For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాక్ నిరంజన్ (రివ్యూ)

  By Srikanya
  |

  EK Niranjan

  Rating

  -సూర్య ప్రకాష్ జోశ్యుల
  సంస్థ: ఆదిత్యరామ్‌ మూవీస్‌
  నటీనటులు: ప్రభాస్‌, కంగనా రనౌత్‌, తనికెళ్ళ భరణి, సంగీత,
  మకరంద్‌ దేశ్‌పాండే, సోనూసూద్‌, ముకుల్‌దేవ్‌, బ్రహ్మానందం, అలీ తదితరులు.
  సంగీతం: మణి శర్మ
  ఎడిటింగ్: ఎమ్.ఆర్.వర్మ
  ఆర్ట్: చిన్నా
  కెమెరా: శ్యామ్.కె.నాయుడు
  యాక్షన్: స్టన్ శివ, పీటర్ హెయిన్స్
  కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌
  నిర్మాత: ఆదిత్యరామ్‌
  రిలీజ్ తేది: అక్టోబర్ 29,2009

  ప్రభాస్, పూరీ కాంబినేషన్ రిపీట్ అనగానే ఈసారి గ్యారెంటీగా బుజ్జిగాడు లాంటి సహన పరీక్ష పెట్టే సినిమా రాదని ఆశిస్తాం...నమ్ముతాం. అయితే పూరీ అటువంటిదేమీ పెట్టుకున్నట్లు లేరు..స్క్ర్రిప్టుని ప్రక్కన పెట్టి కేవలం డైలాగులను, పాటలను నమ్ముకుని ఏక్ నిరంజన్ అంటూ వదిలాడు. దాంతో ఫస్టాఫ్ ఫరవాలేదనిపించినా సెకెండాఫ్ కష్టమనిపించింది. అందులోనూ కంగనా రౌనత్ ఇక్కడ మన నేటివిటికీ బాగా దూరం అనిపిస్తూ..రొమాన్స్ ని ఎంజాయ్ చేయలేని స్దితికి తెచ్చింది. ఇక పూరీ రెగ్యులర్ ప్లస్ పాయింట్ అయిన కామెడీ పండకపోవటం మరో మైనస్ అయి నిలిచింది. దాంతో బి, సి సెంటర్లను టార్గెట్ చేసిన ఈ చిత్రం అక్కడయినా వర్కవుట్ అవటం కష్టంలా మారింది.

  ఛోటు(ప్రభాస్)చిన్నతనంలోనే ముస్టి మాఫియా వల్ల తల్లి తండ్రులకు దూరం అవుతాడు. అయితే ధైర్యం గల ఛోటూ తనని ఎత్తుకొచ్చినవాడిని పోలీసులకు పట్టిచ్చి పోలీసుల మన్ననలు పొందుతాడు. దాంతో అప్పటినుంచీ..తనని బౌంటీ హంటర్ గా చెప్పుకుంటూంటూ క్రిమినల్స్ ని పోలీసులకు పట్టిస్తూ..డబ్బు సంపాదించుకుంటూంటాడు. ఈ క్రమంలో అతనికి ఓ క్రిమినల్ చెల్లి సమీరా(కంగనా)పరిచయమై..ప్రేమగా మారుతుంది. ఆమె ఓ గిటార్ టీచర్. ఈలోగా కథను వేడెక్కించటానికి లోకల్ దాదా జానీభాయ్(సోనూ సూద్)ఓ మినిస్టర్ ని చంపటానికి కాంట్రాక్ట్ ఒప్పుకుని పూర్తి చేస్తాడు. ఆ కాంట్రాక్ట్ ఫినిష్ చేసింది మరెవరో కాదు జానీ బాయ్ మనిషి.. ఛోటూ సొంత అన్న. అది తెలియని ఛోటూ అతన్ని పట్టుకోవటానికి పోలీసుల దగ్గర నుండి పని ఒప్పుకుంటాడు.అప్పుడేం జరిగింది.అతను తన సొంత తల్లి తండ్రులను కలుసుకున్నాడా..జానీ భాయ్ ని ఎలా అంతమొందించాడు అన్నది తెరపై చూడాల్సిందే.

