»   » దువ్వాడ జగన్నాథం రివ్యూః పక్కా కమర్షియల్

దువ్వాడ జగన్నాథం రివ్యూః పక్కా కమర్షియల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు లాంటి భారీ హిట్లతో దూసుకెళ్తున్న అల్లు అర్జున్ తాజాగా దువ్వాడ జగన్నాథం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్‌ను సొంతం చేసుకొన్న హరీశ్ శంకర్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ రెండు విభిన్నమైన పాత్రలను పోషించాడు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్లు, ఫస్ట్‌లుక్, ట్రైలర్లు అభిమానుల్లో భారీ అంచనాలను పెంచాయి. ఇలాంటి సానుకూల పరిస్థితుల్లో 2017 జూన్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన దువ్వాడ జగన్నాథం చిత్రం ఏ మేరకు మెప్పించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ గురించి తెలుసుకోవాల్సిందే..

ఆవేశపరుడైన దువ్వాడ జగన్నాథం

ఆవేశపరుడైన దువ్వాడ జగన్నాథం

బెజవాడకు సమీపంలోని సత్యనారాయణపురం అనే అగ్రహారానికి చెందిన బ్రహ్మణ కుటుంబానికి చెందిన వాడు దువ్వాడ జగన్నాథం (అల్లు అర్జున్) తండ్రికి అన్నపూర్ణ క్యాటరింగ్‌ను నడుపుతుంటాడు. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు వంటలు చేస్తుంటారు. తండ్రికి దువ్వాడ సహకరిస్తుంటాడు. కానీ దువ్వాడకు అన్యాయమంటే సహించదు. చిన్నతనం నుంచే అన్యాయాలను, అక్రమాలను, చెడును ఎదురిస్తుంటాడు. ఆవేశం ఎక్కువ. బ్రహ్మణ కుటుంబంలో పుట్టిన వాడికి ఆవేశం ఉండకూడదు అనే నెపంతో దువ్వాడ జగన్నాథానికి మెడలో రుద్రాక్షతో కూడిన మాలను వేస్తాడు. దానిని తన చేతులతో తీయకూడదని ఒట్టు వేయించుకొంటాడు తండ్రి (తనికెళ్ల భరణి).


తొలి చూపులోనే ప్రేమలో..

తొలి చూపులోనే ప్రేమలో..

ఓ పెళ్లి కార్యక్రమంలో పూజా హెగ్డేను కలుస్తాడు. మొదటి చూపులోనే ప్రేమలో పడుతాడు. అయితే పెళ్లిలో ఆటపట్టించడానికే చనువుగా ఉన్నానని, పెళ్లి, ప్రేమ వ్యవహారాలు తనకు తగవని దువ్వాడ జగన్నాథానికి స్పష్టం చేస్తుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో జగన్నాథం ప్రేమలో ఉన్న స్వచ్ఛతను తెలుసుకొంటుంది.


అండర్ కవర్ ఆపరేషన్స్

అండర్ కవర్ ఆపరేషన్స్

ఇదిలా ఉండగ ఇలాంటి ఆవేశమున్న జగన్నాథం చిన్నతనంలోనే పోలీస్ అధికారి దృష్టిలో పడుతాడు. డీజే పేరుతో అండర్ కవర్ ఆఫీసర్‌గా పనిచేస్తూ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో మాఫియా, సంఘ విద్రోహశక్తుల పనిపడుతుంటాడు. తనకు బాబాయి (చంద్రమోహన్) లాంటి వ్యక్తి అనుకోకుండా ఆత్మహత్య చేసుకొంటాడు. ఆత్మహత్యకు అగ్రి డైమండ్ అనే సంస్థ కారణమని తెలుస్తుంది.


అగ్రి డైమండ్ కుంభకోణం..

అగ్రి డైమండ్ కుంభకోణం..

