For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  అమ్మాయితో మరో అమ్మాయి ప్రేమలో పడితే: ఏక్ లడ్కీ కో దేఖాతో.. మూవీ రివ్యూ

  |

  Rating:
  2.5/5
  Star Cast: అనిల్ కపూర్, జుహీ చావ్లా, సోనమ్ కపూర్, రాజ్‌కుమార్ రావు, రెజీనా కసండ్రా
  Director: షెల్లీ చోప్రా ధార్

  ప్రస్తుత పరిస్థితులను ఆధారంగా చేసుకొని బాలీవుడ్‌‌‌లో విభిన్నమైన కథలతో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. న్యూ ఏజ్ స్టోరి అనే పేరుతో 'దోస్తానా', 'విక్కీ డోనర్' నుంచి మొన్నటి 'వీర్ ది వెడ్డింగ్' వరకు వచ్చిన సినిమాలు సంప్రదాయ సినిమా గోడలను బద్దలు కొట్టినట్టు అనిపించాయి. ప్రేక్షకుల నుంచి కూడా అలాంటి సినిమాలకు ఆదరణ లభించడంతో రెగ్యులర్ కథలను పక్కకు నెట్టి కొత్తదనంతో పేరుతో విలక్షణమైన కథలో ప్రయోగాలు చేస్తున్నారు.

  అలాంటి క్రమంలోనే వచ్చిన చిత్రం ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా. త్రి ఇడియట్, పీకే, సంజూ లాంటి చిత్రాలను నిర్మించిన విదు వినోద్ చోప్రా రూపొందించిన ఈ చిత్రంలో అనిల్ కపూర్, జుహీచావ్లా, సోనమ్ కపూర్, రెజీనా కసండ్రా, రాజ్ కుమార్ రావు ప్రధాన భూమికలు పోషించారు. విడుదలకు ముందే ప్రత్యేక దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఫిబ్రవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ అమ్మాయి మరో అమ్మాయి ప్రేమలో పడిన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకోవాలంటే సినిమా కథ ఏంటో తెలుసుకోవాల్సిందే.

  ఏక్ లడ్కీ కో దేఖా.. సినిమా స్టోరి

  పంజాబ్‌లో సంప్రదాయ కుటుంబానికి చెందిన వ్యాపారవేత్త (అనిల్ కపూర్) కుమార్తె స్వీటి చౌదరీ (సోనమ్ కపూర్). ఆమె చిన్నతనం నుంచే అబ్బాయిల కంటే అమ్మాయిల ఆకర్షణకే లోనవుతుంది. తన స్నేహితురాలికి తన ప్రేమను వ్యక్తం చేసే క్రమంలో ఓ షాక్ తగులుతుంది. అప్పటి నుంచి అమ్మాయి ప్రేమ కోసమే పరితిపిస్తుంటుంది. అలాంటి సమయంలో కుహు (రెజీనా కసండ్రా) అనే ఎన్నారైతో ప్రేమలో పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో నాటకలంటే పిచ్చి ఉన్న దర్శకుడు సాహిల్ మీర్జా అనే ముస్లిం (రాజ్‌కుమార్)తో అనుకోకుండా పరిచయం జరుగుతుంది. ఒకానొక సమయంలో తన సమస్యను సాహిల్‌కు చెప్పడంతో కథ కొత్త మలుపుతిరుగుంది. కానీ ముస్లిం మతానికి చెందిన మిర్జాతో ప్రేమలో పడి తమ సంప్రదాయాలను బ్రష్టుపట్టిస్తుందనే తప్పుడు భావనలో స్వీటి కుటుంబం ఉంటుంది. ఈ నేపథ్యంలో దాంతో కుహు, స్వీటీలను కలిపేందుకు సాహిల్ ప్లాన్ వేస్తాడు?

  స్టోరీలో ట్విస్టులు

  స్వీటి, కుహులను కలిపేందుకు వేసిన ప్లాన్ వర్కవుట్ అయిందా? స్వీటి, కుహుల ప్రేమ కథ తెలుసుకొన్న పంజాబీ కుటుంబం ఎలా స్పందించింది. సంప్రదాయ కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఉన్న ప్రేమను సమాజం అంగీకరించిందా? నాటక రంగ దర్శకుడు సాహిల్ అసలు లక్ష్యం ఏమిటి? ఈ కథలో జుహీ చావ్లా పాత్ర ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా సినిమా కథ.

