్యం-2' పేరుతో సీక్వెల్ తెరకెక్కించిన దర్శకుడు.... ప్రేక్షకులు ఊహించని కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అసలు ప్రేక్షకులు ఊహించుకున్నది ఏమిటి? ఈ సినిమాలో చూపించింది ఏమిటి? రివ్యూలో చూద్దాం.


దండుపాళ్యం 2

దండుపాళ్యం 2

దాదాపు ఐదేళ్ల విచారణ అనంతరం దండుపాళ్యం గ్యాంగ్‌కు ఉరిశిక్ష విధిస్తారు. అనంతరం వారిని బెంగళూరు నగర శివారులోని పరప్పన అగ్రహార జైలుకు తరలిస్తారు. అయితే ఈ కేసులో అభివిక్తి అనే మహిళా రిపోర్టర్‌కు అనేక అనుమానాలుంటాయి. 80 హత్య కేసుల్లో వీరిపై నేరం రుజువైనా..... కేవలం 12 కేసుల్లో మాత్రమే నేరాన్ని రుజువు చేసే సాక్ష్యాలుంటాయి. అవి కూడా బలమైన సాక్ష్యాలు కావు. ఇలాంటి కేసుల్లో అత్యంత కీలకమైన వేలిముద్రలు, వీర్య కణాలు, డీఎన్ఏ, హెయిర్ ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే 80 కేసుల్లో వీరిని దోషులుగా తేల్చడం ఏమిటి? అని అనుమాన పడిన సదరు రిపోర్ట్...... అసలు నిజాలు తెలుసుకునేందుకు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది.
Dandupalyam 2 Movie Leaked Scene, Sanjana Hot video
ఇంటర్వెల్ ట్విస్ట్

ఇంటర్వెల్ ట్విస్ట్

ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో కొన్ని షాకింగ్ సాక్ష్యాలు అభివిక్తి దృష్టికి వస్తాయి. దీంతో ఆ గ్యాంగ్ ఏ తప్పూ చేయలేదని, పోలీసులు, మీడియా కలిసి వారిని నరహంతక గ్యాంగ్‌‌గా చిత్రీకరించారనే నిర్దారణకు వస్తుంది. తన ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా దండుపాళ్యం గ్యాంగ్‌ను పరప్పన అగ్రహార జైలు నుండి బెళగాం జైలుకు తరలిస్తారు. ఉరిశిక్ష అమలు చేయడానికి ఎలాంటి సదుపాయాలు లేని ఆ జైలుకు వారిని తరలించడంతో ఆమెకు అనుమానాలు మరింత బలపడతాయి. పోలీసులు ఏదో కుట్ర చేస్తున్నారని నమ్ముతుంది. స్పెషల్ పర్మిషన్ తీసుకుని వారిని జైల్లో కలిసి అసలు నిజం తెలుసుకోవాలని భావిస్తుంది. అయితే తమను కాపాడటానికి వచ్చిన ఆ రిపోర్టర్‌ను చంపడానికి ప్రయత్నిస్తుంది దండుపాళ్యం గ్యాంగ్. ఇదే ఇంటర్వెల్ ట్విస్ట్. ఇంతకు మించి చెబితే మీకూ సినిమాపై ఇంట్రెస్టు పోతుంది. తర్వాత ఏం జరిగింది అనేది తెరపై చూడాల్సిందే.
పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్ పరంగా ఎవరికీ వంక పెట్టడానికి లేదు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో బొమ్మాళి రవిశంకర్ అదరగొట్టాడు. పోలీసులో విలనిజాన్ని చూపించి సూపర్బ్ అనిపించారు. బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధి, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవి కాలె, పెట్రోల్‌ ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్‌, కరి సుబ్బు, కోటి తదితరులు దండుపాళ్యం గ్యాంగ్ పాత్రల్లో నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పడం బెటర్.


టెక్నికల్ అంశాల పరంగా...

టెక్నికల్ అంశాల పరంగా...

టెక్నికల్ అంశాల పరంగా చూస్తే.... వెంకట్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. అర్జున్‌ జన్య అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. కథను సహజసిద్ధంగా చూపించే క్రమంలో డైలాగులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. నిర్మాణ విలువలు కథకు తగిన విధంగా ఉన్నాయి.


