For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Godse Movie Review : రాజకీయాల మీద విమర్శనాస్త్రం.. సత్యదేవ్ డీసెంట్ ఫెర్ఫార్మెన్స్

  |

  Rating:
  3.0/5

  నటీనటులు : సత్యదేవ్, , ఐశ్వర్య లక్ష్మీ, పృథ్వి రాజ్, నాగబాబు తదితరులు
  దర్శకుడు : గోపీ గణేష్ పట్టాభి
  నిర్మాత: చిల్లర కళ్యాణ్
  బ్యానర్: సీకే ఎంటర్టైన్మెంట్స్
  సంగీత దర్శకుడు: సునీల్ కశ్యప్

  విలక్షణ సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న సత్యదేవ్ ఇప్పుడు తెలుగులో మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా ఎలాంటి పాత్ర అయినా చేస్తూ ప్రేక్షకుల్లో రిజిస్టర్ అవడానికి ప్రయత్నిస్తున్న సత్యదేవ్ తాజాగా గాడ్సే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో బ్లఫ్ మాస్టర్ వంటి సినిమా చేసిన గోపీ గణేష్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ స్టఫ్ మరింత పెంచింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? ఎలా ఉంది అనేది సమీక్షలో తెలుసుకుందాం.

  గాడ్సే కథ ఏంటి?

  గాడ్సే కథ ఏంటి?


  వైశాలి(ఐశ్వర్య లక్ష్మీ) పోలీస్ డిపార్ట్మెంట్లో ఏసీపీగా పని ఉంటుంది. డ్యూటీ అంటే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమయ్యే ఆమె పెళ్లి చూపులు వదిలి వెళ్లి ఒక ఆపరేషన్లో భాగమవుతుంది. అయితే అందులో ఒక గర్భవతి స్వయంగా చేతుల్లో మరణించడంతో ఇక ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. కానీ డిపార్ట్మెంట్ నుంచి పిలుపు రావడంతో ఒక కిడ్నాపర్ తో మాట్లాడటానికి సిద్దమవుతుంది. ఆ కిడ్నాపర్ మరెవరో కాదు గాడ్సే(సత్యదేవ్). అయితే రాష్ట్ర మంత్రులు, ఒక ఎస్పీ, కొందరు సీఏలను కిడ్నాప్ చేసిన గాడ్సే వాళ్ళను ఏం చేశాడు? తొలుత గాడ్సే మీద మండిపడిన వైశాలి తరువాత ఎందుకు జాలి చూపింది? అసలు గాడ్సేకి ఏమైంది? ఎందుకు మంత్రులను కిడ్నాప్ చేశాడు? అసలు చివరికి కిడ్నాప్ చేసిన అందరినీ ఏం చేశాడు? అన్నదే సినిమా కధ.

  మొదటి భాగం ఎలా ఉందంటే?

  మొదటి భాగం ఎలా ఉందంటే?

  సినిమా మొదటి భాగం మొదలు పెడుతూనే పోలీసులు రిస్కీ ఆపరేషన్ తో ప్రారంభించారు. ఒక్కొక్కరిని ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేయడంతో అసలు ఎందుకు చేస్తున్నారు? అనే ఉత్సుకత పెంచారు. సినిమా ప్రారంభమైన చాలా సేపటి వరకు సత్యదేవ్ కనిపించడు. కొంచెం సత్యదేవ్ ఎంట్రీ ఇచ్చాక సినిమాలో స్పీడ్ పెరుగుతుంది. ఆ తరువాత కూడా అసలు కిడ్నాపులు ఎందుకు చేస్తున్నాడు? అసలు అతని మోటివ్ ఏంటి? అనే ఆసక్తి పెరుగుతుంది. అంతేకాక తనతో బేరసారాలు ఆడడానికి వచ్చిన ఒక లేడీ ఆఫీసర్ తో అసభ్యంగా మాట్లాడి కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఏమో అని అనుమానం కూడా కలిగిస్తాడు. ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే మొదటి భాగం ముగిస్తారు.

  రెండో భాగం ఎలా ఉందంటే?

  రెండో భాగం ఎలా ఉందంటే?

