»   » చూడటమే హర్రర్ (త్రిష 'నాయకి' రివ్యూ)

చూడటమే హర్రర్ (త్రిష 'నాయకి' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

దశాబ్దం పైగానే హీరోయిన్ గా కొనసాగిన త్రిష ఇప్పుడు దాదాపు కెరీర్ చివరి దశలో ఉంది. ఇప్పుడు ఆమె నాయకి గా చేసిన ప్రయత్నం కూడా ఆమె క్రేజ్ ఎంత ఉందో తెలుసుకోవటానికి చేసిన ఒక ప్రయోగం గా మాత్రమే అనుకోవాలి. ఇన్ని సంవత్సరాల కెరీర్ లో దక్షిణాది అగ్రహీరోలందరి సరసనా నటించిన త్రిష ఇప్పటివరకూ లేడీ ఓరియంటెడ్ మూవీ మాత్రం చేయలేదు. ఇక ఆ కోరిక కూడా తీర్చుకోవాలనుకుందేమో. నాయకి గా తయారయ్యింది. హారర్ కామెడీగా వచ్చిన నాయకి ఎంత మేరకు భయ పెట్టిందీ..., ఎంత నవ్వించిందీ.. అసలు త్రిష కి ఈ నాయకి ఎంతవరకూ ప్లస్ ఔతుందీ అంటే....

దుండగల్‌ ప్రాంతంలో వరుసగా కొంతమంది వ్యక్తులు అపహరణకు గురవుతుంటారు. అక్కడకు వెళ్లిన వాళ్లెవ్వరూ తిరిగి రారు. దీంతో ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని డేంజర్‌ జోన్‌లో పెడుతుంది. క్రమంగా వూరు ఖాళీ అవుతుంది. ప్రభుత్వం కూడా ఆ వూరి పొలిమేరలో ఓ గోడ కడుతుంది. సంజయ్ ("సత్యం" రాజేశ్) అనే ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్ ఓసారి అనుకోకుండా దుండగల్‌ ప్రాంతంలోకి అడుగుపెట్టాల్సి వస్తుంది. అక్కడున్న ఒక బంగ్లాలో గాయత్రి (త్రిష) ఆత్మ తిరుగుతుంటుంది. దయ్యాలమీద నమ్మకం ఉందదు కానీ నిజానికి సంజయ్ చాలా భయస్తుడు. కానీ అమ్మాయిల ముందు బిల్డప్‌ కోసం తాను దయ్యాలను చెడుగుడు ఆడుకుంటాను అన్న రేంజ్ లో మాట్లాడుతూంటాడు. అలాంటి సంజయ్ కి గాయత్రి ఆత్మ తో ఎలాంటి అనుభవాలెదురయ్యాయి? దుండగల్‌ ప్రాంతంలో కనపడకుండా పోయిన చాలామందికీ గాయత్రీకి ఉన్న సంబంధం ఏమిటి? అసలు సంజయ్‌ అక్కడకు ఎందుకు వెళ్లాడు? గాయత్రి కథేంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మాత్రం "నాయకి" టికెట్ బుక్ చేసుకోవాల్సిందే...


Hit or Flop Trisha Nayaki Movie Review

ఇక నటులవిషయానికి వస్తే సినిమా మొత్తం లో ఎక్కువ మార్కులు పడేది రాజేష్ కే. సంజయ్ పాత్ర ని తన సొంత స్వాభావమే అన్నంతగా నమ్మించే నతన. స్వతహాగా కామెడీ నటుడే కావటం తో తన పాత్రకి న్యాయం చేసాడు. ఇక మిగిలిన పాత్రలను గురించి పెద్దగా చెప్పేదేం లేదు. కథ ప్రకారం మిగిలిన ఎవ్వరికీ అంత స్కోప్ దక్కలేదు. సుష్మారాజ్ బాగానే చేసినా అంత చెప్పుకోదగ్గ పాత్రకాదు. ఆఖరికి మెయిన్ క్యారెక్తర్ అయిన త్రిషకి కూదా ఎక్కువ నటించే అవకాసమే రాలేదు. పోస్టర్లపై త్రిష ఫొటోనే కనిపిస్తున్నా.. ఈ సినిమాలో ఆమెకున్న ప్రాధాన్యం తక్కువ. నిజానికి ఫస్టాఫ్‌ అంతా సత్యం రాజేష్‌పైనే సాగుతుంది. సెకండాఫ్‌లో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌కి తప్ప త్రిష పాత్రకు ప్రాధాన్యం లేదు. ఇక బ్రహ్మానందం, కోవై సరళా ల లాంటి పెద్ద కమేడియన్ లు ఉన్నా నాతకం ఎపిసిఓడ్ మరీ నాతకీయంగా అనిపిస్తుంది. ఇక అథిడి పాత్రల్లో వచ్చిన నారా రోహిత్, పూనం కౌర్ లు కేవలం ఒక హైప్ కోసమే తప్ప మరే ఉపయోగమూ లేదు. మొత్తానికి కథని సరిగా రాసుకోకపోవటం వల్ల నటులకు నటించే అవకాసమే పెద్దగా దక్కలేదు.


