»   » బీ,సీ సెంటర్లలోనే జయం : జయ జానకీ నాయకా రివ్యూ రేటింగ్

బీ,సీ సెంటర్లలోనే జయం : జయ జానకీ నాయకా రివ్యూ రేటింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

Rating: 2.75/5

భద్ర, తులసి, దమ్ము, లెజెండ్, సరైనోడు.... ఒక్కో సినిమా ఒక్కో బ్యాంగ్. పవర్ ప్యాక్డ్ బ్లాస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, లవ్ స్టోరీ, ప‌క్కా మాస్ మ‌సాలా... జోనర్ ఏదైనా కావచ్చు సినిమా వచ్చిందంటే బీ, సీ సెంటర్లు దద్దరిల్లి పోతాయ్. అరుపులూ కేకలతో థియేటర్లు హోరెత్తుతాయ్. మామూలుగా హీరో కోసం చూసే అభిమానులు కూడా బోయపాటి తమ హీరోని సెలక్ట్ చేసుకున్నాడు అనగానే ఆ తరహా ప్రజెంటేషన్ ఎలా ఉండబోతుందో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తారు.


అందుకే బోయపాటి సినిమాలకు సక్సెస్ రేటు ఎక్కువ. మార్కెట్ లోకి ఎలా చొచ్చుకు పోవాలో ఇతనికి బాగా తెలుసు. అయితే ఇప్పటివరకూ బోయపాటి ఎంచుకున్న హీరోలు వేరు.. ఇప్పుడు వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ వేరు. ఇప్పటి వరకూ ఒక్క హిట్ కూడా లేని ఈ కుర్రాడితో బోయపాటి సినిమా అని చెప్పినప్పుడు అనుమానంగానే చూసారంతా... అయితే "జయ జానకీ నాయక" లాంటి సాఫ్ట్ టైటిల్ చూడగానే కాస్త డిఫరెంట్ గా ఫీలయ్యారు...


Rakul Preet Singh Gallery


టీజర్ వచ్చాక మరింత ఆసక్తిగా చూసారు... రెగ్యులర్ ఎమోషన్ ని వదలను అని మెసేజ్ ఇస్తున్నట్టు ఉన్న టీజర్ లోనే సాఫ్ట్ ప్రేమకథ కూదా ఉందన్న క్లూ ఇవ్వటం తో అప్పటి వరకూ ఉన్న అంచనాలు తారు మారయ్యాయి... అప్పటికే హీరోలుగా జ్ఞిలదొక్కుకున్న రానా, నితిన్ లకు సమానంగా దూసుకువచ్చాడు జానకీ నాయకుడు... అయిత్వే ఈ ప్రయత్నం లో బోయపాటి ఎంతవరకూ సక్సెస్ అయ్యాడూ, ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కి ఎంతవరకూ ప్లస్ అవుతుందీ అని తెలుసుకోవాలంటే రివ్యూ చూదాల్సిందే కదా....


కథ:

కథ:

బోయపాటి రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఓపెనింగ్ ఉంటుంది., కానీ ప్రేక్షకుడు ఏమాత్రం నిరాశ చెందడు. కథలోకి వస్తే... గగన్‌(బెల్లంకొండ శ్రీనివాస్‌) తన ఫ్యామిలీ అంటే విపరీతంగా ఉండే మామూలు కుర్రాడు. తన కుటుంబం అంటే, తన తండ్రి అంటే చాలా ఇష్టం. గగన్ తండ్రి చక్రవర్తి (శరత్‌కుమార్‌) అన్నయ్య(నందు) ఈ ఇద్దరూ అతనికి ప్రఒపంచం లోనే ఇష్తమైన మొదటి వ్యక్తులు.


Public talk on "Jaya Janaki Nayaka"| Filmibeat Telugu
ఇలా ఉన్న గగన్‌కు

ఇలా ఉన్న గగన్‌కు

స్వీటి ఉరఫ్ జానకి(రకుల్‌ప్రీత్‌సింగ్‌) పరిచయం అవుతుంది. ఒకరకంగా ఆమె రాకతో చక్రవర్తి ఇంటి స్వరూపమే మారిపోతుంది. స్వీటి-గగన్‌ ప్రేమించుకుంటారు. ఆ ఫ్యామిలో ఇక అంతా ఆనందమే అనుకుంటుండగా. సెంట్రల్ మినిస్టర్ (సుమన్) కొడుకుతో గగన్ గొదవపడటానికి కారణం అవుతుంది జానకి. ఇక అక్కడినుంచీ సమస్యక్లు మొదలవుతాయి. జానకి జీవితం చిక్కుల్లో పడుతుంది...


సెంట్రల్ మినిస్టర్

సెంట్రల్ మినిస్టర్

ఆమెని రక్షించటం కోసం గగన్ అతని తండ్రి చక్రవర్తీ, అన్నయ్య కూడా రంగంలోకి దిగుతారు. అయితే అసలు గగన్ కీ సెంట్రల్ మినిస్టర్ కీ మధ్య వైరం ఏమిటీ, జానకికీ అశ్వింత్‌ నారాయణ (జగపతిబాబు)కీ సంబందం ఏమిటీ? చివరికి జానకి కోసం గగన్ ఎన్ని పోరాటాలు చేసి ఆమెను దక్కించుకున్నాడూ అన్నది తెరమీద చూడాల్సిందే....


నటీనటుల పర్ఫార్మెన్స్:

నటీనటుల పర్ఫార్మెన్స్:

బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఇది మూడో సినిమా గతంలో వచ్చిన రెండు సినిమాలూ అతన్ని పెద్దగా ఎలివేట్ చేయలేకపోయాయి అనటం కన్నా అసలు శ్రీనివాస్ నటన అంటే ఏమిటో కూదా తెలియని స్టేజ్ఞ్ లో అప్పడు ఉన్నాడు అనటమేనిజం. ఈ సినిమా మొదలయ్యే నాటికి అతని బలాలు, బలహీనతలు బోయపాటి బాగా గమనించాడు. అందుకే అతనికి తగినట్టుగానే సన్నివేశాలు రాసుకున్నాడు.అనుకున్నదానికంటే తాను ఎక్కువ కష్టపడ్డాడు శ్రీనివాస్ ని ఇంకా కష్తపెట్టి అతన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీదకి తెచ్చేప్రయత్నం చేసాడు.


బెల్లంకొండ శ్రీనివాస్

బెల్లంకొండ శ్రీనివాస్

గత చిత్రాలతో పోలిస్తే నటన, డైలాగ్స్, డాన్స్ లలో చాలామార్పు గమనించవచు, క్లైమాక్స్‌లో ఎమోషనల్‌ డైలాగ్‌లు బాగా పలికాడు. అయితే నిజనికి ఇంకా చాలా కష్టపడాలి, కేవలం డాన్స్, ఫైట్స్ వస్తేనే హీరో కాదు అన్న విశయాన్ని స్రీనివాస అర్థం చేసుకోవాలేమో అనిపిస్తుంది. ఇక రకుల్‌ ఈ సినిమాకి ఖచ్చితంగా ప్లస్ అయ్యింది. శ్రీనివాస్ కంటే ఈమె నటన ప్రేక్షకులని మెప్పిస్తుంది.


జానకి

జానకి

నిజానికి కీలకమైన పాత్ర "జానకి" ఈ పాత్ర రెండు కోణాల్లో సాగుతుంది. తొలి సగం ఓ సాధారణ అమ్మాయిగా కనిపించిన ఆమె..ఇంతర్వెల్ తర్వాతనుంచీ విఒపరీతమైన సమస్యల్లో ఉన్న అమ్మాయిగా కనిపించి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో ఆకట్టుకుంది. నిజానికి రకుల్ చేసిన కష్టం మరో సినిమా అయ్యుంటే ఆమె పేరు మారుమోగిపోవాలి. జగపతిబాబు ఈ చిత్రంలో మరింత స్టైలిష్‌గా కనిపించాడు. విలన్ గా మారాక ఆయన బాడీలాంగ్వేజ్ లో కూడా వచ్చిన మార్పు ఈ సినిమాలో స్పష్టంగా కనిపించింది.


నెగెటివ్

నెగెటివ్

పూర్తి స్థాయి నెగెటివ్ ఫీల్ ని మెయింటెయిన్ చేయటం వల్ల విలన్ లూక్ బాగా పండింది. జగపతిబాబు ఇంట్రదక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక నందూకి కూడా మంచి పాత్రే దక్కింది. కానీ నటనకి పెద్దగా ఆస్కారం ఉన్న పాత్ర అని చెప్పటానికి కుదరదు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శరత్‌కుమార్‌ నటన, ఆయన చుట్టూ నడిపించిన సన్నివేశాలు అలరిస్తాయి. ఇక ఈ సినిమాలో ఏదో ఉంటుందని ఊహిస్తే అసలూ అనుకున్న స్థాయిలో కూడా ఆకట్టుకోని పాత్ర వాణీ విశ్వనాథ్‌.


టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

దేవిశ్రీ ప్రసాద్‌ నేపథ్య సంగీతం బాగుంది. ‘వీడే వీడే' అనే పాటలో సాహిత్యం ఆక‌ట్టుకుంటుంది. రిషీ పంజాబీ కెమేరా పనితనం మరో ప్రధాన ఆకర్షణ. కేథరిన్‌ ఐటమ్‌ సాంగ్‌ బాగున్నా, ఇరికించినట్టు అనిపిస్తుంది. బోయపాటి శ్రీను తనదైన మార్కు చూపించాడు. కథా, కథనాల్లో మలుపులు ఉన్నా, అవి సమర్థంగా తెరపై చూపించకపోవడం లోపంగా చెప్పుకోవచ్చు.దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం బావుంది. వింటున్నంత సేపు ఫుట్ టాపింగ్‌గా ఉన్నాయి పాట‌లు. వీడే వీడే, ఎ ఫ‌ర్ అనే ఐట‌మ్ సాంగ్ ది బెస్ట్ సాంగ్స్. కెమెరాప‌నిత‌నం మెచ్చుకోవాలి. కీల‌క స‌న్నివేశాల్లో మాత్రమే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావుంది.


విశ్లేషణ

విశ్లేషణ

నిజానికి ఇది పూర్తి స్థాయి బోయపాటి మార్కు యాక్షన్ ప్రేమకథ అనుకోవాలి. తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఓ యువకుడు ఏం చేశాడు? దానికి అతని తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం ఎలాంటిదీ, ఎవరిపై పోరాటం చేశాడు? అనే ఇతివృత్తంతో సాగుతుంది. ఇదేపాయింట్ చుట్టూ తన స్టైల్ ఆఫ్ యాక్షన్‌ ఎమోషన్‌ సన్నివేశాలను అల్లుకున్నాడు దర్శకుడు.


బలమే యాక్షన్

బలమే యాక్షన్

మొదటినుంచీ ఎలాంటి సబ్జెక్ట్ తీసుకున్నా యాక్షన్ ని కలపకుండా తనకథని తీయడు బోయపాటి. నిజానికి అతని బలమే యాక్షన్. అతను ఏ కథ ఎంచుకున్నా యాక్షన్‌.. మాస్‌ మసాలా ఉండేలాగా చూసుకుంటాడు. ఆ ఫార్ములాతోనే ప్రేక్షకున్ని కట్టి పడేస్తాడు. జయజానకీ నాయకా విషయంలో కూడా ఆయన అదే బాటలో నడిచాడు.


