For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చూస్తే టార్చరే...!(తమన్నా హిమ్మత్‌వాలా రివ్యూ)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: హాట్ అండ్ సెక్సీ తమన్నా అంద చందాలు, అజయ్ దేవగన్ యాక్షన్, సాజిత్ ఖాన్ దర్శకత్వం, 1983లో వచ్చిన హిట్ సినిమా'హిమ్మత్‌వాలా'కు రీమేక్..... ఇవన్నీ పాజిటివ్ అంశాలుగా భావించి ఈ వీకెండ్ హిందీ మూవీ 'హిమ్మత్‌వాలా' చూడటానికి ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీకో హెచ్చరిక...అనవసరంగా ఆ తర్వాత రెండు రోజులు వృధా చేసుకోకండి. ఆ రేంజిలో ఉంటుంది ఈ సినిమా చూసిన వారికి టార్చర్.

  కథ: రవి(అజయ్ దేవగన్) యాక్షన్ మాస్టర్. తన కండ బలంతో ముంబై క్లబ్సుల్లో జరిగే జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఒక రోజు తన ఊరు వెళ్లి తన వాళ్లను కలుసుకోవాలని తన స్వగ్రామం రామ్ నగర్ కు వెళతాడు. అక్కడ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి. షేర్ ఖాన్(మహేష్ మంజ్రేకర్) అనే భూస్వామి పేదవారిపై ఆధిపత్యం చెలాయిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. అతనికి బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంటాడు రవి. అదే సమయంలో అతని కూతురు రేఖ(తమన్నా)తో ప్రేమలో పడతాడు. దీంతో రవిపై పగబట్టిన షేర్ ఖాన్ అతనిపై రివేంజ్ తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది తర్వాతి కథ.

  పెర్ఫార్మెన్స్: అజయ్ దేవగన్ యాక్షన్ ఆయన అభిమానులను మెప్పిస్తుందేమోగానీ...ఈ సినిమాలో ఆయన పాత్రను మలిచిన తీరు, అతని ఫర్ఫార్మెన్స్ తనను తానే నవ్వుల పాలు చేసుకునే విధంగా ఉంది. తమన్నా తన అందచందాలతో ఆకట్టుకుంది.

  ప్లస్ పాయింట్స్: సినిమాలో ఒక్కటంటే ఒక్క ప్లాస్ పాయింట్ కూడా లేదు.

  మైనస్ పాయింట్స్: అన్నీ మైనస్ పాయింట్లే...

  1983లో శ్రీదేవి-జితేంద్ర కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘హిమ్మత్‌వాలా'ను అదే పేరుతో రీమేక్ చేసారు.

  ఈ చిత్రంలో తమన్నా, అజయ్ దేవగన్ జంటగా నటించారు.

  సౌత్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చాక తమన్నాకు ఇది తొలి బాలీవుడ్ మూవీ.

  హిమ్మత్ వాలా చిత్రంలోని ఓ సాంగ్ లోని చిత్రం.

  జితేంద్ర పోషించిన పాత్రను ఈచిత్రంలో అజయ్ దేవగన్ పోషించారు.

  సాజిద్ ఖాన్ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు.

  హిమ్మత్ వాలా చిత్రంలో పరేష్ రావల్.

  శయంతని షోష్ ఈచిత్రంలో ఐటం సాంగ్ చేసిది.

  అజయ్ దేవగన్ చేసిన యాక్షన్ సీన్లు ఓవర్ గా ఉన్నాయి.

  జరీనా వాహబ్ ఈచిత్రంలో అజయ్ దేవగన్ తల్లి పాత్ర పోషించింది.

  విశ్లేషణ: 80ల్లో వచ్చిన 'హిమ్మత్‍‌వాలా' లాంటి గొప్ప చిత్రాన్ని రీమేక్ చేసుకునేటప్పుడు దర్శకుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ దర్శకుడు సాజిద్ ఖాన్ ఈచిత్రాన్ని తెరకెక్కించిన తీరు చెత్తగా ఉంది. ఇరిటేటింగ్ మెలో డ్రామా, ఓవర్ యాక్టింగ్, కుళ్లు జోకులు, తెలివితక్కువ తనంతో జొప్పించని వినోదం పాళ్లు, వికృతమైన డాన్స్ స్టెప్పులు ఇలా సినిమాను కంపు కొట్టించాడు.

  ఫైనల్ వర్డ్: ఈ సినిమా టికెట్ ఫ్రీగా ఇచ్చినా....... ఎందుకొచ్చామా? అనే విధంగా తల బాదుకుంటారు.

  English summary
  If you are seriously planning for Sajid Khan's Himmatwala this weekend, here's a warning for you - Do not spoil your next two days. This movie has all the ingredients to make you go lunatic. Yes, I'm certainly not exaggerating as I mean it. We understand the need of funny, light-hearted movies these days, amidst our busy schedule, but this (Himmatwala) is more of a torture than any sort of entertainment.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X