Don't Miss!
- News
జనసేనతో ఏపీ బీజేపీ పొత్తు కటీఫ్.. భీమవరంలో బీజేపీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు?
- Finance
Adani News: నీటిపై కన్నేసిన అదానీ ఎంటర్ప్రైజెస్.. రూ.20 వేల కోట్ల సేకరణ దేనికంటే..?
- Automobiles
స్టీరింగ్ వీల్ కలిగిన మోడిఫైడ్ స్కూటర్: ఇది సృజనాత్మకత అవునో, కాదో.. మీరే చెప్పాలి
- Sports
పట్టువీడని రెజ్లర్లు.. డబ్ల్యూఎఫ్ఐ పదవికి బ్రిజ్ భూషణ్ సింగ్ రాజీనామా!
- Lifestyle
బుద్ధుడి విగ్రహాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, వాస్తు ప్రకారం ఎక్కడ ఉంచాలంటే
- Technology
Apple ఫోన్లు ,ల్యాప్ టాప్ లు ,ఇతర గాడ్జెట్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల వివరాలు!
- Travel
జ్ఞానోదయ యాత్రకు కేంద్రాలు.. ఏపీలోని ఈ నాలుగు బౌద్ధ క్షేత్రాలు!
Gurtundha Seethakalam Review నిదానంగా సాగే ఫీల్‌గుడ్ లవ్ స్టోరి.. సత్యదేవ్, తమన్నా ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?
2.5/5
నటీనటులు: సత్యదేవ్, తమన్నా భాటియా, కావ్యా శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహాసిని మణిరత్నం తదితరులు
కథ: కృష్ణ
మాటలు: లక్ష్మీ భూపాల
సినిమాటోగ్రఫి: సత్య హెగ్డే
మ్యూజిక్: కాల భైరవ
సమర్పణ: ఎంఎస్ రెడ్డి, చినబాబు
నిర్మాతలు: రామారావు చింతపల్లి, నాగ శేఖర్, భావన రవి
దర్శకత్వం: నాగ శేఖర్
రిలీజ్ డేట్: 2022-12-09

గుర్తుందా శీతాకాలం కథ ఏమిటంటే?
మధ్య తరగతి కుటుంబానికి చెందిన సత్యదేవ్ (సత్యదేవ్) అమ్మాయి ప్రేమను పొందాలని కోరికతో ఉంటాడు. కాలేజీలో సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి అమృత (కావ్యశెట్టి)తో ప్రేమలో పడుతాడు. అయితే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన సమయంలో అమృత బ్రేకప్ చెప్పడంతో సత్యదేవ్ షాక్‌లో ఉండిపోతాడు. విషాదకరంగా ఉన్న సమయంలో సత్యదేవ్ జీవితంలోకి నిధి (తమన్నా భాటియా) ప్రవేశిస్తుంది.

గుర్తుందా శీతాకాలంలో ట్విస్టులు
ప్రాణం కంటే ఇష్టంగా ప్రేమించిన అమ్మత ఎందుకు సత్యదేవ్‌కు బ్రేకప్ చెప్పింది? అమృతతో బ్రేకప్ తర్వాత సత్యదేవ్ పరిస్థితి ఏమిటి? మిడిల్ క్లాస్ కుర్రాడు సత్యదేవ్ మ్యారేజ్ ప్రపోజల్‌ను తన కంటే అందగత్తె నిధి అంగీకరించింది? అసలు నిధి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? నిధికి అబార్షన్ ఎందుకు జరిగింది? సత్యదేవ్ జీవితంలోకి నిధి వచ్చిన తర్వాత ఏం జరిగింది? సత్యదేవ్ జర్నీలో దివ్య పరిచయం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది. అసలు దివ్యతో సత్యదేవ్‌కు ఉన్న రిలేషన్ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే గుర్తుందా శీతాకాలం సినిమా కథ.

కథలో ఫీల్, ఎమోషన్స్ గురించి
కన్నడలో విజయవంతమైన లవ్ మాక్‌టెయిల్ అనే సినిమాకు రీమేక్‌గా గుర్తుందా శీతాకాలం రూపొందింది. తెలుగు నేటివిటికి తగినట్టు కొన్ని మార్పులతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అయితే అమృతతో లవ్ ట్రాక్ అంతగా గొప్పగా అనిపించదు. ఇక నిధితో జరిగే ప్రేమ వ్యవహారంలో ఫీల్, ఎమోషన్స్ కనిపించవు. కాకపోతే మాత్రం పేలవమైన కథ, కథనాలను సత్యదేవ్, తమన్నా తమ ఫెర్ఫార్మెన్స్‌తో మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారనిపిస్తుంది.

సత్యదేవ్ వన్ మ్యాన్ ఆర్మీగా
నటీనటుల విషయానికి వస్తే.. సత్యదేవ్ వన్ మ్యాన్ ఆర్మీగా కనిపిస్తాడు. సత్యదేవ్ పాత్రలో ఆయన ఫెర్ఫార్మెన్స్ కెరీర్ బెస్ట్ అనిపిస్తుంది. కథలో ఉండే రకరకాల వేరియేషన్స్‌ను బాగా పండించాడు. కాలేజీ, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా వేరియేషన్స్‌ను తన గెటప్‌తో మెప్పించాడు. సెకండాఫ్‌లో ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ వరకు ఫీల్‌గుడ్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడని చెప్పవచ్చు. ఇక కావ్య శెట్టి ఫర్వాలేదనిపించింది.

తమన్నా భాటియా ఫెర్ఫార్మెన్స్
నిధిగా తమన్నా భాటియా తన పాత్ర వరకు బాగా చేసింది. క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్లలో తన పాత్రలో ఒదిగిపోయింది. సత్యదేవ్‌తో కలిసి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని పండించింది. చివర్లలో తమన్నా ఫెర్ఫార్మెన్స్ భావోద్వేగానికి గురిచేస్తుంది. ఇక మిగితా క్యారెక్టర్లలో సత్యదేవ్ ఫ్రెండ్‌గా ప్రియదర్శి కామెడీని పండించాడు. కథకు ఫీల్‌గుడ్‌తో సపోర్ట్‌గా నిలిచాడు. సుహాసిని మణిరత్నం మిగితా క్యారెక్టర్లలో కనిపించిన వారు ఫర్వాలేదనిపించారు.

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. కాలభైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సత్య హెగ్డే సినిమాటోగ్రఫి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఇక ఇటీవల కాలంలో కలం పదును చూపిస్తున్న రైటర్ లక్ష్మీ భూపాల మరోసారి తన ప్రతిభను చాటుకొన్నాడు. ప్రేమకథకు కావాల్సిన సెన్సిబుల్ డైలాగ్స్‌ను, సున్నితమైన ఎమోషన్స్‌ను తన మాటల ద్వారా చక్కగా చెప్పారు. రామారావు చింతపల్లి, నాగ శేఖర్, భావన రవి పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. వేదాక్షర ఫిల్మ్స్ , నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ తమ మార్కు ప్రమాణాలను సెట్ చేశాయి.

ఫైనల్‌గా
రకరకాల ఎమోషన్స్‌తో కూడిన ప్రేమకథకు సత్యదేవ్, తమన్నా భాటియా ఫెర్ఫార్మెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్. అయితే కథ, కథనాలు ఆసక్తిగా లేకపోవడం ఈ సినిమాకు మైనస్. బలమైన సన్నివేశాలు లేకపోగా.. కథలో పండాల్సిన ఎమోషన్స్ సరిగా పండలేకపోవడం, చాలా స్లోగా, బోర్ కొట్టించేలా ఉండటం మరో మైనస్. నిదానంగా సాగే ఫీల్ గుడ్ లవ్ స్టోరికి ఓపిక చాలా అవసరమనిపిస్తుంది. సత్యదేవ్, తమన్నా భాటియా ఫ్యాన్స్‌కు అలాగే గందరగోళం లేకుండా.. హాయిగా నిదానంగా సాగే ప్రేమ కథా చిత్రాలను ఇష్టపడేవారికి గుర్తుందా శీతాకాలం నచ్చుతుంది.