»   » తమిళ మాస్ ప్లేవర్.. (జిల్లా రివ్యూ)

తమిళ మాస్ ప్లేవర్.. (జిల్లా రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.5/5

హైదరాబాద్: విజయ్, మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో ఆర్.టి. నేసన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘జిల్లా' అప్పట్లో తమిళనాట భారీ విజయం సాధించింది. ఈచిత్రాన్ని తెలుగులో ఎవరైనా స్టార్ హీరోతో రీమేక్ చేయడానికి అప్పట్లో ప్రయత్నాలు జరిగాయి కానీ వర్కౌట్ కాలేదు. 

చివరకు జిల్లా చిత్రాన్ని తెలుగు అనువాదం చేసి విడుదల చేసారు. శ్రీ ఓబులేశ్వరి ప్రొడక్షన్స్ బేనర్లో తమటం కుమార్ రెడ్డి, ప్రసాద్ సన్నితి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసారు. హీరో విజయ్ చాలా కాలంగా తెలుగులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. తమిళనాట విజయ్ పెద్ద స్టార్. అయితే రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్, కార్తిలకు ఉన్న విధంగా తెలుగులో అతని సినిమాలకు ప్రేక్షకాదరణ లేదు. మరి తెలుగులో నిలదొక్కుకోవాలనే అతని ప్రయత్నం ఈ సారైనా ఫలించిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం...


తారాగణం: విజయ్, మోహన్ లాల్, కాజల్, మహత్ రాఘవేంద్ర, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్ తదితరులు...


Jilla Telugu Movie Review

కథ విషయానికొస్తే...
విజయవాడలో పవర్ ఫుల్ రౌడీ శివుడు(మోహన్ లాల్). శివుడి ప్రాణాలు కాపాడే క్రమంలో అతని అనుచరుడు ప్రాణాలు కోల్పోతాడు. అతని కొడుకు శక్తి(విజయ్)ని చేరదీసిన శివుడు తన సొంత కొడుకులా పెంచుతాడు. శక్తి ఎదిగి శివుడికి సపోర్టుగా ఉంటాడు. అయితే పోలీసుల నుండి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో...తమలోనే ఓ పోలీస్ ఉంటే బావుంటుందనే ఉద్దేశ్యంతో శక్తిని పోలీస్ ఆఫీసర్ చేయాలని నిర్ణయిస్తాడు. పోలీసులు అంటేనే రగిలిపోయే శక్తి తన తండ్రి కోసం పోలీస్ అవుతాడు. అయితే పోలీస్ అయిన తర్వాత శక్తిలో మార్పు వస్తుంది. శివుడు చేసే రౌడీ పనులను అడ్డుకుంటాడు. అతని మనుషులను అరెస్టు చేస్తాడు. ఇద్దరి మధ్య విబేధాలు వస్తాయి. విడిపోతారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది తెరపై చూడాల్సిందే.


పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే...
యాక్షన్ సీన్లలో, ఎమోషన్ సీన్లలో విజయ్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో కాజల్ చిన్న పాత్రలో కనిపించింది. గ్లామర్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. మోహన్ లాల్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. బ్రహ్మానందం కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇతర పాత్రలు వారి వారి పాత్రల పరిధి మేరకు రాణించారు.


టెక్నికల్...
ఇమ్మాన్ అందించిన మ్యూజిక్ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా లేదనే చెప్పాలి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా తలనొప్పిగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే యావరేజ్ గా ఉంది. సినిమా లెంత్ ఎక్కువగా ఉంది...ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే బావుండేది. నిర్మాణ విలువలు ఓకే. సినిమాటోగ్రఫీ యావరేజ్.


జిల్లా సినిమా తమిళ జనాలకు నచ్చడానికి కారణం ఫుల్ మాస్ ఎలిమెంట్సే. కానీ తెలుగు ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టెన్మెంట్, ఇతర అంశాలు సినిమాలో పెద్దగా లేవు. డైరక్షన్, స్క్రీప్లే కూడా తెలుగు నేటివిటీకి తగిన విధంగా లేక పోవడం మైనస్ పాయింట్. స్టోరీ కూడా రోటీన్ గా ఉంది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను భరించడం కష్టమే. 

English summary
Jilla Telugu Movie Review and Rating.
Please Wait while comments are loading...