For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎవ్వరికీ చెప్పొద్దు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

|

Rating: 2.5/5

కులం, మతాలు మానవ సంబంధాలకే కాదు.. అన్ని రకాల పురోగతికి అడ్డుగా మారుతుందనే విమర్శ ఎప్పుడూ వినిపిస్తుంటుంది. కులమనేది ఎన్నో పరువు హత్యలకు దారి తీస్తున్న విషయాలు నిత్యం వార్తల్లో కనిపిస్తాయి. తమ కులం వాడు కాదనే ఒకే ఒక విషయంతో మానవ సంబంధాలను కాలరాస్తున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో కులం అనే అంశాన్ని ప్రధానంగా చేసుకొని వచ్చిన చిత్రం ఎవ్వరికీ చెప్పొద్దు. హరి, హరిత అనే యువతి, యువకుల ప్రేమకు కులం ఎలా అడ్డంకిగా మారిందనేది ఈ సినిమా కథాంశం.

ఎవ్వరికీ చెప్పొద్దు కథ..

ఎవ్వరికీ చెప్పొద్దు కథ..

ప్రాణానికి కంటే కులాన్ని ఎక్కువ ప్రేమించే దుర్గాప్రసాద్ (వంశీ నెక్కంటి) కూతురు హరిత (గార్గేయి ఎల్లాప్రగడ). ఓ కారణంగా తమ కులం వారితోనే ఉండాలని కూతురుకు హిత బోధ చేస్తుంటాడు. కట్టడి మధ్య తన కూతురును పెంచుతూ నిత్యం పర్యవేక్షణలో ఉంటాడు. ఈ క్రమంలో తన కులం కాని యువకుడు హరి (రాకేష్ వర్రె)కు దగ్గరవుతుంది. అతని పరిచయం ప్రేమగా మారుతుంది. ఆ క్రమంలో హరిత తండ్రి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెడుతాడు.

ఎవ్వరికీ చెప్పొద్దు కథలో ట్విస్టులు

ఎవ్వరికీ చెప్పొద్దు కథలో ట్విస్టులు

తండ్రి కులం పట్టింపు వల్ల హరితకు ఎలాంటి సమస్యలు ఏర్పడ్డాయి. హరి, హరితకు ప్రేమకు కులం అడ్డంకిగా మారిందా? దుర్గా ప్రసాద్‌కు ఉన్న కులం పిచ్చి అతడికి ఎలాంటి ఇబ్బందలకు గురిచేసింది? ఇలాంటి ఇక్కట్ల మధ్య చివరకు హరి, హరిత కులాంతర వివాహం జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఎవ్వరికీ చెప్పొద్దు సినిమా కథ.

ఫస్టాఫ్‌ అనాలిసిస్

ఫస్టాఫ్‌ అనాలిసిస్

ఎవరికీ చెప్పొద్దు చిత్రంలో బలం, బలహీనత నూతన నటీనటులే. అసలు తెలిసినా ముఖం ఒక్కటి లేకున్నా ప్రేక్షకుడిని చివర వరకు కూర్చొపెట్టడం బలం అని చెప్పవచ్చు. ఇక ఇలాంటి ఫీల్‌గుడ్ కథకు కాస్తా థియేటర్‌కు ప్రేక్షకుడిని నటీనటులు ఉంటే బాగుండేదని ఓ బలహీనతగా చెప్పవచ్చు. ఇక తొలిభాగం సన్నివేశాలు, కొత్త నటీనటుల ఫెర్ఫార్మెన్స్‌తోనే చకచకా ముగుస్తుంది. కడుపుబ్బా నవ్వించే హాస్యం లేకపోయినా పెదవి మీద చిరునవ్వు తెప్పించే అక్కడకక్కడా సన్నివేశాలు ఉంటాయి. ఓ ఫ్రెష్‌గా ఉండే సీన్లు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి.