టెక్నికల్ గా కథఅందించిన అయిన గోవికి ఇప్పుడు పాస్ మార్కులు వేయటం కూడా కష్టమే... సత్యం రాజేష్‌ని దుండగల్‌లోకి బంగ్లాలోకి రప్పించే విధానం ఆసక్తి కలిగిస్తుంది. ఓ కమెడియన్‌ని దెయ్యం ఆడుకోవడం అనేది ఎప్పటి నుంచో చూస్తున్నదే. 'నాయకి'లోనూ అవే ఎపిసోడ్లు కనిపిస్తాయి. ఆ సన్నివేశాలు రొటీన్‌గానే అనిపించినా... కామెడీ పండిస్తాయి. విశ్రాంతి వరకూ కామెడీగా సాగిన 'నాయకి'.. ఆ తర్వాత ఎమోషనల్‌ టచ్‌లోకి వెళ్తుంది. త్రిష ఫ్లాష్‌ బ్యాక్‌ మరీ వీక్‌. ఏదో జరిగింది అని ఆసక్తిగా చూద్దామనుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది. ఎంత హారర్ కామెడీ అయినా కాస్త భయం కూదా ఉండాలి అసలు మెయిన్ గా మిస్సయ్యిందే "భయం". రఘు కుంచె బాణీలు ఏదో పైవేట్ ఆల్బం లా అనిపించినా చాయాగ్రహణం తో పర్వాలేదు అనిపిస్తాయి.. సాయి కార్తీక్ నేపథ్య సంగీతం అంతంతమాత్రమే. లొకేషన్లు ఎక్కువగా లేనప్పటికీ ఉన్నంతలో కెమెరావర్క్ బాగుంది. భాస్కరభట్ల గీతాలు తెరవరకే పరిమితం.


'లవ్‌ యు బంగారం' చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు గోవి గత కొంత కాలంగా సక్సెస్‌లు అవుతున్న హర్రర్‌ కామెడీ స్క్రిప్ట్‌ను ఎంచుకున్నాడు. భయపెడుతూనే నవ్వించాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు ఈ కథను ఎంపిక చేసుకున్నాడు. అటు నవ్వించ లేకా ఇటు భయపెట్టనూ లేక సోసోగా నాయకిని నిలబెట్టాడు.రెండు విధాలుగా విఫలం అయిన దర్శకుడు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. త్రిష వంటి హీరోయిన్‌ను చేతిలో పెట్టుకుని దర్శకుడు వృదా చేసుకున్నాడు అని చెప్పక తప్పదు. సినిమా గురించి ముందే తెలిసి త్రిష ప్రమోషన్‌కు దూరంగా ఉందేమో అనిపిస్తోంది. ఇలాంటి సినిమాకు ఎంత ప్రమోషన్‌ చేసినా వృదానే అని త్రిష అనుకుందేమో.ఫైనల్ గా నాయకి చిత్రం ...అటు హర్రర్ అభిమానులని కానీ ఇటు హర్రర్ కామెడీ అబిమానులని కానీ సంతృప్తి పరచలేకపోయింది. త్రిష అభిమానులకు కూడా కష్టమనిపించే ఈ చిత్రం చూడ్డటమే ఓ హర్రర్ ఎక్సపీరియన్స్ అని చెప్పక తప్పదు.


ప్లస్‌ పాయింట్స్‌ :త్రిష, రాజేష్.


మైనస్‌ పాయింట్స్‌ : పై రెండూ తప్ప మిగిలినవన్నీ కామెడీ


ఫైనల్ గా నాయకి చిత్రం ...అటు హర్రర్ అభిమానులని కానీ ఇటు హర్రర్ కామెడీ అబిమానులని కానీ సంతృప్తి పరచలేకపోయింది. త్రిష అభిమానులకు కూడా కష్టమనిపించే ఈ చిత్రం చూడ్డటమే ఓ హర్రర్ ఎక్సపీరియన్స్ అని చెప్పక తప్పదు.

English summary
'Nayaki' is yet again a horror genre and there is nothing new to us. But performance wise, Trisha has been the centre of attraction.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu