For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Hit 2 Review గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ.. హిట్ 2లో కిల్లర్ ఎవరంటే?

  |

  Rating:
  3.0/5

  నటీనటులు: అడివి శేష్, మీనాక్షి చౌదరీ, రావు రమేష్, కలర్ ఫోటో సుహాస్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
  దర్శకుడు : శైలేష్ కొలను
  నిర్మాత: ప్రశాంతి
  మ్యూజిక్: ఎంఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి
  సినిమాటోగ్రఫి: ఎస్ మణికందన్
  ఎడిటర్: గ్యారీ బీహెచ్
  బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా
  రిలీజ్ డేట్: 2022-12-02

  హిట్ 2 కథ ఏమిటంటే?

  హిట్ 2 కథ ఏమిటంటే?

  కృష్ణదేవ్ అలియాస్ కేడీ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్. ఎలాంటి మర్డర్ కేసునైనా క్షణాల్లో తేల్చేసే సత్తా ఉన్న ఆఫీసర్‌‌కు సంజన అనే యువతి‌తోపాటు మరో ముగ్గురి హత్యా సంఘటన తన ప్రతిభకు ఛాలెంజ్ విసురుతుంది. సంజన మర్డర్ కేసు విచారణ కొనసాగుతున్న ఓ సమయంలో సస్పెన్షన్‌కు గురి అవుతాడు.

  హిట్ 2 లో ట్విస్టులు

  హిట్ 2 లో ట్విస్టులు

  సంజనతోపాటు మరో ముగ్గురి హత్య వెనుక కారణం ఏమిటి? హంతకుడిని పట్టుకోవడంలో కృష్ణదేవ్ వేసిన తప్పటడుగు ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది. సంజన హత్య కేసులో రంగడు అనే అనుమానితుడు ఎలా బలిపశువు అయ్యాడు. సంజన హత్యకు కారణమైన సీరియల్ కిల్లర్ ఎవరు? కృష్ణదేవ్ లవర్ ఆర్య (మీనాక్షి చౌదరీ)ని కిల్లర్ ఎందుకు టార్గెట్ చేశాడు? సస్పెన్షన్ తర్వాత హంతకుడిని కేడీ ఎలా పట్టుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే హిట్ 2 సినిమా కథ.

  హిట్ 2 కథ ఎలా సాగిందంటే?

  హిట్ 2 కథ ఎలా సాగిందంటే?

  వైజాగ్‌లో ఓ హత్యా సంఘటనతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. కృష్ణదేవ్ క్యారెక్టర్‌ను తెర మీద దర్శకుడు మలచిన విధానం బాగుంది. సూటిగా సుత్తిలేకుండా మాట్లాడే కృష్ణదేవ్ బాడీ లాంగ్వేజ్, స్టైయిల్ ఆకట్టుకొనేలా డిజైన్ చేయడం బాగుంది. కేసు దర్యాప్తును తెర మీద ముందుకు తీసుకెళ్లడంలోను. పక్కా స్క్రీన్ ప్లేతో సింపుల కథను ఆసక్తిగా చెప్పడంలో కూడా దర్శకుడు శైలేష్ సఫలమయ్యాడు. ఫస్టాఫ్ విషయానికి వస్తే. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో ఆసక్తికరమైన ట్విస్టులతో ముగించడం సినిమా పాజిటివ్ అయితే.. మితిమీరిన హింస కాస్త జుగప్సగా అనిపిస్తుంది

  అడివి శేష్, మీనాక్షి చౌదరీ గురించి

  అడివి శేష్, మీనాక్షి చౌదరీ గురించి

  కృష్ణదేవ్ పాత్రలో అడివి శేష్ ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్.. యూనిక్ డైలాగ్ డెలీవరీతో మొదట్లోనే ఆకట్టుకొంటాడు. కథతోపాటు ట్రావెల్ అవుతూ కృష్ణదేవ్ పాత్రను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాడని చెప్పవచ్చు. కథలో అరటిపండులా అవసరం లేని రొమాంటిక్ సీన్లలోను ఫర్వాలేదనిపించాడు. ఓవరాల్‌గా చూస్తే.. మేజర్ తర్వాత ఫెర్ఫార్మెన్స్ పరంగా మరో మెట్టు ఎక్కాడని చెప్పవచ్చు. ఇక మీనాక్షి చౌదరీ.. సినిమాకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌గా నిలిచింది. ఎమోషనల్ సన్నివేశాల్లో మెచ్యురిటీని ప్రదర్శించింది.

