Hridayapoorvam Twitter Review: హృదయపూర్వం ట్విట్టర్ రివ్యూ అండ్ రేటింగ్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం హృదయపూర్వం. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సత్యన్ అంతికాడ్ దర్వకత్వం వహించారు. డైరెక్టర్ కుమారుడు అఖిల్ సత్యన్ రాసిన కథకు సోను టీపీ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాను ఆశ్వీరాద్ సినిమాస్ బ్యానర్‌పై అంటోని పెరంబవూర్ నిర్మించారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, సంగీత్ ప్రతాప్, సంగీత మాధవన్ నాయర్, సిద్దిఖీ, లాలు అలెక్స్, జనార్ధన్, సబితా ఆనంద్, బాబురాజ్, నిషాన్, ఎస్పీ చరణ్ తదితరులు నటించారు. మీరా జాస్మిన్, బాసిల్ జోసెఫ్ అతిథి పాత్రల్లో కనిపించారు.

ఈ సినిమా సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. అను మోథేదాత్ సినిమాటోగ్రఫిని, కే రాజ్‌గోపాల్ ఎడిటింగ్, జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ బాధ్యతలను నిర్వహించారు. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రం ఓనమ్ పండుగ సందర్భంగా ఆగస్టు 28వ తేదీన రిలీజైంది. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో నెటిజన్ల రివ్యూలు, అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..

Hridayapoorvam Twitter Review

హృదయపూర్వం బ్యూటీఫుల్ ఫిలిం. మోహన్ లాల్ నటించిన సందీప్ క్యారెక్టర్ లవ్లీగా ఉంది. ప్రేమికుడుగా ఆయన అద్బుతంగా నటించాడు. తన నటనతో ఫీల్ గుడ్‌గా మార్చారు. సంగీత్ ప్రతాప్ కామెడీ టైమింగ్ అద్బుతంగా ఉంది. మాళవిక గ్లామర్ పరంగానే కాకుండా యాక్టింగ్‌గా పరంగా ఆకట్టుకొన్నది.


హృదయపూర్వం మూవీ ఫస్టాఫ్ ఫన్‌తో సాగింది. సెకండాఫ్ సింపుల్‌గా రొమాంటిక్ కామెడీగా అనిపిస్తుంది. మోహన్ లాల్, సంగీత్ ప్రతాప్ కాంబినేషన్ అదిరిపోయింది. సందీప్ క్యారెక్టర్‌లో మోహన్ లాల్ చాలా ఫ్రెష్‌గా కనిపించారు. పాటలన్నీ బాగున్నాయి. న్యూజనరేషన్‌కు తగినట్టుగా సత్యన్ కథను తెరకెక్కించారు. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్‌గా ముగించారు. అందరికి నచ్చే విధంగా మంచి వినోదాత్మకమైన చిత్రమని చెప్పవచ్చు. మూడోసారి 100 కోట్ల వసూళ్లను మోహన్ లాల్ రాబట్టనున్నారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

హృదయపూర్వం సినిమా ఫస్టాఫ్ ముగిసింది. మోహన్ లాల్, సంగీత్ మధ్య సాగే సన్నివేశాలు హిలేరియస్‌గా ఉన్నాయి. హ్యుమర్ మంచి క్వాలిటీతో ఉంది. రైటింగ్ చాలా అద్బుతంగా ఉంది. సెకండాఫ్ బాగుంటే ఈ సినిమా హిట్ కావడానికి చాలా అవకాశాలు ఉన్ానయి. మరోసారి కేరళ బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

హృదయపూర్వం సినిమా నైస్‌గా ఉంది. సత్యన్ అంతికాడ్ మ్యూజిక్ ప్యూర్‌గా కనిపించింది. మోహన్ లాల్‌కు ఈ ఏడాది హ్యాట్రిక్ సినిమాగా మారడం ఖాయం అని నెటిజన్ కామెంట్ చేశాడు.

హృదయపూర్వం సినిమా సింపుల్ స్టోరి, కామెడీ సీన్లతో కూడిన స్క్రీన్ ప్లే బాగుంది. నటీనటుల ఎంపిక సూపర్. ఈ చిత్రంలో నటించిన వారంతా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది. సినిమా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్‌గా సాగింది. స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు ఉన్నా యాక్టర్ల పెర్ఫార్మెన్స్‌తో వాటిని కప్పిపుచ్చాయి. బీజీఎం, సాంగ్స్ వేరీ గుడ్. సంగీత్ ప్రతాప్ తన పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. మొత్తంగా ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీ అని చెప్పవచ్చు. నా రేటింగ్ 3.5/5 అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

హృదయపూర్వం సినిమా ఫస్టాఫ్ మాత్రమే కాకుండా సెకండాఫ్ కూడా అదిరిపోయింది. మోహన్ లాల్ , సంగీత్ కెమిస్ట్రీ అదిరిపోయింది. ఫన్‌తో కూడిన సన్నివేశాలు బాగున్నాయి. ఎమోషన్స్‌తో సాగే సన్నివేశాలు వర్కవుట్ అయ్యాయి. బీజీఎం, పాటలు బాగున్నాయి. నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని నెటిజన్ అభిప్రాయపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X