»   » యావరేజ్ కామెడీ ఎంటర్టెనర్... (ధన లక్ష్మి తలుపు తడితే-రివ్యూ)

యావరేజ్ కామెడీ ఎంటర్టెనర్... (ధన లక్ష్మి తలుపు తడితే-రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

హైదరాబాద్: మాస్టర్‌ సుక్కురామ్‌ సమర్పణలో సాయి అచ్చుత్‌ దర్శకత్వంలో భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మపల్లి రామసత్యనారాయణ నిర్మించిన 'ధనలక్ష్మి తలపు తడితే'. కామెడీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు విడుదలైంది.

సంగీతం : బోలే శావలి,
ఎడిటర్‌ : శివ వై.ప్రసాద్‌
కెమెరా: జి. శివకుమార్‌
కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం : సాయిఅచ్చుత్‌ చిన్నారి
నిర్మాత: తుమ్మల పల్లి సత్యనారాయణ
తారాగణం: ధనరాజ్‌, మనోజ్‌నందం, అనిల్‌ కల్యాణ్‌, శ్రీముఖి, సింధుతులాని


Dhanalakshmi Talupu Tadithey movie review

కథ విషయానికొస్తే...
ప్రొఫెషనల్ కిల్లర్స్ రణధీర్, శ్రీముఖి కలిసి ఎంపీ వసుంధర(సింధు తులానీ) మేనల్లుడిని కిడ్నాప్ చేసి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. వారు అడిగినంత ఇవ్వడానికి ఒప్పుకుంటుంది వరుసుంధ. బాబును ఇచ్చేసి డబ్బు తీసుకోవడానికి వెలుతుండగా యాక్సిడెంట్ అవుతుంది. బాబు వారి నుండి తప్పి పోతాడు.


మరో వైపు తనీస్ బర్త్ డే పార్టీ కోసం అతని ఫ్రెండ్స్ కోడి(ధనరాజ్), పండు(మనోజ్ నందం), చిట్టి(అనిల్ కళ్యాణ్), విజయ్ సాయి(సత్తి) కలిసి వెళ్తుండగా వారికి తప్పిపోయిన బాబు కనిపిస్తాడు. అతను ఎవరి బాబు అని అంతా అయోమయంలో పడతారు. అంతలోనే అక్కడికి వచ్చిన వసుంధర వారికి కోటి ఇచ్చి బాబుని తీసుకెళ్ళిపోతుంది. అసలు ఆ డబ్బు ఆమె ఎందుకు వచ్చిందో వారికి అర్థం కాదు. తర్వాత వారు ఇబ్బందుల్లో పడతారు. తర్వాత రణదీర్ ఎంటరవుతాడు...తర్వాత ఏమైంది? ఆ కోటి రూపాయలు చివరకు ఎవరికి దక్కుతాయి అనేది తెరపై చూడాల్సిందే.


పెర్ఫార్మెన్స్..
ధనరాజ్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది. తన కామెడీతో ఆకట్టుకున్నాడు. శ్రీముఖి నటన ఆకట్టుకునే విధంగా ఉంది. రణదీర్, మనోజ్ నందం, అనిల్, విజయ్ తదితరులు వారి పాత్రల మేరకు బాగా నటించారు. పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేస్తూ నాగబాబు పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. తాగుబోతు రమేష్ కూడా తనదైన స్టైల్ లో ఆకట్టుకున్నాడు.


టెక్నికల్..
భోలె శావలి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. శివప్రసాద్ ఎడిటింగ్ జస్ట్ ఓకే. నిర్మాణ విలువలు ఫర్వాలేదనే విధంగా ఉన్నాయి.


థ్రిల్లింగ్ కామెడీ ఎంటర్టెనర్ గా తెరకెక్కించాలనుకున్న దర్శకుడు కొంతమేర సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే యావరేజ్ గా ఉంది. సినిమాలో కొన్ని సీన్లలో లాజిక్ మిస్సవ్వడం, కొన్నీ సీన్లు సాగదీసిన్లట్లు ఉండటం, నేరేషన్ పర్పాక్టుగా లేక పోవడం లాంటి కొన్ని లోపాలు ఉన్నాయి.


చివరగా...
‘ధనలక్ష్మి తలుపు తపితే' జస్ట్ యావరేజ్ కామెడీ ఎంటర్టెనర్.'

English summary
Dhanalakshmi Talupu Tadithey movie review.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu