For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంద్రసేన మూవీ రివ్యూ: విజయ్ ఆంటోని డబుల్ డోస్

  By Rajababu
  |

  Rating:
  2.5/5
  Star Cast: విజయ్ ఆంటోని, డయానా చంపిక, మహిమ
  Director: జీ శ్రీనివాసన్

  'Indrasena' Movie Public Talk 'ఇంద్రసేన' మూవీ పబ్లిక్ టాక్..!

  బిచ్చగాడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన నటుడు, సంగీత దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి విజయ్ ఆంటోని తాజా చిత్రం ఇంద్రసేన. ఈ చిత్రాన్ని ఫాతీమా విజయ్ ఆంటోని, నటి రాధికా శరత్ కుమార్ సంయుక్తంగా విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఆర్ స్టూడియో బ్యానర్‌పై రూపొందించారు. తొలిసారి ద్విపాత్రాభినయంతో ముందుకు వచ్చిన విజయ్ ఆంటోని మరోసారి సక్సెస్ చేజిక్కించుకొన్నారా? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించారు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ గురించి తెలుసుకోవాల్సిందే.

  ఇంద్రసేన కథ ఇది..

  ఇంద్రసేన కథ ఇది..

  ఇంద్రసేన, రుద్రసేన (విజయ్ ఆంటోని) ఇద్దరు కవలలు. రంగు, రూపం ఒకేలా ఉంటాయి. తాన ప్రియురాలు ఎలిజబెత్ మరణంతో ఇంద్రసేన తాగుడు బానిస అవుతాడు. రుద్రసేన ఓ పాఠశాలలో వ్యాయామ టీచర్‌ (పీఈటీ)గా పనిచేస్తుంటాడు. అనుకొని పరిస్థితుల్లో ఇంద్రసేన ఓ కేసులో ఇరుక్కొని 7 ఏళ్లు జైలుకు వెళుతాడు. తాను ఇష్టపడిన అమ్మాయి రేవతిని పెళ్లి చేసుకోవాల్సిన రుద్రసేన కిరాయి రౌడీగా మారుతాడు. దాంతో రుద్రసేనకు రేవతి దూరమవుతుంది.

  ఇంద్రసేన కథకు ముగింపు

  ఇంద్రసేన కథకు ముగింపు

  ఇలాంటి పరిస్థితుల్లో ఇంద్రసేన జైలు నుంచి వచ్చిన తర్వాత ఏం జరిగింది? సౌమ్యుడైన రుద్రసేన ఎందుకు రౌడీగా మారాడు? తన కారణంగానే కుటుంబం పాడైపోయిందనే తల్లిదండ్రుల ఆవేదనకు ఇంద్రసేన ఎలా సాంతన చేకూర్చాడు. రౌడీగా మారిన ఇంద్రసేన చివరకు ఏమైపోయాడు? చివరకు రేవతిని పెళ్లి చేసుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఇంద్రసేన చిత్రం.

  ఇంద్రసేన విశ్లేషణ

  ఇంద్రసేన విశ్లేషణ

  ఇద్దరు అన్నదమ్ముల జీవితంలో ప్రతికూల పరిస్థితులు చోటుచేసుకొన్న కారణంగా వారు పడిన సంఘర్షణ ఏమిటి?, వాటిని వారు ఎలా ఎదుర్కొన్నారు. అందుకు వారు జీవితంలో ఏం త్యాగం చేశారు అనేది క్లుప్తంగా ఈ చిత్ర కథ. ఎప్పటిలానే తన పరిధికి మించని, తన బాడీ లాగ్వేంజ్‌కు సరిపోయే రెగ్యులర్ కథనే ఎంచుకొన్నాడు. కాకపోతే భావోద్వేగ అంశాలు కథను ముందుకు తీసుకెళ్తాయి.

  బిచ్చగాడుతో భారీగా అంచనాలు

  బిచ్చగాడుతో భారీగా అంచనాలు

  అయితే గతంలో వచ్చిన బిచ్చగాడు లాంటి చిత్రాలను పోల్చుకొంటే విజయ్ ఆంటోని సినిమాలను ఇష్టపడేవారికి కొంత నిరాశే అని చెప్పవచ్చు. కేవలం విజయ్ ఆంటోని యాక్టింగ్ వల్లనే ఇంద్రసేన సినిమా చిత్రంగా యావరేజ్ చిత్రంగా అనిపిస్తుంది. లేకపోతే ఈ సినిమా పరిస్థితి మరోలా ఉండేదేమో అనిపిస్తుంది.