సెకండాఫ్ అనాలిసిస్

సెకండాఫ్ అనాలిసిస్

ఇక రెండోభాగంలో కథలో పెద్దగా విషయం లేకపోవడం వల్ల ప్రీ క్లైమాక్స్ వరకు సినిమాను సాగదీశారనిపిస్తుంది. ఇక కథలో దుర్గా ప్రసాద్ కుల ప్రస్తావన అనే అంశం సినిమాను మరోమెట్టు ఎక్కించినట్టు కనిపిస్తుంది. అక్కడ నుంచి కథ చాలా ఫాస్ట్‌గా ముందుకెళ్తుంది. అశ్లీలత, అసభ్యత, బూతు డైలాగులు మచ్చుకు కూడా కనిపించకుండా సినిమా ఉండటం ఫ్యామిలీ ఆడియెన్స్ నచ్చేలా చేస్తుంది.ఎలాంటి ట్విస్టులు లేకుండా సినిమాను సాదాసీదాగా ఫీల్‌గుడ్ అంశాలతో సినిమాను ముగించడం రిలీఫ్‌గా అనిపిస్తుంది. తండ్రి క్యారెక్టర్‌ను కూతురు ప్రశ్నించే అంశం సినిమాకు బలంగా మారింది.

నటీనటులు యాక్టింగ్, ఫెర్ఫార్మెన్స్

నటీనటులు యాక్టింగ్, ఫెర్ఫార్మెన్స్

సినిమా తెరకు కొత్తగా పరిచయమైన రాకేశ్ వర్రె, గార్గేయి ఎల్లా ప్రగడ నటన, ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకొంటాయి. కొత్తవారైనా పాత్రల్లో దూరిపోయి చూపించిన మెచ్యురిటీ అలరిస్తుంది. ఎంతో అనుభవం ఉన్న హీరో, హీరోయిన్లుగా నటించారని చెప్పవచ్చు. ఇక తండ్రిగా దుర్గా ప్రసాద్‌ పాత్రలో వంశీ నెక్కంటి ఒదిగిపోయాడు. ఆ పాత్రకు సహజత్వం తెచ్చిపెట్టడం సినిమాకు ఓ పాజిటివ్ పాయింట్‌గా చెప్పవచ్చు. మిగితా పాత్రలన్నీ సినిమాకు ఎనర్జీని తెచ్చిపెట్టాయి.

సాంకేతిక విభాగాల పనితీరు

సాంకేతిక విభాగాల పనితీరు

సాంకేతిక విభాగాల్లో దర్శకుడిగా, ఎడిటర్‌గా బసవ శంకర్ రాసుకొన్న కథ, కథనం ప్రేక్షకుడిని మెప్పిస్తాయి. కాకపోతే సెకండాఫ్‌లో కథను సాగదీయకుండా చకచకా ముగించేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. ఓవరాల్‌లా అనుభవం లేని నటీనటులు, బడ్జెట్ పరిమితితో సినిమాను తీసి మెప్పించిన బసవ శంకర్ మంచి మార్కులే కొట్టేశారు. శంకర్ శర్మ మ్యూజిక్ బాగుంది. ఆయన రీరికార్డింగ్ సన్నివేశాలకు బలంగా మారింది. విజయ్ జే ఆనంద్ సినిమాటోగ్రఫి సూపర్‌గా ఉంది. పాటలను చాలా చక్కగా చిత్రీకరించాడు.

నిర్మాణ విలువలు

నిర్మాణ విలువలు

ఎవ్వరికీ చెప్పొద్దు సినిమాకు హీరోగానే కాకుండా నిర్మాతగా మారాడు రాకేశ్ వర్రె. కథ, కథనాలపై నమ్మకంతోనే బహుశా ఈ సహసానికి పూనుకొన్నాడని అనిపిస్తుంది. ఇక చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణం పరంగా ఎక్కడా రాజీ కనిపించదు. నటన, నిర్మాణ సారథ్యంతో రాకేశ్ సినిమాను రిచ్‌గా మలిచాడని చెప్పవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఓ క్లీన్ సినిమాను ప్రేక్షకుడు చూడటానికి అవకాశం లభిస్తుంది.

English summary
Evarikee cheppoddu movie based on caste differences. New actors takes this story forward with perfectness. Rakesh Varre, Gargeyi Yellapragada, Vamsi Nekkanti steal the story.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more