For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కరెంట్ టాపిక్కే గానీ...(ఈనాడు రివ్యూ)

  By Staff
  |

  Eenadu

  Rating

  బ్యానర్: రాజ్ కమల్ ఇంటర్నేషనల్,యుటీవి
  నటీనటులు: కమల్ హాసన్, వెంకటేష్, లక్ష్మి, గణేష్ వెంకట్రామన్,
  అనూజూ అయ్యర్, పూనం కౌర్, సంతానం తదితరులు.
  సంగీతం: శ్రుతి హాసన్
  కెమెరా: మనోజ్ సోనీ
  డైలాగులు: నీలకంఠ
  దర్శకత్వం: చక్రి తోలేటి
  నిర్మాత: కమల్ హాసన్
  రిలీజ్ డేట్: 18,సెప్టెంబర్ 2009

  ఈనాడు సినిమాపై మొదటి నుంచి రకరకాల అనుమానాలు చోటుచేసుకున్నాయి. కధే స్టార్ గా వచ్చి బాలీవుడ్లో సంచలనం సృష్టించిన ఎ వెడ్నస్ డే రీమేక్ లో పెద్ద స్టార్స్ (వెంకటేష్, కమల్)నటించటం అవసరమా అని చాలా చర్చ జరిగింది. మరో ప్రక్క పాటలు ఉండవు..కమర్షియల్ అంశాలు ఉండవు ఎవరికి నచ్చుతుంది అనే విమర్శలూ చెలరేగాయి.అయితే వీటిన్నటికీ సమర్ధవంతగానే ఈనాడు జవాబు ఇచ్చిందని చెప్పుకోవాలి. వెంకటేష్ నటనతో దానికి ఫుల్ స్టాఫ్ పెట్టారు.మంచి ఓపినింగ్స్ తో రిలీజైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా బి, సి సెంటర్ల కన్నా మల్టీఫ్లెక్స్ ఆడియన్స్ కే ఎక్కువ నచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే కరెంట్ టాపిక్ అయిన టెర్రరిజంపై మరింత అవగాహనను పెంచే సినిమాలు మరిన్ని రావాలని మాత్రం ఈ చిత్రం చెప్తుంది.

  కథలో పోలీస్ కమీషనల్ ఈశ్వర్ ప్రసాద్(వెంకటేష్) కి ఓ గుర్తు తెలియని ఆగంతకుడు(కమల్ హాసన్) నుంచి ఓ బెదిరింపు కాల్ వస్తుంది. తాను ఐదు ఆర్డిక్స్ బాంబులను సిటీలో పెట్టానని...అవి ఆరు గంటలకు పేలుతాయని అంటాడు. దాంతో ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ(లక్ష్మి)కి విషయం తెలియచేసిన ఈశ్వర్ ప్రసాద్ పరిస్ధితిని తన చేతుల్లోకి తీసుకుంటాడు. అతని లక్ష్యాలు రెండు..మెదటిది సిటీని ఆ బాంబు ప్రేలుళ్ళ నుంచి రక్షించటం, రెండు ఆ ఆగంతుకుడు ఎవరో కనుక్కోవటం. ఆ ప్రాసెస్ లో అతని డిమాండ్స్ తెలుసుకుంటాడు. ఆ ఆగంతుకుడు జైల్లో ఉన్న నలుగురు టెర్రరిస్టులును విడిచిపెట్టమంటాడు. వాళ్ళు గోకుల్ చాట్, లుంబనీ పార్క్ బాంబు ప్రేలుళ్ళలకు కారకులు. దానికి అంగీకరించిన ఈశ్వర్ ప్రసాద్ వారిని ఆ ఆగంతుకుడు చెప్పిన చోటకి పంపుతాడు. అప్పుడు ఏం జరిగింది. ఈశ్వర్ ప్రసాద్ తన మిషన్ లో ఎలా సక్సెస్ అయ్యాడు అన్నదే మిగతా కథ.

  ఇక చిత్రంలో వెంకటేష్ నటనే రిలీఫ్ ఇచ్చే అంశం. ఇంతకు ముందు ఘర్షణలో ఎట్లా పోలీస్ ఆఫీసర్ గా వెంకటేష్ అదరకొట్టాడే అంతకుమించిన మెచ్యూరిటీతో సీరియస్ నెస్ తో పాత్రలో లీనమై పండించారు. తన స్టార్ హీరో ఇమేజ్ ని సైతం ప్రక్కన పెట్టి ఈ చిత్రంలో నటించినందుకు వెంకటేష్ ని అ భినందించాలి. ఇక కమల్ ఎప్పట్లాగా తన నటన విశ్వరూపం చూపారు కానీ..ఎ వెడ్నస్ డే చూసిన వారికి మాత్రం నసీరుద్దీన్ షానే ఓ సామాన్యుడుగా నమ్మించారనిపిస్తుంది. అయితే అది చూడని వారికి కమల్ బాగానే అనిపిస్తాడు. కానీ కమల్ అనేసరికి చాలా ఎక్సపెక్టేషన్ తో వచ్చేవారికి మాత్రం నిరాశపరుస్తాడు. ఇక మిగతా పాత్రల్లో గణేష్ వెంకట్రామన్, భరత్ రెడ్డి, లక్ష్మి బాగానే చేసారు.

  ఇక దర్శకుడుగా చక్రి తోలేటి మొదటి సినిమా అయినా పరిణితి ఉన్న దర్శకుడుగా ఎక్కడా తడపడకుండా తెరకెక్కించాడు. టెక్నికల్ గా ఈ చిత్రం రెడ్ ఒన్ డిజిటల్ కెమెరాతో తీసిన తొలి తెలుగు చిత్రం కావటం విశేషం. అలాగే ఆ అవుట్ పుట్ బాగుంది. నీలకంఠ డైలాగులు క్రిస్ప్ గా ఉన్నాయి. శ్రుతి హాసన్ సంగీతం అంత గొప్పగా అనిపించదు. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే బావుండనిపిస్తుంది.

  ఏదైమైనా ఎ వెడ్నస్ డే చిత్రాన్ని మైండులో పెట్టుకుని వెళ్లిన వారికి ఈ సినిమా అంత గొప్పగా అనిపించదు. అదే మొదటిసారి ఈ సినిమా గురించి ఏమీ (ట్విస్ట్) తెలియకుండా వెళ్ళిన వారికి బాగుందనిపిస్తుంది. అయితే వెంకటేష్ నుంచి రెగ్యులర్ కమర్షియల్ అంశాలు ఆశించి వెళ్తే మాత్రం మింగుడుపడదు. అయితే కృష్ణ నటించిన ఈనాడు అంత సంచలనం మాత్రం సృష్టించే అవకాశం లేదనేది మాత్రం సుస్పష్టం.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X