»   » కాదలి మూవీ రివ్యూ: రొటీన్ ప్రేమ కథా చిత్రం

కాదలి మూవీ రివ్యూ: రొటీన్ ప్రేమ కథా చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిన్న చిత్రంగా మొదలై ఫీల్ గుడ్ టాక్‌ను సొంతం చేసుకొన్న సినిమా కాదలి. ఈ చిత్రం కోసం దర్శకుడిగా అవతారం ఎత్తాడు పట్టాభి ఆర్ చిలుకూరి. అంతేకాకుండా అందరిని కొత్తవారిని టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ పట్టాభి నిర్మాత కూడా వ్యవహరించారు. కాదలి ఆడియోను మంత్రి కేటీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆవిష్కరించడంతో మరింత హైప్ వచ్చింది. చక్కటి ప్రేమ కథా చిత్రంగా చెప్పుకొంటున్న కాదలి జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని అందించిందా అని తెలుసుకోవాలంటే కథ గురించి తెలుసుకొందాం.

కథ ఇలా సాగింది..

కథ ఇలా సాగింది..

బాంధవి వరదరాజన్ (పూజా కే దోషి) ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో ఫిజియో థెరపిస్ట్. బాంధవికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన పెళ్లి చూపుల కార్యక్రమం బెడిసి కొడుతుంది. మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన పెళ్లిచూపులే చేదు అనుభవాన్ని మిగిల్చడంతో నిరాశకు గురవుతుంది. ఈ క్రమంలో కార్తీక్ (హరీష్ కల్యాణ్), క్రాంతి (సాయి రోనక్) అనే ఇద్దరు యువకులతో ఏర్పడిన పరిచయం గాఢమైన స్నేహంగా మారుతుంది. బాంధవి అంటే ఇద్దరికి ప్రేమ ఏర్పడుతుంది. వారిద్దరూ తమ ప్రేమను బాంధవికి వ్యక్తీకరించాలని ప్రయత్నాలు చేస్తారు. ఆ క్రమంలో కార్తీక్, క్రాంతి ఒకరిపై మరొకరు ద్వేషం పెంచుకొంటారు.


ముగింపు ఇలా..

ముగింపు ఇలా..

బాంధవికి కార్తీక్, క్రాంతి తమ ప్రేమను ఎలా చెప్పారు. బాంధవిని ఒప్పించడానికి వారు చేసిన ప్రయత్నాలు ఏంటీ? ఈ వ్యవహారంలో బాంధవి, కార్తీక్, క్రాంతి పడిన మానసిక సంఘర్షణ ఏమిటీ. చివరికి బాంధవి కార్తీక్, క్రాంతిలలో ఎవరి ప్రేమను గెలుచుకొన్నది? ఇలాంటి ప్రశ్నలకు పరిష్కారమే కాదలి చిత్రం.


ఫస్టాఫ్‌లో..

ఫస్టాఫ్‌లో..

కాదలి చిత్రం చాలా రెగ్యులర్ స్టోరీనే. ఇద్దరు స్నేహితుల ప్రేమ మధ్య నలిగిన ఓ అమ్మాయి ప్రేమ కథ. పెళ్లి చూపులు బెడిసి కొట్టిన ఓ అమ్మాయి తన నాన్నమ సలహా మేరకు తనకు నచ్చిన వరుడిని వెతుక్కునే సింగిల్ లైన్ కథను దర్శకుడు పట్టాభి సాగదీసి సాగదీసి చెప్పాడు. అయితే గతంలో వచ్చిన సెన్సేషనల్ హిట్ ప్రేమకథ ప్రభావంతో దర్శకుడు కథ రాసుకొన్న విధానం బాగానే ఉంది. కానీ ఆయన ఎంచుకొన్న నటీనటుల ఎంపికే సరిగా లేదు. పెళ్లిచూపులు మాదిరిగా పేరులేని నటీనటులతో హిట్ కొడుదామనే ప్రయత్నం పట్టాభిలో కనిపిస్తుంది. ప్రతీ రోజు పండుగ కాదు అన్నట్టే.. తీసిన ప్రతీ సినిమా పెళ్లి చూపులు కాదు గదా. పెళ్లి చూపుల్లో ఇద్దరి మధ్య సంఘర్షణ ఉంటుంది. ప్రేమలో ఉద్వేగం, ఫీల్ ఉంటుంది. అందుకే పెళ్లి చూపులు చిత్రాన్ని తెరమీద చూడగానే ప్రేక్షకుడు కూడా లీనమైపోయాడు. కానీ కాదలి చిత్రంలో అలాంటి అంశాలు కనిపించవు. రెండో భాగానికి క్లిష్టమైన సమస్యను చూపించకుండానే ఇంటర్వెల్ కార్డు వేసేశాడు దర్శకుడు.


సెకండాఫ్‌లో..

