»   » జవాన్ మూవీ రివ్యూ: సాయిధరమ్ తేజ్ మైండ్ గేమ్

జవాన్ మూవీ రివ్యూ: సాయిధరమ్ తేజ్ మైండ్ గేమ్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  Rating:
  2.0/5
  Star Cast: సాయిధరమ్ తేజ్, మెహ్రీన్ పిర్జాదా, ప్రసన్న, సుబ్బరాజు
  Director: బీవీఎస్ రవి

  'Jawaan' Movie Review By Filmibeat జవాన్ మూవీ రివ్యూ

  మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ పిల్లా నీవు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీం లాంటి వరుస విజయాలు అందుకొన్నాడు. ఆ తర్వాత తిక్క, విన్నర్, నక్షత్రం చిత్రాలు ఫ్యాన్స్ నిరాశపరిచాయి. ప్రస్తుతం సినీ రచయిత బీవీఎస్ దర్శకత్వంలో జవాన్ చిత్రంతో డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దేశభక్తి ప్రధానంగా రూపొందిన చిత్రంగా రిలీజ్‌కు ముందే క్రేజ్ సంపాదించుకొన్న ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? సాయిధరమ్ తేజ్‌ మరో సక్సెస్ చేజిక్కించుకొన్నారా? టాలీవుడ్‌లో గొల్డెన్ లెగ్ అని పేరు పడిన మెహ్రీన్ ఫిర్జాదా మరో హిట్‌ను కెరీర్‌లో వేసుకొందా అనే తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  జవాన్ చిత్ర కథ..

  జై (సాయి ధరమ్ తేజ్), జైకి చిన్నప్పటి నుంచే దేశభక్తి ఎక్కువ. రాష్ట్రీయ స్వయం సేవక్‌ (ఆర్‌ఎస్ఎస్) కార్యకర్తగా మారుతాడు. దేశానికి రక్షణగా నిలిచే సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)లో సైంటిస్ట్ కావాలనేది కోరిక. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడి ఇంటర్వ్యూకు వెళుతాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఉద్యోగాన్ని సంపాదించలేకపోతాడు. ఈ క్రమంలో కేశవ్ గ్యాంగ్ ( ప్రసన్న, సుబ్బరాజు) విదేశీ శక్తులతో కలిసి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నుతుంది. అందుకోసం డీఆర్‌డీవో రూపొందించిన అతిశక్తివంతమైన ఆక్టోపస్ మిసైల్ లాంఛర్‌ను దొంగిలించాలను కొంటారు. ఈ విషయం తెలిసిన జై.. ఆక్టోపస్ తీవ్రవాదులకు అడ్డుగా నిలుస్తాడు. దాంతో జై కుటుంబాన్ని ముట్టుపెట్టడానికి కేశవ్ ముఠా ప్రయత్నిస్తుంటుంది.

  జవాన్ ముంగిపు

  ఆక్టోపస్‌ను దొంగిలించకుండా కేశవ్ గ్యాంగ్ నుంచి జై అడ్డు నిలిచాడు? కేశవ్ గ్యాంగ్ దాడుల నుంచి తన కుటుంబాన్ని జై ఎలా రక్షించుకొన్నాడు? అక్టోపస్‌ను దక్కించుకోవడానికి కేశవ్ ఎలాంటి పన్నాగాలను పన్నాడు? కేశవ్ దేశం కోసం కుటుంబాన్ని, ప్రియురాలు (భార్గవి)ని ఎందుకు పణంగా పెట్టాలనుకొంటాడు అనే ప్రశ్నలకు సమాధానమే జవాన్ చిత్ర కథ.


