Dude First Review: డ్యూడ్ మూవీ ఫస్ట్ రివ్యూ.. మమితా బైజు సినిమా పరిస్థితి ఏమిటంటే?

తెలుగు సినిమా రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైద్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ నిర్మించిన చిత్రం డ్యూడ్. తమిళ సినీ హీరో ప్రదీప్ రంగనాథన్, ప్రేమలు సినిమాతో ప్రేక్షకులకు చేరువైన మమిత బైజు జంటగా నటించారు. ఈ చిత్రానికి కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 17వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది. రిలీజ్‌ కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమాను సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. వారు ఈ మూవీపై వెల్లడించిన రివ్యూ ఏమిటి? ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికెట్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..

రొమాంటిక్ కామెడీ యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో ఆర్ శరత్ కుమార్, హిృదు హరూన్, డెవిడ్ సెల్వమ్, రోహిణి, ఐశ్వర్య శర్మ తదితరులు నటించారు. ఈ సినిమా కోసం నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫి, భరత్ విక్రమన్ ఎడిటింగ్ బాధ్యతలను, సాయి అభయంకర్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ప్రమోషన్స్‌తో రిలీజ్‌కు సిద్దమైన తరుణంలో సెన్సార్ నుంచి క్లియరెన్స్ పొందింది.

Dude Movie Review by Censor Board

ఢ్యూడ్ సినిమా కథ విషయానికి వస్తే.. రెండు జనరేషన్లకు సంబంధించిన ప్రేమ కథ. రెండు తరాల మధ్య ప్రేమ ఎలా ఉంది? గతంలో మనుషుల మధ్య ప్రేమ ఎలా ఉండేది.. ఈ తరం వారి ప్రేమను ఎలా ఆస్వాదిస్తున్నారనే విషయంతో తెరకెక్కించారనే విషయం తెలిసింది. ఆరవింద్‌గా ప్రదీప్, అరవింద్ త్ండ్రిగా శరత్ కుమార్, కురాల్‌గా మమితా బైజు నటించగా, ఈ సినిమాను ప్రేమ, పెళ్లి అనే రెండు అంశాలతో రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామాగా మలిచారు. తమిళ చిత్రంగా రూపొందిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల అభిరుచి, నేటివిటితో తెరకెక్కించారు.

డ్యూడ్ సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. ఈ సినిమా కోసం ఎంచుకొన్న కథ బాగుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, రోహిణి, శరత్ కుమార్, హిృదూ హరున్ యాక్టింగ్ ఈ సినిమాకు ప్లస్ పాయిట్స్. మ్యూజిక్, సినిమాటోగ్రఫి అంశాలు టెక్నికల్‌గా బాగున్నాయి అనే విధంగా ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించి స్వల్ప మార్పులు సూచించారు.

తమిళ వెర్షన్‌లో కొన్ని పదాలను మ్యూట్ చేయమని అడిగారు. తమిళ, తెలుగు భాషల్లో కొన్ని బూతు డైలాగ్‌లపై కత్తెర వేశారు.
అలాగే ఇతర సినిమాల్లోని పాటలను ఈ చిత్రంలో పెట్టుకోవడానికి ఎన్‌వీసీని తీసుకొని సమర్పించాలని సూచించారు. పెద్దగా ఈ మూవీపై అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. చిత్ర యూనిట్ కూడా సెన్సార్ సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొన్నారు. దాంతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని తెలిసింది.

డ్యూడ్ సినిమాపై సంతృప్తిని వ్యక్తం చేసిన అధికారులు ఈ చిత్రానికి యూఏ (UA 16+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ చిత్రం చూసే విషయంలో 16 ఏళ్ల లోపు పిల్లలను వారి తల్లిదండ్రులు పర్యవేక్షణలో చూడాలని సర్టిఫికెట్‌లో వెల్లడించారు. 16 ఏళ్లకు పైబడిన వారికి ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతించే విధంగా సర్టిఫికెట్ ఇచ్చారు అని తెలిసింది. ఇక ఈ సినిమా నిడివిని 139.41 నిమిషాలు అంటే. 2 గంటల 19 నిమిషాల 41 సెకన్లుగా రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు అనే విషయం సెన్సార్ సర్టిఫికెట్ ద్వారా తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X