  ఇక రెండో భాగం ప్రారంభం నుంచి అసలు సత్యదేవ్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అనే విషయాలు చూపారు. సెకండ్ హాఫ్ మొదలు అయినప్పటి నుంచి కూడా అప్పటిదాకా సత్యదేవ్ మీద ఉన్న నెగటివ్ ఫీలింగ్ పోయి జాలి కలిగే విధంగా మారుతుంది పరిస్థితి. ఇక రెండో భాగంలో సత్యదేవ్ అలా మారడానికి కారణం ఏమిటి? వరుసగా కిడ్నాపులు చేసి వారందరినీ ఎందుకు చంపాలని అనుకున్నాడు? అసలు ఎందుకు కిడ్నాప్ వరకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అనే విషయాలు చాలా కన్విన్సింగ్ గా చూపించారు.

  దర్శకుడి టేకింగ్ విషయానికి వస్తే :

  దర్శకుడి టేకింగ్ విషయానికి వస్తే :

  బ్లఫ్ మాస్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకున్న గోపీ గణేష్ తన రెండో సినిమాతో కూడా ఆకట్టుకున్నాడు. గాడ్సే అనే పేరుతో వచ్చిన ఈ సినిమాలో సగటు ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యే అంశాలు స్పృశించారు. నిరుద్యోగం, రాజకీయ నాయకుల లంచాల వ్యవహారం, వాళ్ళు తలుచుకుంటే ఏమి చేయగలరు? లాంటి అంశాలను కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఎక్కడా వెనక్కి తగ్గకుండా హీరోతో మాట్లాడించే ప్రతి డైలాగ్ తో ప్రేక్షకులను ప్రశ్నించినట్టు అనిపిస్తుంది. కథ -కథనం విషయంలో కూడా పగడ్బందీగా ప్లాన్ చేసుకోవడంతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

  నటీనటుల పని తీరు విషయానికి వస్తే :

  నటీనటుల పని తీరు విషయానికి వస్తే :

  ఎప్పటిలాగే సినిమా మొత్తాన్ని సత్యదేవ్ తన భుజాన మోశాడు, సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నా సత్యదేవ్ అందరినీ తన నటనతో డామినేట్ చేశాడు. ఇక తమిళ భామ ఐశ్వర్య తన పాత్రకు న్యాయం చేసింది. ఇక మిగతా నటీనటులు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సింగర్ నోయల్ కు చాలా కాలం తర్వాత మంచి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. రాహుల్ రామకృష్ణ, నాగబాబు లాంటి వారు ఉన్నా వారిని ఒకటి రెండు సీన్లకే పరిమితం చేశారు. పృథ్వి రాజ్ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. తన మీద తానే సెటైర్లు వేసుకుని నవ్వించాడు.

  టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే

  టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే

  ఈ సినిమా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే దర్శక -రచయిత గోపీ గణేష్ పట్టాభి క్రెడిట్ అంతా కొట్టేసే ప్రయత్నం చేశాడు. దర్శకుడిగా కంటే రచయితగా ఆయన మార్క్ కనిపిస్తుంది. రెండో భాగంలో వచ్చే డైలాగ్స్ అందరినీ అలరిస్తూనే ఆలోచింప చేస్తాయి. అంతా గట్టిగా ప్లాన్ చేసినా కొన్నిసార్లు సాగతీసిన ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. అయితే పాటలు పెద్దగా లేకపోయినా సునీల్ కశ్యప్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవల్ కు తీసుకు వెళ్ళింది. సురేష్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయింది. మరీ ముఖ్యంగా కొన్ని సీన్స్ లో టేకింగ్ బాగా కుదిరింది. ఇక సాగర్ ఎడిటింగ్ టేబుల్ మీద మరికొంత శ్రద్ధ పెట్టాల్సింది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి, ఎక్కడా వంక పెట్టడానికి లేకుండా సి కళ్యాణ్ సినిమాను నిర్మించారు.

  ఫైనల్ గా చెప్పాలంటే:

  ఫైనల్ గా చెప్పాలంటే:


  గాడ్సే సినిమా ప్రస్తుత రాజకీయాల మీద ఎక్కు పెట్టిన విమర్శనాస్త్రం. నిరుద్యోగం, అవినీతి, వంటి విషయాలే ప్రధాన కథాంశంగా సినిమా తెరకెక్కించారు. దీంతో ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయినా ఫ్యామిలీతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడగలిగే సినిమా.

  English summary
  satyadev kancharana starrer godse released on june 17th, here is the exclusice godse movie review by filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X