అగ్రి డైమండ్ ఉన్న వ్యక్తులు ఎవరూ అనే పనిలో పడుతాడు. అగ్రి డైమండ్ వ్యవహారాలను రొయ్యల నాయుడు (రావు రమేశ్) గుట్టు చప్పుడు కాకుండా బినామీల పేరు మీద నడుపుతాడు. 9 వేల కోట్ల అక్రమాలకు తెర తీసిన అగ్రి డైమండ్ వెనుక దుష్ట శక్తుల పనిపట్టడానికి కంకణం కట్టుకొంటాడు. ఈ క్రమంలో దువ్వాడ జగన్నాథం అలియాస్ డీజే ఎదుర్కొన్న సమస్యలేంటి.? రొయ్యల నాయుడు గుట్టు ఎలా రట్టు చేశాడు. అగ్రి డైమండ్ బాధితులను ఎలా ఆదుకొన్నాడు. బాధితులకు ఎలా డబ్బు తిరిగి వచ్చేలా చేశాడు. వంటమనిషి అని గేలి చేసిన జగన్నాథాన్ని ఇష్టపడటానికి కారణం ఏమిటి? ఇలా ప్రశ్నలకు సమాధానమే దువ్వాడ జగన్నాథం సినిమా.


ఫస్టాఫ్ ఇలా..

ఫస్టాఫ్ ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అగ్రి గోల్డ్ కుంభకోణాన్ని పోలిన నేపథ్యాన్ని అగ్రి డైమండ్ పేరుతో కథను అల్లుకున్నాడు. చాలా సీరియస్ సమస్యకు దర్శకుడు హరీశ్ శంకర్ బ్రహ్మణ నేపథ్యాన్ని జోడించాడు. స్వతహాగా హరీశ్ బ్రహ్మణుడు కావడంతో కథలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా, గ్రౌండ్ వర్క్ బాగా చేయడానికి అవకాశం లేకుండా వెసలుబాటు కలిగింది. అల్లు అర్జున్‌లో ఉండే ఎనర్జీని, సానుకూల అంశాలను దృష్టిలో పెట్టుకొని కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంటు ఎక్కువగా మేలవించి, కొంత యాక్షన్ జతచేసి ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. పూజా హెగ్డే గ్లామర్, అల్లు అర్జున్ స్టయిల్‌ను మిక్స్ చేసి ఫస్టాఫ్‌ను పరుగు పెట్టించాడు.


సెకండాఫ్ అలా..

సెకండాఫ్ అలా..

ఇక రెండో భాగంలో విలన్‌తో వైరం ప్రధాన అంశంగా మారింది. దీంతో క్లైమాక్స్‌ ఏంటో ప్రేక్షకుడికి ముందే అర్థమైపోతుంది అయితే కథను ఎలా ముందుకు తీసుకు వెళ్తాడనే ఆసక్తి కరమైన పాయింట్ ప్రేక్షకుడికి ఇంటర్వెల్ కలిగుతుంది. క్లైమాక్స్‌ను చేరుకోవడానికి దర్శకుడు అనుసరించిన పద్ధతి, కమర్షియల్ ఎలిమెంట్లను వాడుకొన్న విధానం రొటీన్‌గా ఉన్నప్పటికీ.. కొత్తగా చూపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. రొటీన్ భిన్నంగా క్లైమాక్స్‌ను కామెడీతో ముగించడంతో ప్రేక్షకుడు నవ్వుతూ ఓ సంతృప్తితో బయటకు వచ్చే అవకాశాన్ని కల్పించాడు. అయితే ఫైట్స్, భారీ హంగామా లాంటి రెగ్యులర్ క్లైమాక్స్‌ను కోరుకొనే సాధారణ ప్రేక్షకుడికి కొంత ఇబ్బందే ఉంటుంది. జులాయి, రేసుగుర్రం, అదుర్స్ లాంటి ఛాయలు ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తాయి.


అల్లు అర్జున్ ఎనర్జీ.. యాక్షన్ అదుర్స్

అల్లు అర్జున్ ఎనర్జీ.. యాక్షన్ అదుర్స్

దువ్వాడ జగన్నాథం చిత్రం అల్లు అర్జున్‌ బాడీ లాంగ్వేజికి కరెక్ట్‌గా సరిపోయే చిత్రం. తన ఫార్మాట్‌లో పాటలు, డాన్సులు, ఫైట్లు, నాలుగు సెంటిమెంటు సీన్లు కలిపి వినోదాత్మకంగా సాగిపోయే కథ, పాత్రలో అల్లు అర్జున్ ఒదిగిపోయాడు. సహజంగానే స్టైలిష్ స్టార్ డాన్సులను ఇరగదీస్తాడు. అలాంటి అల్లు వారసుడికి మంచి పాటలు, పక్కన పూజా హెగ్డే లాంటి గ్లామర్ స్టార్ ఉంటే చెలరేగిపోవడం ఖాయం. ఫైట్స్, సెంటిమెంట్ సన్నివేశాల్లో మంచి అల్లు అర్జున్ మంచి నటనను కనబరిచాడు. చంద్రమోహన్ చనిపోయే సీన్‌లో, వెన్నెల కిషోర్ కుటుంబంలో తలెత్తే సెంటిమెంట్‌తో కూడిన సన్నివేశాలను అద్భుతంగా పండించాడు. టోటల్‌గా దువ్వాడ జగన్నాథం సినిమా అల్లు అర్జున్‌కు టైలర్ మేడ్ చిత్రం.