మాస్‌ ప్రేక్షకులకు నచ్చుతాయి

మాస్‌ ప్రేక్షకులకు నచ్చుతాయి

సినిమా ప్రారంభం నుంచే ఓ ఎమోషన్‌ డ్రైవ్‌తో సాగుతుంది. యాక్షన్‌ ఘట్టాలు, వాటి ముందు వచ్చే లీడ్‌ సన్నివేశాలను దర్శకుడు బాగా రాసుకున్నాడు. దాంతో మాస్‌ ప్రేక్షకులకు ఆయా సన్నివేశాలు నచ్చుతాయి. పరువు పంతం వీటి నడుమ ఓ అమ్మాయి ఎలా నలిగిపోయింది అనే విషయాన్ని దర్శకుడు సమర్థంగా తెరకెక్కించగలిగాడు.


హంసలదీవి యాక్షన్‌ ఎపిసోడ్‌

హంసలదీవి యాక్షన్‌ ఎపిసోడ్‌

ఇక హంసలదీవిలో తెరకెక్కించిన యాక్షన్‌ ఎపిసోడ్‌ సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలుస్తుంది. కానీ కేవలం ఈ యాక్షన్ కోసమే ఆ సన్నివేశాన్ని ఇరికించినట్టుగా ఉంతుంది.లెక్కకు మించిన యాక్షన్‌ సన్నివేశాలతో తెరపై అధిక భాగం ఫైట్లకే పరిమితం చేసినా, దాని చుట్టూ ఎమోషన్‌ సన్నివేశాలు ప్రేక్షకుడిని కదలకుండా చేస్తాయి. ఇలా ఎంతచెప్పుకున్నా దర్శకుదు తప్ప మరేమీ కనిపించని సినిమా ఇది.


ప్లస్ లూ, మైనస్లూ...

ప్లస్ లూ, మైనస్లూ...

ప్లస్ పాయింట్లు:


బోయపాటి శ్రీనివాస్
సరత్ కుమార్, జగపతి బాబుల నటన
కెమెరా
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (కొన్ని సన్నివేశాల్లో)
కొన్ని ఆకట్టుకునే డైలాగులు


మైనస్ పాయింట్లు:


బెల్లం కొండ నటన
మరీ గుప్పించినట్టున్న యాక్షన్ సీన్లూ
లోపించిన కామెడీ


శ్రీనివాస్ తన నటనలో పరిణతి సాధించకపోతే

శ్రీనివాస్ తన నటనలో పరిణతి సాధించకపోతే

చిత్రంలో అడుగడుగునా భారీతనం, నిర్మాణ విలువలు కనిపిస్తాయి. చిన్న పాత్రలోనూ గుర్తింపు ఉన్న నటుడే కనిస్తాడు. అయితే ఎంత రిచ్ గా తీసిన సినిమా ఆకట్టుకోవటానికి కీలకమైన హీరో, కథ రెండూ బలంగా ఉందాలి, ఆకట్టుకోవాలి... ఎమోషనల్ డైలాగులు చెప్పినప్పుడు, భావోద్వేగ సన్నివేశాల్లో శ్రీనివాస్ నటనను భరించటం కష్టమే. వీలైనంత త్వరగా శ్రీనివాస్ తన నటనలో పరిణతి సాధించకపోతే టాలీవుడ్‌లో నిలదొక్కుకోవడం కొంచం ఆలోచించాల్సిన విషయం. అయితే ఫైట్స్, డాన్సులు మాత్రం ఇరగదీస్తే సరిపోదు కదా నటన కూడా ఉండాలి కదా... మొత్తానికి జానకీ నాయకుడి జయం బీ.,సీ సెంటర్లవరకే అని చెప్పుకోవాలి


English summary
The story revolves around a girl seeking help to save herself and a young man who helps her. Boyapati tried to weave a action packed movie with love story. Priority of action scenes will overtake that of love story.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu