»   » ‘గజరాజు’ రివ్యూ...

‘గజరాజు’ రివ్యూ...

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  కేరక్టర్ ఆర్టిస్టుగా అటు తమిళంతో పాటు ఇటు తెలుగు సినిమాల్లోనూ రాణిస్తున్న ప్రభు తనయుడు విక్రమ్ ప్రభు 'గజరాజు' చిత్రం ద్వారా పరిచయం సినీ రంగానికి పరిచయం అవుతున్నాడు. తమిళంలో విక్రమ్ ప్రభు, లక్ష్మీ మీనన్ జంటగా నటించిన 'కుమ్కి' చిత్రం తెలుగులో 'గజరాజు' పేరుతో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ విడుదల చేస్తున్నారు. మైనా(ప్రేమ ఖైదీ) ఫేం ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమిళంలో ఎన్.లింగుస్వామి, చంద్రబోస్‌లు నిర్మించగా బెల్లంకొండ సురేష్ అనువాద హక్కులు పొందారు.

  సంస్థ: సాయి గణేష్ ప్రొడక్షన్స్
  నిర్మాత: బెల్లంకొండ సురేష్
  దర్శకుడు: ప్రభు సాల్మన్
  సంగీతం: డి. ఇమ్మాన్
  నటీనటులు: విక్రమ్ ప్రభు, లక్ష్మి మీనన్, తంబి రామయ్య, అనంత్ వైద్య నాథన్ తదితరులు

  కథ: దేవగిరి ఊరిపై కపాలి అనే అడవి ఏనుగు దాడి చేస్తూ... ప్రాణ, ఆస్తినష్టం కలిగిస్తూ ఉంటుంది. కపాలి ఆకట్టించేందుకు అడవి ఏనుగులను తరిమికొట్టే సామర్థ్యం గల గుమ్కి అనే ఏనుగుని తేవాలని చూస్తారు ఆ వూరి వారు. కొన్ని కారణాల వల్ల గుమ్కి ఏనుగు స్థానంలో బోపన్న (విక్రమ్ ప్రభు) తన ఏనుగు (మాణిక్యం)ని తీసుకుని దేవగిరికి వెళతాడు. అక్కడ సింగి (లక్ష్మి మీనన్)ని చూసి మనసు పారేసుకుంటాడు. మొదట రెండు రోజులు కాపలా ఉండటానికి వెళ్ళిన బోపన్న సింగి మీద ప్రేమతో ఆ ఊరిలోనే తిష్ట వేస్తాడు. కానీ వారి ప్రేమకు పరిస్థితులు అనుకూలించవు. మరో వైపు తన ఏనుగుకు ఆ వూరిని కాపాడే శక్తి లేదని తెలిసి పోతుంది. మరి ఏనుగు కథ, వీరి ప్రేమకథ ఏమైందనేది తెరపై చూడాల్సిందే.

  పెర్ఫార్మెన్స్ పరంగా విక్రమ్ ప్రభు పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు. విక్రమ్ ప్రభు తన యాక్టింగ్ స్కిల్స్ మెరుగు పరుచుకోక పోతే కష్టమే. లక్ష్మీ మీనన్ నటన బాగుంది. హీరో మామ పాత్రలో తంబిరామయ్య కామెడీ ఆకట్టుకుంది. ఇంతకు మించి సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలు లేవు.

  అడవి అందాలను సినిమాటోగ్రాఫర్ సుకుమార్ అద్భుతంగా తన కెమెరాలో ఆవిష్కరించారు. ఈ సినిమాకు ఫోటోగ్రఫీ హైలెట్. ఇమ్మాన్ అందిన సంగీతం ఇప్పటికే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. అయితే కథ ఆసక్తి కరంగా లేక పోవడం, స్క్రీన్ ప్లే కాస్త బోరింగ్ గా సాగడం, క్లైమాక్స్ బాగోలేక పోవడం, పూర్తిగా తమిళ తారాగణం, ఆ నేటివిటీతో కూడిన సినిమా కాట్టి తెలుగు వారికి ఎక్కడం కష్టమే.

  English summary
  Director Prabhu Solomon has earlier rocked the viewers with his beautiful love story Mynaa set in the backdrop of green forests and hills. The director is now back with another story with the same backdrop. In his latest directorial venture Gajaraju, the dubbed version of Kumki, he introduces a new face Vikram Prabhu, grandson of Sivaji Ganeshan and the film is a joyride through the wilds of Tamil Nadu forests.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more