సెకండాఫ్‌లో..

రెండో భాగంలో ప్రేమికుల మధ్య సంఘర్షణను గొప్పగా చూపించాడా అంటే అదీ ఉండదు. పేలవమైన సీన్లు, నాసిరకమైన యాక్షన్ సీన్లు, ఆకట్టుకొని కథనం, హాస్యం ఇలాంటి అంశాలను కాదలిని సాదాసీదాగా మార్చేసాయి. రెండో భాగం ప్రారంభం కాగానే క్లైమాక్స్‌లో ఏమవుతుందో అనే విషయం సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమవుతుంది. దాంతో ఇక ఎండ్ టైటిల్ కార్డు ఎప్పుడు పడుతుందా అని వేచిచూడటం ప్రేక్షకుడి వంతుగా మారుతుంది. చివరకు ఇది సినిమాల కాకుండా షార్ట్ ఫిలిం చూసిన ఫిలింగ్ కలుగుతుంది.


దర్శకుడిగా పట్టాభి

దర్శకుడిగా పట్టాభి

దర్శకుడిగా పట్టాభికి టాలెంట్ ఉండవచ్చు. కానీ తొలి చిత్ర దర్శకుడిలో ఉండే కసి, తపన తెరమీద కనిపించదు. ముక్కోణపు ప్రేమకథలు ఇప్పటికే వేల సినిమాలు వచ్చి ఉంటాయి. కానీ ప్రేమ కథను నడిపించే సరుకు, ఆసక్తికరమైన కథనం అన్ని కుదరాలి. వీటిపై దర్శకుడు శ్రద్ధపెట్టిన దాఖలాలు కనిపించవు. అనుకొన్న పాయింట్‌ను డెవలప్ చేసేసి సినిమాగా చుట్టేసినట్టు అనిపిస్తుంది. దర్శకుడి విషయాన్ని పక్కన పెడితే.. రచయితగా కూడా ఆకట్టుకోలేకోపోయడాని చెప్పవచ్చు.


హీరో, హీరోయిన్ల ఫెర్ఫార్మెన్స్

హీరో, హీరోయిన్ల ఫెర్ఫార్మెన్స్

బాంధవి, కార్తీక్, క్రాంతి పాత్రలను పోషించిన పూజా కే దోషి, హరీష్ కల్యాణ్, సాయి కొత్తవారైనా మంచి నటనను ప్రదర్శించారు. తమ పాత్ర పరిధి మేరకు నటించి ఆకట్టుకొన్నారనే చెప్పవచ్చు. పూజా కీలక సన్నివేశాల్లో పరిణతి చెందిన నటనను ప్రదర్శించింది. తొలి చిత్రమే కాబట్టి ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్ డెలివరీలో ఇంకా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. సాయి, హరీష్‌లు పూర్తి స్థాయి హీరోలుగా మారడానికి ఇంకా చాలా అంశాలపై దృష్టిపెట్టాల్సి ఉంటుంది. కొత్తవారైనా ముగ్గురు ఎలాంటి స్క్రిన్ ఫియర్ లేకుండా నటించడం ప్లస్ పాయింట్.


సాంకేతిక విభాగాల పనితీరు

సాంకేతిక విభాగాల పనితీరు

సాంకేతిక విభాగాలను పరిశీలిస్తే శేఖర్ వి జోసెఫ్ కెమెరా పనితనం గుడ్. కథకు తగినట్టు కొన్ని సీన్లను చాలా బాగా చిత్రీకరించాడు. ప్రసన్ ప్రవీణ్ శ్యాం మ్యూజిక్ గొప్పగా లేదు. పాటలు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హమ్ చేసుకుందామంటే గుర్తు వస్తే ఒట్టు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ తన కత్తెరకు మరింత పెడితే సినిమా కొంత ఆసక్తికరంగా మారిఉండేదేమో.


బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

మైనస్ పాయింట్స్
కథ, కథనం, దర్శకత్వం
మ్యూజిక్


ప్లస్ పాయింట్స్
హీరో, హీరోయిన్లు (కొంతలో కొంత)
కెమెరా


తెర ముందు.. తెర వెనుక

తెర ముందు.. తెర వెనుక

సినిమా పేరు: కాదలి
నటీనటులు: హరీష్ కల్యాణ్, సాయి రోనాక్, పూజా కే దోషి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: పట్టాబి ఆర్ చిలుకూరి
కెమెరా: శేఖర్ వీ జోసెఫ్
మ్యూజిక్: ప్రసన్ ప్రవీణ్ శ్యాం
ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్
విడుదల: జూన్ 16, 2017English summary
Kaadhali move is directed by new comer Pattabhi R Chilukoori. Harish Kalyan, Sai Ronak, Pooja K Doshi are lead actors. Shekar V Joseph worked as Camaramen. Editing done by Marthand K Venkatesh. This film released on June 16, 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu