twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గాలి సంపత్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.0/5

    నటీనటులు: రాజేంద్రప్రసాద్, శ్రీ విష్ణు, లవ్లీ సింగ్, తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు, కరాటే కల్యాణి, అనీష్ కురువిల్లా, రజిత, శ్రీకాంత్ అయ్యంగార్, మిర్చి కిరణ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ సాయి తదితరులు
    కథ, డైరెక్షన్: అనీష్ కృష్ణ
    నిర్మాతలు: ఎస్ కృష్ణ, హరీష్ పెద్ది, సాహు గారపాటి
    సమర్పణ, స్క్రీన్ ప్లే, మాటలు: అనిల్ రావిపూడి
    సంగీతం: అచు రాజమణి
    సినిమాటోగ్రఫి: సాయి శ్రీరాం
    ఎడిటింగ్: బీ తమ్మిరాజు
    బ్యానర్: ఇమేజ్‌పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ షైన్ సిరీస్
    రిలీజ్: 2021-03-11

    గాలి సంపత్ కథ ఏమిటంటే

    గాలి సంపత్ కథ ఏమిటంటే

    రేడియో ఆర్టిస్టు గాలి సంపత్ (రాజేంద్ర ప్రసాద్)‌కు నాటకాలు అంటే చెప్పలేనంత ఇష్టం. ఓ యాక్సిడెంట్‌లో తనకు, తన జీవితానికి బలంగా మారిన గొంతును కోల్పోయి మూగవాడిగా గాలి సంపత్ మారిపోతారు. భార్య అకాల మరణం చెందడంతో కొడుకు సూరి (శ్రీ విష్ణు) కోసం జీవిస్తుంటాడు. అరకులో ఓ ట్రక్కు కొనుక్కొని జీవితం గడిపేయాలనే ఆలోచనలో సూరి ఉంటారు. ఈ క్రమంలో అదే ఊరిలోని సర్పంచ్ కూతురు పాప (లవ్లీ సింగ్)తో ప్రేమలో పడుతాడు. అయితే తండ్రి కారణంగా తన పెళ్లికి అడ్డంకులు ఏర్పడటంతో సూరి మనస్తాపానికి గురి అవుతారు. తండ్రిపై ఆగ్రహం చెంది ఇంటి నుంచి వెళ్లిపోమ్మని అరిచేస్తాడు. కొడుకు తీరుతో మనోవేదన గురైన గాలి సంపత్ ప్రమాదవశాత్తూ ఇంటి ముందు ఉన్న ఖాళీ బావిలో పడుతాడు.

    గాలి సంపత్ మూవీలో ట్విస్టులు

    గాలి సంపత్ మూవీలో ట్విస్టులు


    రేడియో మామయ్య పేరు సంపాదించుకొన్న గాలి సంపత్‌ ఎలా మూగవాడిగా మారిపోయారు? తన కుమారుడు సూరిని ఎందుకు ప్రాణంగా చూసుకొంటాడు. గాలి సంపత్ కారణంగా సూరి ప్రేమ, పెళ్లికి ఎలాంటి అడ్డంకులు ఏర్పడ్డాయి. బావిలో పడిన గాలి సంపత్ పరిస్థితి ఏమైంది? తండ్రిపై సూరికి ఏర్పడిన అపోహ ఎలా తొలిగిపోయింది? బావిలో పడిన గాలి సంపత్ పరిస్థితి ఏమైంది? పాపతో ప్రేమను సూరి గెలుచుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే గాలి సంపత్ సినిమా కథ.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

    తండ్రి కొడుకుల మధ్య అనురాగం, ప్రేమ యాంగిల్‌లో కథ మొదలవుతుంది. నాసిరకమైన సన్నివేశాలు, కథనం ప్రేక్షకుడికి ముందే రాబోయే విపత్తును హెచ్చరించేలా ఉంటాయి. కథలోకి వెళ్లిన కొద్ది సినిమా మరింత పేలవంగా కనిపిస్తుంది. ఓ చిన్న ట్విస్టుతో ప్రథమార్థం ముగించడంతో ప్రేక్షకుడికి ఊపిరి పీల్చుకొన్నంత పని అవుతుంది. తొలి భాగంలో తండ్రి కొడుకుల మధ్య సన్నివేశాలను భావోద్వేగంగా మలిచి ఉంటే తప్పకుండా ఈ సినిమా హార్ట్ టచింగ్ మారడానికి స్కోప్ ఉండేది. అలాగే రొటీన్, ఎలాంటి కొత్తదనం లేని లవ్ ట్రాక్ ఫస్టాఫ్‌కు మైనస్‌గా మారింది.

    ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా సెకండాఫ్

    ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా సెకండాఫ్


    సెకండాఫ్‌లో బావిలో గాలి సంపత్ పడే యాతన ప్రేక్షకుడిని ఎమోషనల్‌కు గురి చేస్తుంది. కానీ బావిలో ఎమోషనల్‌గా సాగాల్సిన గాలి సంపత్ క్యారెక్టర్‌ కాసేపట్లోనే తేలిపోయినట్టు కనిపిస్తుంది. నాసిరకం, పరిపక్వత లేని సన్నివేశాలతో సినిమా మరింత బోరుగా మారుతుంది. ఇక సెకండాఫ్‌లో శ్రీకాంత్ అయ్యంగార్, అనీష్ కురువిల్లా సీన్లు ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతుంది. ఇక క్లైమాక్స్ మరీ సాధారణంగా, పరమ రొటీన్‌గా, 80వ దశకంలోని స్క్రీన్ ప్లేను మరిపించే విధంగా ఉంటుంది. ఓవరాల్‌గా గాలి సంపత్ ఎలాంటి ఎమోషన్స్ లేని కథగా మిగిలిపోతుంది.

