»   » జూలీ2 మూవీ రివ్యూ: హాట్‌ హాట్‌గా రాయ్ లక్ష్మీ.. కానీ..

జూలీ2 మూవీ రివ్యూ: హాట్‌ హాట్‌గా రాయ్ లక్ష్మీ.. కానీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5
హాట్‌ హాట్‌గా రాయ్ లక్ష్మీ.. జూలీ2 మూవీ రివ్యూ

దక్షిణాదిలో అగ్రతారగా పేరు సంపాదించుకొన్న రాయ్ లక్ష్మీ తొలిసారి బాలీవుడ్‌లో ప్రవేశించి చేసిన సినిమా జూలీ2. విడుదలకు ముందే ఈ చిత్రంలో మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ చిత్రం సినీ నటి నగ్మా జీవితంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కిందనే వార్తలు రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. దానికి తోడు వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రాయ్ లక్ష్మీ బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ఉపయోగపడిందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

జూలీ2 కథ

జూలీ2 కథ

జూలీ ( రాయ్ లక్ష్మీ) దక్షిణాదితోపాటు హిందీ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్. అశ్వినీ అస్థానా (పంకజ్ త్రిపాఠి) భార్య, సంఘ సేవకురాలు సుమిత్రా దేవీ బయోపిక్‌లో నటించడానికి సిద్ధమవుతుంది. ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగానే ఓ జ్యూవెల్లరీ షాపులో జూలీపై హత్యాప్రయత్నం జరుగుతుంది. ఆ దాడిలో జూలీ మరణిస్తుంది. ఆ మరణం వెనుక అనేక అనుమానాలు తలెత్తడంతో ఏసీపీ దేవ్ దత్ (ఆదిత్య శ్రీవాస్తవ) దర్యాప్తు ప్రారంభిస్తాడు. ఆ దర్యాప్తులో జూలీ మేకప్ మెన్ ఆనీ (రతి అగ్నిహోత్రి)ని కలువడంతో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూస్తాయి.

మర్డర్ మిస్టరీ ఇలా

మర్డర్ మిస్టరీ ఇలా

జూలీని ఎవరు చంపారు? జూలీ హత్య వెనుక ఉన్న అసలు కారణమేమి? ఏసీపీ దేవ్ దత్‌కు దర్యాప్తులో ఎదురైన సంఘటనలు ఏంటీ? దర్యాప్తులో దేవ్ దత్‌కు ఎదురైన సమస్యలు ఎంటీ అనే విషయాలకు తెర మీద సమాధానమే జూలీ చిత్ర కథ.

విశ్లేషణ

విశ్లేషణ

బాలీవుడ్ తార నేహా దూపియా నటించిన జూలీకి ఇది ప్రీక్వెల్ అని దర్శకుడు దీపక్ శివదాసనీ వెల్లడించారు. వాస్తవానికి ఈ చిత్ర కథ సినీ నటి జీవితంలో జరిగిన సంఘటనలతో కూడిన మర్డర్ మిస్టరీ. మర్డరీ మిస్టరీ చేధనలో ఉండే ఆసక్తి ఈ సినిమాలో కనిపించకపోవడం ప్రధాన లోపం. ఇక ఈ చిత్రంలో పేరు ఉన్న నటీనటులు లేకపోవడంతో పాత్రలు పేలవంగా కనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో దర్యాప్తు చాలా నీరసంగా సాగినట్టు అనిపించడం సహనానికి ఓ పరీక్షలా మారుతుంది.

 సెకండాఫ్‌లో

సెకండాఫ్‌లో

ఇక రెండో భాగంలో రాయ్ లక్ష్మీ హీరోయిన్‌గా ఎలా మారిందనే అంశాన్ని హాట్ హాట్ సీన్లతో సినిమాను నడిపించాడు. ఇక క్లైమాక్స్ మర్డర్ వెనుక మిస్టరీ చాలా గందరగోళం, హడావిడి మధ్య ముగించే విధంగా అనిపిస్తుంది. దాంతో ఎన్నో ఆశలు పెట్టుకొన్న వచ్చిన ప్రేక్షకులకు జూలీ2 సాదాసీదా మర్డర్ మిస్టరీ అనే నిరుత్సాహంతో వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

దీపక్ డైరెక్షన్

దీపక్ డైరెక్షన్

జూలీ2 చిత్రానికి దర్శకుడు దీపక్ శివదాసని. నేహా దూపియాతో తీసిన జూలీకి ఈయనే దర్శకుడు. ఇక జూలీ2 విషయానికి వస్తే స్క్రిప్టులో అనేక లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. కథపై నమ్మకం ఉండో లేకనో సగటు ప్రేక్షకులకు ఏ మాత్రం పరిచయం లేని నటీనటులతో నాసిరకంగా చుట్టేశాడనే అనిపిస్తుంది.

రాయ్ లక్ష్మీ తప్పిస్తే

రాయ్ లక్ష్మీ తప్పిస్తే

జూలీ2 చిత్రంలో రాయ్ లక్ష్మీ తప్పిస్తే మిగితా పాత్రదారుల పేర్లను వెతుక్కోవాల్సిన దుస్థితి కలుగుతుంది. పాత్రదారుల ఎంపికలో దర్శక, నిర్మాతలు కక్కుర్తి పడటం ద్వారా కథకు ప్రేక్షకుడు కనెక్ట్ కావడానికి చాలా కష్టపడాల్సిన సమస్య ఎదురవుతుంది.

అంతతానై రాయ్ లక్ష్మీ

అంతతానై రాయ్ లక్ష్మీ

జూలీ2 విషయానికి వస్తే ఈ చిత్ర భారాన్నంతా రాయ్ లక్ష్మీ పూర్తిగా మోసింది అని చెప్పవచ్చు. కథలో పస లేకపోవడం వల్ల రాయ్ లక్ష్మీ లాంటి ప్రతిభవంతురాలైన నటి టాలెంట్ వృథా అయింది అనే ఫీలింగ్ కలుగడం సహజం. కొన్ని సీన్లలో తన అందాల ఆరబోతతో గిలిగింతలు పెట్టగా, మరికొన్ని సీన్లలో భావోద్వేగ అంశాలను పండించింది. ప్రేమ కోసం పరితపించే యువతిగా చక్కటి నటనను ప్రదర్శించింది. ఈ చిత్రం ద్వారా రాయ్ లక్ష్మిలో నటిగా మరో కోణంలో చూడటానికి అవకాశం ఏర్పడింది.

ఇతర నటీనటులు

ఇతర నటీనటులు

రాయ్ లక్ష్మీ మేకప్‌మెన్, సంరక్షురాలిగా అలనాటి నటి రతి అగ్నిహోత్రి కనిపించింది. ఈ చిత్రంలో డైరెక్టర్‌గా దర్శకుడు నిశికాంత్ కామత్, మాఫియా డాన్‌గా దేవ్ గిల్, దక్షిణాది సూపర్‌స్టార్ రవికుమార్‌గా రవికిరణ్ తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు.

పేలవంగా మ్యూజిక్

పేలవంగా మ్యూజిక్

ఈ చిత్రానికి విజుషా సంగీతం అందించారు. ఒకట్రెండు తప్ప పెద్దగా ఆకట్టుకొన్న పాటలు కనిపించవు. సినిమాలో 5 పాటలు ఉన్నా మాలా సిన్హా అనే పాట తప్ప ఏవీ కూడా ఆకట్టుకునేలా అనిపించవు. జాన్ స్టివార్ట్ ఎడూరీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పేలవంగా ఉంది.

సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ గుడ్

సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ గుడ్

జూలీ2 చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందించారు. రాయ్ లక్ష్మి‌ని గ్లామర్‌గా చూపించడంలో 100 శాతం సక్సెస్ అయ్యాడు. కొన్ని సీన్లను సమీర్ రెడ్డి అద్బుతంగా తెరకెక్కించాడు. సమీర్ రెడ్డి పనితీరు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

చివరగా సినీతారల జీవిత కథ అంటే మంచి మసాలా ఉంటారని ప్రేక్షకులు ఆశించడంలో తప్పేమీ లేదు. గతంలో వచ్చిన చిత్రాలతోపాటు ఇటీవల వచ్చిన డర్టీ పిక్చర్ కూడా మంచి అనుభూతిని పంచిన చిత్రంగా మిగిలింది. ప్రస్తుతం అలాంటి అంచనాలతో థియేటర్‌కు వెళితే జూలీ2 విషయంలో బోల్తా పడినట్టే. ఇంట్లో ఏమీ తోచక కాస్తా రాయ్ లక్షీ హాట్ హాట్ సీన్లను చూసొద్దామనుకుంటే కాస్తా ఎంజాయ్ చేయడానికి కొంత వెసులుబాటు కలుగుతుంది.

ప్లస్ పాయింట్

ప్లస్ పాయింట్

రాయ్ లక్ష్మీ గ్లామర్, నటన
స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్
కథ, డైరెక్షన్
మ్యూజిక్
క్లైమాక్స్

తెర వెనుక, తెర ముందు..

తెర వెనుక, తెర ముందు..

నటీనటులు: రాయ్ లక్ష్మీ, రవికిషన్, ఆదిత్య శ్రీవాస్తవ, పంకజ్ త్రిపాఠి,రతి అగ్నిహోత్రి తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దీపక్ శివదాసని
నిర్మాత: విజయ్ నాయర్, దీపక్ శివదాసనీ, పహ్లాజ్ నిహ్లానీ
సంగీతం: విజుషా
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
రిలీజ్ డేట్: 24 నవంబర్, 2017

English summary
Julie 2 Movie is written and directed by Deepak Shivdasani who has also helmed its prequel – Julie featuring Neha Dhupia. Raai Laxmi look in gyrating in body-hugging suits and shiny bikinis. This movie is released on november 24.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu