Ghaati Twitter Review: ఘాటీ మూవీ ట్విట్టర్ రివ్యూ
ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి, లెజెండరీ తమిళ నటుడు శివాజీ గణేషన్ మనవడు విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఘాటి. చింతకింద శ్రీనివాస్ అందించిన కథను రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో చైతన్య రావు మదాడి, జగపతిబాబు, జిషు సేన్ గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, వీటీవీ గణేష్ తదితరులు నటించారు.
యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫి, తూరుపు చాణక్య రెడ్డి, నాగవెళ్లి విద్యాసాగర్ సంగీతం అందించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీ 2025 తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రీమియర్ షోలు నార్త్ అమెరికాతోపాటు ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రదర్శించబడ్డాయి. ఈ సినిమాను వీక్షించిన తర్వాత నెటిజన్లు, క్రిటిక్స్ వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూల వివరాల్లోకి వెళితే...

ఘాటీ సినిమా బాగుంది. ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంటుంది. ఆ తర్వాత సెకండాఫ్ అదిరిపోతుంది. ఓవరాల్‌గా ఈ సినిమా హిట్ ఫిలిం. స్వీటీ అనుష్క మాస్ పాత్రలో చూపించిన పెర్ఫార్మెన్స్ పిచ్చెక్కిస్తుంది. శీలావతి పాత్ర ఎప్పటికీ ప్రేక్షకులు గుర్తుంచుకొనేలా ఉంటుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.
పవర్‌ఫుల్ అనుష్క శెట్టి, బ్రిల్లియెంట్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఘాటీ సినిమాతో మీ ముందుకు వస్తున్నారు. ఈ యాక్షన్, డ్రామాను చూసేందుకు నేను కూడా మీలాగే చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. విక్రమ్ ప్రభు, చైతన్య రావు జగపతి బాబు, జాన్ విజయ్ తదితరులు నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం గ్యారెంటి. ఈ సినిమాలో భాగమైన టీమ్ సభ్యులందరికి నా ధన్యవాదాలు అంటూ సాయిధరమ్ తేజ్ విషెస్ అందజేశారు.
ఘాటీ సినిమా చూసే ప్రతీ ప్రేక్షకుడికి గూస్‌బంప్స్ గ్యారెంటీ. టాలీవుడ్‌లోకి పవర్ హౌస్ విక్రమ్ ప్రభు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. క్రిష్ డైరెక్షన్, విక్రమ్ ప్రభు పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రజెన్స్, అనుష్క యాక్టింగ్ అన్నీ కలిపి ఓ గొప్ప సినిమాటిక్ మ్యాజిక్ లోడింగ్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
లేడీ సూపర్ స్టార్‌గా అనుష్క పెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీసింది. తన కెరీర్‌లో వైల్డెస్ట్ పెర్ఫార్మెన్స్‌ను చూపించింది. యాక్షన్ సీన్లలో నా సామిరంగా అన్నట్టు ఫైట్స్ చేసింది. దర్శకుడు క్రిష్ మంచి సినిమాను తీశాడు. వీఎఫెక్స్, స్క్రీన్ ప్లే విషయంలో కాస్త జాగ్రత్త పడాల్సింది. ఈ సినిమాకు నా రేటింగ్ 3/5 అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
యూకేలో ప్రీమియర్ చూశాను. ఫస్టాఫ్ ముగిసింది. కొన్ని సీన్లు ల్యాగ్ ఉన్నప్పటికీ.. గుడ్ అనే ఫీలింగ్ క్రియేట్ చేసింది. అనుష్క శెట్టి తన పెర్ఫార్మెన్స్ సూపర్. ఇంటర్వెల్ సీన్ తీయాలంటే.. యాక్టర్లు, డైరెక్టర్లు చాలా గట్స్ ఉండాలి. క్రిష్ దర్శకత్వంతో గుడ్ జాబ్ చేశాడనిపిస్తుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.
ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంది. సినిమా ఇంట్రెస్టింగ్‌గా మొదలవుతుంది. మ్యుూజిక్ హైలెట్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ ఒకే అనిపిస్తుంది. స్వీటీ యాక్షన్ సెకండాఫ్‌లో ఎలా ఉంటుందనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. సెకండాఫ్ అనుకొన్నటుగానే బాగుంది. అనుష్క మాస్ మోడ్ అదరగొట్టింది. ఫస్టాఫ్‌లో అంతగా వినపడని విజిల్స్.. సెకండాఫ్‌లో భారీగా విజిల్స్ వినిపించాయి. మాస్ డైలాగ్స్ చెప్పేటప్పుడు స్వీటీ వాయిస్ అంతగా నచ్చలేదు. కాటేరమ్మ కోడలు మూమెంట్ బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. నా రేటింగ్ ఈ సినిమాకు 2.25/5 ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











