twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభినందించదగ్గ ప్రయత్నం

    By Staff
    |

    Hindustan
    చిత్రం: హిందుస్థాన్‌
    నటీనటులు: నరేష్‌, భానుప్రియ, శ్రద్ద, బేబీ జీతా, మాస్టర్‌ సాయి శుభాకర్‌
    సంగీతం: కీరవాణి
    కథ, సినిమాటోగ్రఫీ: హరి అనుమోలు
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం
    నిర్మాత: జి.హరిబాబు

    ప్రస్తుతం అన్నిదేశాలూ ఎదుర్కొంటున్న సమస్య-తీవ్రవాదం. ఈ అంశాన్నే తీసుకోని, ఇద్దరు పిల్లలు ప్రధానపాత్రధారులుగా చేసుకొని తీసిన సినిమా ఇది. ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చినా, ఏ మాత్రం అనుభవం లేని ఓ దర్శకనిర్మాత చేసిన తొలిప్రయత్నం అభినందించదగ్గది.

    నరేష్‌ వ్యాపారవేత్త. అతని పక్క ఇంట్లోనే ముఖ్యమంత్రి సోమయాజులు ఉంటాడు. గతంలో రక్షణ మంత్రిగా పనిచేసిన సోమయాజులును చంపేందుకు తీవ్రవాదులు కుట్ర పన్నుతారు. ఇందుకు నరేష్‌ ఇంటిని ఎంచుకుంటారు. వాచ్‌ మెన్‌ ను లోబర్చకోని నరేష్‌ ఇంట్లోకి జొరబడి రిమోట్‌ సహాయంతో ముఖ్యమంత్రి కారును పేల్చి వేసి చంపేస్తారు. దాంతో పోలీసులు నరేష్‌, అతని భార్య భానుప్రియ, తల్లితండ్రులు ఏవీఎస్‌, రమాప్రభలను అరెస్ట్‌ చేసి ఇంటరాగేట్‌ చేస్తారు.

    ఎక్స్‌ కర్సన్‌ వెళ్ళి వచ్చిన నరేష్‌ పిల్లలతో వాచ్‌ మెన్‌ పట్టుకునేందుకు పోలీసు ఆఫీసర్‌ పునీత్‌ ఇస్సార్‌ ప్రయత్నంచేస్తాడు. ఆ ప్రయత్నంలో పిల్లలు (బేబీ జీతా, మాస్టర్‌ సాయి శుభాకర్‌) మిలిటెంట్లకు దొరికిపోతారు. ఈ ఇద్దరు పిల్లలు తమ మాటలతో, చేష్ఠలతో కరుడుగట్టిన తీవ్రవాదుల మనసులను ఎలా మార్చుతారో చిత్రం క్లైమాక్స్‌.

    తీవ్రవాదానికి చూపిన పరిష్కారం సినిమాటిక్‌ గా ఉన్నప్పటికీ దర్శకుడు ఎంచుకున్న బ్యాక్‌ డ్రాప్‌, కమిట్‌ మెంట్‌ తో తీసిన విధానం మెచ్చుకోతగ్గది. నరేష్‌, భానుప్రియ వంటి ఆర్టిస్ట్‌ లను కేవలం రెండు, మూడ్‌ సీన్‌ లకే పరిమితం చేసి, సినిమాంతా కొత్తవాళ్ళతో నడిపించడం బట్టి చూస్తే దర్శకుడికి సినిమా మీద పట్టు ఉన్నట్లు స్పష్టమవుతుంది. నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా బాలనటులు జీతా, సాయిశుభాకర్‌ లు చిన్నవాళ్ళైనా చాలా బాగా నటించారు. కీరవాణి సంగీతం, హరిఅనుమోలు సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఉగ్రవాదం మీద వేటూరి రాసిన పాట ఆలోచింపచేసేవిధంగా ఉంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X