twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kalapuram movie review సినిమా కష్టాల బ్యాక్ డ్రాప్‌తో.. కరుణ కుమార్ డైరెక్షన్ ఎలా ఉందంటే?

    |

    పలాస, శ్రీదేవి సోడా సెంటర్‌ చిత్రాలతో కరుణ కుమార్ సామాజిక అంశాలను సృశించి మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకొన్నారు. అలాంటి దర్శకుడి నుంచి సినిమా వస్తుందంటే.. అందరి దృష్టి ఆయనపై ఉండటం సహజం. అయితే కళాపురం అనే ఫీల్ గుడ్ టైటిల్ ప్రకటించగానే.. తన జోనర్‌కు భిన్నంగా సినిమా చేశాడనే అభిప్రాయం కలిగింది. టీజర్లు, ట్రైలర్ల రిలీజ్ తర్వాత కళాపురం వినోదంతో రూపొందిన రియలిస్టిక్ సినిమా అనే భావన వ్యక్తమైంది. ఇక కళాపురం ఇలాంటి అంచనాలను అధిగమించిందా అనే విషయం తెలుసుకొనేందుకు కథ, కథనాలను సమీక్షిద్దాం.

    సినిమా పరిశ్రమలో దర్శకుడిగా రాణించాలనే కలతో ప్రయత్నాలు చేస్తున్న కుమార్ (సత్యం రాజేశ్)కు డబ్బింగ్ ఆర్టిస్ట్ (ప్రవీణ్ యండమూరి) తారసపడుతాడు. వారిద్దరూ కలిసి నిర్మాతలు, సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు.ఇలాంటి పరిస్థితుల్లో అప్పారావు అనే నిర్మాత సినిమా తీయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. సినిమా లోకేషన్ల ఎంపిక కోసం కళాపురం గ్రామానికి వెళ్లిన కుమార్, ప్రవీణ్‌ ఓ కేసులో ఇరుక్కుపోతారు.

     Kalapuram movie review and rating: Karuna Kumars sensible comedy movie.

    దర్శకుడు అయ్యేందుకు కుమార్ ఎలాంటి అవస్థలు పడ్డాడు? కుమార్‌ను లవర్ ప్రేయసి ఇందు (కాశిమా రఫి) ఎలా మోసం చేసింది? నిర్మాత అప్పారావు చేసిన పనికి కుమార్, ప్రవీణ్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? కళాపురంలో తారసపడిన శారద (సంచిత) పరిచయం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర సీఎం (సన) కుమార్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది? ఇంతకు కుమార్ దర్శకుడిగా మారారా? అనే ప్రశ్నలకు సమాధానమే కళాపురం.. ఇక్కడ అందరూ కళాకారులే సినిమా కథ.

    దర్శకుడు కరుణకుమార్ ఎంచుకొన్న పాయింట్ బాగుంది.. కానీ కథను పూర్తిస్థాయిలో విస్తరించి ఉంటే డెఫినెట్‌గా కొత్త జోనర్‌ ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించేదనే అభిప్రాయం కలిగింది. ఒక సీరియస్ పాయింట్ చుట్టూ సెన్సిబుల్ హ్యుమర్‌ను అల్లుకోవడం బాగుంది. నటీనటులు ఎంపిక విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త వహించాల్సింది. క్రౌడ్ పుల్లింగ్ చేసే యాక్లరు లేకపోవడం వల్ల సినిమా పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ కావడానికి కొంత ఇబ్బంది ఏర్పడిందని చెప్పవచ్చు. ఓవరాల్‌గా సింపుల్‌గా ఎలాంటి అర్భాటలు లేకుండా హాస్యంతో కూడిన ఒక ఎమోషనల్ కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు.

    ఇక సత్యం రాజేశ్, ప్రవీణ్, కాశీమా రఫి, చిత్రం శ్రీను తమ పాత్రల్లో ఒదిగిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సత్యం రాజేశ్ సినిమా భారాన్ని మొత్తం తానే మోయడం ప్లస్ పాయింట్. ఒక కామెడీ సినిమాను రాజేశ్ పూర్తిస్థాయిలో చేయగలడనే నమ్మకం ఈ సినిమా ద్వారా కలిగింది.

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మణిశర్మ బీజీఎం బాగుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. మణిశర్మ రేంజ్‌కు తగినట్టు కథ లేకపోవడం వల్ల పెద్దగా చేయడానికి అవకాశం లేకపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. రజనీ తాళ్లూరి, జీ సంస్థ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

    సినిమా, రాజకీయ అంశాల మేలవింపుతో రూపొందిన సున్నితమైన హాస్య చిత్రం కళాపురం. ఈ కథను మరో లెవెల్‌కు తీసుకెళ్లాల్సిన ఎమోషనల్ పాయింట్స్ పండలేకపోయాయి. సెన్సిబుల్ కామెడీ చిత్రాలను ఆదరించే వారికి కళాపురం నచ్చుతుంది.

    నటీనటులు: స‌త్యం రాజేష్‌, ప్రవీణ్ యండమూరి, కాశీమా రఫి, చిత్రం శ్రీను, సన, జబర్దస్త్ అప్పారావు త‌దిత‌రులు
    దర్శకత్వం: కరుణకుమార్‌
    నిర్మాత: ర‌జనీ తాళ్లూరి
    సంగీతం: మణిశర్మ
    సమర్పణ: జీ స్టూడియోస్‌
    నిర్మాణ సంస్థ: ఆర్ 4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
    రిలీజ్ డేట్: 2022-08-26

    English summary
    Palasa movie fame Karanu Kumar's latest movie Kalapuram. This movie hits the screen on August 26th. Here is the exclusive review form Telugu filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X