 గ్లామర్‌తో అదరగొట్టిన పూజా హెగ్డే

గ్లామర్‌తో అదరగొట్టిన పూజా హెగ్డే

గ్లామర్ డాల్‌గా పూజా హెగ్డే అదరగొట్టింది. బికినీ సీన్‌లో, పాటల్లో, రొమాంటిక్ సన్నివేశాల్లో అందాల ఆరబోతకు వెనుకాడలేదు. ముద్దు ముచ్చట సమయంలో పూజాలో గ్రేస్ కనిపించింది. అల్లు అర్జున్ లాంటి డ్యాన్సర్ పక్కన పాటల్లో సెప్పులతో ఆకట్టుకొన్నది. టాలీవుడ్‌లో గ్లామర్ స్టార్‌గా రాణించేందుకు దువ్వాడ జగన్నాథం చిత్రం పూజా హెగ్డేకు దోహదపడుతుంది. అందాల తారగా ప్రేక్షకుడి మనసులో నిలిచిపోయే సరకు తనలో ఉందని నిరూపించుకొన్నది.


రొయ్యలనాయుడుగా రావు రమేశ్

రొయ్యలనాయుడుగా రావు రమేశ్

విలన్‌గా రొయ్యలనాయుడుగా (రావు రమేశ్) మరోసారి తన నటనతో ఆకట్టుకొన్నాడు. ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో రావుగోపాలరావును మళ్లీ గుర్తుకు తెచ్చాడు. రావు రమేశ్ ప్రతినాయకుడి పాత్రకు న్యాయం చేకూర్చాడు. వ్యాపార ప్రకటనలకు మోడల్‌గా, వివిధ రకాల గెటప్‌లతో రావు రమేశ్ చక్కటి వినోదాన్ని పంచాడు. తన నటనతో రావు రమేశ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాడు.


హాస్యాన్ని పండించిన వెన్నెల కిషోర్

హాస్యాన్ని పండించిన వెన్నెల కిషోర్

శాస్త్రిగా వెన్నెల కిషోర్‌ మెప్పించాడు. ఈ చిత్రంలో డీజేకు మిత్రుడి పాత్రను పోషించాడు. తన పెళ్లి వేడుకలో వెన్నెల కిషోర్ హాస్యాన్ని పండించిన తీరు ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. పెళ్లి తర్వాత భార్యతో కలతలు, కుటుంబంలో నెలకొన్న సమస్యల్లాంటి బరువైన పాత్రకు హస్యాన్ని మిక్స్ చేసి వెన్నెల కిషోర్ ఆకట్టుకొన్నారు. డీజే తండ్రిగా తనికెళ్ల భరణి, బాబాయ్‌గా చంద్రమోహన్, క్యాటరింగ్‌లోని వివిధ నటులు చక్కటి నటనతో ఆకట్టుకొన్నారు. పూజా హెగ్డే తండ్రిగా, హోమంత్రిగా పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో రాణించాడు.


సుబ్బరాజుకు ఓ రకమైన పిచ్చి

సుబ్బరాజుకు ఓ రకమైన పిచ్చి

డీజే చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సుబ్బరాజు పాత్ర. ఈ చిత్రంలో రొయ్యలనాయుడు కుమారుడిగా నటించాడు. అగ్రి డైమండ్ డబ్బంతా కాజేసి అబుదాబీలో విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ సుబ్బరాజుకు ఓ పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చి ఏంటో తెరమీద చూస్తేనే తెలుస్తుంది. సుబ్బరాజుకు కౌంటర్ ఇచ్చే విధంగా అల్లు అర్జున్ ఆడిన నాటకం ఆసక్తికరంగా సాగింది. క్లైమాక్స్ బాంబుల పేలుళ్ల మోత కాకుండా కామెడీ పటాసులు పేలడం ప్రేక్షకుడిని ఆకట్టుకునే అంశం. దర్శకుడి ప్రయత్నం బాగుంది.


