twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చరిత్రకు స్క్రీన్ ప్లే ఉండదు ('రుద్రమదేవి' ‌ రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    3.0/5

    ---సూర్య ప్రకాష్ జోశ్యుల

    చరిత్రంలో అజరామరంగా నిలచిపోయిన 'రుద్రమదేవి' చిత్రం అనగానే యుద్దాలు, వీరోచిత పోరాటాలు ఉంటాయోమో అని ఆశపడటం సహజం. అయితే గుణశేఖర్..ఓ కుటుంబ డ్రామాలాంటి కథను తెరకెక్కించాలనుకున్నాడు. 'రుద్రమదేవి' జీవితంలో ఉన్న చిన్నప్పుడే పడిన చిన్న మెలిక ( ఆ మెలిక క్రింద కథలో చూడండి) ను ఆధారం చేసుకుని కథనం అల్లు కున్నాడు. అంతేగానీ ..ఓ స్త్రీ పాలకురాలై ..చుట్టూ మొహరించి ఉన్న శత్రువులను నుంచి ఎలా తనను, తన రాజ్యాన్ని కాపాడుకుంది..ఆ క్రమంలో ఏమేం ఎత్తులు వేసింది..ఏ ఇబ్బందులు పడింది అన్నట్లు కథనం రాసుకోలేదు. దాంతో కథలో ఉన్న ఏకైక వీరోచిత పాత్ర గోన గన్నారెడ్డి (అల్లు అర్జున్) ఎప్పుడొస్తుందా..అని ఎదురుచూస్తూ కూచోవటమే ప్రేక్షకుడు వంతు అయ్యింది. ఇది గోన గన్నారెడ్డి వైపు నుంచి రాసుకున్న కథగా ఉంది కానీ 'రుద్రమదేవి' కథలాగ లేదు. అలాగే రానాను హైలెట్ చేస్తూ మొదటి నుంచి పోస్టర్స్, ట్రైలర్స్ కట్ చేసారు. అయితే సినిమాలో రానాకు అసలు ప్రయారిటీనే లేదనేది సుస్పష్టం.

    రుద్రమదేవి(అనుష్క) పుట్టేటప్పడికి కాకతీయ సామ్రాజ్య పరిస్దితులు బాగోలేవు... ఓ ప్రక్క దాయాదుల నుంచి, మరో ప్రక్క శత్రువుల నుంచి రాజ్యానికి ముప్పు ఉంది. మగపిల్లవాడు పుడితే తమ వారసుడుగా ఏలుతాడు అనుకుంటే పుట్టింది ఆడపిల్ల అని తెలిసి రాజు గణపతి దేవుడు(కృష్ణం రాజు) నిరాశపడతాడు. వారసుడు లేడు అని తెలిస్తే వెంటనే వారంతా దండెత్తే అవకాసం ఉందని ఏం చేయాలో అని ఆలోచనలో పడితే అప్పుడు ఆయన మంత్రి శివ దేవయ్య(ప్రకాష్ రాజ్) ఓ సలహా ఇస్తాడు. బయిట ప్రపంచానికి తెలియకుండా ఆమెను మగపిల్లాడిలా నమ్మిస్తూ పెంచమంటాడు. ఆ క్రమంలో ఓ కొడుకులాగ రుద్రమదేవిని పెంచుతాడు. ఆమె పెరిగి పెద్దయ్యాక వివాహం సైతం ముక్తాంబ(నిత్యామీనన్ )ని ఇచ్చి చేస్తారు. ఇదే సమయంలో బందిపోటు గోన గన్నారెడ్డి (అల్లు అర్జున్) రుద్రమదేవితో పోరుకు సై అంటాడు. అప్పుడు ఏం జరిగింది...రుద్రమదేవి...మగపిల్లాడు కాదు...స్త్రీ అనే విషయం ఎలా రివీల్ అయ్యింది. ఆమెను ప్రేమించిన వీరభధ్రుడు (దగ్గుపాటి రానా) ఏం చేసి ఆమెను పొందాడు...రుద్రమదేవి తన ముందున్న సవాళ్ళను ఎలా ఎదుర్కొని వీర నారి అయ్యింది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    తొలి నుంచి పౌరాణికాలు వచ్చినట్లుగా మన తెలుగులో చారిత్రక కథాంశాలతో వచ్చిన చిత్రాలు చాలా తక్కువ. బొబ్బలి యుద్దం, తాండ్ర పాపారాయుడు, అల్లూరి సీతారామరాజు,కొమరం భీమ్, ఇలా తెలుగు జాతి చరిత్రను చెప్పేవి అరుదు. ఎందుకంటే చరిత్రను తెరకెక్కించేటప్పుడు చాలా నిబద్దత అవసరం. ముఖ్యంగా కల్పనకు చోటు తక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో సినిమాటెక్ ట్విస్ట్ లు, కమర్షియల్ ఎలిమెంట్స్ కు మార్గం ఉండదని దర్శకులు భావిస్తూంటారు. అయితే చాలా కాలం తర్వాత దర్శకుడు గుణశేఖర్...మనదైన చరిత్రలో నిలిచిపోయిన వీరనారి ..'రుద్రమదేవి' ‌ చరిత్రను తెరకెక్కించాలని అనపించి, కష్ట నష్టాలకు ఓర్చి తెరకెక్కించాడు. అందుకు ఆయన్ను ముందుగా మనస్పూర్తిగా అభినందించాలి.

