twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Freddy movie OTT Review.. జస్ట్ ఫర్ కార్తీక్ ఆర్యన్ ఫెర్ఫార్మెన్స్.. క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

    |

    Rating: 2.5/5

    నటీనటులు: కార్తీక్ ఆర్యన్, ఆలయా ఎఫ్, కరణ్ పండిట్ తదితరులు
    దర్శకత్వం: శశాంక ఘోష్
    నిర్మాతలు: శోభా కపూర్, ఏక్తా కపూర్, జయ్ షెవక్రమణి, నరేంద్ర హిరావత్, శ్రేయాంశ్ హిరావత్
    మ్యూజిక్ ఢైరెక్టర్: క్లింటన్ సెరేజో
    సినిమాటోగ్రఫి: అయంకా బోస్
    ఎడిటింగ్: చందన్ అరోరా
    బ్యానర్: బాలాజీ మోషన్ పిక్చర్స్
    ఓటీటీ రిలీజ్: డిస్నీ+హాట్ స్టార్
    ఓటీటీ రిలీజ్ డేట్: డిసెంబర్ 2, 2022

    ఫ్రెడ్డీ జిన్‌వాలా (ఆర్యన్ కార్తీక్) ముంబైలో దంతవైద్యుడు. అయితే ఇతరులతో ఎక్కువ కలిసే, మాట్లాడేందుకు ఇష్టపడడు. తన జీవితంలో చాలా మంది అమ్మాయిలతో డేటింగ్‌ చేస్తాడు కానీ ఎవరితో కూడా లాంగ్ రిలేషన్ ఏర్పడదు. అలాంటి పరిస్థితుల్లో తన వద్ద ట్రీట్‌మెంట్‌కు వచ్చిన కైనాజ్ ఇరానీ (అలయ ఎఫ్) అనే వివాహితతో ప్రేమలో పడుతాడు. అయితే కైనాజ్‌ను తన భర్త రుస్తుం శారీరకంగా వేధిస్తుంటాడు. అయితే కైనాజ్‌పై ప్రేమ కారణంగా రుస్తుంను చంపాలని డిసైడ్ అవుతాడు.

    Freddy movie OTT Review and Rating: just for Karthik Aryans performance only

    ఫ్రెడ్డీ తన జీవితంలో ఒంటరిగా ఎందుకు గడుపుతుంటాడు? ఫ్రెడ్లీ బాల్యంలో జరిగిన సంఘటనలు ఆయనపై ఎలాంటి ప్రభావం చూపాయి. వివాహిత కైనాజ్‌ను ఎందుకు ప్రేమించాడు. కైనాజ్ ప్రేమ కోసం ఆమె భర్త రుస్తుంను ఎందుకు చంపాలనుకొన్నాడు? రుస్తుంను ఫ్రెడ్డీ చంపిన తర్వాత జరిగిన సంఘటనలు ఏమిటి? పీకల్లోతు ప్రేమలో ఉన్న ఫ్రెడ్డీని కైనాజ్ ఎలా మోసం చేసింది? తనను మోసం చేసిన కైనాజ్‌కు ఫ్రెడ్డీ ఎలాంటి గుణపాఠం నేర్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఫ్రెడ్డీ సినిమా కథ.

    దర్శకుడు శశాంక ఘోష్ ఎంచుకొన్న క్రైమ్ థ్రిల్లర్ పాయింట్ బాగుంది. కానీ రెగ్యులర్ కథ, రొటీన్ కథనంతో సాగుతుంది. అయితే కొన్ని సీన్లను చాలా ఎమోషనల్‌గా రాసుకోవడమే కాకుండా తెరపైన కూడా బాగా చూపించాడు. ఫ్రెడ్డీగా కార్తీక్ ఆర్యన్‌ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయడం ఈ సినిమాకు కొత్తదనంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న కార్తీక్ ఆర్యన్‌ను.. ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో చూపించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే కథలో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి.. కానీ అంతా ప్రేక్షకుడి ఊహకు తగినట్టే కథ సాగడం కొంత రొటీన్‌గా అనిపిస్తుంది. కైనాజ్ పాత్రను రెండు వేరియేషన్స్‌లో రాసుకొన్న తీరు.. ఆ పాత్రకు సంబంధించి ట్విస్ట్ సినిమాపై ఆసక్తిని రేపుతుంది.