    అనిల్ రావిపూడి బ్రాండ్‌ డామేజ్

    అనిల్ రావిపూడి బ్రాండ్‌ డామేజ్


    ఇక అనిల్ రావిపూడి సమర్పణ, స్క్రీన్ ప్లే, మాటలు లాంటి అంశాలు చూస్తే గాలి సంపత్‌ ఓ భావోద్వేగమైన కథగా కనిపిస్తుంది. కానీ అనిల్ రావిపూడి స్టాండర్ట్స్ ఏ కోశానా వెతికినా ఈ సినిమాలో కనిపించవు. అనిల్ రావిపూడి మార్కును చూసి వెళ్తే తప్పకుండా ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. తొలిసారి దర్శకుడు అనీష్ కృష్ణ ప్రతీ అడుగులోను తడబాటు కనిపిస్తుంది. సినిమా మొత్తంలో ఓ బలమైన ఎపిసోడ్‌ ద్వారా ప్రేక్షకుడికి రుచి చూపించలేకపోయాడనే చెప్పవచ్చు.

    రాజేంద్ర ప్రసాద్ తన వంతు న్యాయంగా

    రాజేంద్ర ప్రసాద్ తన వంతు న్యాయంగా

    ఇక గాలి సంపత్‌గా టైటిల్ రోల్‌ను పోషించిన రాజేంద్ర ప్రసాద్ తన పాత్రను మరో రేంజ్‌కు తీసుకెళ్లేందుకు చాలా ప్రయత్నించాడు. కానీ కథ, కథనాల్లో ఏ మాత్రం సరుకు లేకపోవడంతో నట కిరీటి ఏమీ చేయలేకపోయాడనే ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో కొద్ది నిమిషాల ముందు తన నటనా ప్రతిభను మరోసారి రుచి చూపించడం కాస్త ఊరటగా కనిపిస్తుంది.

    శ్రీ విష్ణు ట్రాక్ రికార్డుకు

    శ్రీ విష్ణు ట్రాక్ రికార్డుకు

    ఇక శ్రీ విష్ణుకు ఇప్పటి వరకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. కానీ గాలి సంపత్ చూసిన తర్వాత ఫీల్‌గుడ్ చిత్రాల్లో నటించే ఆయన ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకొన్నాడా అనే అనుమానం కలుగుతుంది. సాధారణంగా శ్రీ విష్ణు సినిమాలో ఇతర అంశాలు ఎలా ఉన్నప్పటికీ.. హీరో క్యారెక్టరైజేషన్ ఇంపాక్ట్‌గా ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలాంటిదేమీ కనిపించదు. శ్రీ విష్ణు అభిమానులకు భారీ నిరాశే ఎదురువుతుందని చెప్పవచ్చు. లవ్లీ సింగ్‌తో లవ్ ట్రాక్ కూడా పండించలేకపోయాడనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది.

    టెక్నికల్ టీమ్ ప్రతిభ

    టెక్నికల్ టీమ్ ప్రతిభ

    ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సాయి శ్రీరాం తన సినిమాటోగ్రఫితో ఆకట్టుకొన్నాడు. అరకు అందాలను తన కెమెరాలో అద్భుతంగా పట్టుకొన్నాడు. అచు రాజమణి సంగీతం విషయానికి వస్తే..రీరికార్డింగ్ బాగుంది. ఓ పాట ఫర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్, ఇతర విభాగాల పనితీరు ఓకే అనిపించేలా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓ మోస్తారుగా ఉన్నాయి.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా


    తండ్రి కొడుకుల బంధాలు, అనుబంధాలతో సాగే గాలి సంపత్‌ భావోద్వేగాలకు అత్యంత తావు ఉన్న చిత్రంగా చెప్పవచ్చు. కానీ వాటిని ఆవిష్కరించడంలో యూనిట్ విఫలమైంది. రాజేంద్ర ప్రసాద్ పాత్రను, శ్రీ విష్ణు లవ్ ఎపిసోడ్‌ను మరింత ప్రభావవంతంగా తెరకెక్కించి ఉంటే తప్పకుండా ఈ చిత్రం ఫీల్‌గుడ్ మూవీగా మారి ఉండేది. అలాంటి అవకాశాన్ని అనిల్ రావిపూడి టీమ్ చేజార్చుకొన్నది. మానవ సంబంధాల ఆధారంగా వచ్చే సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు ఈ సినిమా రీచ్ అయితే కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించడానికి ఛాన్స్ ఉంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు


    ప్లస్ పాయింట్స్
    సినిమాటోగ్రఫి
    రీరికార్డింగ్

    మైనస్ పాయింట్స్
    ఆకట్టుకోలేని కథ
    పేలవమైన కథనం
    నాసిరకమైన లవ్ ట్రాక్

    English summary
    As per wikipedia, Gaali Sampath is a film directed by Anish Krishna from a screenplay written by Anil Ravipudi. The film stars Rajendra Prasad, Sree Vishnu, Lovely Singh, Tanikella Bharani, and Satya. Music is composed by Achu Rajamani. The film is released on 11 March 2021.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X