»   » స్వామి రారా మిక్సింగ్ (‘దోచేయ్’ రివ్యూ)

స్వామి రారా మిక్సింగ్ (‘దోచేయ్’ రివ్యూ)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  Rating:
  2.5/5

  హైదరాబాద్: గతంలో దొంగతనాల కాన్సెప్టుతో ‘స్వామి రారా' చిత్రంతో హిట్ కొట్టిన దర్శకుడు సుధీర్ వర్మ ఈ సారి కూడా అలాంటి కాన్సెప్టుతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నాగ చైతన్య, క్రితి సనన్ హీరో హీరోయిన్లుగా ఆయన తెరక్కించిన చిత్రం ‘దోచేయ్' ఈ రోజు విడుదలైంది. నాగ చైతన్య తన గత సినిమాలకు భిన్నంగా ఇందులో కనిపించాడు. యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌గా ఆ సినిమా సంగతులేందో రివ్యూలో చూద్దాం.

  సినిమా కథలోకి వెళితే.....సీతారాం(రావు రమేష్) నిజాయితీగా బ్రతికే క్యాబ్ డ్రైవర్. తన ఫ్యామిలీని పోషిస్తూ హ్యాపీగా లైప్ గడుపుతుంటాడు. ఓ రోజు సీతారాం తాను చేయని తప్పుకు హత్య, దోపిడీ కేసులో అరెస్టవుతాడు. దీంతో అతని ఫ్యామిలీ కష్టాల్లో పడుతుంది. సీతారాం కొడుకు చందు(నాగ చైతన్య) ఎలాగైనా తన తండ్రి నిజాయితీని నిరూపించి అతన్ని జైలు నుండి విడిపించడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. అసలు దొంగలను పట్టుకునే క్రమంలో, తండ్రిని జైలు నుండి విడిపించానికి, చెల్లిని డాక్టర్ చదివించడానికి భారీగా డబ్బు అవసరం కావడంతో తాను కూడా దొంగగా మారక తప్పదు. ఈ క్రమంలోనే మీరా(క్రితి సనన్)తో ప్రేమలో పడతాడు. రూ 2 కోట్ల విషయంలో రౌడీ మాణిక్యం(పోసాని కృష్ణ మురళి) వల్ల చందు ఇబ్బందులు పడతాడు. చందు ఫాదర్ జైలుకెళ్లడానికి కారణం ఎవరు? మాణిక్యం చందూను ఎందుకు ఇబ్బంది పెడతాడు, కథ ఎలా సుఖాంతం అయింది అనేది మిగతా కథ.

  పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే.... గత సినిమాలతో పోలిస్తే నాగ చైతన్య చాలా ఇంప్రూవ్ అయ్యాడు. దొంగ పాత్రలో ఒదిగిపోయాడు. డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్స్ సీన్స్ బాగా చేసాడు. క్రితి సనన్ తన పాత్ర మేరకు గ్లామర్ పరంగా, లుక్స్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగా చేసింది. బుల్లెట్ బాబు పాత్రలో బ్రహ్మానందం తెగ నవ్వించాడు. తాగుబోతు రమేష్, సప్తగిరి పాత్రలు బ్రహ్మానందం కామెడీకి మరింత ప్లస్సయి మంచి వినోదం పంచింది. పోసాని, రవి బాబు తమ పాత్రలకు న్యాయం చేసారు. ఇతర నటీనటులు వారి వారి పాత్రల మేరకు రాణించారు.

  సినిమా ఎలా ఉందనే విషయానికొస్తే.... గతంలో స్వామి రారా చిత్రాన్ని తెరకెక్కించిన సుధీర్ వర్మ ‘దోచేయ్' సినిమాలోనూ ఆ సినిమా గుర్తొచ్చేలా సన్నివేశాలు, పాత్రలు రిపీట్ చేసాడు. ఒక రకంగా ఈ చిత్రం ‘స్వామి రారా' చిత్రానికి కొనసాగింపా? అనే భావన కలుగుతుంది. తొలి భాగా కాస్త స్లోగా నడిచింది. అయితే రెండో భాగం ఆసక్తిగా సాగింది. సినిమా చివరి 30 నిమిషాలు బాగా నవ్వించాడు. సినిమాలో కామెడీ బాగా వర్కౌట్ అయింది. చేజింగ్ సీన్లు, యాక్షన్ సీన్లు బావున్నాయి.

  టెక్నికల్ అంశాల పరంగా చూస్తే....సినిమా విజువల్ ట్రీట్ లా ఉంది. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బావుంది. సన్నీ ఎంఆర్ అందించిన మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. స్క్రీన్ ప్లే ఫర్వాలేదు.

  ఓవరాల్ గా సినిమా ఎలా ఉందనే విషయానికొస్తే...... స్వామి రారా ఛాయలు కనిపించినప్పటికీ సినిమా ప్రేక్షకులును ఎంటర్టెన్ చేయడంలో కొంతమేర సక్సెస్ అయింది. నాగ చైనత్య, క్రితి సనన్ పెర్ఫార్మెన్స్ ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ ఓకే. సెకండాఫ్ లో చివరి 30 నిమిషాలు చూసి నవ్వుకోవడానికైనా వెళ్లొచ్చు. 

  ఓపెనింగ్ సీన్

  బ్యాంకు దోపీడితో సినిమా మొదలవుతుంది.

  నాగ చైతన్య ఇంట్రడక్షన్

  బైకు మీద నాగ చైతన్య ఇంట్రడక్షన్ సీన్....ఓ పాటతో మొదలవుతుంది.

  క్రితి సనన్ ఇంట్రడక్షన్

  మెడికల్ స్టూడెంటుగా క్రితి సనన్ ఎంట్రీ ఉంటుంది. ఇద్దరి మధ్య ఫన్సీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

  ఇంటర్వెల్

  సింపుల్ ట్విస్టుతో ఇంటర్వెల్ ఉంటుంది.

  అనవసర సీన్లు

  సినిమాలో అక్కడక్కడ కొన్ని అనవసరమైన సీన్లు ఉన్నాయి. సెకండాఫ్ లో భారీ రాబరీ తర్వాత వైవా హర్ష, నాగ చైతన్య మధ్య వచ్చే సీన్లు అనవసరం అనిపిస్తాయి.

  ఫ్లాష్ బ్యాక్

  నాగ చైతన్య, క్రితి సానన్ మధ్య రొమాంటిక్ సాంగ్ తర్వాత సినిమా ఫ్యాష్ బ్యాక్ లోకి వెలుతుంది. ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ సీన్లు ఆడియన్స్ ను కట్టిపడేస్తాయి.

  బ్రహ్మానందం

  బుల్లెట్ బాబుగా ఈ చిత్రంలో బ్రహ్మానందం తెగ నవ్వించాడు.

  రవి బాబు

  ఈ చిత్రంలో రవి బాబు పోలీసాఫీసర్ పాత్రలో నటించారు. హీరోకు ఉపయోగపడే విధంగా అతని పాత్ర ఉంటుంది.

  క్లైమాక్స్

  సినిమా క్లైమాక్స్ ఫన్నీగా ఉండి ఆకట్టుకుంటుంది.

  English summary
  Looks like Sudheer Varma has also stuck with the second film jinx. Lost in the middle of no where, he mixed up his super hit film Swamy Ra Ra into Dohchay and has lend the support of Brahmi to save the film. Court scene in the climax stands as the only good scene in the second half. If you don't mind some lags and a lover of con films, you can give it a watch for the comedy and action episodes.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more