  తొలిభాగంలో

  తొలిభాగంలో పంజాబీ కుటుంబంలో ఉండే సంప్రదాయలు, కట్టుబాట్లును ఎస్టాబ్లిష్ చేసే నేపథ్యంలో సినిమా నింపాదిగా సాగుతుంది. మరో పక్క ఓ సినీ నిర్మాత కొడుకైన రాజ్ కుమార్ రావు (సాహిల్) సినీ రంగాన్ని వదిలేసి నాటక రంగంపై మక్కువ చూపే అంశాలతో కథ సాగుతుంది. తొలి భాగంలో క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేయడం కోసమే చాలా సమయం తీసుకోవడంతో కథ నత్తనడక నడిచినట్టు అనిపిస్తుంది. సన్నివేశాలు పేలవంగా ఉండటం సినిమా మరింత నిస్సారంగా సాగినట్టు కనిపిస్తుంది. ఇంటర్వెల్‌లో సోనమ్ కపూర్ (స్వీటి) రెజీనా (కుహు)తో తన ప్రేమకథను వెల్లడించడంతో తొలిభాగం ముగుస్తుంది.

  రెండో భాగంలో

  రెండో భాగంలో అసలు కథ, భావోద్వేగాలు కనిపిస్తాయి. సోనమ్ కపూర్, రెజీనాల ప్రేమ కథ తెర మీద అసహజంగా అనిపించినా.. పాత్రల్లో కనిపించే వైవిధ్యమైన నటన సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. కూతురు స్వలింగ ప్రేమను తెలుసుకొన్న తండ్రిగా అనిల్ కపూర్ నటన, ఇద్దరు ప్రేమికులను కలిపే పాత్రలో రాజ్‌కుమార్ యాక్టింగ్, జుహీ చావ్లా సున్నితమైన హాస్యం సినిమాపై కొంత సానుకూలమైన అభిప్రాయాన్ని కలిగించడానికి దోహదపడుతాయి. చివర్లో నాటకం ద్వారా ఇద్దరు స్వలింగ ప్రేమికులను కలిపే అంశం ప్రేక్షకులను మెప్పించేలా సాగుతుంది.

  దర్శకురాలి ప్రతిభ

  మహిళా దర్శకురాలు షేల్లీ ధార్ చోప్రా ఏక్ లడ్కీ ఖో దేఖాతో ఐసా లగా సినిమాను తెరకెక్కించారు. సంప్రదాయ కుటంబానికి చెందిన అమ్మాయి ప్రకృతికి విరుద్ధంగా అమ్మాయితోనే ప్రేమలో పడే అంశాన్ని షెల్లీ చోప్రా కథగా ఎంచుకోవడం కత్తి మీద సామే అనిపిస్తుంది. కాకపోతే కథనం బాగా వీక్‌గా ఉండటం, పాత్రల మధ్య సంబంధాలు కృత్రిమంగా చిత్రీకరించడం దర్శకురాలిగా షెల్లీ లోపం కనిపిస్తుంది. సంప్రదాయాలకు సత్యదూరంగా ఉండే కథను కన్విన్సింగ్ చెప్పడంలో తడబాటు కనిపిస్తుంది.

  సోనమ్, రెజీనా పాత్రలు

  సినిమా కథంతా తన చుట్టు తిరిగే పాత్రలో సోనమ్ కపూర్ నటించింది. స్వీటి పాత్రను మరోస్థాయి తీసుకుపోలేకపోయిందనే చెప్పవచ్చు. సమాజ కట్టుబాట్లకు దూరంగా ఉన్న పాత్రలో పూర్తిగా ఒదిగిపోయినట్టు ఎక్కడా కనిపించదు. ఈ సినిమాకు అదే ప్రధాన లోపం. ఇక రెజీనా పాత్ర అతిథి పాత్ర కంటే కొంత మిన్నగా ఉంటుంది. నటనకు స్కోప్ లేని పాత్రలో రెజీనా కనిపించింది.

  రాజ్‌కుమార్ రావు నటన

  నాటక రంగ దర్శకుడిగా రాజ్ కుమార్ రావు మరో వైవిధ్యమైన పాత్రలో నటించాడు. పాత్రకు సంబంధించి కొన్ని లోపాలు ఉన్నప్పటికీ వాటిని తన నటనతో రాజ్ కుమార్ రావు కప్పిపుచ్చే ప్రయత్నం అభినందనీయం. తల్లిదండ్రులు భావోద్వేగాలకు మధ్య, అప్పుడే పరిచయమైన ఓ అమ్మాయి సమస్యను భుజాన వేసుకన్న యువకుడి పాత్రలో మెప్పించాడనే చెప్పవచ్చు.

  అనిల్ కపూర్, జుహీ చావ్లా జంట..

  ఇక ఈ చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన జోడి అనిల్ కపూర్, జుహీ చావ్లాది. భార్యను కోల్పోయిన పారిశ్రామిక వేత్తగా, వంట చేయడం అమితమైన ఇష్టం ఉన్న వ్యక్తిగా, విచిత్రమైన సమస్యలో కూరుకుపోయిన కూతురు తండ్రిగా పలు రకాలు ఉన్న షేడ్స్‌లో కనిపించాడు. తన పాత్ర పరిధిమేరకు ఫర్వాలేదనిపిస్తాడు. ఇక విడాకులు పొందిన మహిళగా, నటన అంటే పిచ్చి ఉన్న పాత్రలో జుహీ చావ్లా నటించారు. అనిల్, జుహీ మధ్య సున్నితమైన హాస్య సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి.

  మ్యూజిక్, ఇతర అంశాలు

  రోచక్ కోహ్లీ అందించిన సంగీతం కొంత మేరకు పర్వాలేదనిస్తుంది. రెండు పాటలు మంచి పంజాబీ బీట్‌తో సాగుతాయి. ఎడిటింగ్‌కు తొలిభాగంలో ఇంకా స్కోప్ ఉంది. సినిమాటోగ్రఫి విషయానికి వస్తే అంతగా ఆకట్టుకొనే పనితనం కనిపించదు. సాంకేతిక అంశాలు విషయాన్ని పరిశీలిస్తే యావరేజ్‌గానే ఉంటాయి.

  నిర్మాణ విలువలు

  విధు వినోద్ చోప్రా నిర్మాతగా సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉంటాయి. నిర్మాణ, సాంకేతిక అంశాలు, కథా, కథనాల పరంగా ఉత్తమ ప్రమాణాలను ఆశిస్తారు. అలాంటివి ఈ సినిమాలో పెద్దగా కనిపించవు. పేలవమైన కథతో సినిమా చాలా నత్తనడకగా నడుస్తుంది. ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా చిత్రం విధు వినోద్ ఫిలింస్ బ్యానర్ స్థాయికి తగినట్టుగా లేకపోవడం గమనార్హం. సినిమాను నాసిరకంగా చుట్టేసినట్టు కనిపిస్తుంది.

  ఫైనల్‌గా

  సంప్రదాయ సినిమా కథలకు, ప్రేక్షకుల అభిరుచికి దూరంగా రూపొందించిన బోల్డ్ చిత్రం ఏక్ లడ్కీ ఖో దేఖాతో ఐసా లగా. కథ బలహీనంగా ఉండటం, కథనం మరింత పేలవంగా ఉండటం సినిమాకు మైనస్. ప్రయోగాత్మక చిత్రమైనప్పటికీ రెగ్యులర్ సినిమా ప్రేక్షకులకు మింగుడు పడని సినిమా అనిచెప్పవచ్చు. సమాజ పోకడలకు దూరంగా ఉండే సినిమాపై ప్రేక్షకులు సానుకూలంగా స్పందిస్తే విజయం సొంతమయ్యే పరిస్థితి కనిపిస్తుంది.

  బలం, బలహీనతలు

  నటీనటులు ఫెర్ఫార్మెన్స్
  మ్యూజిక్

  మైనస్ పాయింట్స్
  కథ, కథనాలు
  సినిమాటోగ్రఫి
  నిర్మాణ విలువలు

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: అనిల్ కపూర్, జుహీ చావ్లా, సోనమ్ కపూర్, రాజ్‌కుమార్ రావు, రెజీనా కసండ్రా తదితరులు
  కథ, దర్శకత్వం: షెల్లీ చోప్రా ధార్
  నిర్మాత: విధు వినోద్ చోప్రా
  మ్యూజిక్‌: రోచక్ కోహ్లీ
  సినిమాటోగ్రఫి: హిమాన్ ధమిజా
  ఎడిటింగ్: అశీష్ సూర్యవంశీ
  ప్రొడక్షన్: విధు చోప్రా ఫిలింస్
  రిలీజ్: 2019-02-01

  English summary
  Ek Ladki Ko Dekha Toh Aisa Laga film directed by Shelly Chopra Dhar. The tagline as shown on the released film trailer and poster is 'The most unexpected romance of the year'. It stars Anil Kapoor, Juhi Chawla , Sonam Kapoor and Rajkummar Rao, and also features Akshay Oberoi, Regina Cassandra, Brijendra Kala and Madhumalti Kapoor in supporting roles. Produced by Vinod Chopra Films and distributed by Fox Star Studios, the film was released on 1 February 2019.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more