  ఇంద్రసేన ఫస్టాఫ్

  ఇంద్రసేన ఫస్టాఫ్

  ఇంద్రసేన చిత్రంలో రుద్రసేన, ఇంద్రసేన పాత్రల కథ, క్యారెక్టరైజేషన్ విజయ్ ఆంటోనికి తగినట్టుగానే ఉంటాయి. సినిమా ప్రారంభంలో ఇంద్రసేన ఎంట్రీ ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమా ప్రథమార్థంలో పాత్రల పరిచయం చక్కగా సాగిపోతుంది. పాటలు కూడా ఫీల్‌గుడ్‌గానే సాగిపోతుంటాయి. అయితే తాగుడుకు బానిసైన ఇంద్రసేన ఆ అలవాటు నుంచి బయటపడి మంచివాడిగా మారే క్రమంలో ఓ సంఘటన చేసుకోవడం, వెంటనే అతను జైలుపాలుకావడం అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత ఓ మంచి ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్‌ ఆసక్తికరంగా మారుతుంది.

  ఇంద్రసేన సెకండాఫ్

  ఇంద్రసేన సెకండాఫ్

  ఇంద్రసేన రెండో భాగంలో సౌమ్యుడిగా ఉండే రుద్రసేన రౌడీగా మారడం, ఇంద్రసేన తనకు జరిగిన అన్యాయాలకు బదులు తీర్చుకోవడం లాంటి అంశాలతో సాదాసీదాగా సాగిపోతుంది. రెండో భాగంలో కథా చట్రంలో ఇరుక్కుపోవడం కారణంగా విభిన్నంగా కథను మలచడానికి వీలుకాలేదనిపిస్తుంది. అయితే ఓ విలక్షణమైన ముగింపుతో ముగించాలనే దర్శకుడి నిర్ణయం ప్రేక్షకుల అంచనాలకు దూరంగా ఉండటం అసంతృప్తిగా బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

  విజయ్ ఆంటోని యాక్టింగ్

  విజయ్ ఆంటోని యాక్టింగ్

  ఇంద్రసేన కథకు విజయ్ ఆంటోని పూర్తిగా న్యాయం చేశాడు. రెండు పాత్రలను సమర్ధవంతంగా పోషించాడనడంలో ఎలాంటి డౌట్ ఉండదు. కానీ కథలో వేగం, కథనంలో ఆసక్తి లేకపోవడం సినిమాను విజయ్ ఆంటోని మరోస్థాయికి తీసుకెళ్లలేకపోయాడనే భావన ఏర్పడుతుంది. అంతేకాకుండా తెలుగు నేటివిటికి దూరంగా ఎక్కువగా తమిళ కంపు ఎక్కువగానే కొట్టిందనిపిస్తుంది.

  హీరోయిన్ల నటన, ప్రతిభ

  హీరోయిన్ల నటన, ప్రతిభ

  ఇక హీరోయిన్ల విషయానికి వస్తే డయాన చంపిక పాత్ర ప్రధానమైంది. మహిమ పాత్ర పరిధి పెద్దగా కనిపించింది. డయానా తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. మహిమ రోల్ పరిమితంగా ఉండటం, కథకు కావాలనే అతికించినట్టు అనిపిస్తుంది. ఇంతకంటే గొప్పగా హీరోయిన్ల గురించి చెప్పడానికి ఏమీ ఉండదు.

  దర్శకుడు శ్రీనివాసన్ గురించి

  దర్శకుడు శ్రీనివాసన్ గురించి

  దర్శకుడు శ్రీనివాసన్ ఎంచుకొన్న కథ బాగానే అనిపిస్తుంది. ఆచరణ విషయంలోనే తడబాటుకు గురైనట్టు కనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకుల వరకు వస్తే బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోని క్రేజ్ మరోస్థాయికి చేరింది. ప్రేక్షకుల ఆశించే అంచనాలకు భిన్నంగా ఈ చిత్రం ఉందనిపిస్తుంది. కథపై సరైన కసరత్తు, భావోద్వేగాలను పండిచే అంశాలను పరిశీలిస్తే ఎక్కడో పొరపాటు చేశాడనిపిస్తుంది.

  ఇతర పాత్రల్లో నటీనటుల

  ఇతర పాత్రల్లో నటీనటుల

  ఇంద్రసేన చిత్రంలో మిగితా పాత్రల్లో జెవెల్ మేరీ, రాధారవి, కాళి వెంకట్, నళినికాంత్ తదితరులు నటించారు. కానీ వీరంత పాత్రల బలానికి సరిపోని నటీనటులు. భారమైన పాత్రలకు వీరంతా చాలా తేలికగా కనిపించారు. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే ఈ నటీనటులు తెలుగు ప్రేక్షకులకు ముక్కు ముఖం తెలియని వారు కావడం ఈ సినిమా ప్రధాన లోపం. ఈ కారణం వల్లనే సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ కావడానికి చాలా కష్టంగా మారింది.

  విజయ్ మ్యూజిక్, ఎడిటింగ్

  విజయ్ మ్యూజిక్, ఎడిటింగ్

  సాంకేతికపరంగా చూస్తే కూడా విజయ్ ఆంటోని అందరికంటే బెటర్‌గా కనిపిస్తాడు. తెర ముందే కాదు.. తెర వెనుక కూడా సత్తా చాటుకొన్నాడు. మ్యూజిక్, రిరీకార్డింగ్ బాగుంది. ఎడిటింగ్ విభాగంలో విజయ్ ఆంటోని పనితీరు మెప్పించింది.

  సినిమాటొగ్రఫీ

  సినిమాటొగ్రఫీ

  ఇక ఈ చిత్రానికి దిల్ రాజు (నిర్మాత కాదు) సినిమాటోగ్రఫీని అందించాడు. యాక్షన్ సీన్లను, పాటలను ఆకట్టుకునేలా చిత్రీకరించాడు. ఈఎంఐ పాటలో కెమెరా, గ్రాఫిక్ వర్క్ అద్భుతంగా ఉంటుంది.

  నిర్మాణ విలువలు

  నిర్మాణ విలువలు

  ప్రముఖ సినీ నటి రాధిక శరత్ కుమార్, విజయ్ ఆంటోని సతీమణి ఫాతీమా విజయ్ ఆంటోని ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. వీరి సారథ్యంలో నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. కాకపోతే కథ ఎంపిక, కథనంపై మరింత దృష్టిపెట్టి ఉంటే ఆర్ స్టూడియోస్, విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌లో మంచి చిత్రంగా నిలిచేది.

  చివరగా

  చివరగా

  విజయ్ ఆంటోని యాక్టింగ్ బలంగా, ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కిన చిత్రం ఇంద్రసేన. లాజిక్కులు లేకుండా మోతాదు మించిన తమిళ వాసనతో తెరకెక్కించిన ఇంద్రసేన తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందడం కష్టమే.సెకండాఫ్‌లో కథ నడిచే తీరు, క్యారెక్టర్లలో క్లారిటీ కనిపించదు. హీరోయిన్ల గ్లామర్ గురించి చెప్పాలంటే అంతంతా మాత్రమే. వినోదం అనేది టార్చ్‌లైట్ వేసి చూసినా కనిపించదు.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్
  విజయ్ ఆంటోని యాక్టింగ్
  సంగీతం, ఎడిటింగ్
  కెమెరా,
  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  మైనస్ పాయింట్స్
  కథ, కథనం
  డైరెక్షన్
  పాత్రలకు నటీనటుల ఎంపిక
  సెకండాఫ్‌

  తెర వెనుక, తెర ముందు

  తెర వెనుక, తెర ముందు

  నటీనటులు: విజయ్ ఆంటోని, డయానా చంపిక, మహిమ తదితరులు
  దర్శకత్వం: జీ శ్రీనివాసన్
  నిర్మాత: ఫాతీమా విజయ్ ఆంటోని, రాధిక శరత్‌కుమార్
  ఎడిటింగ్, సంగీతం: విజయ్ ఆంటోని
  సినిమాటోగ్రఫి: దిల్ రాజు
  బ్యానర్: ఆర్ స్టూడియోస్, విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్
  రిలీజ్ డేట్: 30 నవంబర్ 2017

  English summary
  Vijay Antony's latest movie is Indrasena. G Srinivasan is the director. This movie produced by Fatima Vijay Antony and Raadhika Sarathkumar under the banners Vijay Antony Film Corporation and R Studios banner. Diana Champika, Mahima are lead pair for Vijay Antony. This movie released on November 30th 2017. In this occassion, Telugu Filmibeat brings exclusive review for readers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X