twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రీటీన్ కామెడీ ఎంటర్టెనర్ (‘ఈడో రకం...ఆడో రకం’ రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    2.0/5
    హైదరాబాద్: కేసులు లేని లార్ నారాయణ (రాజేంద్రప్రసాద్) కొడుకు అర్జున్ (విష్ణు), ఆస్తులు లేని పోలీసాఫీసర్ కోటేశ్వరరావు (పోసాని కృష్ణమురళి) కొడుకు అశ్విన్ (రాజ్ తరుణ్) ఇద్దరూ క్లోజ్ ప్రెండ్స్. అల్లరి చిల్లరగా తిరేగే వీరికి ఓ పెళ్లిలో నీలవేణి (సోనారిక), సుప్రియ (హేబ పటేల్) పరిచయం అవుతారు. అర్జున్ నీలవేనిని ప్రేమిస్తే... అశ్విన్ సుప్రియని ప్రేమిస్తాడు. అయితే అనాథనే పెళ్లి చేసుకోవాలనే నీలవేని నిర్ణయించుకోవడంతో తాను అనాధను అని చెప్పి ఆమెను ప్రేమలోకి దింపుతాడు అర్జున్. బాగా డబ్బున్న వాన్ని పెళ్లి చేసుకోవాలనేది సుప్రియ కోరిక. అశ్విన్ కూడా సుప్రియకు అబద్దం చెప్పి ప్రేమలో పడేస్తాడు.

    నీలవేణి అన్న గజన్న(అభిమన్యు సింగ్) పెద్ద గుండా. అనుకోని పరిస్థితుల్లో అర్జున్ తన తండ్రికి తెలియకుండనే నీలవేణిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి తర్వాత రౌడీల మధ్య ఉండటం ఇష్టంలేని నీలవేణి వేరు కాపురం పెట్టాలని నిర్ణయించుకుంటుంది. అంతలోనే పేపర్లో నారాయణ వేసిన ఇంటి అద్దె యాడ్ చూసి అతన్ని కలుస్తుంది. ఇల్లు నచ్చడంతో అర్జున్‌కు తెలియకుండానే అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తుంది. తన ఇంట్లోకే తన భార్యతో కలిసి అద్దెకు వెళ్లాల్సి వస్తుంది అర్జున్. తన కుటుంబం విషయం నీలవేణికి తెలీకుండా, తన పెళ్ళి విషయం కుటుంబానికి తెలీకుండా నీలవేణిని అశ్విన్ భార్యగా తన ఇంటివారికి పరిచయం చేస్తాడు అర్జున్. సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే అశ్విన్, సుప్రియలు పెళ్ళి జరుగుతుంది. ఆస్తిపాస్తులు ఉన్న వాడికే తన చెల్లిని ఇచ్చి పెల్లి చేస్తాననే ఉద్దేశ్యంతో ఉన్న దత్తన్న(సుప్రీత్)కు తాను లాయర్ నారాయణ కొడుకును అని అబద్దం చెప్పి సుప్రియను పెళ్లాడతాడు. ఇలా అబద్దాలు చెప్పి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, చివరకు కథ ఎలా సుఖాతం అయింది అనేది తెరపై చూడాల్సిందే.

    పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.... మంచు విష్ణు, రాజ్ తరుణ్ ఇద్దరూ తమ తమ పాత్రల్లో ఇమిడి పోయారు. కామెడీ టైమింగ్, సిక్స్ ప్యాక్ బాడీతో విష్ణు, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో రాజ్ తరుణ్ ఆకట్టుకున్నారు. ఇద్దరి కాంబినేషన్ బాగా సెట్టయింది. హీరోయిన్లు సోనారిక, హెబ్బ పటేల్ గ్లామర్ పరంగా ఆకట్టుకున్నారు. రాజేంద్ర ప్రసాద్, పోసాని తమదైన పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు మరింత ప్లస్సయ్యారు. ఇతర నటీనటులు అభిమన్యు సింగ్, సుప్రీత్, రఘుబాబు, ప్రభాస్ శ్రీను, జబర్దస్త్ శంకర్ వారి వారి పాత్రల మేరకు రాణించారు.

    రోటీన్

    రోటీన్


    అయితే సినిమా కథలో, కథనంలో కొత్తదనం కరువైంది. ఇలాంటి స్టోరీ ఉన్న కథలు, ఇలాంటి స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి.

    ఇదే మైనస్

    ఇదే మైనస్


    కామెడీ సీన్లు, గ్లామర్ డోసుతో సినిమాను ముందుకు నడిపించడానికి ఆసక్తి చూపిన దర్శకుడు సినిమాలోని పాత్రలను పర్ పెక్టుగా మలచలేక పోయాడు. పాత్రల్లో బలం లేక పోవడంతో పేరున్న నటులు చాలా మంది ఉన్న ప్రయోజనం లేకుండా పోయింది. క్లైమాక్స్, యాక్షన్ ఎపిసోడ్ కూడా ఆకట్టుకోలేదు.

    టెక్నికల్ అంశాల పరంగా చూస్తే....

    టెక్నికల్ అంశాల పరంగా చూస్తే....


    సిద్దార్థ్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎకె ఎంటర్టైన్‌మెంట్ నిర్మాణ విలువలు ఓకే. సాయి కార్తీక మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. ఎడిటింగ్ ఫర్వాలేదు.

    కన్ ఫ్యూజన్

    కన్ ఫ్యూజన్


    పంజాబి సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే సినిమాలో కన్ ఫ్యూజన్ చాలా ఎక్కువైంది. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే అంశాలు కూడా లేవు.

    తేలిపోయింది

    తేలిపోయింది


    సినిమాలో కామెడీ ఉన్నా.... కథ, కథనంలో బలం లేక పోవడం, పాత్రల్లో డెప్త్ లేక పోవడంతో తేలిపోయినట్లయింది.

    కామెడీ

    కామెడీ


    కామెడీ సీన్లు, హీరోయిన్ల గ్లామర్ ప్రధానంగా ఫోకస్ చేసారు కాబట్టి యూత్‌‌కు నచ్చితే సినిమా ఆడే అవకాశం ఉంది.

    English summary
    “Eedo Rakam Aado Rakam” is a comedy film featuring Manchu Vishnu, Raj Tarun, Sonarika Bhadoria and Hebah Patel in the lead roles. The film is directed by G. Nageswara Reddy and produced by Ramabrahmam Sunkara under A.K. Entertainments banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X