twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవినేని మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    రేటింగ్: 2.5/5
    నటీనటులు: నందమూరి తారకరత్న, సురేష్ కొండేటి, ధ్రువతార, బెనర్జీ, తుమ్మల ప్రసన్న కుమార్, సంగీత దర్శకుడు కోటి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, బాక్సాఫీస్ చందు రమేష్, లక్ష్మీ నివాస్, లక్ష్మీ నరసింహ తదితరులు
    నిర్మాతలు: జిఎస్ఆర్, రాము రాథోడ్
    డైరెక్టర్: నర్రా శివనాగు
    బ్యానర్: ఆర్‌టీఆర్ ఫిలిమ్స్
    రిలీజ్ డేట్: 2021-03-05

    బెజవాడలో రెండు ఫ్యాక్షన్ గ్రూపుల మధ్య వర్గ, ఆధిపత్య పోరు పోటాపోటీగా సాగుతుంది. దేవినేని నెహ్రూ (నందమూరి తారకరత్న), వంగవీటి రంగా (సురేష్ కొండేటి) కుటుంబాల మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది. అయితే దేవినేని గాంధీ మర్డర్‌తో బెజవాడ ఫ్యాక్షన్‌కు బీజం పడుతుంది. ఆ తర్వాత దేవినేని మురళి (అర్జున్ తేజ) హత్య‌తో వంగవీటి, దేవినేని ఫ్యామిలీ మధ్య పోరాటం తీవ్రస్థాయికి చేరుకొంటుంది. తన సోదరుడి హత్యకు కారణమైన వంగవీటి రంగాపై దేవినేని నెహ్రూ ఫ్యామిలీ పగ తీర్చుకొంటుంది.

    స్నేహంగా, సన్నిహితంగా ఉండే వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య పగ, ప్రతీకారాలు ఎందుకు చోటుచేసుకొన్నాయి. చలసాని, దేవినేని మురళి హత్యకు ఎవరు కుట్రపన్నారు? మురళి హత్య తర్వాత దేవినేని, వంగవీటి కుటుంబాల మధ్య ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకొన్నాయి. వంగవీటి రంగాను చంపడానికి కారణమైన పెద్దాయన ఎవరు? లాంటి ప్రశ్నకుల తెర మీద సమాధానమే దేవినేని.

    Devineni movie review and rating

    దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన బెజవాడ ఫ్యాక్షన్ కథను మరోసారి కళ్లకు కట్టినట్టుగా చూపించడంలో దర్శకుడు నర్రా శివనాగు సఫలమయ్యారు. గతంలో బెజవాడ హత్యా రాజకీయాలపై పలు సినిమాలు వచ్చినా.. స్పష్టంగా, బ్యాలెన్స్‌గా చూపించే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. వంగవీటి రంగా హత్య వెనుక ఉన్న పెద్దాయన పాత్రను బయటకు లాగడంలో శివనాగు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. కథలో భాగంగా డైరెక్టర్ చెప్పిన వాయిస్ ఓవర్ సినిమాను, కొన్ని సన్నివేశాలను మరో రేంజ్‌కు తీసుకెళ్తుంది.

    దాదాపు మూడు దశాబ్దాలపాటు బెజవాడ ఫ్యాక్షన్, రాజకీయాన్ని కనుసైగల్లో నడిపించిన దేవినేని నెహ్రూగా నందమూరి తారకరత్న ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఇప్పటి వరకు తారకరత్న ఓ రకమైన నటుడిగా తెలుసు. కానీ దేవినేని నెహ్రూగా ఆయన పరిణతితో కూడిన నటనను కనబరిచారు. ఈ చిత్రంలో తారకరత్న విభిన్నమైన ప్రతిభను ప్రదర్శించాడు. ఇక రంగా పాత్రకు సురేష్ కొండేటి న్యాయం చేశాడు. నటనకు కొత్తవాడైనా చాలా ఈజ్‌తో ఆ పాత్రను చేశాడు.

    దేవినేని చిత్రంలోని మిగితా పాత్రల విషయానికి వస్తే.. దేవినేని మురళి పాత్రలో అర్జున్ తేజ, చలసాని పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, వంగవీటి రాధ పాత్రలో సీనియర్ నటుడు బెనర్జీ, రత్నకుమారి పాత్రలో తనుష్క రెడ్డి, సుబ్బు పాత్రలో లక్ష్మీ నివాస్, సీపీఐ లీడర్ పాత్రలో బాక్సాఫీస్ రమేష్ అద్భుతంగా నటించారు. అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

    Recommended Video

    Devineni Director Sensational Comments On Vijayawada Leaders | Filmibeat Telugu

    దేవినేని సినిమాను క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా తెరకెక్కించడంలో నిర్మాతలు జీఎస్ఆర్, రాము రాథోడ్ సఫలమయ్యారు. తెర మీద కనిపించే పాత్రలకు నటీనటుల ఎంపిక విషయం సినిమాపై వారికి ఉండే అభురుచికి అద్దంపట్టింది. ఆర్‌టీఆర్ ఫిలిమ్స్ నిర్మాణ విలువలు భారీ బడ్జెట్ చిత్రానికి ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాయి. బెజవాడ ఫ్యాక్షన్‌ అసలు కారణం ఏమిటనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే దేవినేని సినిమా చూస్తే తప్పకుండా ఓ అవగాహన కలుగుతుంది. ఫ్యాక్షన్, యాక్షన్ సినిమాలు ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

    English summary
    Vijayawada based politician Devineni Nehru life story getting ready as Devineni Biopic title as Devineni. Bezawada Simham is the tag line. Siva Nagu is the director. Music Director Koti is playing crucial police officer. As part of the promotion, unit released first look of Koti.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X