twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దీవీస్తే..అంతే సంగతులు

    By Staff
    |

    Deevinchandi
    -సౌమిత్‌
    చిత్రం: దీవించండి
    నటీనటులు: శ్రీకాంత్‌, ఆనంద్‌, రాశి, మాళవిక, సుత్తివేలు.
    సంగీతం: ఎస్‌.ఎ.రాజ్‌ కుమార్‌
    నిర్మాత: రామోజీరావు
    దర్శకత్వం: ముత్యాలసుబ్బయ్య

    ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ ఇమేజ్‌ ను మరోసారి దెబ్బతీసే చిత్రం- దీవించండి. కొత్త కథనం, కొత్తవాళ్ళతో సక్సెస్‌ లు సాధిస్తోన్న ఆ సంస్థ నుంచి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు నరకాన్ని చూపిస్తోంది. అవకాశాలు లేని ముత్యాల సుబ్బయ్యకు ఉషాకిరణ్‌ మూవీస్‌ అందించిన అద్భుత అవకాశాన్ని చేజేతుల పాడుచేసుకున్నాడు. తలాతోకా లేని ఈ చిత్రంలో ఎన్ని మలుపులో, ఎన్ని బ్రేక్‌ లో! రచయిత ఘటికాచలం పుణ్యమాని సినిమా అడ్డదిడ్డంగా తిరిగి....తిరిగి మళ్ళీ వెనకటి కాలంలోకి మళ్ళింది.

    ఆనంద్‌ మంచి ఫ్రెండ్స్‌. ఆనంద్‌ ఫ్యాక్టరీలో శ్రీకాంత్‌ పనిచేస్తుంటాడు. సుత్తివేలుకు ఇద్దరు కూతుళ్ళు-రాశి, మాళవిక. రాశి అమాయకురాలు. కలివిడిగా మాట్లాడుతూ అవసరం ఉన్నవి, లేనివి చెపుతుంటుంది. శ్రీకాంత్‌ కు ఓ సందర్భంలో రాశి పరిచయమవుతుంది. రాశికి పెళ్ళి సంబంధం కుదురుతుంది. తనకు ఇష్టం లేకుండా పెళ్ళి చేస్తున్నారని శ్రీకాంత్‌ కు చెపుతుంది. మరోవైపు, రాశి ఫోటో చూపించి తనని ప్రేమిస్తున్నాని ఆనంద్‌ ఒకసారి చెప్పుతాడు. సో..ఫ్రెండ్‌ కు సాయం చేసేందుకు శ్రీకాంత్‌ పూనుకొని పెళ్ళిపీటల మీదినుంచి రాశిని తీసుకువస్తాడు. అప్పుడు అసలు విషయం తెలుస్తుంది.

    వాళ్ళిద్దరూ అసలు ప్రేమించుకోలేదని, ఆనంద్‌ రాశి వెంటపడడం భరించలేకే తాము విజయవాడ నుంచి ఈ ఊరు వచ్చామని వేలు చెప్పుతాడు. చివరికి రాశిని శ్రీకాంత్‌ పెళ్ళిచేసుకుంటాడు. ఐనా సుత్తివేలు శ్రీకాంత్‌ ను క్షమించాడు. వేలుకు ఇబ్బంది కలిగించకూడదని వేరే ఊరు వెళ్ళి సెటిల్‌ అవ్వాలని నిర్ణయించుకుంటారు. గర్భవతి ఐన రాశితో కలిసి శ్రీకాంత్‌ బయలుదేరుతాడు. రైల్వేస్టేషన్‌ వద్దకు వచ్చిన ఆనంద్‌ రాశిని రేప్‌ చేసేందుకు ప్రయత్నిస్తాడు.

    శ్రీకాంత్‌ కు 5 ఏళ్ళ కారాగార శిక్ష పడుతుంది. రాశి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్తుంది. కానీ అప్పటికే వేలు చనిపోతాడు. ఓ పిల్లాడికి జన్మనిచ్చి రాశి కూడా చనిపోతుంది. ఆ పిల్లాడిని మాళవిక పెంచుతుంది. వాడిపై మమకారం పెంచుకుంటుంది. జైలు నుంచి వచ్చిన శ్రీకాంత్‌ తన కొడుకును అప్పగించవలిసిందిగా కోరుతాడు. కానీ బావ అంటే అసహ్యం పెంచుకున్న మాళవిక అందుకు ఒప్పుకోదు. కోర్టుకు వెళ్ళుతారు. శ్రీకాంతే గెలుస్తాడు. ఇద్దరం పెళ్ళి చేసుకుందాం, అప్పుడు పిల్లాడు ఇద్దరి దగ్గరి ఉంటాడు కదాని మాళవిక చెప్పుతుంది.

    సో..ఇద్దరూ భార్యభర్తలు అవుతారు. కొన్నాళ్లకు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటిస్తుంది. కేవలం పిల్లాడిని చట్టబద్దంగా సొంతం చేసుకునేందుకే తాను పెళ్ళిచేసుకున్నానని చెప్పి విడాకులు కోరుతుంది. చివరికి విడాకులు తీసుకుంటారా? లేదా అన్నదే మిగతా సినిమా.

    ఇన్ని మలుపులు తిరిగిన ఈ చిత్రకథ 70, 80 దశకంలో వచ్చిన చిత్రాల మాదిరిగా ఓవర్‌ సెంటిమెంట్‌ తో ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తుంది. ఆనందభాష్పాలు మాత్రం కావు. ఒక్క పాట కూడా వినసొంపుగా లేదు. గ్రూప్‌ సాంగ్‌ లు, చిత్రీకరణ అంతా రోటీన్‌.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X