    అయితే ఆయన ఈ తెరకెక్కించే ప్రాసెస్ లో సరైన స్క్రీన్ ప్లేను సమకూర్చుకోవటం మర్చిపోయాడు. అయితే చరిత్ర ...మన తెలుగు స్క్రీన్ ప్లే ను అనుసరించటం కష్టమే అయినా...మరింత ఆ విభాగంలో కష్టపడితే బాగుండేది అనిపిస్తుంది. అలాగే ఆ వీరనారి సాహసకృత్యాలను ,వీరోచిత పోరాటాలను కూడా మరింత సమర్దవంతంగా చూపించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. కానీ దర్శకుడు కాన్సర్టేషన్ మొత్తం అల్లు అర్జున్ చేసిన ఎపిసోడ్ మీద ఉన్నట్లుంది. గోన గన్నారెడ్డిగా ఆ పాత్ర బాగా ఎలివేట్ అయ్యింది. ప్రకాష్ రాజ్ ఫెరఫార్మెన్స్, కొన్ని విజువల్స్ లేకపోతే నీరసపడ్డ సెకండాఫ్ ని లాక్కెళ్లటం కష్టమయ్యేది. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ మరింత ప్రతిభావంతంగా తెరకెక్కించాల్సిన అవసరం ఉంది.

    మిగతా రివ్యూ స్లైడ్ షోలో...

    మ్యాజిక్ లేదు

    మ్యాజిక్ లేదు

    వాస్తవానికి రుద్రమదేవి కథ మనలో చాలా మందికి కొత్తమీ కాదు. చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నదే...తమదైన శైలిలో చదువుకునేటప్పుడు, టీచర్లు చెప్తూంటే విన్నప్పుడు విజువలైజ్ చేసుకున్నదే. అలాంటి ఎక్కువ మందికి తెలిసున్న కథని తీసుకున్నప్పుడు స్క్రీన్ ప్లేనే మ్యాజిక్ లు చేయాలి, అదే జరగలేదు

    బాహుబలి మ్యాజిక్ లేదు

    బాహుబలి మ్యాజిక్ లేదు

    ఇలాంటి చిత్రంలో విజువల్స్ స్టంన్నింగ్ గా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా మొన్నే బాహుబలి చూసిన ప్రేక్షకులకు వెలితి తెలియకుండా యాక్షన్ ఎపిసోడ్స్ అద్బుతంగా ఉండాలి. ఇవన్ని గుణశేఖర్ దృష్టిలో పెట్టుకున్నట్లు లేదు.

    ఫస్టాఫ్ లో ...

    ఫస్టాఫ్ లో ...

    సినిమా చిరంజీవి వాయిస్ ఓవర్ తో రుద్రమదేవి చరిత్రను కొద్దిగా పరిచయం చేస్తూ ..ఇంటెన్స్ గా మొదలవుతుంది. ఇంటర్వెల్ వచ్చేసరికి గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ వేడిక్కిస్తాడు.

    సెకండాఫ్ నీరసం

    సెకండాఫ్ నీరసం

    క్లైమాక్స్ కొన్ని లెంగ్తీ ఎమోషన్ సీన్స్ తో ..సీక్వీల్ తీస్తామని చెప్తూ ముగిసేలా ప్లాన్ చేసారు. కేవలం గోన గన్నారెడ్డి పాత్రకు ఓ ట్విస్ట్ పెట్టుకుని అదే సరిపోతుందనికున్నారు.

