twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జాతి రత్నాలు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating: 2.75/5

    నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వంటి స్టార్డం ఉన్న నటీనటులతో జాతి రత్నాలు అనే సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే పాటలు, టీజర్, ట్రైలర్, పోస్టర్‌లతో మంచి అంచనాలు పెంచేసిన జాతిరత్నాలు నేడు (మార్చి 11) రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ ప్రేక్షకులకు ఏమేరకు చేరువ అయిందో ఓ సారి చూద్దాం.

    జాతి రత్నాలు కథ ఏమిటంటే

    జాతి రత్నాలు కథ ఏమిటంటే

    మెదక్ జిల్లా జోగిపేట శ్రీకాంత్ (నవీన్ పొలిశెటి), రవి (రాహుల్ రామకృష్ణ), శేఖర్ (ప్రియదర్శి) అల్లరిచిల్లరగా బాధ్యత లేకుండా తిరిగే యువకులు. తన తండ్రి నడిపే లేడీస్ ఎంపోరియం షాపులో అయిష్టంగానే పని చేసే శ్రీకాంత్ ఉద్యోగం కోసం తన స్నేహితులతో కలిసి హైద్రాబాద్ర‌కు వస్తాడు. ఆ తరువాత చిట్టి (ఫరియా)తో ప్రేమలో పడతాడు. ఆ తరువాత ముగ్గురు స్నేహితుల జీవితంలో చోటు చేసుకున్న మార్పులే జాతి రత్నాలు.

    జాతి రత్నాలు మూవీలో ట్విస్టులు

    జాతి రత్నాలు మూవీలో ట్విస్టులు

    మంత్రి చాణక్యపై హత్యాయత్నం జరిపింది ఎవరు? ఆ కేసులో ఈ ముగ్గురిని ఎందుకు అరెస్ట్ చేశారు? చివరకు ఈ త్రయం ఎలా తప్పించుకున్నారు? చిట్టితో శ్రీకాంత్ ప్రేమాయణం చివరకు ఎలా మలుపుతిరుగుతుంది? జోగిపేటను వదిలి వచ్చిన ఈ జాతిరత్నాలు మళ్లీ చివరకు ఏం చేశారు? అనే ఆసక్తికరమైన అంశాలకు సమాధానమే జాతిరత్నాలు.

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    కామెడీ ప్రధానంగా సాగే జాతిరత్నాలు ఫస్టాఫ్ మొత్తం నవ్వించేశారు. శ్రీకాంత్, రవి, శేఖర్ ముగ్గురు స్నేహితుల మధ్య వచ్చే సంభాషణతో కథనం అలా ముందుకు సాగుతూ ఉంటుంది. ముఖ్యంగా యూత్‌ను బాగా ఆకట్టుకునేలా ఈ మూవీ ప్రథమార్థం సాగుతూ ఉంటుంది. డైలాగ్స్, పాటలు అన్నీ కూడా ప్రథమార్థాన్ని నిలబెట్టేశాయని చెప్పవచ్చు. ఇంకా ఇంటర్వెల్‌కు అసలు కథ తిరుగుతుంది.

    సెకండాఫ్ అనాలిసిస్..

    సెకండాఫ్ అనాలిసిస్..

    మంత్రి చాణక్య హత్యకేసుతో కథ అసలు మలుపు తిరుగుతుంది. శ్రీకాంత్, రవి, శేఖర్‌లను అరెస్ట్ చేయడం, వారి కోసం చిట్టి వాదించడం, కోర్టు సన్నివేశాలతో ద్వితీయార్థం అలా ముందుకు సాగుతుంది. కానీ అక్కడక్కడా రొటీన్ సీన్స్‌తో బోర్ కొట్టించినట్టు అనిపిస్తుంది. బ్రహ్మానందంపై తెరకెక్కించిన సన్నివేశాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తానికి ద్వితీయార్థం కూడా ప్రేక్షకులను ఓ మోస్తరుగా మెప్పిస్తుంది.

    డైరెక్టర్ అనుదీప్ గురించి

    డైరెక్టర్ అనుదీప్ గురించి

    డైరెక్టర్ అనుదీప్ ఈ సినిమాను ఆద్యంతం వినోదభరితంగా మలిచే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. ఆ కోణంలో దర్శకుడు వంద మార్కులు సాధించేశాడు. ఆ ముగ్గురు ఎంత ప్రమాదంలో ఉన్నా కూడా ప్రేక్షకులను నవ్వించడం మాత్రం మరిచిపోలేదు.ఈ విషయంలో దర్శకుడి రచన ప్రతిభ కనిపిస్తుంది. ప్రతీ సీన్‌ను ప్రేక్షకుడి నవ్వించేందుకు రాసుకున్నట్టే కనిపిస్తుంది. మొత్తానికి జాతిరత్నాలు సినిమాతో దర్శకుడు తన టేకింగ్, కామెడీ టైమింగ్, ఎమోషన్స్ ఇలా ఏదైనా సరే రక్తికట్టించగలనని నిరూపించుకున్నాడు.

    నవీన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ యాక్టింగ్

    నవీన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ యాక్టింగ్

    నవీన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఇది వరకు ఎన్నో సినిమాల్లో తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. జాతి రత్నాలు విషయానికొస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నవీన్ గురించే. కామెడీ టైమింగ్ ఉన్న అతి కొద్ది మంది హీరోల జాబితాలో నవీన్ పేరు చేర్చవచ్చు. అంతలా తన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఇక ప్రియదర్శి, రామకృష్ణ ఎప్పటిలానే ఆకట్టుకున్నారు. ఈ త్రయం చేసిన అల్లరికి ప్రేక్షకులు ఫిదా అవ్వడం గ్యారెంటీ.

    ఇతర నటీనటుల ఫెర్ఫార్మెన్స్

    ఇతర నటీనటుల ఫెర్ఫార్మెన్స్

    జాతి రత్నాలు సినిమాలో నవీన్, రాహుల్, ప్రియదర్శి కాకుండా అంటే హీరోయిన్ ఫరియా గురించి చెప్పుకోవాలి. చిట్టి పాత్రలో ఎంత క్యూట్‌గా కనిపించిందో.. అంతే స్థాయిలో నటించేసింది. చిట్టిగా తన నటనతో ఫరియా ప్రేక్షకులను మెప్పించేసింది.

    టెక్నికల్ టీమ్ గురించి

    టెక్నికల్ టీమ్ గురించి

    జాతిరత్నాలు సినిమా విషయానికి వస్తే ముందుగా సంగీతం గురించే చెప్పుకోవాలి. రదన్ అందించిన సంగీతం, కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ముఖ్యంగా పాటలు కొట్టిన విధానం, తెరకెక్కించిన విధానం అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. సిద్దం మనోహర్ కెమెరా పనితనం కూడా బాగుంది. అభినవ్ రెడ్డి ఇంకాస్త కత్తెరకు పని చెప్పాల్సింది. మొత్తానికి స్వప్నా మూవీస్ స్థాయికి తగ్గట్టు జాతిరత్నాలు నిలిచింది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్‌గా సాగే జాతి రత్నాలు సినిమా అందరినీ ఆకట్టుకునేలానే ఉంది. వినోదం ఆశించి వెళ్లే ప్రేక్షకులు మాత్రం కచ్చితంగా నిరాశ చెందడు. చివరకు నిజంగానే జాతి రత్నాలు అని ప్రేక్షకుల చేతే అనిపిస్తారు. రిలీజ్‌కు ముందే మంచి బజ్ ఏర్పడటంతో ఓపెనింగ్స్ కూడా భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    నవీన్, రాహుల్, ప్రియదర్శి
    మాటలు
    సంగీతం
    దర్శకత్వం

    మైనస్ పాయింట్స్
    అక్కడక్కడా నెమ్మదిగా సాగే కథనం
    కథలో కొత్తదనం లోపించడం

    నటీనటులు

    నటీనటులు

    నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా, మురళీ శర్మ, బ్రహ్మానందం, నరేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, తనికెళ్ల భరణి, గిరిబాబు, శుభలేఖ సుధాకర్, దివ్య శ్రీపాద తదితరులు
    కథ, రచన, దర్శకత్వం: అనుదీప్ కేవీ
    నిర్మాత: నాగ్ అశ్విన్
    మ్యూజిక్: రాధాన్
    సినిమాటోగ్రఫి: సిద్దం మనోహర్
    ఎడిటింగ్: అభినవ్ రెడ్డి దండా
    బ్యానర్: స్వప్న సినిమా
    రిలీజ్ డేట్: 2021-03-11

    English summary
    Jathi Ratnalu film written and directed by Anudeep KV. The film starring Naveen Polishetty, Faria Abdullah, Priyadarshi, and Rahul Ramakrishna. Produced by Nag Ashwin under the banner Swapna Cinema. The film released on 11 March 2021
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X