రాకింగ్ రాక్ స్టార్

రాకింగ్ రాక్ స్టార్

రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇక పాటలకు తెరమీద అల్లు అర్జున్, పూజా హెగ్డే పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. కీలక సన్నివేశాల్లో, సెంటిమెంట్ సీన్లలో దేవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. రొమాంటిక్ సన్నివేశాలకు ఆయన అందించిన సంగీతం లైవ్లీగా ఉంది. గుడిలో బడిలో ఒడిలో పాట, సీటీ మార్, మెచ్చుకో పాటలు అలరించాయి.


ఆకట్టుకొన్న అయాంక బోస్ ఫొటోగ్రఫీ

ఆకట్టుకొన్న అయాంక బోస్ ఫొటోగ్రఫీ

ఈ చిత్రంలో అయాంక బోస్ అందించిన ఫొటోగ్రఫీ చాలా బాగుంది. కలర్ ప్యాటర్న్ తెరను అందంగా మార్చేశాయి. పూజా, అల్లు అర్జున్‌ను ఇంతకు ముందు కంటే చాలా స్టయిలీష్‌గా చూపించాడు. ఫొటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది.


దిల్ రాజుకు ప్రత్యేకం..

దిల్ రాజుకు ప్రత్యేకం..

దిల్ రాజుకు దువ్వాడ జగన్నాథం చిత్రం ప్రత్యేకమైనది. నిర్మాతగా మారిన తర్వాత ఈ చిత్రం ఆయనకు 25వది. ముందునుంచే ఈ చిత్ర విజయంపై చాలా కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. హిట్ కావడం ఖాయం.. హిట్ ఏ రేంజో జూన్ 23న తెలుస్తుంది అని చెప్పుకొంటూ వస్తున్నాడు. దిల్ రాజు కెరీర్‌లో మరో సక్సెస్ ఫుల్ చిత్రంగా మారే అవకాశం ఉంది. దిల్ రాజు పొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి.


ఫైనల్‌గా సినిమా ఎలా ఉందంటే..

ఫైనల్‌గా సినిమా ఎలా ఉందంటే..

రివేంజ్ డ్రామా చిత్రాలు తెలుగు తెరమీద ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చాయి. కుంభకోణాలు, ప్రేమ, ఫైట్స్, సెంటిమెంట్, కామెడీ అంశాలను మేలవించిన రూపొందించిన రొటీన్ కథా చిత్రం దువ్వాడ జగన్నాథం. కానీ పాత కథ అయినప్పటికీ.. హాస్యం, ఎంటర్‌టైన్ మెంట్, గ్లామర్, ప్రేక్షకుడికి థ్రిల్ కలిగించే అంశాలు ఎక్కువగానే ఉన్నాయి. మల్టీప్లెక్స్‌లో అర్బన్ ఆడియెన్స్ సందడిగా భారీగానే ఉండే అవకాశం ఉంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చితే బ్లాక్ బస్టర్ అనేది ఖాయం. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంపైనే ఈ సినిమా రేంజ్ ఆధారపడి ఉంది.


బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

పాజిటివ్ పాయింట్స్
స్టైలిష్ స్టార్ నటన, డాన్స్, ఫైట్స్
పూజా హెగ్డే గ్లామర్, డ్యాన్స్
హరీశ్ శంకర్ టేకింగ్
మ్యూజిక్


మైనస్ పాయింట్స్
సెకండాఫ్
రొటీన్ కథతెరవెనుక, తెర ముందు..

తెరవెనుక, తెర ముందు..

నటీనటులుః అల్లు అర్జున్, పూజా హెగ్డే, రావు రమేశ్, తనికెళ్ల భరణి, మురళీశర్మ, వెన్నెల కిషోర్
కథ, మాటలు, దర్శకత్వంః హరీశ్ శంకర్
నిర్మాతః దిల్ రాజు
సంగీతంః దేవీశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీః చోటా కే నాయుడు
ఎడిటర్ః అయాంక బోస్
బ్యానర్ః శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
రిలీజ్ః 23-06-2017English summary
Stylish Star Allu Arjun's Duvvada Jagannadham movie is released on 23 June 2017. This movie director is Gabbar Singh fame Harish Shankar. This movie made under banner of Sri Venkateshwara Films. This cinema is Producer Dil Raju's 25th Venture.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu