»   » ‘టెంపర్’ అదుర్స్... (రివ్యూ)

‘టెంపర్’ అదుర్స్... (రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
3.5/5

---సూర్య ప్రకాష్ జోశ్యుల

వరస పోలీస్ కథలు...ముఖ్యంగా కరప్టెడ్ పోలీస్ అధికారి కథలు తెలుగు తెరను ప్రతీ శుక్రవారం పలకరిస్తున్నాయి. అటువంటి సమయంలో అలాంటి రొటీన్ అవినీతి అధికారి కథనే తీసుకుని చాలా కాలంగా సరైన హిట్ లేని ఎన్టీఆర్ వస్తూండటంతో అందరిలో ఆసక్తిగా మారింది. దానికి తోడు పూరి జగన్నాథ్ గతంలో ఇదే హీరోతో ఆంధ్రావాలా వంటి డిజాస్టర్ ఇవ్వటం,ఆయన కూడా తొలిసారి బయిట కథ తీసుకుని చెయ్యటం వంటి అంశాలు సినిమాపై అంచనాలు పెంచేసాయి. వీటిన్నటినీ జస్టిఫై చేయటానికి అన్నట్లు పూరి జగన్నాధ్ పూర్తి స్ధాయిలో కసరత్తు చేసి రొటీన్ స్టోరీ లైన్ ని తన మార్కు డైలాగులతో నింపి, ఎమోషనల్ ప్యాక్ డ్ స్క్రిప్టు గా మార్చారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో సినిమాని అమాంతం లేపేలా సన్నివేశాలు డిజైన్ చేసారు. అంతటా యాక్షన్ కామెడీ నడుస్తున్న ఈ సమయంలో అసలు ఆ ఎలిమెంటే లేకుండా పూర్తిగా కథమీదే నడిపి రిస్క్ తీసుకుని కొత్తగా అనిపించేలా సినిమాను చేసారు. ఇక ఎన్టీఆర్ అయితే ఈ సినిమాలో శరీరాకృతిలోనే కాదు డాన్స్ లలో, నటనలలో చాలా కొత్తగా కనిపించి అదరకొట్టాడు.


వైజాగ్ ట్రాన్సఫరై వచ్చిన దయ(ఎన్టీఆర్) ఓ పూర్తి అవినీతి పోలీస్ ఆఫీసర్. అక్కడ వాల్టేర్ వాసు(ప్రకాష్ రాజ్) అనే లోకల్ డాన్ తో చేతులు కలుపి అతని అరాచకాలలో సాయం చేయటం మొదలెడతాడు. మరో ప్రక్క దయ ఓ యానిమల్ లవర్ (కాజల్) తో ప్రేమలో పడతాడు. ఓ చిత్రమైన పరిస్దితుల్లో ఓ కోరిక కోరుతుంది. ఆ కోరిక నెరవేర్చే క్రమంలో దయ...దయగా మారతాడు...వాసు సామ్రాజ్యాన్ని కూల దోయటం మొదలెడతాడు. అంతేకాక చివరకు తన ప్రాణాలమీదకు సైతం తెచ్చుకుంటాడు. ఇంతకీ దయ గర్ల్ ఫ్రెండ్ కోరిన కోరిక ఏమిటి... దయ లో మార్పుకు కారణమైన ఆ సంఘటన ఏమిటి... అసలేం జరిగింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


వాస్తవానికి క్లైమాక్స్ ట్విస్ట్ మినహాయిస్తే కథలో కొత్తదనమేమీ లేనట్లే. ముఖ్యంగా మొన్నే వచ్చిన పటాస్ సినిమా సైతం సేమ్ టు సేమ్ ఇదే రన్ తో ఉంటుంది. అయితే వాటికీ ఈ సినిమాకు తేడా...పూరి జగన్నాథ్ రాసిన డైలాగులు, క్లైమాక్స్ ట్విస్ట్, ఎన్టీఆర్ నటన. కరెప్టెడ్ పోలీస్ అంటే ఇలాగే ఉంటాడు అనేంతగా లీనమై చేసాడు. అలాగే మంచిగా మారినప్పుడు చూపిన ఎమోషన్స్ ...ఎక్సప్రెషన్స్ సైతం ఎన్టీఆర్ లోని నటుడుని పూర్తి స్దాయిలో ఆవిష్కరిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో పూరి జగన్నాథ్ తన రచనా విశ్వరూపం చూపిస్తే..ఎన్టీఆర్ తన నటనా విశ్వరూపం చూపాడనే చెప్పాలి.


ముఖ్యంగా...ఎన్టీఆర్ ..కరెప్టెడ్ నుంచి పూర్తిగా మారి పశ్చాత్తాపపడుతున్నప్పుడు పోసాని సెల్యూట్ కొట్టే సీన్, అక్కడ ఎన్టీఆర్ ఎక్సప్రెషన్స్ అద్బుతమనిపిస్తాయి. అంతేకాదు.. క్లైమాక్స్ లో కోర్టులో మన సమాజాన్ని, న్యాయ వ్వవస్దని నిలదీస్తూ డైలాగులు చెప్పేటప్పుడు పెద్ద ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు.ప్రకాష్ రాజ్, ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేసాలు కూడా బాగా పేలాయి. డాన్స్ లలో ఎప్పటిలాగే ఎన్టీఆర్ అదరకొట్టారు. ముఖ్యంగా టైటిల్ సాంగ్ లో ఎన్టీఆర్ స్టెప్స్ మరీ మరీ చూడాలనిపించేలా ఉన్నాయి.


స్లైడ్ షో లో మిగతా రివ్యూ...


బాడీ లాంగ్వేజ్...క్యారక్టరైజేషన్

బాడీ లాంగ్వేజ్...క్యారక్టరైజేషన్

ఈ సినిమాలో హైలెట్ ఏమిటీ హీరోకు డిజైన్ చేసిన క్యారక్టరైజేషన్...దాన్ని ఓ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఎన్టీఆర్ చేసిన తీరు. ముఖ్యంగా క్లైమాక్స్ పీక్స్ కు వెళ్లారు.


మరో హైలెట్

మరో హైలెట్

ఈ సినిమాలో మరో హైలెట్ ఎవరూ అంటే ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ చేసిన పోసాని కృష్ణ మురళి. ఎప్పటిలాగ రాజా అనే మాడ్యూలేషన్ వదిలేసి...చాలా పద్దతిగా ఓ నిజాయితి గల పోలీస్ గా, హీరోని మంచి వైపు ప్రేరేపించే పాత్రలో నిలిచారు.


ఎప్పటిలాగే

ఎప్పటిలాగే

ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే... డీసెంట్ గా చేసి సినిమాకు కీలకమైన నిలిచారు. చేసింది రొటీన్ పాత్ర అయినా తనదైన శైలిలో దాన్ని నిలబెట్టి సినిమాకు ప్లస్ అయ్యారు. ఎన్టీఆర్ ని డీల్ చేసేటప్పుడు ప్రకాష్ రాజ్ డైలాగ్స్ చేప్పే తీరు, నటన బాగున్నాయి.


ఫస్టాఫ్...సెకండాఫ్ ...క్లైమాక్స్

ఫస్టాఫ్...సెకండాఫ్ ...క్లైమాక్స్

ఫస్టాఫ్ ...చాలా రొటీన్ గా సాగిపోయింది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ సైతం తీసుకోలేదు. అయితే సెకండాప్ రన్ బాగుంది.క్లైమాక్స్ కు పీక్స్ కు తీసుకెళ్లేలా చేసారు.


కాజల్

కాజల్

సినిమాలో హీరోయిన్ కాజలే కానీ ఆమెపై పెద్ద కథ లేదు...ముఖ్యంగా సెకండాఫ్ లో అసలు ఆమె పాత్రే లేదు..కేవలం పాటలకే పరిమతమైపోయింది..


డైలాగ్స్

డైలాగ్స్

‘అందరి ముందు అమ్మాయిని రేప్ చేసింది మేమే అని అందరి ముందు ఒప్పుకునే ధైర్యం మాకు ఉంది, మరి మీకు ఉదయం లోపు మాకు ఉరిశిక్ష వేసే దమ్ము ఉందా.?', ‘దేశంలో జరిగే ప్రతి అవినీతికి ఈ నోటుపై ఉన్న గాంధీగారే సాక్షి'.. వంటి డైలాగులుకు పూరికే సాధ్యం.


టెక్నికల్ గా...

టెక్నికల్ గా...

సినిమాకు టెక్నికల్ గా అటు శ్యామ్ కె నాయుడు, ఇటు ఎడిటింగ్ ఎస్ ఆర్ శేఖర్ పని చేసారు. ఎక్కడా ల్యాగ్, బోర్ లేకుండా సినిమాను స్పీడుగా లాగటంతో పాత కథ అనేది ఎక్కడా చూస్తున్నంతసేపు అనిపించదు.


సంగీతం

సంగీతం

సినిమాకు అనూప్ రూబెన్స్ ఇచ్చిన సంగీతం హైలెట్ గా నిలిచింది. భాస్కరభట్ల రాసిన ఐటం సాంగ్ బాగా పేలింది. పాటలు ఇప్పటికే జనాల్లోకి వెల్లటం కూడా బాగా కలిసి వచ్చింది.


ప్యూరి గా పూరి మార్క్

ప్యూరి గా పూరి మార్క్

పూరి పోకిరి నాటి మార్క్ ని మరోసారి చూపారనిపించింది. డైలాగ్స్ విషయంలో ఆ షార్ఫ్ నెస్, క్యారక్టరైజేషన్ సినిమాలో అడుగడుగునా మనని అలరిస్తూనే ఉంటాయి.


‘టెంపర్’లేచింది... (రివ్యూ)

‘టెంపర్’లేచింది... (రివ్యూ)

బ్యానర్ : పరమేశ్వర ఆర్స్ ప్రొడక్షన్స్
నటీనటులు: ఎన్టీఆర్, కాజల్‌, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు
కథ: వక్కంతం వంశీ,
కెమెరా: శ్యామ్‌ కె నాయుడు,
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌,
ఆర్ట్‌: బ్రహ్మ కడలి,
ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌,
ఫైట్స్‌: విజయ్‌,
సమర్పణ: శివబాబు బండ్ల,
నిర్మాత: బండ్ల గణేశ్‌,
స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.
విడుదల తేదీ: 13, ఫిబ్రవరి 2015.ఫైనల్ గా ఎన్టీఆర్ అభిమానులకే కాక...సినిమా అభిమానులను సైతం అలరించే చిత్రం ఇది. కామెడీ ఉంటేనే ఎంటర్టైన్మెంట్ అనేదాన్ని చెరపవేయటానికా అన్నట్లు కామెడీ లేకుండా వినోదం పండించి గెలిచారు.


(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

English summary
Temper is an action entertainer movie written by Vakkantham Vamsi and directed by Puri Jagannadh released today with hit talk. Jr NTR and Kajal Aggarwal are playing the main lead roles along with Prakash Raj in negative role.
Please Wait while comments are loading...