  పూరీ సినిమాలు కంటెన్యూగా చూస్తున్న వారికి ప్రభాస్ క్యారెక్టర్ కొత్తగా అనిపించదు..అలాగే పూరీ పంచ్ డైలాగులుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సోనూసూద్,బ్రహ్మాజి మద్య జరిగే సంభాషణలుకు క్లాప్స్ పడ్డాయి. ఇక కథలో హీరో బౌంటీ హంటర్ గా పరిచయం చేస్తారు. మనకు ఇన్ఫార్మర్ల వ్యవస్ధ ఉంది కానీ మరీ బౌంటీ హంటర్ లు లేకపోవటం తో నేచురాలటికీ దూరంగా అనిపించి ఐడెండిటి దొరకదు. అలాగే సత్యప్రకాష్ ని క్రూడ్ పోలీస్ ఆపీసర్ గా చూపటం కేవలం ఇంటర్వెల్ బ్యాంగ్ కోసమే కావటం..ఆ తర్వాత ఆ ట్రాకే వదిలేయటం జరిగింది. అంతేగాక హీరోయిన్ అన్నయ్య పాత్రను క్రిమినల్ గా చూపి ఆ తర్వాత సెకెండాప్ లో అతను మంచివాడన్నట్లు చూపటం ట్విస్ట్ గా ఓకే గానీ జస్టిఫై అనిపించుకోదు. పోనీ ట్విస్ట్ గా భావించినా అది హీరో కి కాకపోవటంతో పెద్దగా పండలేదు. అన్నటికన్నా ముఖ్యంగా హీరో ప్యాసివ్ గా ఉంటాడు. జై చిరంజీవాలో మాదిరి బ్యాంకాక్ పారిపోయిన క్రిమినల్ ని అక్కడికి వెళ్లి పట్టుకుని వచ్చేస్తాడు. ఈ క్రమంలో ఎక్కడా అతనికి సమస్యలు ఎదురుకావు. ఎత్తుకు పై ఎత్తులు అసలు ఉండవు. దాంతో ఆ ఎపిసోడ్ పూర్తి స్ధాయి బోర్ వచ్చేస్తుంది. ఇక కామిడీ కోసం పెట్టిన అలీ,బ్రహ్మానందం ట్రాక్ ఎక్కడా చిన్నపాటి నవ్వు తెప్పించదు.ఉన్నంతలో పోసాని కృష్ణ మురళి కన్నింగ్ రాజకీయనాయకుడుగా ఉన్న కాసేపు ఎంగేజ్ చేస్తాడు. ఇక మీ అమ్మా నాన్న ఎవరో నాకు తెలుసు అంటూ హీరోని బ్లాక్ మెయిల్ చేసే దేశ్ పాండే పాత్ర కొదమసింహం చిత్రంలో మోహన్ బాబు సుడిగాలి పాత్రను గుర్తు చేస్తూ..ఇంకా ఇలాంటి పాత్రలు పెడుతున్నారా అని నవ్వు తెప్పింస్తుంది.

  మిగతా విభాగాల్లో మణిశర్మ ఈ సినిమాకు పెద్ద ప్లస్. అమ్మా లేరు..నాన్నా లేరు అనే టైటిల్ సాంగ్ జనాల్ని ధియోటర్ కి లాక్కు వచ్చిందంటే అతిశయోక్తి కాదు.ఇక కెమెరా శ్యామ్ కె.నాయుడు కి వంక పెట్టాల్సిన పనిలేదు. ఫస్టాఫ్ ఆ మాత్ర అయినా బాగుంది అనిపించి అంటే షార్ప్ ఎడిటింగే కారణం.దర్శకత్వపరంగా పూరీ ఎప్పటిలాగే ఫైట్స్ లో, పంచ్ డైలాగుల్లో తనదైన ముద్ర చూపించే ప్రయత్నం చేసారు. అయితే కథను బలవంతంగా బ్యాంకాక్ పంపిచటం మాత్రం కొంచెం విసుగ్గానే ఉంటుంది.ఇక నటీనటుల్లో ఉన్నంతలో ప్రభాస్ బాగా చేసాడు. అలానే విలన్ పాత్ర వేసిన సోనూసూద్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

  ఏదైమైనా పూరీ మరో సారి పూర్తిగా నిరాశపరిచిన చిత్రం ఇది. ఆయన కొద్ది కాలం పూర్తి స్దాయి స్క్రిప్టుపై కష్టపడి ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక ప్రబాస్ అభిమానులుకు ఆ ఫైట్స్, డైలాగ్ డెలివిరీ నచ్చి ఆదరించాలేమో గానీ లేకపోతే కష్టమే. టైటిల్, టైటిల్ సాంగ్ చూసి ధియోటర్లోకి దూరితే కష్టమేననిపిస్తుంది.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X