twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kalyanam Kamaneeyam Review క్యూట్, సెన్సిబుల్ ఫ్యామిలీ డ్రామా

    |

    Rating: 2.5/5

    నటీనటులు: సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్, దేవీ ప్రసాద్, సద్దాం, సత్యం రాజేశ్ తదితరులు
    రచన, దర్శకత్వం - అనిల్ కుమార్ ఆళ్ల
    నిర్మాణం: యూవీ కాన్సెప్ట్స్
    నిర్మాతలు: వంశీ, విక్కీ, అజయ్
    సినిమాటోగ్రఫి: కార్తీక ఘట్టమనేని
    ఎడిటర్: సత్య జి
    సంగీతం: శ్రావణ్ భరద్వాజ్
    సాహిత్యం: కృష్ణ కాంత్
    కొరియోగ్రాఫర్స్: యష్, విజయ్ పోలంకి
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరసింహ రాజు
    ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
    లైన్ ప్రొడ్యూసర్: శ్రీధర్ రెడ్డి ఆర్
    సహ నిర్మాత: అజయ్ కుమార్ రాజు
    పీఆర్వో: జీఎస్కే మీడియా

    శివ (సంతోష్ శోభన్), శృతి నాలుగేళ్ల పరిచయం, రెండేళ్ల అఫైర్ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొంటారు. శృతి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, శివ నిరుద్యోగి. అయితే ఉద్యోగం లేని తన కొడుకుకు పెళ్లి చేయడానికి శివ తండ్రి నిరాకరిస్తాడు. అయితే ఓ కారణంగా చివరకు శివ, శృతికి పెళ్లి రెండు కుటుంబాలే జరిపిస్తాయి. అయితే ఉద్యోగం లేని కారణంగా అందరూ చిన్నచూపు చూడటం, ఇంటర్వ్యూలకు వెళ్లినా ఉద్యోగం రాకపోవడంతో శృతిలో అసంతృప్తి పెరుగుతుంది. దాంతో శివకు 10 లక్షలు ఇచ్చి కన్సెల్టెన్సీ ద్వారా ఉద్యోగం సంపాదించడానికి శృతి సిద్దమవుతుంది. శివ 10 లక్షలు బ్యాంక్ నుంచి విత్ డ్రా చేసి వస్తుండగా చోరికి గురవుతాయి.

    ఉద్యోగం లేకపోయినా శివకు తల్లిదండ్రులు ఎందుకు పెళ్లి జరిపిస్తారు. ఉద్యోగం ఉన్న శృతితో తొందరగా పెళ్లి జరిపించాలని ఆమె తండ్రి ఎందుకు ఆరాటపడ్డాడు? పెళ్లి విషయంలో శివ తండ్రిని శృతి తండ్రి ఎలా ఒప్పించాడు. 10 లక్షల రూపాయలు చోరి అయిన తర్వాత శివ పరిస్థితి ఏమిటి? శృతితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం దొరికిందని అబద్దం ఆడి శివ ఎందుకు క్యాబ్ డ్రైవర్‌గా మారాడు? శివ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారనే విషయం తెలిసి తర్వాత శృతి తీసుకొన్న నిర్ణయం ఏమిటి? శివను వదిలేసి వెళ్లిన శృతికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే ప్రశ్నలకు సమాధానమే కల్యాణం కమనీయం సినిమా కథ.

    Kalyanam Kamaneeyam movie review and rating

    ఉద్యోగం ఉన్న భార్య, నిరుద్యోగి భర్త మధ్య ఏర్పడే అపోహలు, అభ్యంతరాలు, మనస్పర్ధలతో కూడిన పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కల్యాణం కమనీయం. రెండు కుటుంబాల మధ్య జరిగే చిన్న డ్రామాలో ఎమోషన్స్, చిలిపి తగాదాలు, ఫీల్‌గుడ్ అంశాలతో సరదాగా సాగిపోతుంది. ఉద్యోగం లేని భర్త బాధ్యతారాహిత్యంగా తిరుగుతున్నాడనే అపోహకు గురైన భార్యకు చిన్న చిన్న తప్పులు చేసే భర్తపై అసంతృప్తి పెరగడం కథను ముందుకు తీసుకెళ్తాయి. 10 లక్షల రూపాయలు శివ పొగొట్టుకోవడంతో అసలు కథ మొదలవుతుంది. భర్త, భార్య మధ్య అభిప్రాయ భేదాలు అంశాలు కథలో సమస్యగా మారుతాయి. అయితే ఒక సింగిల్ పాయింట్ చుట్టు కథ తిరగడం.. కథా విస్తరణ ఇంకాస్త పెంచి ఉంటే బాగుండేదనిపిస్తుంది. అక్కడక్కడా సినిమా సాగదీతకు గురైనట్టు అనిపిస్తుంది.

    దర్శకుడు అనిల్ కుమార్ కథను నడిపించిన విధానం బాగుంది. ఫీల్‌గుడ్ డైలాగ్స్, వ్యంగ్యంతో కూడిన సంభాషణలతో కథను ఫన్‌తో ముందుకు నడిపించాడు. అనిల్ కుమార్ టేకింగ్ చూస్తే.. కొత్త దర్శకుడు అనే అనుమానం ఎక్కడా అనిపించదు. మంచి అనుభవం ఉన్న దర్శకుడిగా సున్నితమైన అంశాలున్న ఓ ఫ్యామిలీ డ్రామాను చక్కగా నడిపించడం అతడి ప్రతిభకు అద్దం పట్టింది. చిన్న బడ్జెట్ కాబట్టి పరిమితులు అతడికి అడ్డంకిగా మారి ఉండవచ్చనే ఫీలింగ్ కలుగుతుంది.

    శివగా సంతోష్ శోభన్ మరోసారి నటనపరంగా పరిణతిని చూపించాడు. రకరకాల ఎమోషన్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. భార్య అనుమానించినా..ఆమెపై ప్రేమను పంచే యువకుడిగా, రకరకాల సమస్యలతో నలిగిపోయి.. ఎవరికి బాధను పంచుకోలేకపోయిన వ్యక్తి పాత్రలో మంచి ఫెర్ఫార్మెన్స్ ప్రదర్శించాడు. సినిమా సినిమాకు ఫెర్మార్పెన్స్ పరంగా బెటర్ అవుతుండటం యాక్టర్‌గా సంతోష్ శోభన్‌కు ప్లస్ పాయింట్. తమిళ టెలివిజన్‌లో యాక్టర్‌గా రాణిస్తూ.. తమిళ సినిమాలో రంగంలో వర్థమాన తారగా ఎదుగుతున్న ప్రియా భవానీ శంకర్ గ్లామర్‌పరంగానే కాదు.. యాక్టింగ్ పరంగా కూడా ఆకట్టుకొన్నది. శృతి పాత్రలో ఉండే చాలా రకాల వేరియేషన్స్ చక్కగా పలికించింది. సద్దాం స్పాంటేనియస్ కామెడీ కొత్తగా ఉంది. సత్యం రాజేశ్ విలన్ టచ్ క్యారెక్టర్ కథలో కీలకంగా మారింది. మిగితా పాత్రల్లో నటించిన వారు ఫర్వాలేదనిపించారు.

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కార్తీక్ ఘట్టమనేని అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. హైదరాబాద్ అందాలను, నెట్‌ ఎఫెక్ట్ సీన్లతో కథలోని మూడ్‌ను ఎలివేట్ చేశాడు. శ్రావణ్ భరద్వాజ్ మ్యూజిక్ బాగుంది. సిట్యువేషనల్‌గా పాటలు కూడా ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. మిగితా విభాగాల పనితీరులో మంచి ప్రొఫెషనలిజం కనిపించింది. యూవీ కాన్సెప్ట్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

    కొత్తగా పెళ్లైన దంపతుల మధ్య ఉండే ప్రేమలు, భావోద్వేగాలు, క్యూట్ ఫీలింగ్స్, అలకలు లాంటి అంశాలతో రూపొందిన సున్నితమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. స్క్రిప్టు పరంగా లోపాలు ఉన్నప్పటికీ.. చిన్న సినిమాకు లోపాలు వెతకడం సరికాదు. పండగ సీజన్‌లో ఫ్యామిలీ అంతా చూసేందుకు ఆస్కారం ఉన్న సినిమా. ట్విస్టులు, మితిమీరిన హింస లేకుండా చక్కటి ఫ్యామిలీ డ్రామాతో అక్కడక్కడ నవ్విస్తూ.. కొన్ని చోట్ల ఎమోషన్స్ గురిచేసే సింపుల్ సినిమా. ఎక్కువ అంచనాల లేకుండా జాలీగా సినిమా చూద్దామనే వారికి కల్యాణం కమనీయం నచ్చుతుంది.

    .

    English summary
    UV Concept's Kalyanam Kamaneeyam hits the theatres on 14th January. Actress Priya Bhavani Shankar, Santhosh Soban is the lead hero, heroines. Here is the Telugu filmibeats exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X