ప్రేక్షకుడు ఊహించని కోణం

ప్రేక్షకుడు ఊహించని కోణం

సాధారణంగా ‘దండుపాళ్యం' సినిమా చూసిన వారంతా... పార్ట్ 2లో వారి జైలు జీవితం, జైలు నుండి తప్పించుకోవడానికి వారు ప్రయత్నించడం, ఈ క్రమంలో మరిన్ని దారుణాలకు పాల్పడతారని ఊహించుకుంటారు. కానీ థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడికి ఊహించని సినిమా చూపిస్తాడు దర్శకుడు.


ఆ కిరాతకులపై జాలి పడతారు...

ఆ కిరాతకులపై జాలి పడతారు...

దండుపాళ్యం గ్యాంగ్ చేసిన హత్యలు, దోపిడీలు, మానభంగాల పర్వం గురించి తెలిసిన ఎవరికైనా వారిపై జాలి పడాలనే ఆలోచన రాదు. కానీ ఊహించిన ట్విస్ట్‌తో ఆ గ్యాంగ్ మీద ప్రేక్షకుడిలో జాలి కలిగేలా స్క్రీన్ ప్లే రన్ చేశాడు దర్శకుడు. ఇది కూడా ఊహించని పరిణామామమే.


వాస్తవికతకు అద్దం పట్టేలా...

వాస్తవికతకు అద్దం పట్టేలా...

సినిమా ఎలా ఉంది? అనే విశ్లేషణ పక్కన పెడితే సినిమా మొదలైన దగ్గర నుండి, ఎండింగ్ వరకు వాస్తవికతకు అద్దం పట్టేలా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు శ్రీనివాసరాజు సఫలం అయ్యారు.


భయానకం

భయానకం

పోలీసులు దండుపాళ్యం గ్యాంగ్ పట్లు ప్రవర్తించిన తీరు, థర్డ్ డిగ్రీ ప్రయోగించి వారిని హింసించే తీరు భయనకంగా ఉంది. ఈ సీన్లు చూస్తే ప్రేక్షకుల్లో పోలీసు ఇంటరాగేషన్ అంటే భయం కలుగడం ఖాయం.


అసంపూర్తిగా పార్ట్-2

అసంపూర్తిగా పార్ట్-2

దండుపాళ్యం 2 సినిమాతో ఈ నరహంతక ముఠా సినీ పర్వం ముగించలేదు. సినిమాను ఒక కీలకమైన స్థాయికి తీసుకెళ్లి అర్దాంతరంగా ముగించారు. దీంతో ప్రేక్షకుల్లో అసహనం ఒక్కసారిగా ఉబికి వస్తుంది.
 ప్రేక్షకుడు బలవంతంగా బయటకు.

ప్రేక్షకుడు బలవంతంగా బయటకు.

ఆగస్టు 2017లో దండుపాళ్యం పార్ట్ 3 ఉంటుందని, అప్పటి వరకు ప్రేక్షకులు ఓపిక పట్టాల్సిందే అంటూ బలవంతంగా థియేటర్ నుండి బయటకు పంపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.


ఓవరాల్‌గా

ఓవరాల్‌గా

ఓవరాల్‌గా చెప్పాలంటే... పార్ట్ 1పై భారీ అంచనాలతో ఈ సినిమాకు వెళితే ప్రేక్షకుడు కాస్త నిరాశ పడక తప్పదు. ఇప్పటికే వచ్చిన పార్ట్-1..... త్వరలో రాబోతున్న పార్ట్-3కి మధ్య ఓ చిన్న లింకులా చాలా సాదా సీదాగా ఈ సినిమా ఉంది. లింకు మిస్సవ్వకుండా ఉండాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
తెరవెనక

తెరవెనక

సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ప్రసాద్‌
సంగీతం: అర్జున్‌ జన్య,
కో-డైరెక్టర్‌: రమేష్ చెంబేటి
నిర్మాణం: వెంకట్‌ మూవీస్‌
నిర్మాత: వెంకట్‌
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరాజు.


English summary
Director Sekhar Kammula's Telugu movie Fidaa is a romance drama starring Varun Tej and Sai Pallavi. Dil Raju has bankrolled Fidaa under his banner Sri Venkateswara Creations and he has made sure that the film has brilliant production values. Shakthi Kanth's music, Vijay C Kumar's picturisation, beautiful locales, fights and dialogues are the attractions on the technical front, say the audience.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu