Don't Miss!
- Sports
IND vs NZ: మలుపు తిప్పిన సిరాజ్.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్!
- News
Plan B: చీటింగ్ కేసులో ప్రముఖ రాజకీయ నాయుడు అరెస్టు, ఒకరు ఆత్మహత్య, మరోకరి దెబ్బతో!
- Finance
Capex: కేంద్రం ఊతమిస్తున్నా, రాష్ట్రాలు వాడుకోవట్లే...??
- Lifestyle
వాస్తు ప్రకారం ఇంట్లో ఈ మొక్కలు అస్సలే పెంచొద్దు, లేకుంటే తీవ్రంగా నష్టపోతారు
- Technology
ఈ షియోమీ ఫోన్లలో 5G ఫీచర్ ఉన్న కూడా ..! Jio 5G పనిచేయదు. ఎందుకంటే ..!
- Travel
బిష్ణుపూర్.. అదోక అందమైన బొమ్మల నగరం!
- Automobiles
బైక్‌పై వెళ్ళేటప్పుడు పిల్లులు అవసరమా.. వీడియో చూసి మీరే చెప్పండి
Dhamaka Review రెగ్యులర్ మాస్ ఎంటర్‌టైనర్.. రవితేజ, శ్రీలీల కెమిస్ట్రీ ఎలా ఉందంటే?
Rating: 3/5
ధమాకాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: రవితేజ, శ్రీలీల, జయరాం, సచిన్ ఖేడ్కర్, తనికెళ్ల భరణి, రావు రమేష్, ఆలీ, ప్రవీణ్, హైపర్ ఆది, పవిత్ర లోకేష్, తులసి తదితరులు
దర్శకత్వం: త్రినాథ రావు నక్కిన
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కుచిభోట్ల
బ్యానర్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
స్టోరీ, డైలాగ్స్: ప్రసన్న కుమార్ బెజవాడ
మ్యూజిక్: భీమ్స్
సినిమాటోగ్రఫి: కార్తీక్ ఘట్టమనేని
ఫైట్స్: రామ్ లక్ష్మణ్
పీఆర్వో: వంశీ శేఖర్
రిలీజ్ డేట్: 2022-12-23

ధమాకా కథ ఏమిటంటే?
పీపుల్స్ మార్ట్ వ్యాపార సామ్రాజ్యానికి అధినేత చక్రవర్తి కుమారుడైన వివేకానంద చక్రవర్తి అలియాస్ ఆనంద్ చక్రవర్తి (రవితేజ) తండ్రికి అండదండగా ఉంటాడు. అయితే చక్రవర్తి ఓ కారణంగా తన కంపెనీ షేర్లలో 50 శాతం ఉద్యోగులకు రాసిచ్చి కంపెనీ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోవాలని అనుకొంటాడు. కంపెనీ తదుపరి సీఈవోగా ప్రకటించే ముందు పీపుల్స్ మార్ట్ కంపెనీపై కన్నేసిన జేపీ (జయరాం) చక్రవర్తి నుంచి బలవతంగానైనా వ్యాపారాన్ని లాగేసుకోవాలని కుట్ర పన్నుతాడు.
కూకట్‌పల్లిలోని మాస్ ఏరియాలో ఉండే స్వామి (రవితేజ) ఉద్యోగవేటలో ఉంటాడు. తన ప్రాంతంలో ఉండే ప్రణవి (శ్రీలీల)తో ప్రేమలో ఉంటాడు. అయితే ప్రణవితో స్వామి పెళ్లి జరిపించడానికి తండ్రి (రావు రమేష్) అభ్యంతరం వ్యక్తం చేస్తాడు.

ధమాకా మూవీలో ట్విస్టులు
పీపుల్ మార్ట్ కంపెనీని ఆక్రమించుకోవాలనుకొన్న జేపీ కుట్రను ఆనంద చక్రవర్తి అడ్డుకొన్నారా? పీపుల్స్ మార్ట్ కంపెనీ అధినేత ఎందుకు తన పదవిని వదులుకొన్నారు? కంపెనీ షేర్లను ఉద్యోగులకు ఎందుకు ఇచ్చాడు.
పీపుల్స్ మార్ట్ కంపెనీపై జేపీ ఎందుకు కన్నేశాడు? ఉద్యోగ వేటలో ఉన్న స్వామి చివరకు జాబ్ సంపాదించాడా? పీపుల్స్ మార్ట్ కంపెనీకి స్వామికి సంబంధం ఏమిటి? పీపుల్స్ మార్ట్ కంపెనీపై జేపీ కుట్రలను స్వామి అడ్డుకోవాలని ఎందుకు రంగంలోకి దిగాడు? శ్రీలీలతో పెళ్లి విషయంలో ఆమె తండ్రిని స్వామి ఎలా ఒప్పించాడు అనే ప్రశ్నలకు సమాధానమే ధమాకా సినిమా కథ.

మూవీ ఎలా ఉందంటే?
సక్సెస్‌ఫుల్‌గా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన చక్రవర్తి.. సక్సెస్‌ఫుల్ బిజినెస్‌గా చనిపోవాలనే అనుకోవడమనే ఎమోషన్ పాయింట్‌తో కథ మొదలవుతుంది. ప్రసన్న కుమార్ రాసిన కథ చాలా రెగ్యులర్, రొటీన్‌గా ఉంటుంది. కానీ దానికి ఇచ్చిన ట్రీట్‌మెంట్ వల్లనే సినిమా మరింత ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు.
అయితే ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చినప్పటికీ.. దర్శకుడు త్రినాథ రావు సినిమాను నడిపించిన విధానంగా బాగుంది. రవితేజ మాస్ అప్పీల్, ఎనర్జీ, శ్రీలీల గ్లామర్, డ్యాన్సులు ఈ సినిమాకు పాజిటివ్ అంశాలుగా మారడమే కాకుండా జోష్‌ను కూడా కలిగించాయి. ఫస్టాఫ్ జాలీగా సాగిపోతే.. సెకండాఫ్ మాత్రం రెగ్యులర్‌గా, కథలో ఎలాంటి ట్విస్టులు లేకుండా సాఫీగా డెస్టినేషన్ చేరుకొన్నదనే ఫీలింగ్ కలుగుతుంది.

రవితేజ రెగ్యులర్ పాత్రలో..
మాస్ మహారాజ్ ఇమేజ్ ఉన్న రవితేజకు ధమాకా కథ కొత్తేమీ కాదు. కానీ రొటీన్, రెగ్యులర్ కథను తన ఎనర్జీ, బాడీలాంగ్వేజ్‌తో కొత్తగా చూపించేందుకు ప్రయత్నం చేశారు. సినిమాలోని పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో మరింత జోష్ పెంచాడు.
ఎప్పటిలానే పాటల్లో, ఫైట్స్‌లో తన ఎనర్జీతో ఆకట్టుకొన్నాడు. శ్రీలీలతో కలిసి మంచి మాస్, మసాలా అంశాలను ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశాడు. అయితే ఇంకా ఇలాంటి కథలపై రవితేజ ఎన్నాళ్లు ఆధారపడుతారనే ప్రశ్న మాత్రం ప్రేక్షకల్లో కలగడం సహజం.

శ్రీలీల, ఇతర నటీనటుల
ఇక పెళ్లి సందD చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీలీలకు మరోసారి తన ప్రతిభను రుజువు చేసుకొనేందుకు దొరికిన అవకాశాన్ని సక్సెస్‌ఫుల్‌గా ఉపయోగించుకొన్నదని చెప్పవచ్చు. పాటల్లో ఊరమాస్ స్టెప్పులతో అలరించడమే కాకుండా గ్లామర్‌తో గిలిగింతలు పెట్టే ప్రయత్నం చేసింది.
కీలక సన్నివేశాల్లో ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పించే ప్రయత్నం చేసింది. రావు రమేష్, హైపర్ ఆది కామెడీ ట్రాక్ సినిమాను మరింత ఫన్‌గా మార్చింది. జేపీగా జయరాం రెగ్యులర్ విలన్‌గా కనిపించాడు. మిగితా పాత్రల్లో ఆలీ, పవిత్రా లోకేష్, తులసి తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

ధమాకాలో టెక్నికల్ అంశాలు..
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ధమాకా సినిమాకు ప్రసన్నకుమార్ అందించిన డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాగుంది. స్వామి, వివేకానంద చక్రవర్తి రోల్స్ పాత్రలను కలిపిన విధానం ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. పాత్రలకు తగినట్టుగా రాసిన డైలాగ్స్ సినిమాకు స్పెషల్ ప్యాకేజ్.
రవితేజతో చెప్పిన డైలాగ్స్ అన్ని బాగున్నాయి. ఇక రెగ్యులర్, రొటీన్ సినిమాను కూడా నిలబెట్టే ప్రయత్నాన్ని మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరోలియో చేశాడు. భీమ్ అందించిన పాటలు సిల్వర్ స్క్రీన్ మీద కేక పెట్టించే విధంగా ఉన్నాయి. పాటలకు తగినట్టుగా కొరియోగ్రఫి కూడా తోడవ్వడంతో సాంగ్స్‌లో జోష్, ఫైర్ కనిపించింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ బాగున్నాయి.

ఫైనల్‌గా ఎలా ఉందంటే?
కథలో ఎలాంటి కొత్తదనం కనిపించని రెగ్యులర్, రొటీన్ మాస్ ఎంటర్‌టైనర్ ధమాకా సినిమా. రవితేజ ఎనర్జీ, బాడీలాంగ్వేజ్, శ్రీలీల గ్లామర్, డైలాగ్స్, మాస్ సన్నివేశాలు సినిమాకు ప్లస్ పాయింట్స్. మాస్, కమర్షియల్ అంశాలను ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు ధమాకా మూవీ సంతృప్తి పరుస్తుంది. కొత్తదనం కోరుకొని థియేటర్‌కు వెళ్లే వారికి కొంత నిరాశే మిగులుతుంది. కథ విషయాన్ని పక్కన పెడితే.. మంచి కంటెంట్‌తో పేర్చుకొంటూ పోయిన సీన్లు మాత్రం ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తాయి. ఎక్కువగా ఆశించి వెళితే నిరాశ కలుగుతుంది. రవితేజ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌లా ఉంటుంది.