Dies Irae Malayalam Movie Twitter Review: డైస్ ఎరా మలయాళం మూవీ ట్విట్టర్ రివ్యూ
మలయాళ దిగ్గజ నటుడు మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం డైస్ ఎరా (Dies Irae). హారర్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. చక్రవర్తి రామచంద్ర నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో సుస్మిత భట్, జిబిన్ గోపినాథ్, మనోహరి జాయ్, జయ కురుప్, అరుజ్ అజికుమార్ తదితరులు నటించారు.
ఈ సినిమాకు షఫిఖ్ మహ్మద్ ఆలీ ఎడిటర్‌గా, షెహనాద్ జలాల్ సినిమాటోగ్రఫిని, క్రిస్టో జేవియర్ మ్యూజిక్ అందించారు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రం అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా గురించి నెటిజన్లు, క్రిటిక్స్, సినీ ప్రేక్షకులు సోషల్ మీడియాలో వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూలు, పోస్టుల వివరాల్లోకి వెళితే..

డైస్ ఎరా సినిమా గ్రిప్పింగ్‌గా చిత్రీకరించిన హారర్ థ్రిల్లర్. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి సన్నివేశం వరకు చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. దర్శకుడు రాహుల్ సదాశివన్ వెన్నులో చలిని పుట్టించేస్తాడు. ఎంటర్‌టైనర్‌గా బ్రిల్లియెంట్‌గా రూపొందించారు. ప్రణవ్ మోహన్‌లాల్ యాక్టింగ్ టెర్రిఫిక్. షెహనాజ్ జలాల్ సినిమాటోగ్రఫి, క్రిస్టో జేవియర్ మ్యూజి్ అవుట్‌స్టాండింగ్. ఈ హారర్ మూవీ ఒక్కసారి కాదు.. అనుక్షణం వణికించేలా ఉంటుంది. ఏ ఒక్క సీన్‌ను కూడా ఎవరూ ఊహించలేరు అని నెటిజన్ తన రివ్యూను అందించాడు.
డైస్ ఎరా ప్యూర్ మ్యాడ్ నెస్. మలయాళ హరర్ సినిమా పీక్స్‌లో ఉంది. సదాశివన్ సృష్టించిన కాళరాత్రిని ఎవరూ తప్పించుకోలేరు. అనుక్షణం టెన్షన్, దవడలు వణికేలా, భయం గుప్పిట్లో ఉండేలా సినిమా సాగుతుంది. ప్రణవ్ మోహన్ లాల్ తన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టో తన సంగీతాన్ని ఓ స్టెరాయిడ్‌లా అందించారు. ప్రీ ఇంటర్వెల్ సీన్, ఇంటర్వెల్ బ్లాక్. నిజంగా వణికిపోవాల్సిందే. ఏకంగా నరకం చూసేలా ఉంటుంది. ప్రేక్షకుల అరుపులతో థియేటర్ దద్దరిల్లుతుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.
డైస్ ఎరా సినిమా అద్బుతమైన హారర్ మూవీ. ప్రణవ్ మోహన్‌లాల్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఎపిసోడ్ అదిరిపోయింది. ఈ సినిమాకు చేసిన గ్రాఫిక్స్, విజువల్ వర్క్ బాగుంది. తప్పుకుండా చూడాల్సిన సినిమా అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
డైస్ ఎరా సినిమాలో ప్రణవ్ మోహన్ లాల్ నటన మెరుపులా ఉంటుంది. సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సన్నివేశాలు వెంటాడుతుంటాయి. అనుక్షణం భయం పడుతూ చూసేలా ఉంటుంది. ఈ హారర్ మూవీ ఇప్పటి వరకు మలయాళంలో రాలేదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











