For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖైదీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

|

Rating:
3.0/5
Star Cast: కార్తీ, నరైన్, జార్జ్ మరియన్, హరీష్ ఉత్తమన్ తదితరులు
Director: లోకేష్ కనకరాజ్

లవ్, యాక్షన్, కామెడీ క్యారెక్టర్ ఏదైనా తనదైన శైలిలో మెప్పించి దూసుకుపోతోన్నహీరో కార్తీ. తమిళంలోనే కాక తెలుగులోనూన మంచి మార్కెట్ ఏర్పరుచుకున్న కార్తీ.. చివరగా దేవ్ చిత్రంతో పలకరించాడు. తాజాగా ఖైదీ అంటూ మరోసారి ఆడియెన్స్‌ను మెప్పించేందుకు రెడీ అయ్యాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖైదీ.. కార్తీకి మరో విజయాన్ని చేకూర్చిందా? లేదా అన్నది చూద్దాం.

కథ

కథ

డ్రగ్స్ మాఫియా పని పట్టాలనుకునే పోలీస్ డిపార్ట్మెంట్.. తమ సరుకును పట్టుకున్న పోలీస్ ఆఫీసర్లను మట్టు బెట్టాలని వెంటపడే రౌడీలు.. పుట్టినప్పటి నుంచి తన కూతురుని చూడకుండా ఉన్న ఖైదీ డిల్లీ(కార్తీ).. వీటన్నంటికి సంబంధం లేని ఓ స్నేహితుల బృందం.. ఒక్క రాత్రి వీరి జీవితాలను ఏ విధంగా మలిచాయి? చివరకు ఏం జరిగింది? పోలీస్ ఆఫీసర్ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడా? ఆ క్రమంలో మాజీ ఖైదీ అయిన డిల్లీ పోలీసులకు ఏవిధంగా సహాయపడ్డాడు? చివరకు ఆ ఐదుగురు స్నేహితులు ఏం అయ్యారు? తన కూతురును చూడాలనే కోరిక తీరిందా లేదా? అన్నదే కథ

కథలో ట్విస్టులేంటంటే..?

కథలో ట్విస్టులేంటంటే..?

ఖైదీగా ఉన్న కార్తీ కథ ఏంటి? డ్రగ్స్ మాఫియాలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇన్‌ఫార్మర్ ఎవరు? చివరకు అతని కథ ఏమైంది? డ్రగ్స్ మాఫియాను నడిపిస్తున్న ఆది శంకర్ (హరీష్ ఉత్తమన్) ఎవరు? అతనికి ఖైదీగా ఉన్న డిల్లీకి సంబంధం ఏంటి? అనేవి కథలో ఆసక్తిని రేకెత్తిస్తాయి.

ఫస్టాఫ్ అనాలిసిస్...

ఫస్టాఫ్ అనాలిసిస్...

దాదాపు 800 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేయడం, వాటిని తిరిగి చేజిక్కించుకోవడం కోసం డ్రగ్స్ మాఫియా చేసే ప్రయత్నాలతో బాగానే ఆకట్టుకుంది. ఈ క్రమంలో పోలీసులు ఓ ప్రమాదంలో చిక్కుకోవడం.. వాటి నుంచి తప్పించుకోవడం కోసం బెజోయ్ (నరైన్) అనే ఆఫీసర్ డిల్లీ సహాయ తీసుకోవడం... మార్గమధ్యలో చేజింగ్‌లు, యాక్షన్ పార్ట్, కాసింత కామెడీ సీన్స్‌తో ఫస్టాఫ్ పర్వాలేదనిపించింది.

సెకండాఫ్ అనాలిసిస్..

సెకండాఫ్ అనాలిసిస్..

డ్రగ్స్ మాఫియాకు సంబంధించిన నాయకుడిని అంతకుముందే అరెస్ట్ చేశామని పోలీసులు తెలుసుకోవడం.. ఆదిశంకర్‌ను కాపాడుకోవడానికి రౌడీలు చేసే ప్రయత్నాలు.. వాటిని అడ్డుకునేందుకు ఓ కానిస్టేబుల్ నెపోలియన్ (జార్జ్ మరియన్), స్నేహితుల బ‌ృందం చేసే ప్రయత్నాలతో సెకండాఫ్ ఆద్యంతం ఆసక్తికరంగా మారుతుంది. చివరకు కార్తీ చేసే విధ్వంసం కాస్త ఎక్కువ అయినా సెకండాఫ్ బాగానే ఆకట్టుకుంది.

కార్తీ పర్ఫామెన్స్..

కార్తీ పర్ఫామెన్స్..

జైలు నుంచి విడుదలైన ఖైదీ పాత్రలో కాస్త మొరటుగా, పుట్టినప్పటి నుంచి తన కూతురిని చూడకుండా ఉన్న తండ్రిగా, ఒక్కసారైనా తన కూతురును చూడాలని, మాట్లాడాలని తపన పడే పాత్రలో కార్తీ జీవించేశాడు. గెటప్, లుక్స్ అన్నీ కూడా పాత్రకు సరిపోయాయి. ఈ చిత్రంతో మంచి నటుడిగా మరోసారి నిరూపించుకున్నాడు.