    Freddy movie OTT Review and Rating: just for Karthik Aryans performance only

    ఆర్యన్ కార్తీక్‌ను ఇప్పటివరకు యూత్, రొమాంటిక్ పాత్రల్లో చూశాం. కానీ ఫ్రెడ్డీ సినిమా విషయానికి వస్తే.. పూర్తిగా ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో ఒక కొత్త కార్తీక్ ఆర్యన్‌ను చూసే అవకాశం కనిపించింది. తల్లిదండ్రులకు దూరమైన యువకుడిగా.. తల్లిని దారుణంగా హత్యకు గురికావడమనే విషయం తనను ఎలా ఒంటరిగా మార్చిందనే కోణంలో తన నటను అద్బుతంగా తెరపైన చూపించాడు. ఈ చిత్రంలో చాలా తక్కువ పాత్రలు కనిపిస్తాయి. ఈ కథకు కీలకమైన పాత్రలో పూజా బేడీ కూతురు అలయా ఎఫ్ నటించింది. తొలి భాగంలో భర్త వేధింపులకు గురైన యువతి పాత్రలో అమాయకంగా.. ఫ్రెడ్డీని మోసగించిన కిలాడీగా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రను తనదైన శైలిలో మెప్పించింది. మిగితా పాత్రల్లో కనిపించిన వారు వారి రోల్స్‌కు న్యాయం చేశారని చెప్పవచ్చు.

    ఫ్రెడ్డీ సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. క్లింటన్ సెరోజో మ్యూజిక్ చాలా బాగుంది. ఒక క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్‌కు కావాల్సిన నేపథ్య సంగీతాన్ని అద్బుతంగా, సీన్లను బాగా ఎలివేట్ అయ్యే విధంగా మ్యూజిక్ అందించారు. అయాంక బోస్ సినిమాటోగ్రఫి కూడా బాగుంది. మర్డర్ మిస్టరీకి కావాల్సిన మూడ్‌ను క్రియేట్ చేసే లైటింగ్‌తో ఆకట్టుకొన్నారు. దాదాపు ఈ సినిమా అంతా ఇండోర్‌లోనే సాగడంతో ఎక్కువగా సీన్లను ఎలివేట్ చేయడానికి లైటింగ్‌పై ఆధారపడి ఉన్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది.

    Freddy movie OTT Review and Rating: just for Karthik Aryans performance only

    బాలాజీ మోషన్ పిక్చర్స్‌పై ఏక్తా కపూర్ ఫ్రెడ్డీ సినిమాను రూపొందించారు. అడల్డ్ కంటెంట్‌తో క్రైమ్, థ్రిల్లర్‌ ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేశారు. చిన్న నటులు, తక్కువ పాత్రలతో మంచి అవుట్‌పుట్ రాబట్టే ప్రయత్నం చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

    క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తోపాటు కార్తీక్ ఆర్యన్ నటనకు స్కోప్ ఉన్న చిత్రం ఫ్రెడ్డీ. తాను ప్రేమించిన అమ్మాయి.. తననే మోసం చేస్తే.. తట్టుకోలేని ఓ దంతవైద్యుడు ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడనే కథలో కార్తీక్ అద్బుతంగా ఫెర్ఫార్మ్ చేశాడు. ఇది పక్కా ఓటీటీ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా. డీస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. తీరిక వేళలో కార్తీక్ ఆర్యన్ ఫెర్ఫార్మెన్స్‌ను ఎంజాయ్ చేయాలనుకొంటే.. ఫ్రెడ్డీని చూడండి.. క్రైమ్, థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఈ సినిమా నిరాశ కలిగించదు.

    English summary
    Karthik Aryan's Freddy movie release in OTT platform Disney+Hotstar. Here is the exclusive review by telugu filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X