    సినిమాటెక్ గా చరిత్ర

    సినిమాటెక్ గా చరిత్ర

    చారిత్రంగా జరిగిన కథకు సమకూర్చిన స్క్రీన్ ప్లే చాలా సినిమాటెక్ గా సాగింది. పాత్రల్లో ఎక్కడా బలం ఉండదు. బాహుబలి (పోలిక కాదు కానీ) ఏమేమి ప్లస్ అయ్యాయో (కీ క్యారక్టర్ల క్యారక్టరైజన్స్, యాక్షన్ ఎపిసోడ్స్) అవే ఇక్కడ మైనస్ అయ్యాయి.

    హైలెట్స్

    హైలెట్స్

    గోన గన్నారెడ్డి (అల్లు అర్జున్) పాత్ర సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఈ పాత్ర ద్వారా చెప్పించిన డైలాగ్స్ , బాడీ లాంగ్వేజ్, మేనరిజం, స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని బాగా కుదిరాయి. అల్లు అర్జున్ పాత్ర నిలబెట్టిందనే చెప్పాలి.

    కొన్ని సూపర్ ..

    కొన్ని సూపర్ ..

    అరేయ్ ‘గమ్మునుండవో..' అంటూ సాగదీసి చెప్పే డైలాగ్, నేను తెలుగు భాష లెక్క..ఆడా ఉంటా..ఈడా ఉంటా, కోడలికి నీతులు చెప్పి అత్త ఉడాయించిందంట..లాంటి డైలాగులకు సినిమాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగని మొత్తం డైలాగులు అధ్బుతంగా ఉన్నాయని చెప్పలేం.

    రెండు ఇంట్రడక్షన్ లూ...

    రెండు ఇంట్రడక్షన్ లూ...

    అనుష్క ఇంట్రడక్షన్, అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ రెండూ చాలా బాగా డిజైన్ చేసారు. సినిమాలో చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ లో అది ఒకటి

    సంగీతం

    సంగీతం

    ఈ సినిమాకు పెద్ద మైనస్ సంగీతం అని చెప్పాలి. పాటలు, రీరికార్డింగ్ రెండూ ఇబ్బంది కలిగిస్తాయి. ఇళయరాజా అభిమానులు ఆశ్చర్యపోయేలా ఉంది

    టెక్నికల్ గా

    టెక్నికల్ గా

    అన్ని డిపార్టమెంట్స్ లోకి తోట తరణి గారి కళా దర్శకత్వం, కాస్ట్యూమ్స్ విభాగం సినిమా జానర్ కు తగినట్లు ఉన్నాయి. సినిమాటోగ్రఫీ లో వావ్ అనిపించే ఒక్క మూవ్ మెంట్ ఉండదు. ఎడిటింగ్ గురించి చెప్పుకోకుండా ఉంటేనే మేలు.

    ఎవరెవరు...

    ఎవరెవరు...

    బ్యానర్ :గుణ టీమ్ వర్క్స్
    నటీనటులు: అనుష్క, దగ్గుపాటి రానా, అల్లు అర్జున్, సుమన్‌, ప్రకాష్‌రాజ్‌, నిత్య మేనన్‌, కేథరిన్‌, ప్రభ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్య మేనన్‌, అజయ్‌ తదితరులు
    సంగీతం: ఇళయరాజా,
    కళ: తోట తరణి,
    ఛాయాగ్రహణం: అజయ్‌ విన్సెంట్‌,
    మాటలు: పరుచూరి బ్రదర్స్‌,
    ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
    పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి,
    సమర్పణ: రాగిణీగుణ.
    కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం),
    విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్,
    మేకప్ : రాంబాబు,
    నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.
    విడుదల తేదీ: అక్టోబర్ 9, 2015

    ఫైనల్ గా 'రుద్రమదేవి' అనేదానికన్నా ఈ సినిమాకు గోన గన్నారెడ్డి అనే టైటిల్ పెట్టి అల్లు అర్జున్ ఎపిసోడ్స్ పెంచితే బాగుండును అనిపిస్తుంది. ఓ గొప్ప చిత్రం చూడబోతున్నాం అని ఎక్సపెక్టేషన్స్ తో కాకుండా మన జాతికి సంభందించిన ఓ చారిత్రక చిత్రం చూస్తున్నాం...అని వెళితే అంతగా నిరాశపరచదు. అలాగే.. అల్లు అర్జున్..‘గమ్మునుండవో..' అంటూ సాగదీసి చెప్పే డైలాగ్ కోసం కూడా చూడవచ్చు. రేసుగుర్రంలో ద్యాముడా డైలాగులా ఇదీ పాపులర్ అవుతుంది.

    English summary
    RudramaDevis is the most awaited movie after baahubali. Gunashekhar has put an great efforts for rudhramadevi and the movie is finally arriving todyay (oct 9th) .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X