  మిగితా క్యారెక్టర్లలో

  మిగితా క్యారెక్టర్లలో


  మిగితా పాత్రల విషయానికి వస్తే.. పోలీస్ ఆఫీసర్‌గా శ్రీనాథ్ మాగంటి మరో మంచి పాత్రలో ఆకట్టుకొన్నాడు. పాత్ర నిడివి తక్కువైనా కీలక సన్నివేశాల్లో తన ప్రజెన్స్‌ను చూపించుకొన్నాడు. హిట్ 1‌తోపాటు హిట్ 2లో కూడా డిఫరెంట్ లుక్‌తో మెప్పించాడు. ఇక రావు రమేష్ మరోసారి విభిన్నమైన పాత్రలో కనిపించారు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండిలాంటివే.. ఇక సుహాస్ ఈ సినిమాను మలుపు తిప్పే పాత్రలో నటించాడు. కలర్ ఫోటో తర్వాత తనకంటూ ఇమేజ్ తెచ్చిపెట్టే పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. క్లైమాక్స్‌లో సుహాస్ పలికించిన ఎమోషన్స్ బాగున్నాయి.

  సాంకేతిక విభాగాల పనితీరు..

  సాంకేతిక విభాగాల పనితీరు..

  హిట్ 2 సినిమాకు సంబంధించి సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. మ్యూజిక్ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్. ఎంఎం శ్రీలేఖ కంపోజ్ చేసిన ఉరికే ఉరికే పాట ఆడియో పరంగాను.. తెరమీద కూడా బాగుంది. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ సహకారం సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. మణికందన్ సినిమాటోగ్రఫి విషయానికి వస్తే... మర్డర్ మిస్టరీకి కావాల్సిన మూడ్‌ను క్రియేట్ చేయడంలో అతడు వాడుకొన్న లైటింగ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఎడిటింగ్ విషయంలో ఎలాంటి లోపాలు లేవు. నాని, ప్రశాంతి నిర్మించిన ఈ సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ప్రమాణాలకు అనుగుణంగా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ఈ సినిమాకు మరింత పాజిటివ్‌గా మారింది.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్
  అడివి శేష్, ఇతర నటీనటుల ఫెర్ఫార్మెన్స్
  స్క్రీన్ల్ ప్లే
  మ్యూజిక్
  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  మైనస్ పాయింట్స్
  సెకండాఫ్‌లో స్లో నేరేషన్
  మితిమీరిన హింస
  ఎమోషనల్‌ కంటెంట్ తగ్గడం

  హిట్ 2 ఫైనల్‌గా ఎలా ఉందంటే?

  హిట్ 2 ఫైనల్‌గా ఎలా ఉందంటే?


  హిట్ 2 నటీనటుల ఫెర్ఫార్మెన్స్, సాంకేతిక నిపుణుల ప్రతిభ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌ బేస్డ్ మర్డరీ మిస్టరీ. మర్డర్ అనే సింగిల్ పాయింట్ చుట్టూ అల్లుకొన్న క్యారెక్టర్లు సినిమాకు బలం. ప్రతీ క్యారెక్టర్ మీద అనుమానాలు క్రియేట్ చేసి.. హంతకుడు ఎవరు? విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో దర్శకుడు ప్రతిభను చాటుకొన్నాడు. అయితే సెకండాఫ్‌లో ముఖ్యంగా క్లైమాక్స్‌లో హింస, నేర ప్రవృత్తి, రక్తపాతం ఒళ్లు జలదరించేలా ఉన్నాయి. చిన్నపిల్లలను ఈ సినిమాకు దూరంగా ఉంచితే మంచింది.. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఆదరించే వారికి హిట్ 2 నచ్చుతుంది. ఇప్పటికే కలెక్షన్ల పరంగా మంచి బజ్ క్రియేట్ చేసింది.. ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.

  ట్యాగ్ లైన్: పర్‌ఫెక్ట్ స్క్రీన్ ప్లే, గ్రిప్పింగ్‌గా మర్డర్ మిస్టరీ

  English summary
  Naturnal Star Nani and Shailesh Kolanu's Hit 2 is set release on December 2nd. Here is the Telugu filmibeat's Exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X