 నరైన్, జార్జ్ మరియన్

నరైన్, జార్జ్ మరియన్

తనకు ఏం జరిగినా సరే కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు వెనుకాడని పోలీస్ ఆఫీసర్లుగా నరైన్, జార్జ్ మరియన్‌లు ఆకట్టుకున్నారు. ఎంత మంది చుట్టుముడుతున్న బయపడకుండా ధైర్యంగా నిలబడే కానిస్టేబుల్ పాత్రలో జార్జ్ మరియన్ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో కార్తీ తరువాత వీరిద్దరికే ఎక్కువ మార్కులు పడతాయి.

దర్శకుడి పనితీరు..

దర్శకుడి పనితీరు..

దర్శకుడు తాను అనుకున్న కథకు ఎంచుకున్న కథనం అంతా బాగానే ఉంది. అయితే ఆ ఒక్క పాయింట్ చుట్టే తిప్పి తిప్పి ప్రేక్షకుడికి కాస్త బోర్ కొట్టించినట్టు అనిపిస్తుంది. అయితే కథను పక్కదారి పట్టించుకుండా పాటలు, కుళ్లు జోకులు వంటివి ఇరికించకుండా.. కథ, కథనాల మీదే ద‌ృష్టి పెట్టడం కలిసొచ్చే అంశం. అయితే కార్తీకి ఎంతో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అందరూ అనుకుంటే.. చివరకు దాన్ని కూడా అంతగా హైలెట్ చేయలేదు. అయితే తాను చెప్పాలనుకున్న పాయింట్‌ను.. బిగితో కూర్చిన స్క్రీన్‌ప్లే మెప్పించగలిగాడు. మితిమీరిన యాక్షన్ సీన్స్‌ కూడా లేకుండా చూస్తే ఇంకాస్త బాగుండేది. వాటి వల్ల థియేటర్లో శబ్ద కాలుష్యం తప్పా ఇంకేమీ జరగలేదు. ఓవరాల్‌గా లోకేష్ మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

ప్లస్ పాయింట్స్

కార్తీ నటన

కథ

కథనం

దర్శకత్వం

మైనస్ పాయింట్స్

మితిమీరిన యాక్షన్ సీన్స్

స్లో నెరేషన్

నిడివి

సాంకేతిక బృందం

సాంకేతిక బృందం

దర్శకత్వం: లోకేష్ కనకరాజ్

నిర్మాత: ఎస్ ఆర్ ప్రభు

మ్యూజిక్: శ్యామ్ సీకే

సినిమాటోగ్రఫి: సత్యన్ సూర్యన్

ఎడిటింగ్: గౌతం రాజు

ఆర్ట్: సాహి సురేష్

స్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీరంగరాజ్

స్టంట్స్: అంబరీవ్

మ్యూజిక్, సినిమాటోగ్రఫీ...

మ్యూజిక్, సినిమాటోగ్రఫీ...

కథ పరంగా ఎలాంటి పాటలు అవసరం లేకపోవడం, ఇరికించాలని కూడా చూపకపోవడంతో కథ కూడా ఎక్కడా పక్కకు జరగదు. ఒకే ఫ్లో లో వెళ్తూ ఉంటుంది. అవసరానికి తగ్గట్టు శ్యామ్ సీకే అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. కొన్ని చోట్ల డిల్లీ పాత్రను ఎలివేట్ చేసేందుకు నేపథ్య సంగీతం బాగా ఉపయోగపడింది. సినిమా అంత ఒక్క అర్దరాత్రిలోనే జరిగిపోవడం, నైట్ మోడ్‌లోనే సినిమాను చూపించడంతో సినిమాటోగ్రఫర్ సత్యన్ సూర్యన్ పనితనం కనబడుతుంది.

సాంకేతిక పరంగా...

సాంకేతిక పరంగా...

కొన్ని అనవసరమైన సీన్లకు కత్తెర వేసి ఉంటే.. ఇంకా బాగుండేది. అనవరసరమైన ఖర్చులకు పోకుండా.. కథ డిమాండ్ మేరకు ఏం కావాలో అది చేశారు. ఈ క్రమంలో ఆర్ట్ విభాగం పనితనం బాగా ఆకట్టుకుంది. విజువల్ ఎఫెక్ట్స్ విభాగం తమ పరిధి మేరకు చక్కగా చేసింది.

 ఫైనల్‌గా...

ఫైనల్‌గా...

ఫక్తు మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం అంతగా ఎక్కకపోవచ్చు. అయితే భిన్న కథకథనాలతో కూడుకున్న చిత్రాలను ఇష్టపడేవారిని మాత్రం ఖైదీ కచ్చితంగా మెప్పిస్తుంది.

English summary
Kaithi is an Tamil, Telugu language comedy horror film written and directed by Lokesh Kanagaraj. The film stars Karthi And Narain. This movie released on October 25, 2019.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more