  జవాన్ కథా విశ్లేషణ

  దేశం కోసం ఎంతకైనా తెగించే జై అనే యువకుడి కోణంలో అల్లుకొన్న కథ ఇది. జై చుట్టు ఉండే పరిస్థితులు, అతని కుటుంబం, స్నేహితులు, ప్రియురాలు అనేవి కథను ముందుకు నడిపించే ఎలిమెంట్స్. అమితమైన దేశభక్తి కలిగిన జై, అంతే సమానంగా తీవ్రవాదులకు సహకరించే కేశవ్ పాత్రల మధ్య తెరపైన జరిగే సంఘర్షణ, మైండ్ గేమ్‌‌కు రూపమే జవాన్ చిత్రం. ఈ సినిమా లైన్ చదవడానికి బాగా అనిపించినా తెరమీదకు వచ్చే సరికి చాలా అంశాలు కలగపులగంగా కనిపిస్తాయి. టాలీవుడ్‌కు పరిమితులు ఉన్న దృష్ణా నేరుగా కథ చెప్పకపోవడం, కథలో ప్రేమ, కుటుంబం, స్నేహితులు ఇలాంటి అంశాలు కథా వేగానికి అడ్డుపడినట్టు అనిపిస్తాయి.


  జవాన్ స్క్రిప్ట్ అనాలిసిస్

  తొలిభాగంలో అయితే చాలా స్క్రిప్టు చాలా గందరగోళంగా అనిపిస్తాయి. ఎక్కడా క్లారిటీ ఉండదు. కథను వదిలేసి కమర్షియల్ హంగుల కోసం దర్శకుడు పాకులాడటం ఈ సినిమాకు ఓ మైనస్ అని చెప్పవచ్చు. జవాన్ సినిమాలో చెప్పాల్సిందేమైనా ఉంటే సెకండాఫ్. రెండో భాగంలో కేశవ్, జై పాత్రల మధ్య నడిచే మైండ్ గేమ్ ఆసక్తికరంగా సాగుతుంది. కానీ ఈ మధ్యలో వచ్చిన ధ్రువ్ చిత్రం ప్రేక్షకుడిని వెంటాడుతుంటుంది. అయినా జవాన్ ఏదో మంచి ట్రాక్‌లో వెళ్తుందని ఓ ఫీలింగ్ పుట్టగానే రొటీన్ క్లైమాక్స్‌తో ప్రేక్షకుడి ఆసక్తిపై నీళ్లు చల్లాడనే భావన ఏర్పడటం మరో ప్రధాన లోపం.


  దర్శకుడు బీవీఎస్ రవి పనితీరు

  చిత్ర ప్రారంభంలో వచ్చే ప్రసన్న, సాయిధరమ్ తేజ్ మధ్య సాగే స్కూల్ డేస్ ఎపిసోడ్ చాలా కొంచెం అతిగానే అనిపిస్తుంది. సాయిధరమ్ తేజ్ క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు ఎక్కువ రీళ్లనే వృధా చేశాడనిపిస్తుంది. సీరియస్‌గా సాగే కథలో మెహ్రీన్‌తో లవ్ ట్రాక్ డైవర్షన్‌లా కనిపిస్తుంది. ఇంటర్వెల్‌లో ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు ముందుగానే అర్థమైపోతుంది. కాకపోతే రెండో భాగంలో ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా చాలా వేగంగా పరుగులు పెడుతుంది. కథపై దర్శకుడు చేసిన కసరత్తు, పడిన కష్టానికి మంచి ఫలితమే కనిపిస్తుంది. ఇంకాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసి స్క్రిప్ట్‌ను మరింత బాగా చేసి ఉంటే సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే బెస్ట్ చిత్రం అయ్యేదేమో.


  డైరెక్షన్‌లో తడబాట్లు

  జవాన్ చిత్రం విషయానికి వస్తే దర్శకుడు బీవీఎస్ రవి ఆలోచన, విజన్ సరైనదే అనిపిస్తుంది. కానీ లౌకికవాదమనే చెప్పుకునే దేశంలో హీరోను అరెస్సెస్ కార్యకర్తగా ముద్ర వేయాలని తీసుకొనే నిర్ణయం ఎందుకో అర్థం కాదు. దేశభక్తులంటే ఆరెస్సెస్ వాళ్లేనా? మిగితా వాళ్లు కాదా అనేది కొన్ని వర్గాల ప్రశ్న. ఆరెస్సెస్ అంశాన్ని జొప్పించి హీరో పాత్రకు పరిమితులను విధించడం దర్శకుడు చేసిన తొలి తడబాటు అని చెప్పవచ్చు. ఇక స్క్రీన్‌ప్లేలో దర్శకుడు జొప్పించిన డాక్యుమెంటరీ ఎలిమెంట్స్ కొంత చికాకుకు గురిచేసేలా ఉంటాయి. కథా రచయిత దర్శకుడైతే కలిగే ఇబ్బంది ఈ చిత్రంలో మరోసారి కనిపించాయి. మొత్తానికి జవాన్‌ను ఫర్వాలేదనిపించే మెప్పించడం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది.


  పవర్ ఫుల్‌గా సాయి ధరమ్ తేజ్

  సాయి ధరమ్ తేజ్‌ మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించాడు. ఆవేశం, దూకుడు స్వభావం ఉన్న జై పాత్రలో ఒదిగిపోయాడు. కథలో ఉండే పరిమితులను, పరిధిని మించి తేజ్ తన నటనను ప్రదర్శించాడు. జవాను విషయంలో తేజ్ ప్రతిభపై ఎక్కడా సందేహం కలుగదు. పాటలు, ఫైట్స్, కీలక సన్నివేశాల్లో భావోద్వేగాలు పండించడంలో పరిణతి చూపించాడు. మెగా అభిమానులకు అలరించే జవాన్‌గా మాత్రం వందశాతం న్యాయం చేశాడు.


  అదరగొట్టిన ప్రసన్న

  జవాన్ చిత్రానికి వెన్నముక కేశవ్ పాత్ర. కేశవ్ పాత్రలో తమిళ నటుడు ప్రసన్న చక్కటి విలనిజాన్ని పండించాడు. సన్నివేశాలకు అనుగుణంగా ప్రసన్న పలికించిన హావభావాలు అద్భుతంగా పండాయి. హీరో పాత్రలకే కాకుండా విలన్ పాత్రలను కూడా ఒంటిచేత్తో పండిస్తాననే భరోసాను ప్రసన్న కలిగించాడు. ప్రసన్నలో ఉండే ఈజ్ ఆకట్టుకునేలా ఉంది. పసన్నలోని అగ్రెసివ్ యాక్టింగ్ సాయిధరమ్ తేజ్‌లోని నటనను మరింత బయటకు తెచ్చేకుందు ఉపయోగపడిందని చెప్పవచ్చు.


  గ్లామర్‌తో మెప్పించిన మెహ్రీన్

  వరుస విజయాలతో మెప్పిస్తున్న మెహ్రీన్‌ మరోసారి గ్లామర్‌ పాత్రతో ఆకట్టుకొన్నది. అందాలను యదేచ్చగా ఆరబోసింది. సాయిధరమ్ తేజ్‌తో మంచి కెమిస్ట్రిని వర్కవుట్ చేసింది. పాటలు, రొమాంటిక్ సీన్లలో మొహమాటం లేకుండా రెచ్చిపోయింది.


  మిగితా పాత్రల్లో సుబ్బరాజు, కోటా

  జవాన్ చిత్రంలో కీలక పాత్రల్లో కోటా శ్రీనివాసరావు, నాగబాబు, జయప్రకాశ్, సత్యం రాజేశ్, సుబ్బరాజు తదితరులు కనిపించారు. వారి పాత్రల మేరకు ఫర్వాలేదనిపించేలా నటించారు. ప్రసన్న గ్యాంగ్‌లో సుబ్బరాజుది పెద్దగా స్కోప్ లేని రొటీన్ విలన్ పాత్ర. ఇక సాయిధరమ్ తేజ్ బాబాయి అని పిలుచుకొనే పాత్రలో కోటా నటించారు. పాత్ర పరిధి తక్కువేనా కథకు బలంగా మారే పాత్ర. కోటా గురించి యాక్టింగ్ తెలుసు కాబట్టి పెద్దగా చెప్పాల్సిన పనేమీలేదు.


  రెచ్చిపోయిన థమన్

  మ్యూజిక్ విషయానికి వస్తే ఎస్ థమన్ మరోసారి రెచ్చిపోయాడు. సెకండాఫ్‌లో థమన్ అందించిన రీరికార్డింగ్ బాగా ఉంది. మైండ్ గేమ్ వర్కవుట్ కావడానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణ. జవాన్ టైటిల్ సాంగ్, బంగారు, బొమ్మ అదిరింది పాటలు బాగున్నాయి.


  కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ

  జవాన్ చిత్రానికి కేవీ గుహన్ సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి మరో ప్లస్ పాయింట్. ఛేజింగ్ సీన్లను బాగా షూట్ చేశారు. పాటలను మరోరంజకంగా తెరకెక్కించారు. ఏరియల్ షాట్స్ బాగున్నాయి. ఎస్ఆర్ శేఖర్‌ కత్తెరకు మరింత పదను పెట్టాల్సిన అవసరం ఉంది.


  నిర్మాణ విలువలు

  చాలా కాలంగా పరిశ్రమలో ప్రొడక్షన్ బాధ్యతలను నిర్వహించిన కృష్ణ జవాన్ చిత్రంతో నిర్మాతగా మారాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పించాడు. రాజీ లేకుండా, ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను చాలా రిచ్‌గా రూపొందించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


  ఫైనల్‌ పంచ్

  దేశభక్తి కీలక అంశంగా రూపొందిన చిత్రం జవాన్. కానీ అతిగా జొప్పించిన కమర్షియల్ విలువలు కథా ప్రయోజనాన్ని దెబ్బ తీశాయి.బీ, సీ సెంటర్లలో వచ్చే స్పందన బట్టి సినిమా సక్సెస్ ఏ రేంజ్ అనేది ఆధారపడి ఉంటుంది. చిరంజీవికి యుద్ధభూమి, పవన్ కల్యాణ్‌కు కొమురం పులి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చాయో సాయిధరమ్ తేజ్‌కు జవాన్ చిత్రం అంతకంటే మంచి ఫలితాన్ని ఇవ్వవచ్చు.


  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్
  సాయిధరమ్ తేజ్, ప్రసన్న యాక్టింగ్
  మెహ్రీన్ గ్లామర్
  సెకండాఫ్‌లో స్క్రీన్ ప్లే


  మైనస్ పాయింట్స్
  ఫస్టాఫ్ నేరేషన్
  క్లైమాక్స్
  డాక్యుమెంటరీ ఎలిమెంట్స్
  లెంగ్త్


  తెర వెనుక, తెర ముందు

  నటీనటులు: సాయిధరమ్ తేజ్, మెహ్రీన్ పిర్జాదా, ప్రసన్న, సుబ్బరాజు తదితరులు
  దర్శకత్వం: బీవీఎస్ రవి
  నిర్మాత: కృష్ణ
  సంగీతం: ఎస్ థమన్
  సినిమాటోగ్రఫి: కేవీ గుహన్
  రిలీజ్ డేట్: డిసెంబర్ 1, 2017
  ప్రివ్యూ: శ్రీరాములు థియేటర్ (నవంబర్ 30)


  English summary
  Supreme Hero Sai Dharam Tej’s success graph plunged after Tikka, Winner, Nakshtram films tanked heavily at the box office. Now, he is getting ready with his latest film Jawaan, which is releasing December 1st, 2017). This movie is directed by BVS Ravi. Tamil Star Prasanna as acted as antagonist. Tollywoods Golden Leg Mehreen Prizada is the film’s leading lady. Star producer Dil Raju is backing this film and the whole team has aggressively promoted the film. Telugu Filmibeat brings exclusive review for the readers.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more